ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

2018లోని పోస్ట్‌లను చూపుతోంది

యండమూరి

యండమూరి : ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ వుంటుంది. ఆ స్త్రీ ప్రేయసి అయితే విజయం యవ్వనం నుంచి ప్రారంభం అవుతుంది. తల్లయితే బాల్యం నుంచే ప్రారంభం అవుతుంది’ ‘వస్తువు పగిలితే శబ్దం వస్తుంది. మనసు పగలిగితే నిశ్శబ్దం మాత్రమే మిగులుతుంది’ ‘సున్నితత్వం అంటే చిన్నచిన్న విషయాలకి బాధపడటం కాదు. చిన్నచిన్న విషయాలకి ఆనందపడటం.’ ‘నమ్మిన వాటిని ఆచరించకపోవడం ఆచరిస్తున్న వాటిని నమ్మినట్లు నటించడం- మనిషి నిరంతరం చేసుకుంటున్న ఆత్మవంచన’ ‘నీ శరీరం నా చేతుల మధ్య బందింపబడటం కన్నా నీ కీర్తి దిగంతాల పరిధి దాటి విస్తరించటం నాకు సంతోషాన్నిస్తుంది. నా ప్రేమ కోసం నీ కీర్తిని బలిపెట్టలేను’ ‘ఎక్కడ మనిషి నమ్మకాన్ని కోల్పోతాడో, అక్కడ ప్రేమని కోల్పోతాడు. తనక్కావాలసిన వ్యక్తి తన పరోక్షంలో కూడా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడనే నమ్మకమే ప్రేమ’

సూక్తులు 01

సంతోషాలు వికసించిన సుమాలు... వాటి జ్ఞాపకాలు ఎన్నటికీ వాడిపోని సుమగంధాలు : డి బఫర్ మనం ఓటమికి సిద్ధంగా లేనంత వరకు మనల్ని ఓడించడం ఎవరి తరం కాదు - కిరణ్ బేడీ ఇతరులను అర్థం చేసుకున్న వాడు జ్ఞాని, తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి : జైనులబ్దీన్ సహనం లేని వాడే పరమ దరిద్రుడు : షేక్స్ స్పియర్ ఏ మనిషినైనా అతని బుద్ధి నాశనం చేస్తుంది కానీ అతని శత్రువులు కాదు : బుద్ధుడు విద్యార్థి విజ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్లాలి కాని, విజ్ఞానం విద్యార్థిని వెతుక్కుంటూ రాదు : చుక్కా రామయ్య శ్రమ ఎదగడానికి ఉపయోగపడే మెట్లలాంటిదైతే, అదృష్టం లిఫ్ట్ లాంటిది. అయితే లిఫ్ట్ ఒక్కోసారి పనిచేయకపోవచ్చు.. కానీ మెట్లు శాశ్వతమైనవి : విక్టర్ బోర్గే నువ్వు చేసిన పని గురించి కానీ, చేయబోయే పనుల గురించి కానీ ఎక్కడా మాట్లాడకు : థామస్ జెఫెర్సన్ మరచిన వెత చూపుతుంది అరచేతిలోన స్వర్గం మరపుల మతి తెరుస్తుంది ఊహానూతన దుర్గం - బైరాగి పరిపూర్ణంగా నేర్చుకున్న విజ్ఞానమెప్పుడూ మరపురాదు - పైథాగరస్ మరుపు అనేది ఎప్పుడొస్తుంది? ఎదుటివారి మీద లక్ష్యం లేనప్పుడు, ఎదుటివాడి మాట మీద గురిలేనప్పుడు - బీనాదేవి ‘ఒక ఆలోచన...

హేమంతం

మూలం : నికొలాయ్ నెక్రొసొవ్ అనుకృతి : శ్రీశ్రీ ఎవరావస్తున్నది చెట్లమీంచి గాలికాదు మైదానంమీద దూకు సెలయేళ్లవి కావుకావు తన మిహికా సామ్రాజ్యం తణిఖీ చేసేటందుకు అదిగో హేమంతరాజు కోటవెడలి కదలినాడు అడవిదార్లు మూసుకు పోయాయాలేదా? హిమాని కడుశ్రద్ధగ తనపని చేస్తున్నదాలేదా, ఈ ధరణీతలమంతా ఏయెగుడు దిగుడు లేకుండా మంచుకప్పి ఉందా అని మరీమరీ చూస్తాడు టేకుచెట్లు, తురాయీలు, ఓకు చెట్లు రంగవల్లి సవరించాయా లేదా? సెలయేళ్లూ పెద్దనదులు గడ్డకట్టి సమత్వాన్ని సాధించాయా లేదా? వస్తున్నాడతడు వృక్షవాటిక లందూగులాడి! మంచుమీద అతని పదధ్వనులు మీరు వినలేదా? అతని తెల్లని గడ్డం అదిగో కనబడలేదా! (‘సోవియట్ భూమి’ నుండి)

నవవర్షసుందరి

ఒరియా మూలం : కుమారి తులసీదాస్ తెలుగు అనువాదం : శ్రీశ్రీ వర్షధారను నేను వడివడిగ వచ్చాను పరువంపు పైరులకు పచ్చదన మలరించి స్రోతస్వినీ బాల చేతమ్ము విరియించి వడివడిగ జడిజడిగ వచ్చాను నేను క్షితిమీద అందాల జెండాల నెగిరించి రసగంధ రూపాలు ప్రకృతిలో నెగడించి జీవనానంద సంజీవనీ దేనినై వేదనా బంధాల విదలించి వచ్చాను బాధల, నిరాశల, విభేదాల తెమలించి పచ్చికల బయలు పయి విహసించి తుహిన బిందువులతో దోబూచి పచరించి అరుణకిరణాధ్వముల హాయిగా పయనించి వచ్చాను వచ్చాను, వర్షధారను నేను విశ్వచైతన్య దీపికలు వెలిగించాను ఆత్మలోతులలో అనంత రతి నించాను సాధనా శిఖరాల శాంతి కురిపించాను అభయమని ఈయవని నాశీర్వదించాను రామధేనువు వోలె కదలి నే వచ్చాను శూన్యశుష్కాత్మలకు స్తన్యసుధలిచ్చాను విరహవిధురాగ్నులకు వేణువై, వీణనై మదన కావ్యమరంద మధురిమలు తెచ్చాను పూలడెందాలలో పొంగు పరిమళమట్లు అసమశరు రసనలో మసృణడ్రుతులు నించి స్పర్శాసుఖమ్ములో ప్రణయార్తులు హరించి ఫేన సంకేతాలలో నవ్య సృజనతో వడివడిగ వచ్చాను వర్షధారను నేను నవ్యవర్షను నేను శ్రావ్యగుంజనలతో విశ్వతో ముఖ సుఖావిర్ఫూతి తెచ్చాను సుమమంజరుల దేహముల మీద ఆకర్ష ణీయ చందనచర్...

నాన్నా.. నన్ను క్షమించు!

'నే ను తప్పుచేశాను... నన్ను క్షమించు నాన్నా... ఏ కొడుకూ తండ్రి పట్ల ప్రవర్తించని విధంగా నేను నీ పట్ల ప్రవర్తించాను' అంటూ.. సత్యమూర్తి కాళ్లపై పడతాడు రవీంద్ర. 'ఇందులో ఎవరి తప్పూ లేదురా... కాల ప్రభావం.. అంతే. వఅద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత ఇది. స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి మాట్లాడేవారు... వారు ఇలా మాట్లాడే స్థాయికి ఎదిగేందుకు ఓ నిచ్చెన మెట్టుగా మారిన పునాధి గురించి మర్చిపోతున్నారు. అందరూ ఉండి ఎవరూలేని అనాథలై.. కాస్తంత ప్రేమను కూడా పంచే వారులేక అల్లాడిపోతున్న ముసలి ప్రాణాల దీనస్థితికి నేటి సమాజ రోగగ్రస్థ దుస్థితే కారణం. ఈ సమాజంలో మనమూ భాగమేగా.. ఇందులో ప్రత్యేకంగా నీ తప్పు మాత్రం ఏముంది గనుక... లే నాన్నా... లే..' అంటూ కొడుకును పైకి లేపుతాడు.

అర్పణ

మనం గడిపిన క్షణాలు అనంత విశ్వస్మరణలో కరిగిపోయి కనబడవేమోనని వాటిని అక్షరాలలో నిక్షిప్తం చేసి ఎద గోడలపై తాపడం జేసి నీ కనుల ప్రేమామృత ధారలలో అభిషేకించి నీ చరణాల ముందు విరుల అర్పణ చేసినా.. ప్రియ... స్వీకరించు నా హృదయార్పణ - రాజాబాబు కంచర్ల 15-10-2018

శ్ర‌మ‌, సంస్కృతుల‌ సారం సామెతలు

Prajasakti Posted On:   Sunday,July 15,2018                     తెలుగునాట జానపద సాహిత్యానికి పుట్టినిళ్లు గ్రామాలు. శ్రమైక జీవన సౌందర్యానికి సజీవ సాక్ష్యం మౌఖిక వాజ్మయం. మౌఖిక వాజ్మయంలో అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు ఉంది. జానపద సాహిత్య ప్రక్రియల్ని పాట, కథ,

అరుణారుణం

ఓ అరుణారుణమా నువు బయల్దేరుతునే వసంతాన్ని కొనితెచ్చావు గ్రీష్మంలో అల్లాడుతున్న జనానికి చిరు ఆశను కల్పించావు నవ్యాంధ్ర కరుణిమను పులమడానికి పిల్లతెమ్మెరలను తోడ్కొని సప్తవర్ణాలను రంగరించుకొని నలు దిక్కులను కలుపుకొని శరవేగంగా కదిలొస్తున్నావు ఏవైనా మబ్బు తెరలు అడ్డొస్తే ఏవైనా గండు తుమ్మెదలు నిలువరిస్తే ఏమాత్రం అదరకు బెదరకు ఏమైనా నీ అడుగులాపకు నీవెంట నడుస్తున్నాయెన్నో అరుణకిశోరములు నీకోసం ఎదురు చూస్తున్నాయి మరెన్నో అరుణకిరణములు నవ్యాంధ్ర సీమల్లో ఎర్రమందారాలు పూయించడానికి ఓ అరుణారుణమా... నిండా కమ్మిన గ్రీష్మపు వాడగాడ్పులకు ప్రాణాల నెదురొడ్డి నువు కొనివచ్చే వసంతం కోసం నిరీక్షిస్తోంది నవ్యాంధ్రము - రాజాబాబు కంచర్ల 02-09-2018

ముద్దు...

ముద్దు... నాలుగు పెదవుల కలయికే కాదు రెండు శ్వాసల సరాగం రెండు మనసుల సంగమం రెండు తనువుల తన్మయత్వం

నా పతాకం అరుణారుణం

నా పతాకం అరుణారుణం నా కవిత్వం రసరమ్యం నా దీక్ష దృఢ సంకల్పం నా లక్ష్యం నిత్య చైతన్యం

అంటరాని వసంతంలో పూసిన ‘కటికపూలు’

         ఇవి ‘కటికపూలే’ కాదు... పైకి కనిపించని గులాబీల సౌరభాలు. పెత్తందారీ పదఘట్టనల కింద నలిగిపోయిన మల్లెల మార్దవం. తడియారని గుండె సడి. తినే తిండి మీద, కట్టే బట్ట మీద, మాట మీద, నడక మీద, నడత మీద బోల్డన్ని ఆంక్షలు. సొంతమంచం మీద స్వేచ్చగా కూచోలేని అస్వతంత్ర బతుకుల జీవన పోరాటం ఇది. అంటరాని వసంతంలో పూసిన ‘కటికపూలు’ అరుణిమను పులుముకున్న వెలివాడల ఎర్ర మందారాలు. ఇవి కథలు కావు.. మట్టిపాదాల ముద్రలు. పెత్తందారుల పొలాల్లో లోగిళ్లలో చిందిన నెత్తురు చుక్కలు. అనుభవంలోంచి మొలిచిన అక్షరాలు గనుకే ఈ కథలకు ఇంత పదును. రచయిత తన అనుభవంలోంచి తీసుకున్న సంఘటనలు గనుకే ఈకథల కన్నీటిలో ఇన్ని ఎరుపుజీరలు. దళిత జీవితం గురించి, దళిత జనం గురించి ఇప్పుడిప్పుడే ఈ సమాజానికి తెలియజెప్పే సొంత గొంతుకలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో ఒక పదునైన గొంతుక  ఇండస్ మార్టిన్. ‘కటికపూలు’ పుస్తకం ద్వారా దళిత జీవిత చిత్రాన్ని తనదైన శైలిలో సజీవమైన, స్వచ్ఛమైన భాష, యాసతో పఠితులకందించారు.  

కిటికీ

కటికపూలు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్

శశి మనసు

మేఘాల్లో పద్మాలు వికసిస్తున్నాయి నదీనదాలు సంగీతాన్ని ఆలపిస్తున్నాయి పవనుడు పక్షులతో కలిసి తాళం వేస్తున్నాడు కోయిలలు మైమరచి పాడుతుంటే.. మయూరాలు పరవశించి నాట్యమాడుతున్నాయి కాళిదాసు బందనలోనున్న అప్సరాంగనలు ఈర్ష్యగా చూస్తున్నారు శశికాంతుడు ఎన్నెలపిట్ట కిలకిలల కోసం ఆత్రంగా ఎదురుచూస్తూనే వున్నాడు శశి మనసును రంజింప జేయాలని ప్రకృతి సర్వశక్తులూ ఒడ్డుతునే వుంది - రాజాబాబు కంచర్ల 25-07-2018

రాగాల సన్నాయి

అది వెలుతురు పిట్ట పండు వెన్నెల్లో పరవశించి ఆడే ఎన్నెలపిట్ట ఆనందం కట్టలు తెంచుకున్నప్పుడు మమకారం వెల్లువల పొంగినప్పుడు వసంతంలో కోయిలల కిలకిల రావాలు రువ్వుతూ రాగాల సన్నాయి అవుతుంది ప్రేమ వరదలా పొంగినప్పుడు భావాలు కట్టలు తెంచుకొని ఎగసినప్పుడు హేమంతంలో పక్షిల ముడుచుకుపోతూ తుపానుకు ముందు సంద్రంలా గంభీరం అవుతుంది ఆ కళ్లు అయస్కాంత క్షేత్రాలు ఆ నవ్వులు  మొగలిపువ్వులు అంబరమంత ప్రేమను అర్ణవమంత మమతను మదిలోనే అణచిపెడుతూ ప్రశాంత గోదారిలా ప్రవహిస్తుంది.. చౌరాసియా వేణుగానంలా తనలో లీనం చేసుకుంటుంది విరజిమ్మే వెన్నెల వెలుగుల్లో ఎన్నెలపిట్ట ప్రేమగీతమౌతుంది మత్తెక్కించే మల్లెచెండు అవుతుంది మెడఒంపు మొగలిపువ్వవుతుంది మల్లెతీగలా అల్లుకుంటుంది మన్మథ శరసంధానం గావిస్తుంది విప్పార్చుకున్న రెక్కల మధ్యన విత్తును చీల్చుకొనివచ్చే మొలకలా తనువంతా చుట్టుకొని ఒదిగిపోతూ బరువంతా తానై కరిగిపోతూ బతుకంతా తానై నిలిచిపోతూ జీవితాన్ని పండిస్తుంది వెలుగుల పంటై... - రాజాబాబు కంచర్ల 14-08-18

ప్రేమవృక్షం

వేళ్లు లోతుగా పాతుకుపోయిన వటవృక్షానికి నీళ్లతో పనిలేదు భూమిలోని నీటిఊటను పీల్చుకొని పుష్పిస్తూ, ఫలిస్తూంటుంది నిజమైన ప్రేమ కూడా అంతే... ఎంత దూరాన వున్నా పదేపదే కలవకపోయినా చివురులు వేస్తూంటుంది పరిమళిస్తుంది నవనాడుల్లో పారుతుంది కాంతి నాదమౌతుంది శాంతి ధామమౌతుంది చిగురించి పుష్పించి పరిమళించి ఫలించి వటవృక్షమంత విశాలంగా విస్తరిస్తుందీ ప్రేమవృక్షం... - రాజాబాబు కంచర్ల 02-08-2018

నీ తలపులు

నీ తలపులు మదిలో చెలమలుగా ప్రవహిస్తుంటే క్షణాలు నిమిషాలుగా నిమిషాలు దినాలుగా గడిచిపోతుంటే... మదిలోని నీ రూపం హృదయమంతా అల్లుకుంటుంటే నీవెంత దూరంలో వున్నా నీతో కలిసి నడుస్తూనే వుంటా... నీ స్థానం ఎప్పటికీ పదిలం నీవిచ్చే స్ఫూర్తి నా నడకకు ఆలంబనం చివరి శ్వాస వరకూ... నీ ఆరాధనలో మునగనీ నీ కనుదోయి కనుపాపల్లే ప్రేమసుమాలు విరియనీ... విరహమైనా..ప్రణయమైనా చెదరని నీ ప్రేమ సాక్షిగా నిలువనీ తుదివరకూ.... - రాజాబాబు కంచర్ల 18-07-2018

ఏమిటీ అన్యాయం..?

ఏమిటీ అన్యాయం..? ఎందుకీ కర్కశత్వం..? మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకివ్వొద్దంటే... వేలాది కార్మికులు రోడ్డున పడితే... మహిళలన్న ఇంగితం లేకుండా జుట్టుపట్టి లాగడం.. కాళ్లు పట్టి ఈడ్చడం... మానవత్వం మరిచారా? పశువుల్లా వ్యవహరిస్తారా? ఏ విలువలకీ ప్రస్థానం.. ఎవరి అభివృద్ధిని కాంక్షించి ఈ జులుం.. మీ విదేశీ టూర్ల కయినంత ఖర్చు కూడా వుండదేమో మీ దీక్షల పబ్లిసిటీ కయినంత ఖర్చు కూడా వుండదేమో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ... వినాశకాలే విపరీత బుద్ధి అని... వినాశకాలం దాపురించినప్పుడు ఇలాంటి బుద్ధులే పుడతాయి... గతాన్ని తల్చుకోండొకసారి ఈసారి శాశ్వత బహిష్కరణ తప్పదు ఇది కడుపు మండిన కార్మిక, కర్షకుల ప్రతిన. - రాజాబాబు కంచర్ల 31-07-2018

ఎవరిదా నవ్వు?

ఎవరిదా నవ్వు? కిలకిలమని గిలిగింతలు పెడుతూ ఇంత మత్తుగా ఇంత నిర్మలంగా ఇప్పుడే వసంతమొచ్చినట్టుగా నవ్వుల వెలుగులు పంచుతున్న దీపికలా నందన వన విహారి గోపికలా ఎంత మధురంగా నవ్వుతోంది..! ఎవరిదా నవ్వు? వెన్నెలంత స్వచ్చంగా మల్లెలంత మధురంగా మత్తుగా కొత్తగా గమ్మత్తుగా అమృతధారలు కురిపించే కిన్నెరలా మయమరపించే మోహినిలా హాయిని పంచే ఉదయనిలా ఎంతో సమ్మోహనంగా నవ్వుతోంది..! ఎవరిదా నవ్వు? ఇంత రమ్యంగా ఇంత రసాత్మకంగా ఇంత సౌకుమార్యంగా ఇంత ప్రభోదాత్మకంగా నిశీధిని ఛేదించే తేజంలా ఎంత సుమమనోహరంగా నవ్వుతోంది..! అదీ... వెన్నెలను తాగి నవ్వుల అమృతధారలను ఒలికించే ఎన్నెలపిట్ట కాదుకదా..! - రాజాబాబు కంచర్ల 26-07-2018

ఈరోజు

ఈరోజు మంచిరోజు మధురమైనది.. మరపురానిదీ ఇరువురినీ కలిపిన రోజు ఇరుతనువుల దరిచేర్చిన రోజు ఈ రోజు మంచిరోజు ఇరు మనసులు పెనవేసిన రోజు తొలిసారి ఎన్నెలమ్మ కలిసిన రోజు తొలిచూపులు ముడివేసిన రోజు చెక్కిలిపై సిగ్గులు మొలిచిన రోజు పెదవులపై ముద్దులు మురిసిన రోజు ఈ రోజు మంచిరోజు ఇరు మనసులు పెనవేసిన రోజు రెండు మనసుల సంగమం తొలిప్రేమ పులకించిన పుణ్యక్షేత్రం ఈ ప్రేమ పరమ పవిత్రము ఈ రోజు నిత్య స్మరణము ఈ రోజు మంచిరోజు ఇరు మనసులు పెనవేసిన రోజు - రాజాబాబు కంచర్ల 23-06-2018

ఓ రోజు నువ్వొస్తావు...

నువ్వెందుకు... ఎప్పుడూ నా కళ్లలోనే వుంటావు.. మనసు నిండా అల్లుకొని వుంటావు...ఆ నేనేదో చెప్పాలనుకుంటాను ఏదేదో రాయాలనుకుంటాను ఇంకేదో చదవాలనుకుంటాను మరేదో గీయాలనుకుంటాను అంతలోనే నన్నావహించుకుంటావు ఇక నాదంటూ ఏమీ వుండదు అదేమని గదమాయిస్తే.. కిలకిలా నవ్వుతావు... సన్నజాజులు వికసించినట్టు పారిజాతాలు పరిమళించినట్టు ఆ నవ్వులో ఆదమరిచి నే వుంటే... ముఖమంతా సుగంధాలద్దుతావు అధరాలతో సున్నితంగా... ప్రపంచంలోని ప్రేమనంతా కళ్లలో ఒంపుకొని తేనెలఝరులను కురిపిస్తావు ఇంక నేనంటూ లేకుండా నీలో ఐక్యం చేసుకుంటావు... అందుకే... నీ నవ్వులను పూయించే ఓ క్షేత్రాన్ని కట్టుకుంటాను ప్రతి ప్రభాతాన్ని నీ కళ్లలో అద్దుతాను నీ కోసం ఎదురుచూసే సంధ్యనౌతాను ప్రతి క్షణాన్నీ నీ పాదాల కింద పరుస్తాను కరిగే క్షణాలను దాటుకొని పరుగెడుతుంటాను ఓ రోజు నువ్వొస్తావు... ఎందుకింత ప్రేమ అంటావు... ప్రేమించకుండా ఎలా వుంటాను నువ్వే నేనైనప్పుడు నా జీవితమే నీవైనప్పుడు... మళ్లీ నవ్వుతావు కిలకిలా ప్రకృతి పులకించేలా ఈ క్షేత్రం చిగురించేలా... - రాజాబాబు కంచర్ల 22-09-2017

కొత్తగాలి

తాటి ఆకుల్లో రాసిన మనుధర్మాలను పాతరెయ్యాలి రాగి రేకుల్లో, రాతి పలకల్లో కనుమూసిన చరితకు ప్రాణం పొయ్యాలి నాగరికతలోని ప్రతి దశలోనూ ఆమె అంతర్భాగం ఆమె అడుగుల్లో పుట్టే చైతన్యం లోకానికి ప్రగతిపథం చిన్నారుల నుంచి... ముదివగ్గులదాకా తప్పని వికృత చేష్టలు పట్టపగలే వెంటాడుతున్న మానవ మృగాలు మురికి కాలువల్లో తేలుతున్న గర్భస్థ పిండాలు యుగయుగాల చరితలో మాననిగాయాలు బంధువులే రాబంధులై రక్కుతుంటే గొంతు పెగలడంలేదు రోజుకో నిర్భయ... పూటకో అభయ... గంటకో రమిజాబీ... గడియకో మాయాత్యాగి బలౌతుంటే గుండెగాయం మానడంలేదు ఇపుడిపుడే వీస్తోంది కొత్తగాలి పడమటిగాలిని...మనుధర్మ ధూళినీ తట్టుకొని ఇపుడిపుడే వీస్తోంది సరికొత్తగాలి ఆనందవార్నిధియై.. అభ్యుదయవాహినియై ఓ ఆధునిక మహిళా... ఎదురుచూడకు... ఎవరోవస్తారని... ఏదోచేస్తారని ఆత్మవిశ్వాసం నీ ఆయుధం స్వేచ్ఛా సమానత్వం నీ వారసత్వం అదిగదిగో నవయుగం... పూరించు నారీ శంఖం - రాజాబాబు కంచర్ల 07-03-2017 (అంతర్జాతీయ మహిళాదినోత్సవం(08-03-2017) సందర్భంగా సాహితీస్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన జనకవనంలో చదివిన కవిత)

స్త్రీ స్వేచ్ఛ కోసం పరితపించిన మానవతావాదికి అక్షరాంజలి

చలం... ఒక చలనం.. సంచలనం ఒక నిర్ణిద్ర సముద్రం ఒక మహా జలపాతం ఒక ఝంఝానిలం చలం... ఆంధ్ర సాహిత్యంలో ఒక సుడిగాలి సంఘంలో.. సాహిత్యంలో... ప్రజల ఆలోచనలలో... తరతరాలుగా పేరుకుపోయిన కశ్మలాన్ని కడిగేసిన దీశాలి కొత్త గాలులకు తలుపులు తెరచి కొత్త భావాలకు లాకులు ఎత్తిన సవ్యసాచి తెలుగు వచన స్వరూపాన్ని రచన స్వభావాన్ని మార్చివేసి సమకాలిక రచయితలపైన తర్వాతి తరంపైన తన ముద్రవేసిన వైతాళికుడు తనపై విమర్శలకు చలించక నమ్మిన సిద్ధాంతం కోసం ఆ విలువల కోసం పుంఖానుపుంఖాలుగా రచనలు చేసి సంఘంలోని చెత్తా చెదారం, దుమ్మూ దూగర ఎగరగొట్టిన సంస్కర్త స్త్రీకి పురుషునితో సమానమైన హక్కులుండాలని ఆమె ఒక వ్యక్తి అని, ఆమెకొక వ్యక్తిత్వం ఉంటుందని, ఆమెకూ సొంత ఇష్టానిష్టాలు, అభిరుచులు, స్వేచ్ఛానురక్తి ఉంటాయని తాను పిల్లలను కనే, వంట చేసి మరబోమ్మ కాదని పురుషునికున్న స్వేచ్ఛ స్త్రీకీ ఉండాలని ఘోషించిన అభ్యుదయవాది చలం రచనలు ఆంధ్రదేశంపై విరుచుకుపడిన ఉప్పెన నవలలు, నాటకాలు, కథలు, ఇతర రచనలతో అసాంప్రదాయిక భావాలతో తెలుగువారిని ఉక్కిరి బిక్కిరి చేసిన అసాధారణ రచయిత సంఘ దురాచారాల మీద మూఢ విశ్వాసాల మీద కుల మత ...

తాను..!

తాను... ప్రవహించే సెలయేరు ఎగసిపడే జలపాతం వర్షించే శ్రావణమేఘం నవీన జాగృతిలోంచి పుట్టుకొచ్చిన రసవిస్ఫోటనం తాను... ఎప్పుడు ఆవహించిందో తెలియదు నాకు తెలియకుండానే నాలోకి తనను వంపేసుకుంది ఒక సెలయేరులా ఒక జలపాతంలా ఒక శ్రావణమేఘంలా నిలువెల్లా నింపేసింది గోదావరి వేదంలా కృష్ణవేణి తరంగంలా ప్రేమ రుతువు ఆలపించే అమరనాదంలా హృదయ తంత్రుల్ని మీటుతోంది తాను... తన పాదముద్రలను తన కనుల నక్షత్ర కాంతులను వసంతకాలపు యామినిలో హేమంతపు కౌముదిలో మళ్లీ మళ్లీ అద్దుతూనే వుంది నిలువెల్లా ఆవహిస్తూనే వుంది - రాజాబాబు కంచర్ల 29-03-2018

దీన్నేమంటారు..?

బీడువారిన నేల గుల్ల బారింది చినుకమ్మ రాకతో అవని పులకించింది మోడువారిన తరువులు చిగుళ్లు విడిచింది గరికమ్మ సైతం మొగ్గలు తొడిగింది దీన్నేమంటారు..? రసభాషిణి కోయిలమ్మ గళము విప్పింది  రాగాలుపాడింది వసంతమొచ్చిందని వయ్యారాలు వలికించింది చీకటిని పారద్రోలుతూ వెన్నెలమ్మ పురివిప్పింది ఎన్నెలపిట్ట మధువును తాగుతోంది దీన్నేమంటారు...? - రాజాబాబు కంచర్ల 09-01-2018

నానీలు

జీవితం సత్యం సుందరం గమ్యం విజయం తథ్యం --- భావాల వెల్లువ పొంగి పొర్లనీ తేలికవును మనసు శాంతించి

నీతో నడుస్తా..

మనమిప్పుడు నడిచిన దూరం చాలా స్వల్పం నడవాల్సిన దూరం అనంతం నీకోసం హృదయాన్ని దారంతా పరిచాను నిశీధిలోనైనా మిణుగురుల వెలుగు దారిచూపుతూనే వుంటుంది దివారాత్రాలు కష్టసుఖాలు ఎత్తుపల్లాలు అన్నింటా నీతో నడుస్తా.. ఆ దారంతా మన వలపుల విరులు పరుచుకుంటూ... - రాజాబాబు కంచర్ల 11-01-18

పరిష్వంగం

చిగురించిన దీపంలా నీ పెదాలపై చిరునవ్వు సన్నజాజుల పరిమళంలా సౌరభాలు వెదజల్లు ఉషోదయ కిరణంలా నీ కనులలో వెలుగులు నిండు పున్నమిలా వెన్నెల సుధలు కురిపించు తొలకరి పలకరింపులా చెక్కిలిపై నునుసిగ్గులు ఎర్ర మందారాలు విరగ బూసినట్లు మధుర వీణా నాదంలా మైమరపించే పలుకులు వసంతం అల్లుకున్నట్లుగా నీ గాఢ పరిష్వంగం - రాజాబాబు కంచర్ల 22-03-2018

పాదముద్రలు

అక్కడ వెతికేను కాసిన్ని పాదముద్రల కోసం మరి కాసిన్ని చిరునవ్వుల కోసం అది... తన పాదముద్రలను పారాణిగా పులుముకున్న నేల కదా అది... తన చిరునగవులను చెక్కిళ్లనద్దుకున్న గాలి కదా అందుకే... అక్కడ నాలుగడుగులు వేసి ఆ నేలను, ఆ గాలిని స్పృశించాను తడిమి తడిమి చూశాను అప్పుడు కనిపించాయి... సుపరిచితమైన పాదముద్రలు అప్పుడు స్పృశించాయి... నను మత్తెక్కించే చిరునవ్వుల కిలకిలలు మైమరిచానో క్షణం మమతలన్నీ మూటగట్టుకుని జ్ఞాపకాలను పదిలపర్చుకుని ముందుకు సాగిపోయా... పెనవేసుకున్న మమతలను పండించుకోవాలనీ... - రాజాబాబు కంచర్ల 26-01-2018

బాల్యం శిథిలం!

కరడు గట్టిన హృదయాలు సైతం ద్రవిస్తోన్న దృశ్యం ఎగురుతున్న పక్షులు సైతం నిలబడి నిట్టూర్పులిడుస్తోన్న భీతావాహం చివుళ్లు వేసి మొగ్గలు తొడిగి వికసించి పరిమళించాల్సిన బాల్యం మొగ్గగానే నేలరాలి నెత్తురోడుతోంది హత్తుకుంటోన్న నెత్తుటి ముద్దలను ప్రవహిస్తోన్న నెత్తుటి దారలను తనలో ఇంకించుకోలేక తెట్ట కట్టిన నెత్తుటి మడుగుల గోసకు చమురు నేల నిస్సత్తువగా కన్నీరు పెడుతోంది బాంబు దాడులు క్షిపణుల గర్జనలు పసిపాపల ఉసురు తీస్తోంటే... లక్షలాది చిన్నారుల హాహాకారాలు తల్లిదండ్రుల ఆక్రందనలు చూసి ఎగిరే పిట్టలు ఆక్రోషిస్తున్నాయి ఏమీ చేయలేక చూసే కళ్లు జాలిపడుతున్నాయి ఏదో చేయాలని... సిరియా చమురు సంపదపై కన్నేసిన బూచోళ్లు మాత్రం... రెచ్చగొడుతున్నారు అంతర్యుద్ధం చమురు వ్యాపారులు జలగల్లా పీల్చిపీల్చి తీర్చుకుంటున్నారు వారి తీరని దాహం బలైపోతున్నది మాత్రం... ముక్కుపచ్చలారని పసోళ్లు ఇక్కడ బాల్యం ఛిద్రమౌతోంది ఇక్కడ పసితనం శిథిలమౌతోంది పువ్వుల్లా పరిమళించాల్సిన బాల్యం స్వేచ్ఛగా విహరించాల్సిన విహంగం తల్లివేరును తెంచుకొని పొట్ట చేత పట్టి వలస బాట పట్టి వరస కడుతున్నారు శరణార్థం రెక్కల...

మనమిద్దరం అయినా...

మనం సంచరించిన చోటులన్నీ కలిపితే ఓ బృందావనమవుతుంది మనం చెప్పుకున్న ఊసులన్నీ ఒకచోట చేర్చితే ఓ కావ్యమవుతుంది మనం మోస్తున్న కలలన్నీ కలిపితే ఓ పంచవర్ణ చిత్రమవుతుంది మనం వేసిన అడుగులన్నీ కలిపితే ఓ ప్రగతిపథం అవుతుంది మనమిద్దరం అయినా మనలోకి తొంగిచూసుకుంటే కనిపించేది ఒక్కరే నాకు నువ్వు- నీకు నేను - రాజాబాబు కంచర్ల 17-01-2018

మళ్లీ ఉదయిస్తా

ప్రేమ పూదోటలో మనం పంచుకున్న అనుభూతులు పరిమళాలు వెదజల్లే సంపంగెల్లా ఇంకా ఆ తోటలో కదలాడుతునే వున్నాయి ఆ చెట్టు కొమ్మల్లోంచి కురిసిన వెన్నెల ఇంకా బొట్లుబొట్లుగా రాలుతూనే వుంది ఆ పూల పరిమళాలతో కలగలిపి రాలిన వెన్నెల బిందువులన్నీ నా గుండెల్లో పట్టితెచ్చాను సూర్యుడికి భూమిపై ఉన్నంత ప్రేముంది నీపై నాకు రాత్రి అస్తమించిన సూరీడు పొద్దునే ప్రభాత కాంతులతో మళ్లీ ఉదయిస్తాడు ధరణిని పరవశింపజేస్తాడు అచ్చంగా నేనూ అంతే... రాత్రి అస్తమించినా... పొద్దున్నే ఉదయిస్తాను మళ్లీ మళ్లీ ఉదయిస్తూనే వుంటాను - రాజాబాబు కంచర్ల 10-11-2017

మీకు మాట్లాడే ప్రధానినిచ్చాం : అమిత్ షా

మాటలతో లేదు ఉపయోగం చేతలతో చూపండి ప్రతాపం --- వట్టి మాటలేల సార్వభౌమా గట్టి మేలు తలంచండి --- మాట్లాడాల్సిన చోట మౌనం ప్రశ్నించ వీల్లేనిచోట అబద్దం --- నోట్లరద్దు నాటకం వస్తుసేవల పన్ను బూటకం --- ఎన్నికల్లో చెసిన వాగ్దానాలు మాటల్లో చెప్పలేని గారడీలు --- అబద్దం నీ జన్మహక్కు ఆచరణం మా ఓటుహక్కు --- - రాజాబాబు కంచర్ల 12-10-2017

యుద్ధం

అది యుద్ధ భూమి అదీ యుద్ధ భూమి అక్కడ కత్తులూ కటారులుండవు యుద్ధతంత్రాలు కుత్తుకలు తెంచే రాజకీయ ఎత్తుగడలే వుంటాయి అక్కడ ప్రాణాలు ఎదురొడ్డే పోరాటం వుండదు అణచివేతలు ఆర్థిక జీవనాడులు కర్కశంగా తెంచే కుతంత్రాలే వుంటాయి యుద్ధం జరుగుతోంది... యుద్ధం జరుగుతోంది సమఉజ్జీల మధ్యకాదు... సర్కారు సేనలతోను ఆధిపత్యదారులతోను యుద్ధం జరుగుతోంది... మా పదవులు నొక్కేసే రాజకీయులతోను మా స్వేచ్ఛను తొక్కేసే భూస్వాములతోను యుద్ధం జరుగుతోంది... ఈ యుద్ధం జరుగుతూనే వుంటుంది ఉనికి కోసం... బతుకు కోసం... నిరసనలతో గొంతులు పగులుతున్నాయి లాఠీదెబ్బలతో తనువులు చిట్లుతున్నాయి చమట లావాలా పొంగుతోంది నెత్తురు కుతకుతమని ఉడుకుతోంది ఉనికి కోసం... బతుకు కోసం... యుద్ధం జరుగుతూనే వుంటుంది కులం కూడికలు తీసివేతల మధ్య మనువు రాతలు వెలివేతల మధ్య ఇంకా మోస్తూనే వున్నాం కులం కుంపటిని నత్త నెత్తిమీది గూడులా ఇంకా అనుభవిస్తూనే వున్నాం వెలివాడల బతుకుని విసిరేయబడిన ఎంగిలి విస్తరిలా మనువు రాతలు చెరిగేదాకా వెలివేతలు నిలిచేదాకా ధిక్కార స్వరాలు వినిపిస్తూనే వుంటాయి యుద్ధం జరుగుతూనే వుంటుంది ఈ గడ్డపై చిమ్మే స్వేధం నా బ...

రాలుతున్న కుసుమాలు

రాలుతున్న కుసుమాలు దిగజారుతున్న విద్యాప్రమాణాలు --- పిల్లలకు విద్య విజ్ఞానం వ్యాపారులకు విద్య ధనం --- 18 గంటల చదువు 18 గంటల సిఎం పని ఒకరికి ఉరి ఒకరికి సరి --- అధికారులపై హుకుం కార్పొరేట్ కాలేజీలపై మౌనం --- విద్యా వ్యాపారులు ప్రభుత్వానికి ఆర్థిక వనరులు --- చర్యలంటూ ఆగ్రహాలు తెరచాటున మంతనాలు --- భుజానికి పుస్తకాల బ్యాగు మెడకు ఉరితాడు --- ఈ చదువులు మాకొద్దు క్లాసురూములో ఖైదీలం కాదు --- విజ్ఞాన దీపం వెలిగిద్దాం పసి ప్రాణాలను కాపాడుదాం --- తల్లిదండ్రులారా ఆలోచించండి ‘కార్పొరేట్’వలలో పడకండి --- - రాజాబాబు కంచర్ల 17-10-2017

రేపటి సూర్యులం

ఈ మట్టికి పూసిన గడ్డిపువ్వులం మేము మీ అడుగుల కింద మొలిచిన చైతన్య కెరటాలం మేము మీ పాదాల కింద నలిగిన పాన్పులము మీ పాదాలను గుచ్చే ముళ్లవుతాం సహనం నశించిననాడు మట్టికున్నంత సహనముంది మింటికెగసే ఆశయమూ వుంది పంచములని పాతాళానికి తొక్కాలనుకుంటే పాంచజన్యం పూరించే పార్థులం మేము అమృతం తాగినా విషంగక్కే మనువు నువ్వు గంజిబువ్వ తిన్నా విశ్వాసం నింపుకున్న మనిషులం మేము దోచుకోవడం దాచుకోవడం నీ నైజం శ్రామిక జన జీవన సౌందర్యం మా తేజం వాడబతుకును దీపశిఖలుగా జ్వలింపజేయగలం ఆకలిబాధను ఆయుధాలుగా మలచగలం కులహంకార ముసుగులను తొలగించగలం నపుంసక రాజకీయ క్రీడలను ఎదిరించగలం సమానత్వం కోసం హక్కుల కోసం మా పోరాటం మేము నిలుచున్న చోటే యుద్ధరంగం మేము శ్రామిక సైనికులం పోరాట యోధులం...రేపటి సూర్యులం - ఉదయ 29-12-2017

విరులతోట

నా విరులతోటను నీవెప్పుడైనా చూశావా ఆ తోటంతా రకరకాల పూల పరిమళంతో రకరకాల పక్షుల రెక్కల శబ్దాలతో రమణీయంగా ఆహ్వానిస్తోంది... మలయమారుతాలను చీల్చుకొని గోదారి అలలను దాటుకొని అడ్డొచ్చే మేఘాలను తప్పుకొని ఎప్పుడొస్తావో కదా... వేకువనే పక్షుల కిలకిలరావాలతో మేల్కొని చూస్తే... వేపచెట్టు మీది గూటిలో కాకి కావుకా అంది మామిడి కొమ్మ మీది కోయిల కుహుకుహు అంది అయినా నీ జాడే కనబడలేదు... ప్రభాత కిరణాలకు ఆకులు తళతళ లాడుతున్నాయి పిల్ల గాలులకు పువ్వులు తలలాడిస్తున్నాయి గాలితెర వీచినప్పుడల్లా పూలు రాలిపడుతున్నాయి నీకు స్వాగతం చెప్పడానికా అన్నట్టు... అప్పుడొచ్చింది ఎన్నెలపిట్ట మంచుతెరలను చీల్చుకొని ఉదయించే సూర్యునిలా కిలకిలమని వయ్యారాలు ఒలికిస్తూ... గరికపువ్వుని చేరింది..గుసగుసలు చెప్పింది - రాజాబాబు కంచర్ల 07-10-2017

వెన్నెల పరిమళం

నీతో చెప్పాలనుకున్నాను విరజాజుల పరిమళాల గురించి... ఆ పొదరింటి వద్ద నిలుచుండిపోయాను ఆ పరిమళం ఎంత మధురంగా వుందనీ... అప్పుడప్పుడే కురుస్తోన్న వెన్నెలతో జత కలిసిన వన్నెల పరిమళం మరింత మత్తెక్కిస్తుంటే... అప్పుడు దూసుకొచ్చింది రివ్వున కిలకిలమంటూ నా ఎన్నెలపిట్ట... ఏ గోదారి అలలు తాకిందో ఏమో వెన్నెల పరిమళాన్ని తనువంతా అద్దుతూ... - రాజాబాబు కంచర్ల 29-09-2017

వెన్నెల మధువు

ఆకాశం మేఘావృతం గుంపులు గుంపులుగా మేఘాల పయనం గాలి తెరలతో ఆటలాడుకుంటున్నట్టుగా... జరజర రాలుతున్న నీటి తుంపరలు గాలి తెరలను దాటుకొని అక్కున చేరుతున్నాయి పరవశంగా... మెలమెల్లగా కమ్ముతున్న చీకట్లు మబ్బుల చాటునుంచి తొంగిచూశాడు తారాపతి నెమ్మదిగా విచ్చకునె వెన్నెల జిలుగులు రివ్వున దూసుకొచ్చిందో పవన వీచిక వెన్నెల మధువును వెంటతెచ్చింది వచ్చింది ఎన్నెలపిట్ట.. అధరాలకందించె కిలకిలమంటూ... - రాజాబాబు కంచర్ల 27-09-2017

నను చుట్టేయ్యి

ప్రియతమా.. నీ కోమల చరణములను నా కరములతో స్పృశించనీ.. నా అదరాల స్పర్శను నీ చరణాల కద్దనీ... నా స్వప్న సౌధాలను దాటుకొని నా ఊహల శిఖరాలను అధిరోహించి సౌందర్య తీరాలను నను చేరుకోనీ అమరత్వాన్ని సిద్ధించుకోనీ... చీకటి ప్రవాహాల వేడుకోళ్లను దాటి నిశీధి తెరలను తొలగించుకొని నీ ముందర నిల్చున్నా సరికొత్త వేకువనై తుఫాను వేగంతో నను చుట్టేయ్యి - రాజాబాబు కంచర్ల 21-01-2018

స్వరం మారిన స్వతంత్రం

నాడు... ఏ ఆశయంతో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నామో ఏ ఆశయంతో దేశమంతా ఒక్కటిగా నిలిచిందో నేడు... ఆ ఆశయం ఆవిరైపోతున్నది నల్లదొరల దోపిడీ కబంధ హస్తాల్లో దేశం తల్లడిల్లిపోతోంది అవినీతి నిరుద్యోగం విచ్చలవిడిగా పెరిగిపోతోంది ఒకవైపు మద్యం ఏరులై పారుతుంటే... తాగునీరు సాగునీరు కోసం జనం గొంతులు పగులుతున్నాయి అభివృద్ధి పేరుతో పచ్చని పంటభూములు బీళ్లుగా మారుతున్నాయి పేదరికాన్ని రూపుమాపుతామంటూ

హరితహారం

హరితహారం ప్రకృతినుదుట సిందూరం వర్షం పచ్చదనానికి జీవాధారం వర్షాలులేని ప్రకృతికి పెరుగును అసహనం దెబ్బతినక తప్పదు జీవవైవిధ్యం జనులకు తరువులే వరములు జగతి ప్రగతికి ఆధారములు పర్యావరణానికి ప్రధమములు భవిష్యత్తరాలకు ప్రగతిపథములు

నీలో దాగిన నేను

నీ దగ్గర వదిలిపెట్టిన నాకోసం పచ్చటి పంటచేలను జలజల పారే వాగువంకలను దాటుకొని బిరబిర పరుగులెత్తే మేఘాలను తప్పుకొని బయలుదేరాను నీలోవున్న నాకోసం...

కలుషితం

కమ్ముకొస్తున్నాయి చూడు చూడు మేఘాల సమూహాలను చూడు కవుల ఊహల్లోంచి మొలిచిన మేఘసందేశాలు కావు ఢిల్లీ వీధుల్లో పెరేడ్ చేస్తున్న మేఘాలు మోసుకొచ్చె కాలుష్య వాయువులు పెడుతుండె పర్యావరణానికి చిల్లులు పీల్చేందుకు లేవు స్వచ్ఛమైన గాలులు - రాజాబాబు కంచర్ల 09-11-2017

చెప్పవే చిరుగాలి...

మల్లెలోని తెల్లదనం తన మనసులోనే చూశానని ఆ మనుసులోని మంచితనం తన కనులలోనే చూశానని అనురాగానికి అవధులు తనలోనే చూశానని చెప్పవే చిరుగాలి... నాజూకు నాసికపై జాబిలి చంద్రిక నేనై మెరవాలని ఎదపై హొయలొలికించే కంఠహారం నేనై పరవశించాలని పసిడి వర్ణ చరణాలపై పుట్టుమచ్చ నేనై మురవాలని చెప్పవే చిరుగాలి... నా చెలియతో.. - రాజాబాబు కంచర్ల 24-04-2018

ఎప్పటికీ...

ఎప్పటికీ... నీవొక ఆకుపచ్చ జ్ఞాపకం నన్నల్లుకున్న నిత్య వసంతం తడియారని వెన్నెల సంతకం

తపస్విని

అనంతాకాశంలో ఎగిరే అక్షర విహంగాన్ని ఎన్ని ఉషస్సులో తపస్సు చేసి నిను చేరుకున్న తపస్విని ఊహల అంబరంలో విహరించే ప్రణయ విహాయసాన్ని నీ గాఢ పరిష్వంగంలో మైమరిచే సుమపారిజాతాన్ని - రాజాబాబు కంచర్ల 18-05-2018

ఈరోజు

ఈరోజు మంచిరోజు మధురమైనది.. మరపురానిదీ ఇరువురినీ కలిపిన రోజు ఇరుతనువుల దరిచేర్చిన రోజు ఈ రోజు మంచిరోజు ఇరు మనసులు పెనవేసిన రోజు తొలిసారి ఎన్నెలమ్మ కలిసిన రోజు తొలిచూపులు ముడివేసిన రోజు చెక్కిలిపై సిగ్గులు మొలిచిన రోజు పెదవులపై ముద్దులు మురిసిన రోజు ఈ రోజు మంచిరోజు ఇరు మనసులు పెనవేసిన రోజు రెండు మనసుల సంగమం తొలిప్రేమ పులకించిన పుణ్యక్షేత్రం ఈ ప్రేమ పరమ పవిత్రము ఈ రోజు నిత్య స్మరణము ఈ రోజు మంచిరోజు ఇరు మనసులు పెనవేసిన రోజు - రాజాబాబు కంచర్ల 23-06-2018

నేనే నువ్వని

నువ్వెవరో తెలియనప్పుడు నేనో మామూలు వ్యక్తిని ఎగిరే పక్షుల రెక్కల రెపరెపలలోని సంగీతం గోదారి గలగలల విన్యాసం చిరుగాలికి కదలాడే విరుల పరిమళ వికాసం ఇంత అందంగా వుంటాయని తెలియదు నాకప్పుడు

తప్పదు..!

ఇక్కడ వసంతం లేదు భరించరాని గ్రీష్మ పవనాలు తప్ప ఇక్కడ ప్రభాతోదయాలు లేవు భరించరాని నిశీధి నిస్పృహలు తప్ప ఇక్కడ పున్నమి వెలుగులు లేవు వెన్నెల కాంతులూ లేవు భరించరాని అంధకారము తప్ప ఇక్కడ ఉగాదులులేవు మత్తకోయిలలు లేవు భరించరాని ఒంటరితనం తప్ప వసంతాలు పుష్పించాలంటే సరికొత్త ఉదయాలు వెలగాలంటే పున్నములు పరిమళించాలంటే నా కనులెదుట నీవుండాలి నా గుండెల నిండిపోవాలి నాలో నిలువెల్లా ఒలికిపోవాలి తప్పదు... - రాజాబాబు కంచర్ల 21-06-2018

నెట్టింట్లో న‌డ‌క‌

    విఠలాచార్య సినిమాల్లో బోల్డన్ని వింతలు, కనికట్లు కనిపిస్తుంటాయి. మంత్రదండం తిప్పగానే ఓ రాతి తలుపు తెరుచుకుంటుంది. ఓ రాతి విగ్రహం నడుచుకుంటూ వస్తుంది. ఇక సైన్స్‌ ఫిక్షన్‌ కథల్లో, సినిమాల్లో అయితే బోల్డన్ని వింతలూ విశేషాలూను. చేతిలో రిమోట్‌

పులి ఆత్మ‌క‌థ‌

                  దట్టమైన కీకారణ్యం... చిన్నా పెద్దా నీటి మడుగులు... రకరకాల జంతువులు... పక్షుల కిలకిలరావాలతో అలరారే పచ్చ పచ్చని తరువులు నా సామ్రాజ్యం. అక్కడ నేను మకుటంలేని మహారాజుని. నేను ఠీవిగా నడిచొస్తుంటే ఆమడ దూరంలో ఒక్క పిట్టా కనబడేది కాదు. ఇక నేను వికటాట్టహాసం చేస్తే

3డి అవయవాలు రెడీ

3డి అవయవాలు రెడీ : ప్రజాశక్తి ఆదివారం మ్యాగజైన్ (స్నేహ)లో  17-01-2016న  ప్రచురితమైన  కవర్ స్టోరీ.

త్రిపదం 09

09. గుప్పెట నుండి జారిపోతున్న ఇసుకలా గడియారంలో గడిచిపోతున్న కాలంలా గుప్పెడంత మనసు పరుగులు తీస్తోంది నీవెంట 13-12-2016

త్రిపదం 08

08. రంగురంగులతో వచ్చె రెండువేల నోటు కొత్త నోటును సరిగా చూడనన్నాలేదు అప్పుడే వచ్చిపడె నకిలీ నోట్ల జోరు 12-11-2016

త్రిపదం 07

07. నిన్నటిదాకా  ఉసూరుమన్న 'జన్‌ధన్' ఖాతాలు పెద్ద మొత్తంలో వచ్చిపడుతోన్న సొమ్ములు జగమెరిగిన సత్యమే ఈ అవకతవకలు 12-11-2016

త్రిపదం 06

06. నోట్ల రద్దుతో ఇక్కట్లు మోడీ గారి విదేశీ షికార్లు చిల్లరలేక చిన్నబతుకుల అగచాట్లు 12-11-2016

త్రిపదం 05

05. గులాబీలు విరబూయనీ ప్రేమ సుమాలు వికసించనీ ఇరు హృదయాలు రవళించనీ 11-11-16

త్రిపదం 04

04. నా ఊహల్లోని వెన్నెల నక్షత్రాలు తన అధరాలపై మెరిసే చిరునవ్వులు తన చెక్కిళ్లపై మొలిచే సిగ్గుల మొగ్గలు 01-12-2016

త్రిపదం 03

03. అందుకోవాలని దోసిళ్లు పట్టాను చిరునవ్వుల చిరుజల్లులను... జారిపోతున్నాయి నను కవ్విస్తూ.. మురిపిస్తూ... 20-09-2016

త్రిపదం 02

02. నీ నవ్వులలో జలకాలాట పరిమళాలు పరిచె విరులతోట పరవశించి ఆడెదమా సయ్యాట 20-09-2016

త్రిపదం 01

01. చెలి చరణాల కద్దిన పారాణి నా త్రిపదం బదులే రాని మేఘసందేశం నా అక్షరం వసంతాలు చూడని గ్రీష్మం నా హృదయం - 01-11-2016

2017లో నా పుస్తక పఠనం

        ‘అ క్షరం చినుకై తాకగానే... కాగిన మట్టిపై తొలకరి జల్లుల పరిమళం’ వెదజల్లినటుల ‘వంద పుస్తకాల పఠనం... వేయి ఆలోచనల సంఘర్షణకు కారణం’ అయింది.  ఫలితంగా కాస్తంతైనా అక్షర శుద్ధి అబ్బివుంటుందనే తృప్తి. 2016లో చదివిన పుస్తకాల సంఖ్య 116 అయింది. 2017లో కూడా అదే ఒరవడి కొనసాగింది. ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగి... 150 అయింది.  కథా సంపుటములు, కవితా సంకలనాలు, ప్రముఖుల కథలు, వ్యాసాలు వున్నాయి.  ఇవే కాకుండా వివిధ పత్రికల ఆదివారం అనుబంధాల్లో వచ్చేవి, ఆన్ లైన్ మ్యాగజైన్స్ లోనివి కథలు, సాహిత్య వ్యాసాలు అదనంగా వున్నాయి. ఆరు కథలు కూడా రాయడం గతేడాది మరింత సంతృప్తినిచ్చే విషయం. అంతేకాకుండా ‘పెట్టుబడి’ గ్రంథం మొదటి సంపుటి చదివే పనిలో వున్నా. ఇదేదో గొప్పగా చెప్పుకోడం కాదు. జంపాల చౌదరి గారి లాంటివారు చాలా ఎక్కువ చదువుతున్నారు. కానీ.. ఈ ఏడాది కాలంలో నా సాహిత్య పఠనం,

2016లో నేను చదివిన పుస్తకాలు

       ‘అ క్షరం చినుకై తాకగానే... కాగిన మట్టిపై తొలకరి జల్లుల పరిమళం’ వెదజల్లినటుల ‘వంద పుస్తకాల పఠనం... వేయి ఆలోచనల సంఘర్షణకు కారణం’ అయింది.  పలితంగా కాస్తంతైనా జ్ఞానం సంపాదించుకున్నాననే తృప్తి... మెదడుకు మరింత పదును పెట్టాలనే తపన. గతంలోనూ పుస్తకాలు చదివినా... ఒక క్రమపద్ధతిలో చదవలేదనే చెప్పాలి.  2016లో చదివిన పుస్తకాలన్నింటినీ తేదీలతో సహా నోట్ చేసుకుంటూ వస్తే.... ఏడాది చివరికి ఆ సంఖ్య 116 అయింది.  మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో చాలా తక్కువ చదివాను.  లేకపోతే ఈ సంఖ్య మరింత పెరిగివుండేది. ఇందులో నవలలు,  కథా సంపుటములు, కవితా సంకలనాలు, ప్రముఖుల కథలు వున్నాయి.  ఇవి కాకుండా వివిధ పత్రికల ఆదివారం అనుబంధాల్లో వచ్చేవి, ఆన్ లైన్ మ్యాగజైన్స్ లోనివి కథలు, సాహిత్య వ్యాసాలు

అక్షర తూణీరాలు.. గణపతిరావు కథలు

         గ ణపతిరావు రచన చేసిన 'ఆకుపచ్చ అంటుకుంది' కథాసంకలనంలోని అన్ని కథలు సమాజంపై సంధించిన అక్షర తూణీరాలే. రచయిత సామాజిక దృక్పథమే ఈ రచనకు బలం చేకూర్చింది. సమకాలీన స్థితిగతులపై పదాల తూటాలను పేల్చుతూ.. కథను చెప్పడంలో తనదైన ఒక ప్రత్యేక శైలిని రచయిత అనుసరించారు. కథలకు పెట్టిన శీర్షికలు కూడా అర్థవంతంగా, ఆకర్షణీయంగా, ఆలోచనాత్మకంగా వున్నాయి. పుస్తకం ముఖచిత్రం నుంచి, ప్రతి కథనూ ప్రారంభించిన తీరు, ఆయా కథలకు వేసిన చిత్రాల వరకూ కథా సంకలనం యొక్క ప్రత్యేకతను చాటుతాయి. 'ప్రకృతిని కాపాడలేనివారికి జీవించే హక్కులేదు' అంటూ 'ఆకుపచ్చ అంటుకుంది' కథలో

సమాజంలోని అవకతవకలపై కళాత్మక విశ్లేషణ... ''కడుపుకోత'' కథాసంపుటి

       తె లంగాణా మాండలికంలో వచ్చిన తొలి కథా సంపుటి 'కడుపుకోత'. ఈ సంపుటి కడుపుకోత కథతోనే ప్రారంభం అయింది. తెలంగాణా మాండలికం మీద మంచి పట్టున్న దేవరాజు మహారాజు రచించిన ఈ కథాసంపుటిలో పది కథలున్నాయి. ఈ పది కథల్లోనూ వారు ఎంచుకున్న కథా వస్తువు ప్రజాజీవనానికి సంబంధించిదే. నిత్యజీవితంలో మనం రోజూ చేసే సంఘటనలను వారు చక్కని కథలుగా మలిచిన వైనం చదువరులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.        ముఖ్యంగా ఈ సంపుటిలోని కథలను రెండురకాలుగా చెప్పారు రచయిత. ఒకటి : కథ మొత్తం తెలంగాణా

'కాలాతీత వ్యక్తులు'కు షష్టిపూర్తి

        సా హిత్యంలో నవలా రచనకు ఒక ప్రత్యేక స్థానం వుంది. తెలుగు నవల పుట్టిన తర్వాత దాదాపు పాతికేళ్ల వరకు నవలా ప్రక్రియను వచన ప్రబంధంగానే వ్యవహరించారు. నవల అనే పదాన్ని వాడుకలోకి తెచ్చింది కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి. అప్పటివరకూ నవలలు రాసినవారంతా తమ గ్రంథాలను వచన ప్రబంధాలనే పిలిచేవారు. ‘The Development of English Novel’ అనే గ్రంథంలో  ‘యదార్థ జీవితాన్ని యదార్ధ దృష్టితో అధ్యయనం చేసి, దానిని గద్యరూపంలో వ్యక్తం చేసేదే నవల’ అని రిచర్డ్ క్రాస్ అనే రచయిత పేర్కొంటాడు. అలాగే ‘రచనాకాలం నందలి వాస్తవికములగు జీవితాచార వ్యవహారములను చిత్రిస్తూ... జనుల ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధం నవల’ అని మొదలి నాగభూషణ శర్మ తన ‘తెలుగు నవలా వికాశం’లో వివరించారు. అక్కడితో ఆగలేదు. ‘కవిత్వం

మూర్తిమత్వం

ప్రతి పనికీ ఓ ఫలితం ప్రతి ఫలితానికీ ఓ రూపం ప్రతి రూపానికీ ఓ వర్ణం ప్రతి వర్ణానికీ ఓ స్వరం ప్రతి స్వరానికీ ఓ గాత్రం ఆ ఫలితం ఆ రూపం ఆ వర్ణం ఆ స్వరం ఆ గాత్రం ఆ అన్నింటి మూర్తిమత్వం ఓ సజీవ సుందర శిల్పం కనుల ఎదుట సాక్షాత్కరిస్తే... ఆ ప్రేమమూర్తి ఆ అనురాగ దీప్తి నీవు...నీవు మాత్రమే.. - రాజాబాబు కంచర్ల

వీడిపోనంటూ బాసలు చేసి

విరిసిన హరివిల్లే నీ వదనం మమతల విరిజల్లే నా హృదయం నీ సన్నిధి ప్రతి క్షణం ఓ వసంతం నా ఎదలో సముద్రమై పొంగే సంతోషం నీ స్పర్శతో పరవశమేదో రగులుతువుంటే ఏదో వింతలు ఎదలో చేరి సరిగమలే పలుకుతువుంటే తెరచాటు సంకోచాలే సడలుతువుంటే జన్మజన్మలకీ ఇదే ప్రేమను వాంఛిస్తున్నా మనసులోని కోరికకే బలముంటే వీడిపోనంటూ మనసుబాసలు చేసి వలపుల రాణివై మనసుకు బంధం వేశావు మదిలోని రంగుల కలను నిజం చేసి నా చిన్ని ప్రపంచాన్ని రసమయం చేశావు - రాజాబాబు కంచర్ల

శరద్రాత్రి

కన్నుల్లో వెలిగావు కంటిపాపవై గుండెల్లో నిలిచావు గుండె సవ్వడై నాలో చేరుకున్నది నీ ఊహే ఊపిరై నడుపుతున్నవి నీ ఊసులే జీవనాడులై ఎదలోతులు తాకే నవ్వులు మధురాలు దాచే అధరాలు ఒడిలోన వాలే నగుమోము మదిలోన దాగే వలపుపొంగులు నీ చూపులతో ప్రేమపొంగె నాలో పరవశం పెంచే పరిమళం నీలో వలపు వీణాలు మ్రోగించావు నాలో ఏ జన్మకైనా బతికేవుంటాను నీలో ఈ చల్లని శరద్రాత్రిలో నింగిలోని తారలా నువ్వు కొలనులోని కలువల నేను... ఊసులతో రాతిరి కరిగే దూరము తరిగే వలపులు రగిలే విరహము పగిలే తనువులు కలిసే ప్రకృతి మురిసే - రాజాబాబు కంచర్ల

సంతోష సింధువు

సాయంసంధ్య వేళ వెండివెలుగుల కాంతుల్లో జాలువారుతోంది నీ నవ్వుల జలపాతం మనోనేత్రాన్ని తాకిన ఘల్లుఘల్లుమనే అందెల సవ్వడిలో పరవశిస్తుంది నీ అడుగుల చప్పుడుతో రమిస్తుంది పరుచుకుంటున్న నిశీధి నీడ ఉనికిని మాయం చేస్తున్న వేళలో నాలో నిన్ను చూపిన దివిటీ సంతోష సింధువులా నీ పరిచయం - రాజాబాబు కంచర్ల

సాయం సంధ్యవేళ

సాయం సంధ్యవేళ అలసిన సూర్యుడు నిస్సత్తువగా అస్తమించే వేళ సంద్రం సంబరంగా వింత వింత కాంతులీనుతున్న వేళ గంటలు నిమిషాలుగా గడిచిపోయే వేళ పిల్లగాలి గలగలలు పరవశింపజేస్తున్న వేళ ఎద కోవెలలో ప్రమిదలు వెలిగించే వేళ నింగిమీద తొలి చుక్క తొంగి చూసే వేళ దూరంగా నీలిమేఘాలు కమ్ముకొస్తున్న వేళ ఈ నిశబ్ద నీరవంలో నా తలపుల నిండుగా నిను నింపుకొస్తున్న నా అడుగుల సవ్వడి వినిపిస్తుందేమో జాగ్రత్తగా కనిపెట్టి చూడు... మది తలపులను తెరచి వుంచు... ఆ సంధ్యా కాంతిలో నే నడచి వస్తున్నా.. నీ ఎద కోవెలలో ప్రమిదగ వెలగాలని... - రాజాబాబు కంచర్ల

స్ఫూర్తి శిఖరం

ఎదలోని స్పందన తానని అలసటలోని ఓదార్పు తానని వేదనలోని లాలన తానని కోవెలలోని దేవర తానని మనసులోని మాట నీవైనా చెప్పవే ఓ మేఘమాల శరత్తులోని వెన్నెల తానని వెన్నెలలోని చల్లదనం తానని మల్లెలలోని మాధుర్యం తానని పూవులోని తేనీయ తానని మనసులోని మాట నీవైనా చెప్పవే ఓ మేఘమాల తానులేక నేను లేనని నా ప్రతి అణువులోనూ నిండివున్నదని నా స్ఫూర్తి శిఖరం తానేనని జన్మజన్మల బంధం తానేనని మనసులోని మాట నీవైనా చెప్పవే ఓ మేఘమాల - రాజాబాబు కంచర్ల

అనుబంధం

పూవుకి తావికీ వున్న సంబంధం ఆకసానికి మేఘానికీ వున్న అనుబంధం వెన్నెల సారానికి మధుర తుషారానికి వున్న బాంధవ్యం మన అనుబంధం... కొమ్మలకి రెమ్మలకీ మధ్యనున్న గుసగుసలు కోయిలకు మావిచిగురుకీ మధ్యనున్న కువకువలు పిల్లనగ్రోవికి మధుమాసవేళకీ మధ్యనున్న సరగాలు మన అనురాగం... - రాజాబాబు కంచర్ల

ఇదికాదా ప్రేమంటే..?

నేను ప్రేమిస్తున్నది నీలో కనిపించే నా భావనను ఎప్పటికీ నాతోనే వుంటాయవి నేను ప్రేమించిన నువు దూరంగా వున్నా నీలో కలగలిసిపోయిన నేనెప్పుడూ నీతోనే వుంటాను నా భావనలను తర్జుమా చేస్తూ నీవెప్పుడూ నాతోనే వుంటావు ఇంకా మన మధ్య ఎడబాటుకు తావెక్కడ ఇదికాదా ప్రేమంటే..? - రాజాబాబు కంచర్ల

ఎద లోగిలి

ఎద లోగిలిలో తీర్చిదిద్దిన రంగవల్లివీవు కను దోయలలో దాగున్న స్వప్నికవీవు మది ఊహలలో విరిసిన రంగుల హరివిల్లువీవు అణువణువునా ప్రవహించే ప్రేమధార నీవు హృది లోయలలో దాగిన భావాలను రగిలిగించిన చైతన్యమీవు నేస్తమై మనసు దోచిన సౌందర్యవల్లివీవు నీవులేని నేను... శృతితప్పిన పల్లవిని మూగబోయిన గేయాన్ని రంగు వెలసిన చిత్రాన్ని ఛందస్సులేని పద్యాన్ని దేవతలేని నిలయాన్ని శిథిలమైన ఆలయాన్ని - రాజాబాబు కంచర్ల

ఏ జన్మవరమో

రోజులలో లెక్కించలేని మనబంధం ఇది జన్మజన్మల అనుబంధం ఎన్నటికీ వీడని మమతానురాగాల పరిమళం ఏ జన్మవరమో ఈ నేస్తం అనుకోని అతిథిలా అడుగుపెట్టావు గ్రీష్మంలో వసంతంలా ఎద తట్టావు మూగబోయిన మౌనమృదంగాన్ని పలికించావు గానం తెలియని గొంతులో రాగమై పల్లవించావు ఏడాదికొకటే వసంతం నీరాకతో నామది నిత్యవసంతం నీ పద సవ్వడి తరలివచ్చిన మలయమారుతం చీకటిలో మెరిసే నక్షత్రం నీ రూపం వేయివెన్నెల కుంచెతో నీలాల నింగి క్యాన్వస్ పై ఇంద్రధనుస్సు రంగులతో చిత్రించా నీ పంచవన్నెల చిత్రాన్ని ఈ క్షణాల కోసమే ఎదురుచూశానేమో మరుగుతున్న హృదయంతో ఇన్నాళ్లు ఎద లోగిలి దాటిపోకు నేస్తమా... ఈ చిన్నిగుండె పగిలిపోతుందేమో - రాజాబాబు కంచర్ల

ఓ మేఘమాలిక

ఓ మేఘమాలికా.. చెప్పవే ఓ మాట నా చెలియతో వేరెవ్వరూ లేని వేళలో శశిలేని రాతిరిలా నేనున్నానని.. జతలేని ఒంటి గువ్వలా నే మిగిలానని ఓ మేఘమాలికా... చెప్పవే ఓ మాట నా చెలియతో పగలంతా నీ తలపులతో నే గడిపేస్తున్నాఅని రేయంతా నీ స్వప్పాలలో నే తేలిపోతున్నా అని ఓ మేఘమాలికా... చెప్పవే ఓ మాట నా చెలియతో మల్లెలోని తెల్లదనం తన మనసులో నే చూశానని ఆ మనసులోని మంచితనం తన కనులలో నే చూశానని ఓ మేఘమాలికా... చెప్పవే ఓ మాట నా చెలియతో - రాజాబాబు కంచర్ల

చతురత

కనులు మూసినా నీవే, కనులు తెరిచినా నీవే, ఈ క్షణంలోనూ నీవే, మరుక్షణంలోనూ నీవే, శ్వాసల్లోనూ నీవే, ఆశల్లోనూ నీవే, ఆనందంలోనూ నీవే, ఆవేదనలోనూ నీవే, ఊహల్లోనూ నీవే, ఊరడింపుల్లోనూ నీవే, నా మనసు పొరల్లో పారాడే ప్రతి జ్ఞాపకంలోనూ నీవే, నా పరువపు సీమను ఏలే ప్రణయమూ నీవే నా మనసును కోవెలగా మార్చే ప్రణవమూ నీవే మాయే చేసావో, మంత్రమే వేసావో, కూరిమిని కళ్ళలో కురిపిస్తూ కనికట్టే చేసావో, ఎక్కడ నేర్చుకున్నావో ఏమో నా జీవాన్ని నీ మనసు కొనలకు ముడేసుకునే ఈ చతురత ... - రాజాబాబు కంచర్ల

చలం పుట్టినరోజు (19-05-1894)

చలం... ఒక చలనం.. సంచలనం ఒక నిర్ణిద్ర సముద్రం ఒక మహా జలపాతం ఒక ఝంఝానిలం చలం... ఆంధ్ర సాహిత్యంలో ఒక సుడిగాలి సంఘంలో.. సాహిత్యంలో... ప్రజల ఆలోచనలలో... తరతరాలుగా పేరుకుపోయిన కశ్మలాన్ని కడిగేసిన దీశాలి కొత్త గాలులకు తలుపులు తెరచి కొత్త భావాలకు లాకులు ఎత్తిన సవ్యసాచి తెలుగు వచన స్వరూపాన్ని రచన స్వభావాన్ని మార్చివేసి సమకాలిక రచయితలపైన తర్వాతి తరంపైన తన ముద్రవేసిన వైతాళికుడు తనపై విమర్శలకు చలించక నమ్మిన సిద్ధాంతం కోసం ఆ విలువల కోసం పుంఖానుపుంఖాలుగా రచనలు చేసి సంఘంలోని చెత్తా చెదారం, దుమ్మూ దూగర ఎగరగొట్టిన సంస్కర్త స్త్రీకి పురుషునితో సమానమైన హక్కులుండాలని ఆమె ఒక వ్యక్తి అని, ఆమెకొక వ్యక్తిత్వం ఉంటుందని, ఆమెకూ సొంత ఇష్టానిష్టాలు, అభిరుచులు, స్వేచ్ఛానురక్తి ఉంటాయని తాను పిల్లలను కనే, వంట చేసి మరబోమ్మ కాదని పురుషునికున్న స్వేచ్ఛ స్త్రీకీ ఉండాలని ఘోషించిన అభ్యుదయవాది చలం రచనలు ఆంధ్రదేశంపై విరుచుకుపడిన ఉప్పెన నవలలు, నాటకాలు, కథలు, ఇతర రచనలతో అసాంప్రదాయిక భావాలతో తెలుగువారిని ఉక్కిరి బిక్కిరి చేసిన అసాధారణ రచయిత సంఘ దురాచారాల మీద మూఢ విశ్వాసాల మీద కుల మత ...

చెలిమి చెలమ

చెలిమివవుతావా జీవితమంతా చెలమనవుతా హృదయమంతా ఆతపత్రమవుతా ఎప్పటికీ జతగా తరుచ్ఛాయనవుతా ఎన్నటికీ తోడుగా వెన్నెలనవుతా చీకటి దరిచేరకుండా ఊపిరినవుతా ప్రాణవాయువే నేనుగా ఎద స్పందననవుతా గుండెగంటనై మోగుతా పారాణినవుతా చరణాలనంటిన గోరింటగా పెదవిపై మెరుపునవుతా నిత్యం చిరునవ్వుగా చెలిమివవుతావా జీవితమంతా... అడుగులో అడుగునవుతా తుదిగడియదాకా - రాజాబాబు కంచర్ల

ఛాయ

రేయి కడుపున చీకటి ఛాయవోలె విషాదమ్ములోను... చీకటిని పారదోలె వెన్నెల కిరణంవోలె ఆనందమ్ములోను... జ్ఞాపకాల నీడల్లో ఆరని తడివోలె జీవితమ్ములోను... మనసు పొరల్లో జ్వలిస్తోన్న వెలుగురేఖవోలె హృదయమ్ములోను నాలోన దాగినది నీవె.. నాఎదుట నడయాడేదీ నీవె కనులలోని స్వప్పికవు నీవె అధరములపైని దరహాసివవీ నీవె ప్రతి అడుగుల సవ్వడి నీవె మది నిండుగ పరుచుకున్నదీ నీవె అవని నీవు అంబరం నీవు అర్ణవం నీవు అనంత విశ్వం నీవు ఆ నువ్వే నేను... నాలోని ఆత్మ నీవు... శశిలా నిశిలా అలలా లయలా - రాజాబాబు కంచర్ల

డప్పుకొడదాం మన గొప్పలు

గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఎలుకలు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చీమలు పొట్టనపెట్టుకుంటోన్న పసికందుల ప్రాణాలు అమరావతి మహాయజ్ఞంలో వీరంతా సమిధలు అయినా..అంతర్జాతీయ స్థాయిలో డప్పుకొడదాం మన గొప్పలు చానళ్ల ప్రసారాలపై ఆంక్షలు పాత్రికేయులకు ప్రతిబంధకాలు మీడియా స్వేచ్ఛకు తిలోదకాలు బాబుగారి జమానాలో దురాగతాలు అయినా..అంతర్జాతీయ స్థాయిలో డప్పుకొడదాం మన గొప్పలు ఎండలకు ఉపశమనం మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేస్తారంట మంచినీళ్లకు బదులు కేటాయించారు జిల్లాకు  మూడుకోట్లు అందరూ తాగాల్సిందే హెరిటేజ్ ప్యాకెట్లు అయినా..అంతర్జాతీయ స్థాయిలో డప్పుకొడదాం మన గొప్పలు ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఫిరాయింపుదారులకు పచ్చ కండువాలు పొసగని నేతల మధ్య పంచాయతీలు ఇవే నవ్యాంధ్ర నిర్మాత రాజకీయాలు అయినా..అంతర్జాతీయ స్థాయిలో డప్పుకొడదాం మన గొప్పలు నీళ్లులేక ఎండుతున్న పంటలు మేతలేక కబేళాలకు పశువులు కరువుతో రోడ్డున పడుతున్న రైతులు తాగునీటికి సైతం పడరాని పాట్లు అయినా..అంతర్జాతీయ స్థాయిలో డప్పుకొడదాం మన గొప్పలు చట్టాలు పెట్టుబడిదారుల చుట్టాలు పట్టించుకోని కార్మికుల వెతలు అర్థాకలితో అంగన్వాడీలు మగ్గాలప...

తెలిసిపోయింది

తెలిసిపోయింది ‘హోదా’కి అడ్డెవరో నిరసనలు తెలిపేవారిని లాఠీలతో బాదించి వ్యాన్లలోకి ఈడ్పించి మహిళల తాళిబొట్టు తెంపించి కర్కోటకంగా వ్యవహరించి అభినవ ‘నీరో’నని మళ్లీ మళ్లీ రుజువు చేసుకొంటున్నదెవరో తెలిసిపోయింది... హోదాకు అడ్డెవరో తెలిసింది... గజదొంగను సంకలో పెట్టుకొని ఎదుటివారిపై నిందలు మోపి సిసలైన నీతిమంతుడ్నని గప్పాలు కొట్టి పచ్చమీడియాతో డబ్బా కొట్టించుకొని తోకముడిచే బడాబాబుల బండారం బట్టబయలయింది.. హోదాకు అడ్డెవరో తెలిసిపోయింది... హోదా సంజీవని కాదు... సింగపూర్ తరహా రాజధానులు కజకిస్తాన్ తరహా భవంతులు జపాన్ తరహా నిరసనలు ఇక ఆంధ్రుల సంస్కృతికి కాలంచెల్లు ఇవే బాబుగారి గీతోపదేశాలు అందరికీ తేటతెల్లం అయింది హోదాకు అడ్డెవరో తెలిసిపోయింది ప్రత్యేక హోదా మన హక్కు ఆంధ్రుడా చెయ్యి చెయ్యి కలుపు దూసుకొంటూ..తోసుకొంటూ... మన హక్కును నినదిస్తూ.. జగన్నాథ రథచక్రాలై పోదాం...పోదాం.. మునుముందుకు... - రాజాబాబు కంచర్ల

తోడు

చీకటి ముసిరినా వేకువ ఆగినా కొమ్మలు వాడినా పువ్వులు రాలినా కల చెదిరినా విధి మారినా నీవు నా తోడు నీవే నా తోడు మరువకు నేస్తం ఈ జీవితం నీకోసం - రాజాబాబు కంచర్ల

నవచేతనం

నా ప్రతి అణువు ఒక స్వరం ఒక నయాగరా జలపాతం నా ప్రతి శ్వాస ఒక కెరటం అంబరాన్ని తాకాలనే ఆశల జలతరంగం నా ప్రతి కదలిక ఒక మలయమారుతం ఎదను శృతిచేసే వీణానాదం నా ప్రతి అరుపు ఒక స్ఫూర్తిగీతం ఒక ఉత్తుంగ తరంగం నా ప్రతి మలుపు ఒక గిరిశిఖరం నువు నా సర్వాంగీణ నవచేతనం - రాజాబాబు కంచర్ల

నివేదన

జీవితం యాంత్రికమైన వేళలో కాలం కడలిలో నన్ను నేనే కోల్పోతున్నప్పుడు అంతరంగ పొరల్లో నిక్షిప్తమైన అగాధాన్ని ప్రేమతో నింపింది  నువ్వు నిర్నిద్ర రేయిలలో... హృదయ పరితాపాలతో రెప్పమాటు తడి ఆవిరవుతున్నప్పుడు వెన్నెల వెలుగులు నింపిన స్వప్నాల జాడ నువ్వు భారమైన ఏకాంత వేళలో వాసంత సమీరం నీ స్నేహం నిద్రాణమైన మనసును మేల్కొలిపి ఎద వీణియను శృతి చేసింది నువ్వు మనసును రంజింపజేసే వెన్నెల వాహినిలో ప్రేమజ్యోతిని వెలిగించె నీ మమతల మాధుర్యంతో మదినిండిన ఆశల దీపానికి ఆయువు నింపి మరో ఉదయానికి దారిచూపింది నువ్వు రంగుల హరివిల్లయిన ఈ సరికొత్త ఉషోదయాన్ని పల్లవించవా నా గొంతులో... వసంతగానమై రవళించవా నా బతుకులో... ప్రణయనాదమై ఆలకించవా నా నివేదన.. ప్రియ నెచ్చెలివై - రాజాబాబు కంచర్ల

నిరీక్షిస్తున్నా నీకోసం ..

ఓ మేఘమాలికలారా... తనను చూడనిదే ఉండలేదు మనసు.. క్షణమైనా మది తన వైపే లాగుతోంది... పదేపదే ఎద నిండా తన రూపమే పరచుకొనివుందని హేమంత తుషారంలా చల్లగా చెప్పరాదా ప్రియురాలి ముంగురులను మెల్లగా తాకి తన తలపుల పానుపుపై వాసంత సమీరంలా శయనిస్తానని తన మమతల కోవెలలో నను పదిలముగా దాచుకొమ్మని ఈ చిన్ని గుండెలో శ్రావణమేఘమై ప్రేమ తుషారాలు చిలికించమని శరచ్ఛంద్రికలా నచ్చజెప్పిరావా క్షణాలు యుగాలుగా మారుతున్న వేళ నిరీక్షిస్తున్నా... అనురాగమై చుట్టేయాలని - రాజాబాబు కంచర్ల

నీ తలపులు చెలమలుగా...

నీ తలపులు మదిలో చెలమలుగా ప్రవహిస్తుంటే క్షణాలు నిమిషాలుగా దినాలు మాసాలుగా గడిచిపోతుంటే... మదిలోని నీ రూపం హృదయమంతా అల్లుకుంటుంటే భౌతికంగా దూరం ఎంతున్నా.. మానసికంగా అడుగులు వేస్తుంటే మనస్సులోని నీ స్థానం ఎప్పటికీ పదిలం నీవిచ్చే స్ఫూర్తి నా నడకకు ఆలంబనం చివరి శ్వాసవరకూ... నీ ఆకర్షణలో మునగనీ నీ ధ్యానంలో పయనించనీ నీ ప్రేమలో పరవశించనీ విరహమైనా..ప్రణయమైనా చెదరని నీ ప్రేమ సాక్షిగా తుదివరకూ నిలువనీ.... - రాజాబాబు కంచర్ల

నీ చిరునవ్వుతో..

ప్రతి ఉషోదయం చిగురించనీ ప్రతి ఊహనూ బ్రతికించుకోనీ ప్రతి రేయినీ వెలిగించుకోనీ ప్రతి స్వప్నికను సృష్టించుకోనీ నీ చిరునవ్వుతో... ప్రతి క్షణం గులాబీల పరిమళం ప్రభవించనీ ప్రతి నిముషం మల్లెల మకరంధం మదిగ్రోలనీ ప్రతి గడియా పారిజాతాలు పరిమళించనీ ప్రతి దినం విరజాజులు విరబూయనీ నీ చిరునవ్వుతో... ప్రతి ఉదయం నందివర్థనంలా విచ్చుకోనీ ప్రతి మధ్యాహ్నం మొగలిపొదలా చురుక్కున గుచ్చుకోనీ ప్రతి సాయంత్రం గుల్మొహర్ పూవులా పుష్పించనీ ప్రతి నిశీధిలో నల్లకలువలా విరబూయనీ నీ చిరునవ్వుతో... ప్రతి వేకువా ప్రభాతకిరణమై ఉదయించనీ ప్రతి రుతువూ వసంతమై అలరించనీ ప్రతి అడుగూ మువ్వల సవ్వడై రవళించనీ ప్రతి క్షణం నాలో నిన్ను శ్వాసించనీ నీ చిరునవ్వుతో... - రాజాబాబు కంచర్ల

జంధ్యాల పాపయ్యశాస్త్రి "ఉదయశ్రీ"
(ఖండ కావ్యముల సంపుటి)

అరుణరేఖలు ఆనాడు నా శిథిల జీవితానికి ఒక మధురప్రభాతం. నాహృదయంలో ఒక ఉదయశ్రీ. కన్నులు విప్పి చూచాను. శ్రీమతినీ చిరంజీవినీ విడిచి బరువు గుండెతో మేడమెట్లు దిగే గౌతమబుద్ధుని కారుణ్యమూర్తి కనిపించింది. ఆయన ఆర్దనేత్రాంచలాల్లో కరుణాకుమారి తొంగి చూచింది. ఆమె వదనంలో అయోధ్యానగరం అంతఃపురాల్లో నుంచి దండకారణ్య పర్ణకుటిలో తన జీవిత సౌభాగ్యం వెతుక్కుండే ఊర్మిళాకుమారి ఉత్కంఠ తొణుకు లాడుతూ వుంది.

నా ఆనందం నీవే

ఎవరు లేకున్నా ఉండగలను నేను కానీ నీవు లేక మనలేను నా హృదిని మెలి పెడతావు నీవు నా మదిలో నివసిస్తావు నా కనుదోయిని నింపుతావు నా ఆనందం నీవే నీవు లేక నేను జీవింపజాలను ...రూమి I can be without anyone But not without You. You twist my heart, Dwell in my mind And fill my eyes … You are my joy. I can’t be without You. ~Rumi

నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే

గొల్లపూడి వారి ‘ఏరినపూలు’లో ఒక మంచి భావ ప్రకరణం. ‘‘ఓర్పు నిన్నటి చర్యలకు నేడు ఇచ్చే తీర్పు రేపు నేటిని మనశ్శాంతిగా తర్జుమా చేసే చల్లటి ఓదార్పు’’ ‘‘నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే మళ్ళీ నా కలం ఈ ప్రేమ రసైక జీవిని మేలుకొలిపింది ప్రతి ఆలోచనలోనూ కొత్తగా దర్శనమిచ్చి ప్రతి దర్శనలోనూ కొత్త ఆలోచనని రేకెత్తిస్తున్నావు నీవు’’