గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఎలుకలు
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చీమలు
పొట్టనపెట్టుకుంటోన్న పసికందుల ప్రాణాలు
అమరావతి మహాయజ్ఞంలో వీరంతా సమిధలు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
చానళ్ల ప్రసారాలపై ఆంక్షలు
పాత్రికేయులకు ప్రతిబంధకాలు
మీడియా స్వేచ్ఛకు తిలోదకాలు
బాబుగారి జమానాలో దురాగతాలు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
ఎండలకు ఉపశమనం మజ్జిగ ప్యాకెట్లు
సరఫరా చేస్తారంట మంచినీళ్లకు బదులు
కేటాయించారు జిల్లాకు మూడుకోట్లు
అందరూ తాగాల్సిందే హెరిటేజ్ ప్యాకెట్లు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోళ్లు
ఫిరాయింపుదారులకు పచ్చ కండువాలు
పొసగని నేతల మధ్య పంచాయతీలు
ఇవే నవ్యాంధ్ర నిర్మాత రాజకీయాలు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
నీళ్లులేక ఎండుతున్న పంటలు
మేతలేక కబేళాలకు పశువులు
కరువుతో రోడ్డున పడుతున్న రైతులు
తాగునీటికి సైతం పడరాని పాట్లు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
చట్టాలు పెట్టుబడిదారుల చుట్టాలు
పట్టించుకోని కార్మికుల వెతలు
అర్థాకలితో అంగన్వాడీలు
మగ్గాలపై మగ్గుతున్న బతుకులు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
ప్రత్యేక హోదాపై పిల్లిమొగ్గలు
సొంత మీడియాలో ఆర్భాటాలు
ఎమ్మెల్యేలను కొనే పనిలో మంత్రులు
ధనార్జనలో అధికారపార్టీ నాయకులు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
ఫీజులు కట్టలేక విద్యార్థులు
ఉపాధి లేక నిరుద్యోగులు
పనుల్లేక పెరుగుతున్న వలసలు
ఇవి ఏనాటికీ బాగుపడని అతుకులు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
- రాజాబాబు కంచర్ల
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చీమలు
పొట్టనపెట్టుకుంటోన్న పసికందుల ప్రాణాలు
అమరావతి మహాయజ్ఞంలో వీరంతా సమిధలు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
చానళ్ల ప్రసారాలపై ఆంక్షలు
పాత్రికేయులకు ప్రతిబంధకాలు
మీడియా స్వేచ్ఛకు తిలోదకాలు
బాబుగారి జమానాలో దురాగతాలు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
ఎండలకు ఉపశమనం మజ్జిగ ప్యాకెట్లు
సరఫరా చేస్తారంట మంచినీళ్లకు బదులు
కేటాయించారు జిల్లాకు మూడుకోట్లు
అందరూ తాగాల్సిందే హెరిటేజ్ ప్యాకెట్లు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోళ్లు
ఫిరాయింపుదారులకు పచ్చ కండువాలు
పొసగని నేతల మధ్య పంచాయతీలు
ఇవే నవ్యాంధ్ర నిర్మాత రాజకీయాలు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
నీళ్లులేక ఎండుతున్న పంటలు
మేతలేక కబేళాలకు పశువులు
కరువుతో రోడ్డున పడుతున్న రైతులు
తాగునీటికి సైతం పడరాని పాట్లు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
చట్టాలు పెట్టుబడిదారుల చుట్టాలు
పట్టించుకోని కార్మికుల వెతలు
అర్థాకలితో అంగన్వాడీలు
మగ్గాలపై మగ్గుతున్న బతుకులు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
ప్రత్యేక హోదాపై పిల్లిమొగ్గలు
సొంత మీడియాలో ఆర్భాటాలు
ఎమ్మెల్యేలను కొనే పనిలో మంత్రులు
ధనార్జనలో అధికారపార్టీ నాయకులు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
ఫీజులు కట్టలేక విద్యార్థులు
ఉపాధి లేక నిరుద్యోగులు
పనుల్లేక పెరుగుతున్న వలసలు
ఇవి ఏనాటికీ బాగుపడని అతుకులు
అయినా..అంతర్జాతీయ స్థాయిలో
డప్పుకొడదాం మన గొప్పలు
- రాజాబాబు కంచర్ల
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి