అరుణరేఖలు
ఆనాడు నా శిథిల జీవితానికి ఒక మధురప్రభాతం. నాహృదయంలో ఒక ఉదయశ్రీ.
కన్నులు విప్పి చూచాను. శ్రీమతినీ చిరంజీవినీ విడిచి బరువు గుండెతో మేడమెట్లు దిగే గౌతమబుద్ధుని కారుణ్యమూర్తి కనిపించింది. ఆయన ఆర్దనేత్రాంచలాల్లో కరుణాకుమారి తొంగి చూచింది.
ఆమె వదనంలో అయోధ్యానగరం అంతఃపురాల్లో నుంచి దండకారణ్య పర్ణకుటిలో తన జీవిత సౌభాగ్యం వెతుక్కుండే ఊర్మిళాకుమారి ఉత్కంఠ తొణుకు లాడుతూ వుంది.
ఆమె కంఠంలో పాషాణ హృదయుల ప్రక్కలక్రింద రెక్కలు వీడి నలిగి నశించిపోయే పూలబాల జాలిపాట మెల్లమెల్లగా మ్రోగుతూవుంది.
ఆమె నిట్టూర్పులో గంగానది గట్టుమీద నిలిచి నిర్ఘాంతపోయి ఏటి కెరటాలలో పడి ఎక్కడెక్కడికో కొట్టుకుపొయ్యే కొడుకు వైపు నిశ్చల నిరీహ నేత్రాలతో చూచే కుంతీకుమారి గుండెలచప్పుడు వినిపిస్తూవుంది.
ఆమె ఆర్ద్రనేత్రాల్లో మృత్యుదేవత వెంట ఒంటరిగా పతికోసం పరువెత్తే సతీమణి సావిత్రి ప్రణయస్వరూపం ప్రతిబింబిస్తూ వుంది.
ఆమె చల్లనిచేతుల్లో కరుణామయి రాధిక హృదయవిపంచి అమృతరాగాలు ఆలపిస్తూవుంది.
ఆమె కన్నీటి కెరటాలలో భారతమాత బాష్పధారలు ప్రవహిస్తూవున్నాయి. ఆమె నిట్టూర్పులు నన్ను మానవుణ్ణిచేశాయి. ఆమె కన్నీళ్ళే నాలోని కవిత్వం. ఆమె నా కరుణామయి. నా జీవిత సహచరి. నా కళ్యాణమూర్తి. నా ఆరాధ్యదేవి.
భగవంతుడు కరుణామయుడు – సృష్టి కరుణామయం. జీవితం కరుణామయం. ప్రపంచం కరుణలో పుట్టి కరుణలో పెరిగి కరుణలోకే విలీన మౌతుంది.
కరుణకూ కవికి అవినాభావ సంబంధం వుంది. కరుణ లేకపోతే కవికి వ్యక్తిత్వం లేదు. కవి లేకపోతే కరుణకు అస్తిత్వం లేదు.
ఈనాడు నా శిథిల జీవితానికి ఒక మధుర ప్రభాతం. నాహృదయంలో ఒక ఉదయశ్రీ.
******************
పొదుగుగిన్నెకు పాలు పొసి పోసి
కలికి వెన్నెల లూరి చలువ దోసిళ్ళతో
లతలకు మారాకు లతికి యతికి
పూల కంచాలలో రోలంబమునకు రే
పటి భోజనము సిద్ధపరచి పరచి
తెలవారకుండ మొగ్గలలోన జొరబడి
వింత వింతల రంగు వేసి వేసి
తీరికే లేని విశ్వ సంసారమందు
అలిసిపోయితివేమో దేవాదిదేవ!
ఒక నిమేషమ్ము కన్నుమూయుదువు గాని
రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు!!
కూర్చుండ మాయింట కురిచీలు లేవు! నా
ప్రణయాంకమే సిద్ధపరచనుంటి
పాద్యమ్ము నిడ మాకు పన్నీరులేదు! నా
కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి
పూజకై మావీట పుష్పాలు లేవు! నా
ప్రేమాంజలులె సమర్పించనుంటి
నైవేద్యమిడ మాకు నారికేళము లేదు! నా
హృదయమే చేతి కందీయనుంటి
లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము! దయసేయు మాత్మపీఠమ్ముపైకి
అమృతఝురి చిందు నీ పదాంకములయందు
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!
లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర
దీపాలు గగనాన త్రిప్పలేక
జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు
మామూలు మేరకు మడవలేక
పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె
గడియారముల కీలు కదపలేక
అందాలు చింద నీలాకాశ వేదిపై
చుక్కల మ్రుగ్గులు చెక్కలేక
ఎంత శ్రమనొందుచుంటివో ఏమో సామి!
అడుగిడితి వెట్లో నేడు మా గడపలోన!
గుండె కుదిలించి నీముందు కుప్పవోతు
అందుకోవయ్య! హృదయపుష్పాంజలులను
*******
లెగురుచున్నవి ప్రజల నెమ్మొగములందు!
క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి
క్రమ్ముకొన్నది దిగ్దిగంతమ్ము నెల్ల.
ఈ నిస్తబ్దత కంతరార్థ మెదియొ!! ఈ కారుమేఘాలలో
ఏ నిర్భాగ్య నిరర్థ నీరస గళం బెల్గెత్తి వాపోవునో!
ఈ నీరంధ్ర నిశీధ గర్భకుహర, మ్మే భావ గంభీరతా
పౌనఃపున్యము దాచెనో! వెలయవో ప్రాభాత శోభావళుల్!
ఈ చీక ట్లిక తెల్లవారవటె! లేనేలేవటయ్యా స్మిత
శ్రీ చైతన్య నవప్రభాతములు నిర్జీవ ప్రపంచాన! మా
ప్రాచీబాల కపోల పాళికలపై ప్రత్యూష సౌవర్ణ రే
ఖా చిత్రమ్ములు గీతు రెవ్వ రనురాగస్విన్న హస్తాలతో!
***********
మంధలోకాని కిడు జగద్బాంధవుండు
ఉదయమగుచుండె నవయుగాభ్యుదయమునకు
అరుణ కిరణాలతో కరుణార్ద్రమూర్తి.
చీకటిలో లోక మ్మిది
చీకాకై పోయె; సంస్పృశింపగవలె నీ
శ్రీకరముల, కరుణా కమ
లాకర తరుణ ప్రభాకరా! రావోయీ!
శుద్ధోదన రాజేంద్రుని
శుద్ధాంతము చిందె శాంతసుధల, అహింసా
సిద్ధాంత మొలుకు గౌతమ
బుద్ధుని చిరునవ్వులోన పులకీకృతమై!
***********
గన్నుల నీడలన్ సుఖముగా సుమడోలల తన్మయుండవై
ఉన్నత భర్మసౌధముల నూగెడి రాజుల చిన్నవాడ! నీ
కన్నులు విప్పి నల్ దెసలు సన్గొనరా! యిక నిద్రచాలురా!
నిదురన్ భంగము చేసినా ననుచుగానీ; కూర్మిదేవేరి ప
య్యెద బాంధవ్యము బాపుచుంటి నని కానీ, కిన్కగైకోకు! నీ
హృదయమ్మున్ హృదయేశ్వరీ హృదయమందే కాదు..సుప్త ప్రజా
హృదయాబ్జమ్ముల మేలుకొల్పు ’ఉదయశ్రీ’లో ప్రపంచింపరా!
ప్రేయసి ప్రేమలోన కనిపించెడి తీయని స్వర్గ మొక్కటే
ధ్యేయము కాదు, హీను లతిదీనులు మ్లానతనుల్ దరిద్ర నా
రాయణు లేడ్చుచుండిరి, తదశ్రువులన్ దుడువంగపొమ్ము నీ
ప్రేయసితోడ, నీ కట లభించును కోట్లకొలంది స్వర్గముల్!
బుద్ధుడవై సుషుప్తుల ప్రబుద్ధుల జేయుము, శాంతి సత్య ధ
ర్మోద్ధరణార్థమై బ్రతుకు నొగ్గుము, మానవ సంఘసేవయే
సిద్ధికి త్రోవ, వత్సలర చిందెడి ప్రేమ సుధా స్రవంతులన్
శుద్ధ మొనర్చు ముజ్జ్వలయశోధర! జర్జరిత ప్రపంచమున్!!
లెమ్మిక మేలుకొమ్ము! కదలింపుము క్రాంతిరథమ్ము శాంతి మా
ర్గమ్మున; కాంతి పుంజము లఖండములై నవ జీవన ప్రభా
తమ్ములు నింప, సర్వసమతాసుమకోమల మానవాంతరం
గమ్ముల ప్రేమసూత్రమున గట్టుము మంగళ తోరణమ్ములన్!
గుటగుటలాడ ప్రాణములు గొంతుకలో వసి కన్ను గొల్కులన్
బొటబొట రాల బాష్పకణపుంజము, బోరున నేడ్చు నల్లదే
కటికి కసాయి కెంపు చురకత్తి గనుంగొని గొర్రెపిల్ల; సం
దిట గదియింపవే! దిగులు దీర్పవె! ముద్దుల బుజ్జగింపవే!!
ఈ మహి స్వర్గఖండ మొనరింపుము! ఘోర హలాహలమ్ము ది
వ్యామృత మాచరింపుము, “జయోస్తు” కుమార! శిరస్సుపై అహిం
సా మకుట ద్యుతుల్ దశదిశల్ వెలిగింప ప్రపంచ మెల్ల నీ
ప్రేమ రసైక వృష్టి గురిపింపుమురా! కరుణాకళాధరా!
************
గడియ కదలించుచున్న సవ్వడి యిదేమి?
ఇప్పు డంతఃపురమ్మునం దెవరు వీరు
మూసియున్నట్టి తలుపులు దీసినార?
తెర తొలగ ద్రోసికొని చనుదెంచుచున్న
ముగ్ధ మోహన కారుణ్యమూర్తి యెవరు?
అందములు చిందు పున్నమచందమామ
కళ దరుగుటేమి కాలమేఘాలలోన?
నిండు గుండెలపై వ్రాలి నిదురవోవు
ఏ హృదయదేవి పావన స్నేహమునకు
ద్రోహ మొనరించి ప్రక్కకు త్రోసిపుచ్చి
వచ్చెనో కాక – వదన వైవర్ణ్య మేమి?
నమ్మి జీవన సర్వస్వ మమ్ముకొన్న
ప్రణయమయి శాశ్వతప్రేమబంధనములు
త్రెంపుకొని బైటపడు ప్రయత్నింపులేమొ-
తడబడుచు కాళ్ళు గడపలు దాటవేమి!
ఒడలు తెలియక ప్రక్కపై బడి, యనంత
మోహనస్వప్నలోకాలలో హసించు
ముద్దుపాపాయి చిరునవ్వు ముత్తియములు
దొరలుచున్నవి వాలు కందోయి తుదల!
గేహమే వీడలేకనో! గృహిణితోడ
స్నేహమే వీడలేకనో; శిశువుమీది
మోహమే వీడలేకనో; సాహసించి
దేహళిని దాట నింత సందేహపడును?
ప్రణయ భాగ్యేశ్వరీ బాహు పాశ మట్లు
జారిపొలేక ముందుకు సాగనీక
వెంట జీరాడుచు భుజమ్ము నంటి వచ్చు
నుత్తరీయాంచలము చక్కనొత్తడేమి?
కేలుగవ సాచి ఆర్ద్రనేత్రాల తోడ
మెట్టు మెట్టుకు పాదాల జుట్టుకొనెడి
ప్రేయసీ కల్పనా ప్రతిబింబ శత స
హస్రముల గాంచి నిస్తబ్ధు డగుచు నిలుచు!
పడియు ముందుకు, వెనుకకే ప్రాకులాడు
ప్రభువు చరణాలు స్ఫటిక సోపాన పంక్తి;
గాలి కెదురుగ సెలయేటి జాలులోన
పయనమగు రాజహంస దంపతుల భంగి.
ఆ మహోన్నత భర్మ హర్మ్యాలు దిగుట
ఏ మహోన్నత సౌధాల కెక్కజనుటొ?
ఈ వన విహారములు త్యజియించి చనుట
ఏ నవ విహారములు సృజియించుకొనుటో;
లలిత లజ్జావతీ లాస్య లాలనములు
కనెడి కన్నులు సత్య నర్తనము కనెనొ;
శ్రీ చరణ మంజు మంజీర శింజితములు
వినెడి వీను లంతర్వాణి పులుపు వినెనొ;
మినుకు మినుకున గుడిసెలో కునుకుచున్న
దీప మంపిన దీన సందేశ మేమొ;
స్వర్ణశాలలపై భ్రాంతి సడలి, జీర్ణ
పర్ణశాలల మార్గమ్ము పట్టినాడు;
ఆపుకొలేని హృదయమ్ము నదిమిపట్టి
దూరమగుచుండె ప్రభువు సంసారమునకు’
శ్రీయు – శ్రీమతియును – చిరంజీవి లేని
ఈ “మహానిష్క్రమణ”కర్థ మేమికలదో?
కాంతిలోనుండి కటికి చీకటులలోన
కలిసిపోవుచునున్నాడు కరుణమూర్తి’
కటికి చీకట్లలోనుండి కాంతిలోన
పతితపావనుడై బయల్పడగనేమొ!!
***********
నంత విశ్వ విహారిణి, శాంతమూర్తి;
ఆమె లోకైకపావని, ఆమెవంటి
అందములరాణి లేదు బ్రహ్మాండమందు.
ఆమె మానస కమలాకరాంతరమున
జలజమై తేలు నీ చరాచరజగత్తు;
ఆమె నిట్టూర్పులో పరమాణులట్లు
కరగి నీరౌను మేరు మందరము లెన్నొ!!
ఆమె కడకంటి చూపులో అనవరతము
కాపురము సేయు దివిజగంగాభవాని;
ఆమె చిరునవ్వు తలుకులో అహరహమ్ము
నవ్వుకొన్నవి వంద నందనవనాలు!!
బాల భానుడు పసిడి హస్తాలతోడ
పసుపు పారాణి నిడు నామె పాదములకు;
ఆ దయామయి విశ్వ విహారమందు
ప్రతిపదమ్మును కోటి స్వర్గాలపెట్టు.
ఆర్ద్రత-అహింస-అనసూయ-ఆమె యింటి
ఆడబిడ్డలు, నిత్య కల్యాణి ఆమె;
ఆ మహారాజ్ఞి మృదల పాదాంతికమున
అనవతశిరస్కు డగును బ్రహ్మంతవాడు!
ఆమె గాఢ పరిష్వంగమే మదీయ
జీవితమునకు మోక్ష్మలక్ష్మీ ప్రసాద;
మామె యనుభూతియే శుష్కమైన నాదు
బ్రతుకు నోదార్చు మలయ మారుతపు వీచి.
కర్కశ కఠోర కాలచక్రాన నలిగి
చితికిపోయిన నా ముగ్ధ జీవితమ్ము
నింపుకొందును అంచులనిండ, ఆమె
అడుగుదమ్ముల కమ్మపుప్పొడులతోడ.
అస్మదీయ జీవిత పరమార్థ మెల్ల
ఆమె పాదాలమీదనే అంకితమ్ము;
ఆమె హృదయము హృదయాన సందుకొనక
సార్థకత లేదు నా నరజన్మమునకు.
భరతమాత ఆనంద బాష్పాలలోన
నిండు జాబిల్లి పండువెన్నెలలలోన
విశ్వ మానవ కల్యాణ వేదిపైన
జరిగినది మాకు గాంధర్వపరిణయమ్ము.
అస్మదారాధ్యదేవియౌ ఆమెకొరకె
ఆమెకొరకె మదీయ మహా తపస్య;
బుద్ధభగవాను గారాబు పుత్రి – ఆమె
నవ్య సుకుమారి “శ్రీకరుణాకుమారి.”
*************
లేదుగదా తమస్సు లవలేశము, ప్రేమసుధానిధాన! నే
డీ దయనీయదాసి భరియింపగలే దిక నీదు ప్రేమలో
పేదరికమ్ము – మేను మరపింపుము మోహన వేణుగీతికన్!
నీ యసితద్యుతుల్ కనుల నింపితి కాటుకచేసి – అల్లదే
తీయని పాటతో తలుపుదీసెను గుండెకు గున్నమావిపై
కొయిలకన్నె – నా వలపు కొండలపై కడకళ్లనుండి నే
రే యమునా స్రవంతి ప్రవహించెనురా; అనురాగవార్నిధీ!
“శ్రీయుతమూర్తియై కరుణచిందెడి చూపులతోడ స్వామి వేం
చేయును; పాదపూజ దయసేయును మా” కను సంబరాన, ఆ
ప్యాయముగా త్వదీయ పథ మారయుచున్నవి నేడు, పూచియుం
బూయని పచ్చపట్టు పరపుల్ గొని శ్యామల శాద్వలీ స్థలుల్.
నిద్దపు ముద్దుమోవి పయనించు భవన్మురళీరవమ్ములో
నిద్దుర వోయినట్లు శయనించె సమస్తము; సద్దులేని ఈ
యద్దమరేయి ఒంటిగ – రహస్యముగా – తపియించు గుండెపై
నద్దుకొనంగ వచ్చితి దయామయ! నీ చరణారుణాబ్జముల్!!
ఏది మరొక్కమాటు హృదయేశ్వర! గుండెలు పుల్కరింపగా
ఊదగదోయి! ఊదగదవోయి! సుధామయ యుష్మదీయ వే
ణూదయ రాగ డోలికల నూగుచు, విస్మృతిలో విలీనమై
పోదును నాదు క్రొవ్వలపు పువ్వుల ముగ్ధ పరీమళమ్ముతో!!
నీ చిరునవ్వు పాటలు ధ్వనించెడి మామక మానసమ్ములో
లేచెనురా! ప్రఫుల్ల మురళీరవళీ రమణీయ భావనా
వీచి – దృగంచలమ్ముల ద్రవించి స్రవించు మనోనురాగముల్
దాచుకొనంగలేని పసిదాననురా! విసిగింపబోకురా!
“ఇది యది” యంచు తేల్చి వచియింపగరాని విషాద మేదియో
హృది గదలించుచున్నది; దహింపగసాగె నిరాశ శుష్కమౌ
బ్రదుకును; స్నిగ్ధ శీతల కృపారస ధారల, దుర్దినమ్మునే
సుదినము చేయరా! యదుకిశోర! కృశాంగి ననుగ్రహింపరా!
నీరసమైన నీ ప్రణయినీ హృదయ మ్మిది చల్లచల్లగా
నీ రసగీతిలో కరిగి నీరయిపోవుచునుండె, మోహనా
కార! రవంత వచ్చి కనికారము జూపవయేని, కాలువై
యేరయి పొంగి పొర్లి ప్రవహింపదొ గోకుల మాకులమ్ముగన్!
ఈ కరుణామయీ హృదయమే ఒక ప్రేమ మహాసముద్రమై
లోకము నిండెరా! కడుపులో బడబాగ్నిని దాచి; కాంక్ష మ
ర్రాకయి తేలె; చక్కనిదొరా! శయనింతువుగాని పొంగి వ
చ్చే కెరటాలమీద; దయసేయుము గోప కిశోర మూర్తియై.
రాధనురా ప్రభూ! నిరపరాధనురా! అనురాగ భావనా
రాధన మగ్నమానసనురా కనరా; కరుణింపరా; మనో
వీధి పదేపదే కలకవేయుచునున్నవిరా పురా రహో
గాథలు – ఈదలేనిక అగాధ తమోమయ కాలవాహినిన్!!
***********
దేవతా స్త్రీలు దీపాలు తీర్చినారు;
సరస రాకాసుధాకర కరములందు
కలమటంచు నవ్వె శృంగారసరసి.
పూచె వనలక్ష్మి, పిండారబోసినట్లు
పండు వెన్నెల జగ మెల్ల నిండిపోయె;
యమున శీతల సురభి తోయమున దోగి
చల్లగా…మెల్లగా…వీచె పిల్లగాలి.
ఆ మహోజ్వల రజని, మోహన విహార
నవ నవానంద బృందావనమ్ము నందు,
అమల యమునానదీ శాద్వలముల మీద,
లలిత బాల రసాల పల్లవ పరీత
మధుర మంజుల మాలతీ మంటపమున-
పాల రా తిన్నెపయి కల్వపూలతోడ
మాల గట్టుచు కూర్చున్న బాల యెవరు?
ప్రణయ మకరంద మాధురీ భరిత ముగ్ధ
లోచనమ్ములలోని యాలోచనమ్ము
లేమో – ప్రేమ సుధారస శ్రీముఖ మగు
ఆ ముఖములోని యాకాంక్ష లేమొ – త్రిజగ
తీ సముజ్జ్వల సౌందర్యతిలక మామె
ముద్దు చేతులలో ప్రేమ పుష్పమాల
అంద మొగవోయి ఏ కళానందమూర్తి
కంఠము నలంకరించునో –
“చిచ్చువలె చందురుడు పైకి వచ్చినాడు!
పెచ్చరిలినాడు గాడుపు పిల్లగాడు!
రాడు మోహన మురళీస్వరాలవాడు!
తప్ప కేతెంతు నని మాట తప్పినాడు!”
అంత కంతకు నిట్టూర్పు లతిశయించె
కొమరు చెమటలు చిగురు చెక్కుల జనించె
వదన మరచేతిలో నట్టె వ్రాలిపోయె
పడె కపోలమ్ముపై నొక్క బాష్పకణము.
అంత లోపల సుశ్యామలాంగు డొకడు
అల్లనల్లన పుడమిపై నడుగు లిడుచు
వెనుకగా వచ్చి తన ముద్దు వ్రేళ్ళతోడ
గట్టిగా మూసె నామె వాల్గన్ను దోయి.
కమ్మ కస్తురి తావులు గమ్ముమనియె
లలిత తులసీ పరీమళమ్ములు చెలంగె
తరుణి తన్మృదులాంగుళుల్ తడవి చూచి
“కృష్ణుడో, కృష్ణుడో” యంచు కేకవేసె.
“సరస శారద చంద్రికా స్థగిత రజత
యామున తరంగ నౌకా విహారములకు
నన్ను రమ్మని చెప్పి బృందావనమున;
కింటిలో హాయిగా కూరుచుంటివేమి?
ఎంత తడవయ్యె నే వచ్చి – ఎంతనుండి
వేచియుంటిని – పొదరిండ్లు పూచి – వలపు
వీచికలు లేచి – హృదయాలు దోచికొనెడి
యీ శరజ్జోత్స్నలో – పుల్కరించి పొంగి
మ్రోతలెత్తెడి యమునానదీ తటాన!
ప్రేయసి నుపేక్ష సేతువే ప్రియవయస్య!
ఇంత నిర్దయ పూనెదవే దయాళు!
ఇంతగా చిన్నబుచ్చెదనే మహాత్మ!
ఇట్లు గికురింతువే నన్ను హృదయనాథ!”
కలికి యిటు వచ్చిరాని పేరలుక తోడ
సజల నయనాల జీవితేశ్వరుని గాంచె.
సరస సంగీత శృంగార చక్రవర్తి
సకల భువనైక మోహన చారుమూర్తి
రాధికా మానస విహార రాజహంస
మందహాసమ్ము కెమ్మోవి చింద పలికె.
“ఆలసించుట! కాగ్రహ మందితేని
వెలది! విరిదండ సంకెలల్ వేయరాదొ!
ముగుద! పూబంతితో నన్ను మోదరాదొ!
కలికి! మొలనూలుతో నన్ను కట్టరాదొ!
రాధికా క్రోధ మధురాధర మ్మొకింత
నవ్వెనో లేదొ? పకపక నవ్వె ప్రకృతి;
నవ్వుకొన్నది బృందావనమ్ము; యమున
నవ్వుకొన్నది, చంద్రుడు నవ్వినాడు;
విరగబడి తమ పొట్టలు విచ్చిపోవ
నవ్వినవి రాధ తలలోని పువ్వులెల్ల.
వాలుకన్నుల బాష్పాలు జాలువార
నంత రాధిక వివశయై అంఘ్రియుగళి
వ్రాలిపోయిన ప్రియుని కెంగేల నెత్తి
చిక్కుపడిన ముంగురులను చక్కనొత్తి
చెరిగిపోయిన తిలకమ్ము సరియొనర్చి –
“అవును లేవోయి! కపటమాయా ప్రవీణ!
ధీరుడవు మంచిశిక్షనే కోరినావు!
నిత్య సుకుమారమైన సున్నితపు మేను
నాదు చేబంతి తాకున నలిగిపోదె?
సొక్కి సొలిన నీ మోము చూడగలనె?
చేతు లెట్లాడు నిన్ను శిక్షింప నాథ!”
ఎంత నిర్దయురాలనో పంతగించి
కృష్ణ! నీచేత నిట్లు మ్రొక్కించుకొంటి –
నవ్య వనమాల కంఠాన నలిగిపొయె
చెక్కుటద్దాల తళుకొత్తె చిగురుచెమట
కొదుమ కస్తూరి నుదుటిపై చెదరిపోయె
బర్హిబర్హంబు చీకాకుపడియె మౌళి.
పొంద నేర్తునె నిన్ను నా పూర్వజన్మ
కృత సుకృత వైభవమున దక్కితివి నాకు;
విశ్వసుందర చరణారవింద యుగళి
ముద్దుగొని చెక్కుటద్దాల నద్దుకొను అ
దృష్ట మబ్బిన దొక్క రాధికకె నేడు,
తావకీన సౌందర్య సందర్శనాను
భూతిలో పొంగి ప్రవహించి పోదునోయి!
ఎంత కారుణ్య మున్నదో యెంచగలనె
కమలలోచన! నీ కటాక్షములలోన –
ఎంత లావణ్య మున్నదో యెంచగలనె!
ప్రేమమయమూర్తి! నీ ముద్దుమోములోన –
ఎంత మాధుర్య మున్నదో యెంచగలనె!
సులలితకపోల! నీ మృదు సూక్తిలోన –
ఎంత యమృతము గలదొ భావింపగలనె!
స్వామి! తావక మందహాసమ్ములోన –
ఎంత మైకము కలదొ యూహింప గలనె!
రాధికానాథ! నీ మధురాధరమున.”
అనుచు రాధిక పారవశ్యమున మునిగి
వ్రాలె మాధవు స్నేహార్ద్ర వక్షమునందు.
“రాధపై ప్రేమ యధికమో మాధవునకు
మాధవునిపైన రాధ ప్రేమయె ఘనమ్మొ”
ఈ రహస్యము నెరుగలే రెవరుగూడ
ప్రణయమయ నిత్యనూత్న దంపతులు వారు!
****************
మిరుసు లేకుండనే దిరుగుచుండు
ఏ ప్రేమ మహిమచే నెల్ల నక్షత్రాలు
నేల రాలక మింట నిలిచియుండు
ఏ ప్రేమ మహిమచే పృథివిపై బడకుండ
కడలిరాయుడు కాళ్ళు ముడుచుకొనును
ఏ ప్రేమ మహిమచే నీరేడు భువనాల
గాలిదేవుడు సురటీలు విసరు
ఆ మహాప్రేమ – శాశ్వతమైన ప్రేమ –
అద్భుత మఖండ మవ్యక్తమైన ప్రేమ –
నిండియున్నది బ్రహ్మాండభాండమెల్ల
ప్రేయసీ! సృష్టి యంతయు ప్రేమమయము!!
************
లోచన లేమిటో హరిణలోచనీ! నీ చిరునవ్వులోని సం
కోచము లెందుకో కుసుమకోమలి! నీ మధురాధరమ్ములో
దాచుకొనంగనేటికి సుధామయసూక్తి కళావిలాసినీ!
భావోద్యానమునందు క్రొత్తవలపుంబందిళ్లలో కోరికల్
తీవెల్ సాగెను పూలు పూచెను; రసార్ద్రీభూతచేతమ్ముతో
నీవే నేనుగ నేనె నీవుగ లతాంగీ! యేకమైపోద మీ
ప్రావృ ణ్ణీరద పంక్తి క్రింద పులకింపన్ పూర్వపుణ్యావళుల్!
మన దాంపత్యము సత్యమౌ ప్రణయ సామ్రాజ్యమ్ములో లోతులన్
గనియెన్; సాగెను భాగ్యనౌక కవితాకాళిందిలో; నవ్య జీ
వన బృందావన దివ్యసీమ విహరింపన్ రమ్ము; నే కొల్లగొం
దును నీ కోమల బాహుబంధనములందున్ కోటిస్వర్గమ్ములన్
*************
కుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ
కంజదళాక్షి! నీ ప్రణయ గానమ్ములో పులకింతునా – మనో
రంజని! పుష్పవృష్టి పయి రాల్చి నినున్ పులకింపజేతునా!
క్రొంజిగురాకు వ్రేళుల కురుల్ తడియార్చుచు కూరుచున్న అ
భ్యంజనమంగళాంగి! జడ యల్లుదునా – మకరంద మాధురీ
మంజుల మామక ప్రణయ మానస భావనలే ప్రఫుల్ల పు
ష్పాంజలి చేసి నీ యడుగులందు సమర్పణచేసికొందునా –
సంజవెలుంగులో పసిడిచాయల ఖద్దరు చీరగట్టి నా
రింజకు నీళ్ళువోయు శశిరేఖవె నీవు; సుభద్రసూతినై
రంజిత పాణిపల్లవము రాయుదునా – నిను మౌళి దాల్చి మృ
త్యుంజయమూర్తినై జమునితో తొడగొట్టి సవాలుచేతునా!
ర్తాండుడు చేటలన్ జెరిగె నగ్నికణమ్ములు; వెండినీ రదే
కొండలు నెత్తిపై పులుముకొన్నవి, రమ్ము శయింతు మీ లతా
మండపమందు, ప్రేమమయ మానసముల్ మధురించిపోవగన్
బుడుత డుయేలలో నిదురబోవుచునుండెను; పొట్లపాదుపై
ఉడుత పదేపదే అరచుచున్నది; పిట్టలు చెట్టుకొమ్మలన్
వడబడి కూరుచుండె; తలవంచెను చిట్టిగులాబి; గాడుపుల్
సుడిగొనుచుండె నో కుసుమసుందరి! మో మటు త్రిప్పబోకుమా
ఉండుము – లేవబోకుము కృశోదరి! నీ నుదుటన్ శ్రమాంబువుల్
నిండెను; పైపయిం దుడువనీ – సుషమా సుకుమారమైన నీ
గండయుగమ్ము వాడె వడగాలికి; ఊయలలోన వచ్చి కూ
ర్చుండుము – స్వేచ్ఛమై కలసి యూగుద మాశలు మిన్నుముట్టగన్.
------------------------------------------------------
ప్రోగులు వోయగా నిదురవోవు దయామయి! నా యెడందలో
ఆగక పొంగు స్వాప్నిక రహస్యము లెవ్వియొ నీదు గుండెలో
దాగుడుమూతలాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా!
ఈ గిజిగానిగూడు వలెనే మలయానిల రాగడోలలో
నూగుచునుండె నా తలపు లూరక; నీ కబరీభరమ్ములో
మాగిన కేతకీ సుమ సమంచిత సౌరభవీచి పైపయిన్
మూగి స్పృశించి నా హృదయమున్ కదలించుచునుండె ప్రేయసీ!
రాగము నందుకొన్నది తరంగిణి; బాలమరీచిమాలికిన్
స్వాగతమిచ్చె పద్మిని; హసన్ముఖమై మన దొడ్డిలోని పు
న్నాగము కుప్పవోసె సుమనస్సులు, కోవెలలో విపంచికల్
మ్రోగెను; లెమ్ము! పోదము! ప్రమోదముతో మనమాతృపూజకున్.
-------------------------------------------------------
పాటయి మ్రోగ, నూల్ వడకు పావన భారత భాగ్యలక్ష్మి! నీ
పాటల పాణిపద్మములు భవ్యము లయ్యెను – వేలులక్షలున్
కోటులు నూరుకోట్లు గయికొ మ్మివె ముద్దుల బావ దీవనల్.
పసుపుంబూతల లేత పాదములకున్ బారాణి గీలించి, నె
న్నొసటం గుంకుమ దిద్ది, కజ్జలము కన్నుందోయి గైసేసి, క్రొ
గుసుమంబుల్ తలదాల్చి, రాట్నముకడన్ గూర్చున్న నీమూర్తిలో
ప్రసరించెన్ జయభారతీ మధుర శోభా భాగ్య సౌభాగ్యముల్.
పండెను దేవి! నా వలపుపంటలు; పింజలు పింజలైన యీ
గుండెయె యేకుగా వడకుకొంటివి; నా బ్రతుకెల్ల దారమై
కండెలుగగట్టె నీదు చరఖాపయి; నేనిక చే రుమాలనై
యుండెద మెత్తగా పెదవు లొత్తుచు నీ వరహాల చేతిలో.
--------------------------------------------------
ఉపవన నికుంజ వేదిపై నుంటి నేను;
చేత సుమరజ మూని వచ్చితిని నీవు
తిలకమును నా ముఖమ్ముపై దిద్ది తీర్ప.
ఒరిగి ఒయ్యరమొలుక కూర్చుండినావు
అందములరాణివై అస్మదభిముఖముగ;
చేరె మునుముందు నీ కుడిచేయి నాదు
ఆలిక ఫలకమ్ము తిలక విన్యాసమునకు.
పులక లెత్తించె తనువెల్ల చెలి! మదీయ
చిబుక మంటి పైకెత్తు నీ చేతివ్రేళ్ళు;
రాగరస రంజిత పరాగ రచ్యమాన
తిలక కళిక పరీమళమ్ములను చిందె.
“ఐనది సమర్చ, సొగ సింక అద్దమందు
చూచుకొను” డంటి వీవు నాజూకుగాను;
“అటులనా”యంచు నటునిటు సరసి, నీదు
చెక్కుటద్దమ్ము కడ మోము చేర్చినాను.
“ఎంత ముద్దుగ దిద్దితి వేది యేది”
యనుచు నొకరెండు ముద్దుల నునిచినాను;
పకపక మటంచు నవ్వి నీ పాణితలము
అడ్డమొనరించితివి తళ్కుటద్దమునకు.
నాటి ప్రేమార్ద్రతిలక మీ నాడు విజయ
దీక్ష నిప్పించు రక్తార్ద్ర తిలకమయ్యె;
ప్రియతమా! రమ్ము చేయెత్తి పులుచుచుండె
అమ్మ మనలను కరుణ కంఠమ్ము తోడ.
-----------------------------------------------
మోసికొనివచ్చి సేవలు చేసిపోవు
మంచుమలమీది యాదిమ మౌనిమణికి
మందమంద మందాకినీ మారుతములు
స్వామి యర్ధ నిమీలితేక్షణములందు
ఏమి యాకాంక్షితమో చెప్పలేము గాని
సర్వమంగళ పర్వత సార్వభౌము
పట్టి ముప్ప్రొద్దు భక్తిమై పరిచరించు.
అమ్మునిరాజు గెల్చి విజయధ్వజ మెత్తెడి పూన్కి చెంగటన్
ద్రిమ్మరుచుండె మారుడు సతీయుతుడై సమయప్రతీక్షమై;
తుమ్మెదనారితో – చివురుతూణముతో – విరజాజిపూల వి
ల్లమ్ములతో – శుకీపిక బలమ్ములతో – అతిలోకశూరుడై.
ఉచిత పూజోపహారము లూని గౌరి
మూడుకన్నుల మునిమౌళి ముందు నిలిచె;
వినయము భయమ్ము సిగ్గు ముప్పిరిగొనంగ
పలికె కలకంఠి చిగురుచేతులు మొగిడ్చి.
“వాచవులూరు పండ్లు గొనివచ్చితి స్వాములకోస మిచ్చటన్
దాచుదునా ప్రభూ! మిసిమి తామరపాకులలోన; క్రొత్తగా
మా చదలేటి ప్రక్క మధుమాస మనోజ్ఞ మహోదయమ్ములో
పూచెను మొన్ననే పొగడపూ లివి, మాలలు గ్రుచ్చి యిత్తునా!
వచ్చుచునున్న సూర్యభగవానుని చక్కిలిగింత కప్పుడే
విచ్చుచు విచ్చుచున్న అరవిందములందున పొంగి వెల్లువౌ
వెచ్చని తియ్యదేనియలు భృంగకుమారిక లంటకుండగా
తెచ్చితి దొన్నెలందు నిడి దేవరవారికి ఆరగింపుకై!”
అందము చిందిపోవు చెవియందలి చెందొవ జారుచుండ “పూ
లందుకొనుం”డటంచు సుమనోంజలి ముందుకు జాచి శైలరా
ణ్ణందన వంగె – చెంగున అనంగుని చాపము వంగె – వంగె
బాలేందుధరుండు కాన్కలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై.
ఇచట శాంతమ్ము నిండార ఈమెచేతి
పైడి క్రొందమ్ము లందుకొన్నాడు హరుడు;
అచట పంతమ్ము నిండార ఆమె చేతి
వాడి కెందమ్ము లందుకొన్నాడు మరుడు.
తియ్యవిల్కాడు వింట సంధించి విడిచె
అక్షయమ్మైన సమ్మోహనాశుగమ్ము;
గౌరి కడగంటి చూపుతో కలిసిపోయి
గ్రుచ్చుకొనె నది ముక్కంటి గుండెలోన.
స్వర్ణదీ స్వర్ణ కింజల్కములకు
పసిమి దిద్దెడి గిరికన్య పాణితలము
పట్టుకొని వీడగాలేడు భవుడు; మేను
పులకరింపగ వలపులు తొలకరింప.
ముద్దు లొలికెడి పగడాల మోవిమీద
తళుకు చిరునవ్వు ముత్యాలు తద్గుణింప
“స్వామి! యేమిది?” యనుచు లజ్జా వినమ్ర
ముఖి యయి యొకింత వారించె మగుద మునిని.
అంత మహేశ్అరుండు హృదయమ్మును మెల్లగ నిగ్రహించి, అ
త్యంత తపోవిభంగమున కాగ్రహముం గొని, విఘ్నకారణ
మ్మింతకు నెద్దియంచు కనియెన్ నలుదిక్కులు – కానుపించె ఆ
పొంతనె పువ్వుటీరమున పూవిలుకాడు సతీసమేతుడై.
తక్షణము శూలి రూక్ష ఫాలేక్షణమున
ఉదయమందెను ప్రళయ మహోగ్ర శిఖలు;
“పాహి పాహి ప్రభో! ప్రభో! పాహి” యనెడి
సురుల యార్తధ్వనుల్ మింట సుళ్ళు తిరిగె.
అగ్గిరిశు ఫాలనేత్రంపుటగ్గిలోన
భగ్గుమన్నాడు క్షణములో ప్రసవశరుడు
మంచుగుబ్బలి గుహలలో మారుమ్రోగె
తేటి జవరాలి జాలి కన్నీటిపాట.
ఆ కరుణగానమే – ఆ యనంత విరహ
విశ్వసంగీతమే – పంచమస్వరాన
గాన మొనరించినది మన “కాళిదాస
కోకిలమ్ము “వియోగినీ” కూజితముల.
---------------------------------------------
కోడి కూయంగనే మేలుకొంటి నేను;
గంగలో మున్గి ధొతవల్కలము గట్టి
పూలు గొనితేర నరిగితి పుష్పవనికి.
నే నొక పూల మొక్కకడ నిల్చి, చివాలున కొమ్మ వంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి “మా
ప్రాణము తీతువా” యనుచు బావురుమన్నవి – క్రుంగిపోతి – నా
మానసమం దెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై!
“తల్లి యొడిలోన తలిరాకు తల్పమందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె! మోక్షవిత్తమ్ము కొరకు?
హృదయమే లేని నీ పూజ లెందుకోయి?
జడమతుల మేము! జ్ఞానవంతుడవు నీవు!
బుద్ధి యున్నది! భావసమృద్ధి గలదు;
బండబారెనటోయి నీ గుండెకాయ?
శివునికై పూయదే నాల్గు చిన్నిపూలు?
ఆయువు గల్గు నాల్గుగడియల్ కనిపెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తుము – తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము – ఆయువు దీరినంతనే
హాయిగ కన్నుమూసెదము - ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.
గాలిని గౌరవింతుము సుగంధము పూసి, సమాశ్రయించు భృం
గాలకు విందు సేసెదము కమ్మని తేనెలు, మిమ్ముబోంట్ల నే
త్రాలకు హాయి గూర్తుము, స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో
తాళుము త్రుంపబోవకుము! తల్లికి బిడ్డను వేరుసేతువే?
ఆత్మసుఖమ్ము కోసమయి! అన్యుల గొంతులు కోసితెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురుచేతిపూజ వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచరవర్తి ప్రభుండు మా పవి
త్రాత్మల నందుకోడె? నడుమంత్రపు నీ తగులాట మేటికిన్?
ఊలుదారాలతో గొంతు కురి బిరించి
గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము
అకట! దయలేనివారు మీ యాడవారు.
గుండెతడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపుకొరకు
పులుముకొందురు హంత! మీ కొలమువారు.
అక్కట హాయిమేయు మహిషాసురు లందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కలమీద చల్లుకొని, మా పనిమేనులు పాడుకాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి – దొర్లి – మరురోజుదయాననే వాడి వత్తలై
రెక్కలు జారిపోన్ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బపై.
మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోమె! మా
యౌవన మెల్ల కొల్లగొని ఆపయి చీపురితోడ చిమ్మి మ
మ్మావల పారవోతురుగదా! నరజాతికి నీతి యున్నదా?
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్యచేసెడి హంతకుండ
మైల పడిపోయెనోయి! నీ మనుజజన్మ!
పూజ లేకున్న బాబు నీ పున్నెమాయె!
కోయబోకుము మా పేద కుత్తుకలను;
అకట! చేసేత మమ్ముల హత్యచేసి
బాపుకొనబోవు ఆ మహాభాగ్య మేమి?”
ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లుపెట్టి
నట్లుగాన్ – పూలు కోయ చేయాడలేదు!
ఏమితోచక దేవర కెరుకసేయ
వట్టిచేతులతో ఇటు వచ్చినాను.
---------------------------------------------
నది యొక మారుమూలగది – ఆ గది తల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్ల యీడుగల బాలిక – పోలిక రాచపిల్ల – జం
కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్!
కన్నియలాగె వాలకము కన్పడుచున్నది – కాదు కాదు – ఆ
చిన్ని గులాబి లేత అరచేతులలో – పసిబిడ్డ డున్నయ
ట్లున్నది – ఏమికావలయునోగద ఆమెకు – అచ్చుగ్రుద్దిన
ట్లున్నవి రూపురేక – లెవరో యనరా దత డామెబిడ్డయే!
దొరలు నానంద బాష్పాలో – పొరలు దుఃఖ
బాష్పములొగాని యవి గుర్తుపట్టలేము;
రాలుచున్నవి ఆమె నేత్రాలనుండి
బాలకుని ముద్దు చెక్కుటద్దాలమీద!
పొత్తులలోని బిడ్డనికి పుట్టియుపుట్టకముందె యెవ్వరో
క్రొత్తవి వజ్రపుం గవచకుండలముల్ గయిచేసినారు! మేల్
పుత్తడి తమ్మిమొగ్గ జిగిబుగ్గల ముద్దులు మూటగట్టు నీ
నెత్తురుకందు నెత్తుకొని నెచ్చెలి యెచ్చటి కేగుచున్నదో?
గాలితాకున జలతారు మేలిముసుగు
జారె నొక్కింత – అదిగొ! చిన్నారిమోము!
పోల్చుకున్నాములే! కుంతిభోజపుత్రి
స్నిగ్ధ సుకుమారి ఆమె కుంతీకుమారి!!
కడువేగమ్మున చెంగుచెంగున తరంగాల్ పొంగ ఆ తోట వెం
బడి గంగానది పారుచున్నయది బ్రహ్మాండమ్ముగా – అల్లదే
బుడుతన్ చేతులలోన బట్టుకొని యా పూబోడియుంఘూడ ని
య్యడకే వచ్చుచునుండె గద్గదికతో నేమేమొ వాపోవుచున్
“ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నే కోరగనేల? కోరితినిబో ఆతండు రానేల? వ
చ్చెనుబో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగానేల? ప
ట్టెనుబో పట్టినొసంగనేల? అడుగంటెన్ కుంతిసౌభాగ్యముల్.
ఏ యెడ దాచుకొందు నిపు డీ కసిగందును? కన్నతండ్రి “ఛీ
ఛీ” యనకుండునే? పరిహసింపరె బంధువు? లాత్మగౌరవ
శ్రీ యిక దక్కునే? జనులు చేతులు చూపరె? దైవయోగమున్
ద్రోయగరాదు – ఈ శిశివుతో నొడిగట్టితి లోకనిందకున్
“ఈ విషాదాశ్రువులతోడ నింక నెంత
కాల మీమేను మోతు? గంగాభవాని
కలుషహారిణి – ఈ తల్లి కడుపులోన
కలిసిపోయెద నా కన్నకడుపుతోడ.”
అనుచు పసివాని రొమ్ములో నదుముకొనుచు
కుంతి దిగినది నదిలోన – అంతలోన
పెట్టె కాబోలు పవన కంపిత తరంగ
మాలికా డోలికల తేలితేలి వచ్చు!
మందసము రాక గనెనేమొ – ముందు కిడిన
యడుగు వెనుకకు బెట్టి దుఃఖాశ్రుపూర్ణ
నయనములలోన ఆశాకణాలు మెరయ
ఆ దెసకె చూచు నామె కన్నార్పకుండ
దూరదూరాల ప్రాణబంధువు విధాన
అంతకంతకు తనకు దాపగుచునున్న
పెట్టె పొడవును; తన ముద్దుపట్టి పొడవు
చూచి తలయూచు మది నేమి తోచినదియొ!!
“ఆత్మహత్యయు శిశిహత్య యనక గంగ
పాలు గానున్న యీ దీనురాలిమీద
భుఅవనబంధునకే జాలిపుట్టెనేమొ
పెట్టె నంపించి తెరువు చూపెట్టినాడు.”
“ఇట్టులున్నది కాబోలు నీశ్వరేచ్ఛ”
యనుచు విభ్రాంతయై దిక్కు లరసికొనుచు
సగము తడిసిన కోకతో మగువ, పెట్టె
దరికి జని మెల్లమెల్లగా దరికి తెచ్చి –
ఒత్తుగా పూలగుత్తుల నెత్తుపెట్టి –
పైచెరగు చింపి మెత్తగా ప్రక్కపరచి –
క్రొత్త నెత్తలిరాకుల గూర్చి పేర్చి –
ఒత్తుకొనకుండ చేతితో నొత్తిచూచి –
ఎట్ట కేలకు దడదడ కొట్టుకొనెడి
గుండె బిగబట్టుకొని కళ్ళనిండ జుచి,
బాష్పముల సాము దడిసిన ప్రక్కమీద
చిట్టిబాబును బజ్జుండబెట్టె తల్లి.
చిన్ని పెదవుల ముత్యాలు చిందిపడగ
కలమటంచు నవ్వునేగాని, కన్న
యమ్మ కష్టము తన యదృష్టమ్ము కూడ
నెరుగ డింతయు నా యమాయికపుబిడ్డ.
చెదరు హృదయము రాయి చేసికొని పెట్టె
నలలలో త్రోయబొవును – వలపు నిలుప
లేక – చెయిరాక – సుతు కౌగిలించి వెక్కి
వెక్కి యేడ్చును – కన్నీరు గ్రుక్కుకొనును.
“భోగభాగ్యాలతో తులదూగుచున్న
కుంతిభోజుని గారాబు కూతురునయి
కన్న నలుసుకు ఒక పట్టె డన్నమైన
పెట్టుకో నోచనైతి పాపిష్టిదాన.
నన్నతి పేర్మిమై గనెడి నా తలిదండ్రుల ప్రేమ యర్థమౌ
చున్నది; నేడు బిడ్డ నిట నొంటరిగా విడిపొవ కాళ్ళు రా
కున్నవి; యేమి సేతు కనియున్ గనలేని యభాగ్యురాల నే
నన్నివిధాల – కన్నకడుపన్నది కాంతల కింత తీపియే!
పెట్టియలోన నొత్తిగిలబెట్టి నినున్ నడిగంగలోనికిన్
నెట్టుచునుంటి తండ్రి! యిక నీకు నాకు ఋణంబుతీరె; మీ
దెట్టుల నున్నదో మన యదృష్టము! ఘోరము చేసినాను నా
పుట్టుక మాసిపోను! నినుబోలిన రత్నము నాకు దక్కునే!
“పున్నమ చందమామ” సరిపోయెడి నీ వరహాలమోము నే
నెన్నటికైన చూతునె! మరే! దురదృష్టము గప్పికొన్న నా
కన్నుల కంత భాగ్యమును కల్గునె? ఏ యమయైన ఇంత నీ
కన్నముపెట్టి ఆయువిడి నప్పటి మాటగదోయి నాయనా?
పాలబుగ్గల చిక్కదనాల తండ్రి!
వాలుగన్నుల చక్కదనాల తండ్రి!
మేలి నీలి ముంగురుల వరాల తండ్రి!
కాలు చేయి రాని తండ్రి! నా కన్నతండ్రి!
కన్నతండ్రి నవ్వుల పూలు గంపెడేసి –
చిన్నినాన్నకు కన్నులు చేరెడేసి –
చక్కనయ్యకు నెరికురుల్ జానెడేసి –
చిట్టిబాబు మై నిగనిగల్ పెట్టెడేసి –
బాలభానునిబోలు నా బాలు నీదు
గర్భమున నుంచుచుంటి గంగాభవాని!
వీని నే తల్లిచేతిలోనైన బెట్టి
మాట మన్నింపుమమ్మ! నమస్సులమ్ము!”
దిక్కులను జూచి భూదేవి దిక్కుజూచి –
గంగదెస జూచి బిడ్డ మొగమ్ము చూచి –
సజలనయనాలతో ఒక్కసారి “కలువ
కంటి” తలయెత్తి బాలభాస్కరుని జూచె-
మరులు రేకెత్త బిడ్డను మరల మరల
నెత్తుకొనుచు పాలిండ్లపై నొత్తుకొనుచు
బుజ్జగింపుల మమకార ముజ్జగింప
పెట్టెలోపల నుంచి జోకొట్టె తల్లి.
ఆతపత్రమ్ము భంగి కంజాతపత్ర
మొండు బంగారుతండ్రిపై నెండ తగుల
కుండ సంధించి, ఆకులోనుండి ముద్దు
మూతిపై కట్టకడపటి ముద్దు నునిచి –
“నన్ను విడిపోవుచుండె మానాన్న” యనుచు
కరుణ గద్గద కంఠియై కంపమాన
హస్తములతోడ కాంక్షలల్లాడ కనులు
మూసికొని నీటిలోనికి ద్రోసె పెట్టె.
ఏటి కెరటాలలో పెట్టె యేగుచుండ
గట్టుపై నిల్చి అట్టే నిర్ఘాంతపోయి
నిశ్చల నిరీహ నీరస నిర్నిమేష
లోచనమ్ములతో కుంతి చూచుచుండె.
---------------------------------------------
మచట గూడెను; తళతళలాడు భూష
ణాలతో ఖండ ఖండాంతరాల దొరలు
శివ ధనుర్భంగమునకు విచ్చేసినారు.
బారులు తీర్చి భూపతులు బంగరు గద్దెలమీద గూరుచు
న్నారు – వెలుంగుచుండ నయనమ్ముల ముందొక పెద్దవిల్లు, శృం
గార మధూక మాలికను గైకొని జానకి చూచువారి నో
రూరగ తండ్రి ప్రక్క నిలుచున్నది ముద్దుల పెండ్లికూతురై!
ఆ కనుదోయిలో తొణుకులాడు సముజ్జ్వల దివ్యదీప్తి ము
ల్లోకము లేలు రాజసము లోగొనగా – రఘురామమూర్తి తా
నాకృతిగొన్న వీరరసమట్టుల నమ్మునిరాజు వెన్క, నా
జూకుగ నిల్చియుండె ప్రియ సోదరుతో అభిరామమూర్తియై.
స్వాగత! మో స్వయంవర సమాగత రాజకుమారులార! మీ
యాగమనమ్ముచే హృది ప్రహర్ష పరిప్లుతమయ్యె – ఈ ధను
ర్యాగమునందు శంకర శరాసన మెక్కినాడు నెవ్వ; డా మహా
భాగు వరించు నా యనుగుపట్టి సమస్త సభాముఖమ్మునన్”
అని జనకుండు మెల్లగ నిజాసనమం దుపవిష్టుడయ్యె – మ్రో
గెను కరతాళముల్; నతముఖీ ముఖపద్మము వైపు పర్వులె
త్తినవి నరేంద్రపుత్రుల సతృష్ణ విలోకన భృంగపంక్తి; ఆ
ల్లన పులకించె మేను మిథిలాపురనాథుని ముద్దుబిడ్డకున్.
బిగువునిండారు కొమ్మటేనుగులవంటి
రాచవస్తాదు లెందరో లేచినారు;
శివధనుర్భంగ మట్లుండ శృంగభంగ
మయ్యెను సమస్త సభ్య సమక్షమందు.
ముని చిరునవ్వుతోడ తన ముద్దుల శిష్యుని మోము జూచె – త
మ్మునకు ధనుస్సు విచ్చి రఘుముఖ్యుడు జానకి నోరకంటితో
గనుచు, వినమ్రుడై గురువుగారికి – సింహకిశోరమట్లు ముం
దున కరుదెంచె నచ్చెరువుతో నృపతుల్ తలలెత్తి చూడగన్!
“ఫెళ్ళు” మనె విల్లు – గంటలు “ఘల్లు” మనె – “గు
భిల్లు” మనె గుండె నృపులకు – “ఝల్లు” మనియె
జానకీదేహ – మొక నిమేషమ్మునందె
నయము జయమును భయము విస్మయము గదుర.
సిగ్గు బరువున శిరసు వంచినది ఒక్క
సీతయే కాదు – సభలోని క్షితిపతులును;
ముదముమెయి పూలు వర్షించినది సతీ శ్
రోమణులె గాదు – దేవతాగ్రామణులును.
చెల్లరే విల్లు విరుచునే నల్లవాడు
పదిపదారేండ్ల యెలరాచపడుచువాడు!
“సిగ్గు సి”గ్గంచు లేచి గర్జించినారు
కనులుగుట్టిన తెల్లమొగాలవారు.
లక్ష్మివంటి సీతామహాలక్ష్మి విజయ
లక్ష్మితో శ్యామునకు గృహలక్ష్మి యయ్యె!
భరత జనయిత్రి ప్రేమ బాష్పాలలోన
అయ్యె నతివైభవముగ సీతమ్మ పెండ్లి.
-----------------------------------------
గడపివచ్చు వత్సర మొక గడియమాడ్కి;
నాథు నెడబాసి శూన్యమౌ నగరిలోన
నెట్లు నిలచెదు? పదునాలుగేండ్లు తల్లి!
రమణుడు చెంతనుండిన నరణ్యములే యపరంజి మేడలౌ –
రమణుడు లేక మేడలె యరణ్యములొ – నికనేమి జానకీ
రమణికి రాణివాసమె అరణ్యనివాసము – నీవు నీ మనో
రమణుని బాసి ఘోరపుటరణ్యములో బడిపోతి విచ్చటన్!
“వదినెయు నన్నగారు వనవాసము సేయగ నన్నగారి శ్రీ
పదముల సేవచేసికొను భాగ్యము స్వేచ్ఛగ నాకు గల్గు నీ
యదనున నీవు రావల”దటంచు ప్రియుండు నిరాకరింప, నీ
హృదయము కృంగి; పొంగిపోకలెత్తిన దుఃఖము మ్రింగికొంటివే.
అత్తరి “పోయి వత్తును ప్రియా! యిక నే”నను భర్తకెట్టి ప్ర
త్యుత్తర మీయలేక యెటులో తలయెత్తి యెలుంగు రాని డ
గ్గుత్తికతోడ నీలి కనుగొల్కుల బాష్పకణమ్ము లాపుచున్
“చిత్త” మటన్న నిన్ను గన చిత్తము నీరగు నమ్మ ఊర్మిళా!
పైటచెరంగుతో పుడమిపై బడకుండగ నద్దుకొమ్ము నీ
కాటుక కన్నుదామరల కాలువలై ప్రవహించు వేడి క
న్నీటికణాలు – క్రింద పడనీయకు! ముత్తమ సాధ్వి వైన నీ
బోటి వధూటి బాష్పములు భూమి భరింపగలేదు సోదరీ!
అన్నపదమ్ములన్ గొలుచు నాస మనోహరు డేగినాడు – తా
జన్నది భర్తృపాద పరిచర్యకు ప్రేమపుటక్కగారు – ఏ
మున్నది దిక్కు నీ కిచట? నొంటరి వైతివి తల్లి! ఎంతయున్
జిన్నతనమ్ము – నీ వెటుల జేతువొ కోడరిక మ్మయోధ్యలో.
“నన్ను నా పుత్రు జంపి, అన్నను అయోధ్య
గద్దె నెక్కింప వీరకంకణము దాల్చు
లక్ష్మణకుమారు దేవేరులా!” యటంచు
ఆడిపోయదె కైక ని న్నహరహమ్ము.
క్రొవ్వలపు జవ్వనపు మూగకోరికలను
దాపురమ్మైన మీ లేత కాపురమ్ము
చేఇమీదుగ నడవిపాల్ చేసినాడు
కనులుగుట్టిన వేమొ రాకాసి విధికి?
చెల్లెం డ్రిర్వురు ప్రాణవల్లభుల సంసేవించుచున్నారు – తా
నుల్లాసమ్మున సీత వల్లభునితో నుండెన్ వనిన్ నీ వెటుల్
తల్లీ! భర్తృ వియోగ దుఃఖమును నుల్లం బల్లకల్లోలమై
యల్లాడన్ కడత్రోతువమ్మ పదునా ల్గబ్దమ్ము లేకాకృతిన్!
నలుగురు “నంగనాచి గహనాలకు కాంతుని గెంటి యింటిలో
కులుకుచు కూరుచున్న”దనుకొందు రటంచు రవంతయేని చిం
తిలకము తల్లి! త్యాగమయదేవివి నీవని నీ చరిత్రమే
తెలుపుచునుండె – లోకము హృదిన్ గదలించు సదా త్వదశ్రువుల్!
కమ్మని జవ్వన మ్మడవిగాచిన వెన్నెలజేసి, భర్తృవా
క్యమ్మున కడ్డుచెప్పక మహత్తరమౌ పతిభక్తిలోన సీ
తమ్మను మించిపోయితివి – తావక దివ్య యశోలతా వితా
నమ్ములు ప్రాకిపోయె భువనమ్ముల, పుణ్యవతీవతంసమా!
------------------------------------------------------
నినుప గుగ్గిళ్ళు వండి వడ్డించినావు;
అమ్మ! నీ చేతి తాలింపు కమ్మదనము
భరతదేశాన గుమగుమ పరిమళించె.
అత్యపూర్వ మమోఘ మనంత మైన
తావక పతివ్రతా మహత్త్వమ్ములోన
ఆది సాధ్వీమణుల హృదయాలతోడ
నుక్కు సెనగలు తుక తుక ఉడికిపోయె.
వేద వేదాంత సౌవర్ణ వీథులందు
తిరుగుచుండెడి దివ్యమూర్తిత్రయమ్ము
నేడు నీ వంటయింట దోగాడుచుండె
గోరుముద్దలు గుజ్జనగూళ్ళు తినుచు.
కాలు కదపక బిడ్డ లుయ్యేలలందు
నూగునాడె ముల్లోకము లూగుచుండె;
కాలు వచ్చి గంతులు వేయు కాలమునకు
ఇంత కెంతౌనొ? వింతబాలెంతరాల!
ఇయ్యఖిల ప్రపంచములనే తమ బొజ్జల మాటుకొన్న బా
బయ్యలు మువ్వురున్ శిశువులై శయనించిరి నీ గృహాన – నీ
తియ్యని జోలపాటల కిదే పులకించెను సృష్టి యెల్ల – నీ
యుయ్యల తూగులో నిదురనొందెనులే పదునాల్గు లోకముల్!
గర్భము లేదు – కష్టపడి కన్నదిలే – దిక బారసాల సం
దర్భములే – దహో! పురిటి స్నానములున్ నడికట్లు లేవు – ఏ
స్వర్భువనాలనుండి దిగివచ్చిరి నీ ప్రణయాంక పీఠి కీ
యర్భకు? లంతులేని జననాంతర పుణ్య తపఃఫలమ్ములై.
ఆదియు నంతమే యెరుగనట్టి మహామహిమాఢ్యులైన బ్ర
హ్మాదుల కుగ్గు వెట్టి ఒడియం దిడి జోలలువాడు పెద్ద ము
త్తైదువ! “ధన్యురాలవు” గదమ్మ! త్వదుజ్జ్వల కీర్తి గీతికా
నాదము మ్రోగె స్వర్గ భువనమ్మున దైవతమౌని వీణపై.
అగ్గిని గల్పి మట్టు మరియాదలు – పుణ్య పురాణ పూరుషుల్
ముగ్గురు చేయవచ్చిన యమోఘపు టగ్నిపరీక్ష లోపలన్
నెగ్గితి వీ – వపూర్వములు నీ చరితల్ చెవిసోకి మేనులన్
గగ్గురుపాటు పుట్టినదిగా! ముగురమ్మల కొక్కపెట్టునన్;
కొంగులు బట్టి “మా పసుపుకుంకుతో పతిభిక్ష పెట్టి మా
మంగళ సూత్రముల్ నిలుపు” మంచు సరస్వతి సర్వమంగళా
మంగళ దేవతల్ ప్రణతమస్తకలై పడియున్నవారు నీ
ముంగిటియందు నారదుని మోమున నవ్వులు నాట్యమాడగన్!
అమ్మవైనావు చతురాస్య హరి హరులకు –
అత్తవైతివి వాణీ రమాంబికలకు –
ఘనతమై అత్తగారి పెత్తనము చూపి
క్రొత్త కోడండ్ర నిక దిద్దుకోగదమ్మ!
మాతృప్రేమ పునీతమౌ సఫల దాంపత్యమ్ము నీ సొమ్ము, నీ
పాతివ్రత్యములోన అత్రితపముల్ పండెన్, వియద్గంగకే
యేతామెత్తెను నీ యశస్సులు, గుమాయించెన్ జగమ్మెల్ల నీ
యాతిథ్యమ్ము, నమస్సులమ్మ! అనసూయా! అత్రి సీమంతినీ!
------------------------------------------------------------
వీ దారిం బడి దక్షిణాభిముఖివై యేతెంతు వీ కానలో?
నీ దిక్కై దరిజేర్చువా రెవరు లేనేలేరటే తల్లి! ఏ
దేదీ! మో మిటు ద్రిప్పు మెవ్వతెవు దేవీ! నీవు సావిత్రివా!
“నల్లనివాడు – రక్తనయనమ్ములవాడు – భయంకర స్వరూ
పోల్లసనమ్మువాడు – గద నూని మహామహిషమ్ముపై ప్రవ
ర్తిల్లెడివాడు – నా ప్రణయదేవుని జీవధనమ్ము తెచ్చె – నో
బిల్లపురంధ్రులార! కనిపింపడుగా? దయచేసి చెప్పరే!”
చెడ్డది గొడ్డుబోతువిధి, చెల్లి! నిమేషముక్రింద ఏటికా
యొడ్డున గట్టుమీద నిలుచుండి హుటాహుటి రెండుచేతులన్
గొడ్డలి బట్టి కట్టియలు గొట్టెడి నీ హృదయేశు నెత్తిపై
గొడ్డలిపెట్టుపెట్టి పడగొట్టిన దుష్టకిరాతు డెవ్వడో!
నారదుడు చెప్పె – బెదరించె నాన్నగారు –
తల్లి బ్రతిమాలె – నీ గుండె ధైర్యమేమో!
చా వెరింగియు కట్టుకొన్నావు నాడు!
కొదువయైపోయె పసుపు కుంకుమలు నేడు!
పెండ్లినా డమ్మ చెక్కిట బెట్టినట్టి
కాటుక యరాబు రవ్వంత కందలేదు;
పెద్దముత్తైదువలు కాళ్ళ దిద్దినట్టి
పసుపు పారాణి కనుమాపు పడనెలేదు.
అత్తయు మామగారు జనుషాంధులు! కానన భూములందు క్రొం
గ్రొత్తది కాపురమ్ము! జనకుం డిట లేడు! నిజేశు డి ట్లిక
స్మాత్తుగ కూలిపోయె! కొరమాలిన క్రూర విధాత నేడు నీ
కుత్తుక కత్తిపెట్టి తెగగోసెను చిట్టెపు రాతిగుండెతో!
వదనశ్రీ వసివాడిపోయినది, జవ్వట్లాడె లేగను, నీ
మృదు పాదమ్ములు బొబ్బలెత్తినవి, నెమ్మేనెల్ల కంపించె వ
ట్టిది నీ నాథుడు నీకు దక్కుట – వధూటీ! ఆగిపోవమ్మ! అ
ల్లదిగో! కాలుడు, చాలదూరమున; నీ వందించుకోలేవులే!
“నా”యను దిక్కులేని, పదునారవయేడును వచ్చిరాని, లే
బ్రాయపు చిట్టితల్లివి! అరణ్యములో! జమువెంట నొంటిగా
నాయువు దీరి పోవు పతికై పరువెత్తెదు! నీ ప్రపత్తికిన్
మ్రోయవె దేవదుందుభులు! మ్రొక్కవె ఈ పదునాల్గులోకముల్!
బత్తెపుగింజ లేని పతి ప్రాణము కోసము వెంటనంటి ప
ర్వెత్తెడు పిచ్చిపిల్ల వనియే తలపోసెనొ – కచ్చగట్టి దం
డెత్తు సతీమతల్లివని యెంచెనొ – చట్టున నిల్చిపోయినా
డుత్తదిగాదు చూడు మదిగో! బిగబట్టిన దున్న పగ్గముల్!
“వందన మో మహామహిషవాహన! నీ దయచేత నాన్నకున్
నందను లబ్బినారు, నయనమ్ములు గల్గెను మామగారికిన్
హైందవసాధ్వి కీ శుభము లన్ని లభించియు భర్తలేక ఆ
నందము గల్గునా? నుతగుణా! పతిభిక్ష ననుగ్రహింపుమా!”
“పతి నొసగు” మంచు దోసిలొగ్గితివో లేదొ
చేతి పగ్గాలు సడలించె ప్రేతరాజు;
పరుచుచున్నది మహిష మంబరమునందు
వెంటబడుమమ్మ గుండె ద్రవించునేమొ!
చేతి మీదుగ ఎన్నెన్నొ పూతపిందె
కాపురమ్ములు తీసిన ఘాతకుండు!
నిండు ప్రాణాలు నిలువును పిండుకొనెడి
గుండెతడి లేని కర్కోటకుండు వాడు!
కాలుని దున్నపోతు మెడ గంటలు పట్టెడలోని కింకిణీ
జాల ’ఘణం ఘణం’ ధ్వనులు చల్లగ చల్లగ సాగి, దూర దూ
రాలకు పోయె – నీ యెలుగు రాసిన గొంతుక పిల్పులేల? “ఓ
హో”లకు నంద డాత డడిగో! కనిపించెడి కొండమల్పులో!
వైతరణీ ప్రవాహములు వైదొలగెన్ – అసిపత్ర కానన
వ్రాతము స్వాగత మ్మిడె – సెబా! సదిగో యమరాజధానియున్!
ప్రేత పురీశు డేడి కనుపింపడు! దుర్గములోన దూరినా
డాతడు – కోటతల్పు లకటా! బిగియించిరి ద్వారపాలకుల్.
కడకంటన్ బ్రభవింప రక్తనది – సాక్షాత్ కాళికాదేవివై
నడికట్టుం బిగియించి నిల్చిన త్వదంతశ్శక్తికిన్ “ఫెళ్ళునన్”
గడియల్ గూలి “గభీలు”మంచు యమ దుర్గద్వారముల్ బ్రద్దలై
పడియెన్ ధాత్రి “చిరాయురస్తు” జగదంబా నీకు నీ భర్తకున్!
“భగవంతుం డొక డున్న నాకిడును నా ప్రాణేశు – లేకున్న ఈ
జగముల్ నిల్చునె” యంచు భారతసతీ సామర్థ్యముల్ మ్రోతమ్రో
యగ గర్జించితి వమ్మ! దండధర బాహాదండ చండ ప్రచం
డ గదాదండము బెండువోయినది బిడ్డా! నీదు క్రోధాగ్నికిన్!
నిఖిల లోకైక సాధ్వి నిన్ను కన్న
భరతజనయిత్రి భాగ్యాలు పండెనమ్మ!
మెచ్చుకొన్నాడు నీ భర్త నిచ్చినాడు
పుచ్చుకోవమ్మ నీ పూర్వపుణ్యఫలము!
విశ్వవిచిత్ర మైనది పవిత్రము నీ చరితమ్ము – దిక్కులన్
శాశ్వతమయ్యె తావక యశ శ్శశి కాంతులు – నీవు రాజ రా
జేశ్వరివే పతివ్రతల కెల్లను – పచ్చనితల్లి! యింత కా
యశ్వపతిక్షితీంద్రుడు కృతార్థుడులే నిను గన్న తండ్రియై!
-----------------------------------------------------
పంటపొలానో? చేయునది పద్యమొ సేద్యమొ? మంచమందు గూ
ర్చుంటివో మంచెయందో? కవివో గడిదేరిన కర్షకుండవో?
రెంటికి చాలియుంటివి సరే కలమా హలమా ప్రియంబగున్?
కాయలుగాచిపోయినవిగా యరచేతులు! వ్రాతగంటపున్
రాయిడి చేతనా? మొరటు నాగలిమేడి ధరించి సేద్యమున్
జేయుట చేతనా? కవికృషీవల! నీ వ్యవసాయదీక్ష “కా
హా” యని యింతలేసి కనులార్పక చూచిరిలే దివౌకసుల్!
మెత్తనిచేయి నీది; సుతిమెత్తని చిత్తమువాడ వంచు నీ
పొత్తమె సాక్ష్యమిచ్చు; పొలమున్ హలమున్ గొని దున్నుచో నెటుల్
గిత్తల ముల్లుగోల నదలించితివో; వరిచేలపైన ను
వ్వెత్తుగ వ్రాలుచో పరిగపిట్టల నెట్టుల తోలినాడవో!
“నమ్ముము తల్లి నాదు వచనమ్ము; ధనమ్మునకై బజారులో
అమ్మనుజేశ్వరాధముల కమ్మను ని”న్నని బుజ్జగించి నీ
గుమ్మములోన నేడ్చు పలుకుంజెలి కాటుకకంటి వేడి బా
ష్పమ్ములు చేతితో తిడిచివైచెడి భాగ్యము నీకె యబ్బెరా!!
గంటలు కట్టుకొంటివటగా? విటగాండ్రను బోలునట్టి ఈ
కుంటి కురూపి భూపతులకుం గవితాసుత నీయనంచు; ఆ
పంటవలంతియల్లునకె భాగవతమ్మును ధారవోసి, ని
ష్కంటక వృత్తికై నడుముగట్టితి వెంతటి పుణ్యమూర్తివో!
అచ్చపు జుంటితేనియల; నైందవ బింబ సుధారసాల, గో
ర్వెచ్చని పాలమీగడల, విచ్చెడి కన్నెగులాబి మొగ్గలన్
మచ్చరికించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ
వెచ్చట నేర్చినావు? సుకవీ! సుకుమారకళా కళానిధీ!
కమ్మని తేట తెల్గు నుడికారము లేరిచి కూర్చి చాకచ
క్యమ్ముగ కైత లల్లు మొనగాండ్రు కవీశ్వరు లెంతమంది లో
కమ్మున లేరు – నీవలె నొకండును భక్తి రసామృత ప్రవా
హమ్ముల కేతమెత్తిన మహాకవి యేడి తెలుంగుగడ్డపై?
ఎండిన మ్రోడులే కిసలయించెనొ; యేకశిలాపురమ్ములో
బండలు పుల్కరించెనో; అపారముదమ్మున తెల్గుతల్లికిన్
గుండెలు పొంగిపోయి కనుగొల్కులు నిండెనో! పచ్చిపైరులే
పండెనొ; జాలువారిన భవత్ కవితామృత భక్తిధారలన్!
భీష్మునిపైకి కుప్పించి లంఘించు గో
పాల కృష్ణుని కుండలాల కాంతి
కరిరాజు మొరవెట్ట పరువెత్తు కరివేల్పు
ముడివీడి మూపుపై బడిన జుట్టు
సమరమ్ము గావించు సత్య కన్నుల నుండి
వెడలు ప్రేమ క్రోధ వీక్షణములు
కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ
సందు మాగాయ పచ్చడి పసందు
ఎటుల కనుగొంటివయ్య! నీ కెవరు చెప్పి
రయ్య! ఏరాత్రికలగంటివయ్య! రంగు
కుంచెతో దిద్దితీర్చి చిత్రించినావు!
సహజ పాండితి కిది నిదర్శనమటయ్య!!
ముద్దులుగార – భాగవతమున్ రచియించుచు, పంచదారలో
నద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య – అ
ట్లద్దక – వట్టిగంటమున నట్టిటు గీచిన తాటియాకులో
పద్దెములందు – ఈ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా?
“భాగవతమ్ము భాగ్య పరిపాకమ ఆంధ్రులకెల్ల – దానిముం
దాగగజాల వే కవిత” లంచు నభంబున దేవదుందుభుల్
మ్రోగినవేమొ; నీవు కలముంగొని కావ్యము వ్రాయ చిందిపో
సాగినవేమొ! తీయని రసాల రసాల త్వదీయ లేఖినిన్!
వేసము మార్చి యిన్ని దిగవేసి యభా సొనరింపకుండ శ్రీ
వ్యాసుని గ్రంథ మాంధ్రమున వ్రాసితి వందము చింద; నీద అ
గ్రాసనమయ్య! ఆంధ్రకవులందు; వరాలకు నెత్తు కెత్తుగా
ఆ సొగసైన పద్దెము లయారె; తయారగు నీ కలాననే!
ఖ్యాతి గడించుకొన్న కవులందరు లేరె – అదేమి చిత్రమో
పోతన యన్నచో కరిగిపోవు నెడంద, జొహారుసేతకై
చేతులు లేచు, ఈ జనవశీకరణాద్భుతశక్తి చూడగా
ఆతని పేరులో గలద్ప్; ఆయన గంటములోన నున్నదో!
-----------------------------------------------
తల్లి గారాబంపు తల్లి నాకు
అత్యంత సుకుమారి ఆంధ్రభాషా యోష
అల్లారు ముద్దుల చెల్లి నాకు
నవ నవోన్మేష సుందరమూర్తి సాహితీ
లక్ష్మియే అర్ధాంగ లక్ష్మి నాకు
కమనీయ మృదుపదక్రమ కవితాబాల
కలికి పల్కుల పసికందు నాకు
పాణినీయులు దేశికప్రభువులు నాకు
సరసవాజ్ఞ్మయపురము కాపురము నాకు
వాణి వాయించు మాణిక్య వీణలోన
యర్థ మెరిగిన “ఆంధ్ర విద్యార్థి నేను”!
ఒకమాటు కనుమోడ్చుచుందు బమ్మెరవారి
మందార మకరంద మధుర వృష్టి
ఒకమాటు మూర్కొనుచుందు తిమ్మనగారి
పారిజాత వినూత్న పరిమళమ్ము
ఒకమాటు చవిచూచుచుందు పెద్దనగారి
ద్రాక్షాగుళుచ్ఛ సుధా సుధార
ఒకమాటు విహరించుచుందు పింగళివారి
వరకళాపూర్ణ సౌవర్ణ శిఖరి
ఒకట కవితా కుమారితో నూగుచుందు
గగన గంగా తరంగ శృంగారడోల
ఆంధ్ర సాహిత్య నందనోద్యాన సీమ
నర్థి విహరించు “ఆంధ్ర విద్యార్థి” నేను.
కాళిదాస కవీంద్ర కావ్యకళావీధి
పరుగులెత్తెడి రాచబాట నాకు
భట్టబాణుని ముద్దుపట్టి కాదంబరి
కథలు చెప్పెడి చెల్మికత్తె నాకు
భవభూతి స్నేహార్ద్ర భావవైభవగీతి
కరుణా రసాభిషేకమ్ము నాకు
వాల్మీకి కవిచక్రవర్తి భావస్ఫూర్తి
ఆటలాడెడి పూలతోట నాకు
భారతీదేవి మృదులాంక భద్రపీఠి
ముద్దులొలికెడి కతనాల గద్దె నాకు
తెలుగుతోటల సంస్కృత వనలతాళి
నంటుత్రొక్కెడి “ఆంధ్రవిద్యార్థి” నేను.
--------------------------------------
ద్యానమునిండ రక్కసిపొదల్ చిగిరింతలు గారకంపలే
గాని, పదేపదే పయిరుగాలికి నూగు గులాబి గుత్తులే
కానగరావు – స్వేచ్ఛయును గల్గునే యీ కరుణావిహారికిన్!
నేనొక వెర్రిమొర్రికవినే అయినాను – మదీయ జీవితా
ఖ్యానమునందు క్లిష్టగతి కష్టసమన్వయ దుష్టసంధులే
కాని సుగమ్య సుందర సుఖంకర సూక్తి సువర్ణ పంక్తియే
కానగరాదు – బోధమును గల్గునే యీ కవితావిలాసికిన్!
నేనొక జీర్ణశిల్పకుడనే అయిపోయితి – నా యులిన్ సదా
పీనుగ మొండెముల్ – పునుకపేరులు – కుంటిరూపి బొమ్మలే
కాని, వినూత్న యౌవన వికాస మనోహర రూపరేఖయే
కానగరాదు – తృప్తియును గల్గునె యీ తృషితాంతరాత్మకున్!
నేనొక క్లిష్టగాయకుడనే అయిపోయితి – నా విపంచి పై
దీన గళమ్ముతో తెగిన తీగలమీద విషాదగీతులే
కాని, రసంబు పొంగి పులకల్ మొలపించు ప్రమోదగీతయే
కానుగరాదు – స్థాయియును గల్గునె యీ రసలుబ్ధజీవికిన్!
నేనొక రంగలంపటుడనే అయినాను – మదీయ నాటకా
స్థానములో బుసల్ గుసగుసల్ సకలింతలు చప్పరింతలే
కాని, సెబాసటంచు రసికప్రవరుల్ తలలూపి మెచ్చుటే
కానగరాదు – సిద్ధియును గల్గునె యీ నటనావిలాసికిన్!
నేనొక కష్టకర్షకుదనే అయినాను – మదీయ బుద్ధి మా
గాణము నిండ ఒడ్డు మెరకల్ రవపెంకులు రాలురప్పలే
కాని, పసందుగా పసిడి కంకులువంగిన పంటపైరులే
కానగరావు – పుష్టియును గల్గునె నిష్ఠదరిద్రమూర్తికిన్!
నేనొక నష్టజాతకుడనే అయినాను – మదీయ జన్మ చ
క్రాన కుజాష్టమాది కుటిలగ్రహ కుండలి క్రూర దృష్టులే
కాని, త్రికోణ కేంద్ర శుభగ గ్రహ వీక్షణ సామరస్యమే
కానగరా – దదృష్టమును గల్గునె? యీ దురదృష్టమూర్తికిన్?
నేనొక భగ్ననావికుడనే అయినాను – మదీయ భవనాం
భోనిధిలో మహామకరముల్ సుడిగుండములున్ తుపానులే
కాని, సుధా సుధాకిరణ కల్పక దివ్యమణీ వితానమే
కానగరాదు – అద్దరియు గల్గునె యీ యెదురీతగానికిన్?
నేనొక దీనభిక్షుడనే అయినాను – మదీయ జీర్ణగే
హాన దరిద్రదేవత మహా వికట ప్రళయాట్టహాసమే
కాని, యదృష్టలక్ష్మి కడకంటి సుధా మధురార్ద్రదృష్టియే
కానగరాదు – భాగ్యమును గల్గునె ఇట్టి యభాగ్యమూర్తికిన్?
నేనొక వ్యర్థతాపసుడనే అయినాను – మదీయ సంతత
ధ్యాన సమాధిలో వెకిలిదయ్యపు మూకల వెక్కిరింతలే
గాని, ప్రసన్నభావ కళికా లవలేశ విలాసమేనియున్
గానగరాదు – ముక్తియును గల్గునె యీ పరితప్తమౌనికిన్?
------------------------------------------
సామ్రాజ్య జాతీయ జయపతాక –
వినిపింపదే నేడు! విద్యానగర రాజ
సభలోని విజయ దుందుభుల మ్రోత –
చెలగదే నేడు! బొబ్బిలికోట బురుజుపై
తాండ్ర పాపయ తళత్తళల బాకు –
నిప్పచ్చరంబయ్యెనే నేడు! వీర ప
ల్నాటి యోధుల సింహనాదలక్ష్మి –
చెక్కు చెదరని – యేనాడు మొక్కవోని –
ఆంధ్ర పౌరుష మిప్పు డధ్వాన్న మయ్యె;
మరల నొకమాటు వెనుకకు మరలి చూచి
దిద్దుకోవమ్మ! బిడ్డల తెనుగుతల్లి!
రాజరాజుల చరిత్రల నాలపించెడి
గౌతమీ గద్గద కంఠరవము
కృష్ణరాయల కీర్తిగీతాలు కడుపులో
జీర్ణించుకొను హంపి శిథిలశిలలు
అలనాటి కాకతీయుల పౌరుషము త్రవ్వి
గంపకెత్తెడి ఓరుగంటి బయలు
బలితంపు రెడ్డి బిడ్డల సాము గరడీల
రాటుతేలిన కొండవీటి తటులు
విని – కని – తలంచుకొని గుండె వ్రీలిపోయి
వేడి వేడి నిట్టూర్పులే విడిచినాము!
గుడ్డ గట్టిన కడివెడు కొడుకులుండి
యిల్లు వాకిలి కరువైన తల్లివీవు!!
“రాయి గ్రుద్దును” నీ పురా శిల్పసంపత్తి
అమరావతీ స్తూప సముదయంబు;
“చదవించు” నీ మహాసామ్రాజ్య కథల నాం
ధ్ర క్ష్మాపతుల జయస్తంభ లిపులు;
“గళమెత్తిపాడు” నీ గాన సౌభాగ్యమ్ము
రమణీయముగ త్యాగరాయ కృతులు;
“వేనోళ్ళచాటు” నీ వీరమాతృత్వమ్ము
పలనాటివీరుల పంట కథలు;
“వల్లె వేయును” నీ వైభవ ప్రశస్తి
హోరుమంచును నేడు మా ఓడరేవు;
బ్రతికిచెడియున్న నీపూర్వ భాగ్యరేఖ
చెరగిపోలేదు తల్లి! మా స్మృతిపథాల!!
గంటాన కవితను కదనుత్రొక్కించిన
“నన్నయభట్టు” లీనాడు లేరు
కలహాన కంచుఢక్కల నుగ్గునుగ్గు గా
వించు “శ్రీనాథు” లీవేళ లేరు
అంకాన వాణి నోదార్చి జోలలు వాడు
“పోతనామాత్యు”లీ ప్రొద్దు లేరు
పంతాన ప్రభువుచే పల్లకీ నెత్తించు
కొను “పెద్దనార్యు” లీ దినము లేరు
“వాణి నా రాణి” యంచు సవాలు కొట్టి
మాట నెగ్గించు వీరు లీ పూట లేరు
తిరిగి యొకమాటు వెనుకకు తిరిగి చూచి
దిద్దికోవమ్మ! బిడ్డల తెనుగు తల్లి!!
కవులకు బంగారు కడియాలు తొడిగిన
రాయలు గన్న వరాల కడుపు
సీసాలతో కవితాసార మిచ్చు శ్రీ
నాథుని గన్న రత్నాల కడుపు
భద్రాద్రిలో రామభద్రు స్థాపించు గో
పన్నను గన్న పుణ్యంపు కడుపు
జగ మగంటిమి నల్దెసల్ వెలార్చిన పాప
రాయని గన్న వజ్రాల కడుపు
పిసినిగొట్టు రాజులకును – పిలకబట్టు
కుకవులకు – పిచ్చిపిచ్చి భక్తులకు – పిరికి
పందలకు – తావు గాకుండ ముందు ముందు
దిద్దుకోవమ్మ! బిడ్డల తెనుగుతల్లి!
----------------------------------------------
శివ జటాజూట గాంగేయ శీకరములు;
రంజితము లౌత మీకు శర్వాణి చరణ
కంజ మంజుల మంజీర శింజితములు.
పసిడి గిన్నెల నుగ్గుబాలు త్రాగి
సోమయాజులవారి హోమవేదికలపై
అల్లారు ముద్దుగా నాటలాడి
శ్రీనాథుల సువర్ణ సీసమాలికలలో
హాయిగా తూగుటుయ్యాల లూగి
భాగవతులవారి పంచపాళీలలో
మెత్తని శయ్యల నొత్తిగిల్లి
విజయ విద్యానగర రాజవీథులందు
దిగ్గజమ్ముల మీదనే తిరిగి తిరిగి
కంచు జయభేరి దెనల మ్రోగించుకొన్న
ఆంధ్ర కవితాకుమారి! “జయోస్తు” నీకు.
-------------------------------------
ల్లావజ్ఝల” కిరీటలక్ష్మి నింప
“పింగళి” “కాటూరి” ముంగురుల్ సవరింప
“దేవులపల్లి” శ్రీతిలక ముంప
“విశ్వనాథ” వినూత్న వీధుల కిన్నెర మీట
“తుమ్మల” రాష్ట్రగాన మ్మొనర్ప
“వేదుల” “నాయని” వింజామరలు వేయ
“బసవరాజు” “కొడాలి” పదము లొత్త
“అడివి” “నండూరి” భరతనాట్యములు సలుప
“జాషువా” “ఏటుకూరి” హెచ్చరిక లిడగ
నవ్యసాహిత్య సింహాసనమున నీకు
ఆంధ్ర కవితా కుమారి! “దీర్ఘాయురస్తు”
----------------------------------------
నాడకు మో దయామయ! యథార్థము నీకడ విప్పిచెప్ప నో
రాడుటలేదు – పూలకొరకై పువుదోటకు నేను గూడ జ
న్నాడను – పుష్ప మొక్కటయినన్ లభియింపకపోయె నాకటన్
వారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు – మంచి మంచి బం
గారపు పూలబుట్టలను గైకొని పోయిరి ముందుగానె – మా
బూరుగుచెట్టిక్రింద పడిపోయిన గోడల పూరిపాకలో
దూరిన లేతవెల్గులకు దుప్పటి నెత్తితి అమ్మ లేపినన్.
లేచి – చిరుచాప నొకమూల దాచిపెట్టి
ప్రాత తాటాకుబుట్టను చేత బట్టి
పొంగ లోపలి జల మింత పుక్కిలించి
తల్లి కాళ్ళకు వంగి వందన మొనర్చి –
తెలతెలవారుచుండ జనితిన్ విరితోటకు – తోటమాలి త
ల్పులు బిగియించె నా చినిగిపోయిన గుడ్డలు నన్ను జూచి; కా
ళుల బడి, గడ్డమంటి, యెటులో బ్రతిమాలి యవస్థనంది లో
పల బడినాను – చెంత గనుపట్టిరి మిత్రులు పూలు గోయిచున్.
చకచక పూలు గోసికొని సాగిరి వారలు – శూన్యకుంజ మా
లిక లెటుచూచినన్; మిగులలే దొక పుష్పము కూడ నాకు; నే
నొకదెస విన్నబోయి నిలుచుంటిని; నన్ గని వార లందరున్
పకపక నవ్వినారు – తలవంచితి నేనొక కొమ్మచాటునన్
వట్టి పూమొక్కలన్ని నా వంక జూచి
ప్రసవ బంధాలు సడల బాష్పములు రాల్చె;
చేతిలో నున్న బుట్టను చింపివైచి
తిరిగివచ్చితి గుండెలు దిగబడంగ.
ఇంటికి వచ్చుచుండ గనుపించిరి దేవర దేవళమ్ములో
మంటపమందు పుష్పములు మాలలుగ్రుచ్చుచు వారు - పోయి కూ
ర్చుంటిని నేనుగూడ నొకచో నొక స్తంభమువెన్క – ఇంతలో
గంటలు మ్రోగి – అర్చనలకై గుడిలోనికి పోయి రందరున్.
పూజలై మిత్రు లిండ్లకు పోయినారు
రిక్తహస్తాల నిన్ను దర్శింపలేక
మండపము ప్రక్క ధూళిలో నిండియున్న
గ్రుడ్డిపువ్వులనే యేరుకొంటి నేను.
పరిమళములేక – ఎవరికి పనిరాక –
పారవేయ బాటల ప్రక్కబడి – కరాళ
కాల పురుషుని కారు చక్రాల క్రింద
బ్రతుకలేని దరిద్ర పుష్పమ్ములివ్వి.
ఈ యనాథ సుమాలనే – ఈ విశీర్ణ
జీర్ణ కుసుమాలనే – ఈ కృశించు మ్లాన
హీన దీన ప్రసూనాలనే – త్వదంఘ్రి
సేవకై దోయిలించి తెచ్చితిని నేను.
పూల దోసిలి కన్నీట పొరలిపోయె
విరుల మాలిన్య మంతయు వెడలిపోయె
ఆగియుంటి ప్రభూ! స్వామి యాజ్ఞకొరకు
ఆదరింతువొ లేదొ నా బీదపూజ!
----------------------------------
గుళ్ళలోపల హాయిగా కూరుచున్న
దైవముల తలకెక్కి తైతక్కలాడి
కులుకరింపగ మామది కోర్కె లేదు.
గందపొడి గాలిపై చల్లి విందులిడి మ
రంద బిందువులు మిళిందబృందములకు
సిగ్గు విడనాడి ఉచ్ఛిష్ట జీవితమ్ము
గడపుటకు మా మదిని కౌతుకమ్ము లేదు.
హాయి మేయుచు శయ్యాగృహాంతరముల
పూలపాన్పులపైబడి పొరలుచున్న
మనుజ మహిషాల అడుగున మణగిపోయిన
కమలిపోవ మాకు నుత్కంఠ లేదు.
తొడిమ లెడలించి చించి తంతువులతోడ
గొంతులు బిగించి దండలు గ్రుచ్చి మమ్ము
ముడుచుకొను మోహనాంగుల ముడుల మీద
ఫేషనులు దిద్ద మా కభిలాషలేదు.
ప్రణయినీ మృదులాంగుళీ రచిత పుష్ప
దామమై ప్రేమికుని కంఠసీమ నలరి
వలపు కౌగిళ్ళ సందున నలిగి నలిగి
పరవశత నంద మాకు సంబరములేదు.
ఒక ప్రశాంత ప్రభాతాన ఒక్క మంద
మలయ మారుతవీచిలో పులరించి
మెల్లగా తల్లి చల్లని కాళ్ళపైన
రాలి కను మూసికొనుటె సార్థకత మాకు.
--------------------------------------
జీవితమ్ములు నర్పణసేయునట్టి
ధన్యమూర్తులు నడచెడి దారులందు
కాపురము సేయగా కోర్కె గలదు మాకు.
దేశదాస్య విముక్తికై దీక్షనూని
బందిఖానాల బ్రతుకులు బలియొనర్చు
త్యాగమూర్తుల పాదపరాగ మొడల
పులుముకొన నెంతయో కాంక్ష గలదు మాకు.
కట్టుకొన గుడ్డ, త్రాగంగ గంజి లేక
గుడిసెలందు పేరాకట కుములుచున్న
కష్టజీవుల నిట్టూర్పు కాకలందు
కమలిపోవగ కోరిక గలదు మాకు.
విజయఘంటా ధ్వనులు వినువీథి నీండ
ప్రజలు సాగింప జాతీయ పథము వెంట
కదలు స్వాతంత్ర్యరథము చక్రాలక్రింద
నలిగిపోయి సముత్కంఠ గలదు మాకు
దాస్యబంధ విముక్త స్వతంత్ర భరత
మాతృకంఠాన ఒక పుష్పమాల యగుచు
తల్లి యానందబాష్పాల తడిసి తడిసి
పులకరింపగ అభిలాష గలదు మాకు.
ఒక ప్రశాంత ప్రభాతాన ఒక్క మంద
మలయ మారుత వీచిలో పులకరించి
మెల్లగా తల్లి చల్లని కాళ్ళపైన
రాలి కనుమూసికొనుటె సార్థకత మాకు.
----------------------------------
మౌళి జుట్టిన మల్లెపూలచెండు
గోదావరీ కృష్ణ లే దేవి కటిసీమ
వ్రేలాడు ఆణిముత్యాల సరులు
ఆంధ్రసముద్ర మే యమ్మ పాదాలపై
జీరాడు పట్టుకుచ్చెల చెరంగు
నలుబదికోట్ల వీరులు భారతీయులే
కళ్యాణి చల్లని కడుపుపంట
ఆమె బ్రహ్మర్షిజాత కళ్యాణగీత
ధర్మసముపేత వేదమంత్రపూత
విశ్వవిఖ్యాత సుశ్రీల వెలయుగాత
పరమకరుణాసమేత మా భరతమాత!!
----------------------------------
పరువెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తన మ్మొనరించు పెద్దకొడుకు
"నల్లమామా" యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లుకుర్ర
వడకు గుబ్బలి రాచవారిబిడ్డ భవాని
నూరేండ్లు నోచిన నోముపంట
అమరులం దగ్రతాంబూల మందు మేటి
ఆరుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ!!
తిలకమ్ముగా దిద్ది తీర్చిన పూప జా
బిలి రేక లేత వెన్నెలలు గాయ
చిరుబొజ్జ జీరాడు చికిలి కుచ్చెల చెంగు
మురిపెంపు పాదాల ముద్దుగొనగ
జలతారు పూలకుచ్చుల వల్లెవాటుతో
త్రాచు జందెములు దోబూచులాడ
కొలుచు ముప్పదిమూడు కోట్ల దేవతలపై
చల్లని చూపులు వెల్లివిరియ
గౌరికొమరుడు కొలువు సింగారమయ్యె
జాగుచేసినచో లేచి సాగునేమో
తమ్ముడా! రమ్ము స్వామి పాదములు బట్ట
చెల్లెలా! తెమ్ము పువ్వుల పళ్ళెరమ్ము
కొలుచు వారలకు ముంగొంగు బంగారమ్ము
పిలుచువారల కెల్ల ప్రియసఖుండు
సేవించువారికి చేతి చింతామణి
భావించు వారికి పట్టుగొమ్మ
"దాసోహ" మనువారి దగ్గర చుట్టమ్ము
దోసి లొగ్గినవారి తోడునీడ
ఆశ్రయించిన వారి కానంద మందార
మర్థించు వారల కమృతలహరి
జాలిపేగులవాడు - లోకాల కాది
దేవుడే మన పార్వతీదేవి కొడుకు!!
చిట్టెలుకనెక్కి; నేడు విచ్చేసినాడు
అక్కరో! అర్ఘ్యపాత్ర మిట్లందుకొనవె.
లడ్డు జిలేబి హల్వాలె యక్కరలేదు
బియ్యపుండ్రాళ్ళకే చెయ్యి చాచు
వలిపంపు పట్టు దువ్వలువలె పనిలేదు
పసుపు గోచీకె సంబ్రాలుపడును
ముడుపు మూటల పెట్టుబడి పట్టుదల లేదు
పొట్టిగుంజిళ్ళకే పొంగిపోవు
కల్కి తురాయికై తగాదా లేదు
గరిక పూజకె తలకాయ నొగ్గు
పంచకళ్యాణికై యల్కపాన్పు లేదు
ఎలుకతత్తడికె బుజా లెగురవైచు
పంచభక్ష్య ఫలహార కించ లేదు
పచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి.
కుడుము లర్పించు పిల్లభక్తులకు నెల్ల
యిడుమలం దించి కలుము లందించు చేయి;
పార్వతీబాయి ముద్దులబ్బాయి చేయి
తెలుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక!
ఆనాడు నా శిథిల జీవితానికి ఒక మధురప్రభాతం. నాహృదయంలో ఒక ఉదయశ్రీ.
కన్నులు విప్పి చూచాను. శ్రీమతినీ చిరంజీవినీ విడిచి బరువు గుండెతో మేడమెట్లు దిగే గౌతమబుద్ధుని కారుణ్యమూర్తి కనిపించింది. ఆయన ఆర్దనేత్రాంచలాల్లో కరుణాకుమారి తొంగి చూచింది.
ఆమె వదనంలో అయోధ్యానగరం అంతఃపురాల్లో నుంచి దండకారణ్య పర్ణకుటిలో తన జీవిత సౌభాగ్యం వెతుక్కుండే ఊర్మిళాకుమారి ఉత్కంఠ తొణుకు లాడుతూ వుంది.
ఆమె కంఠంలో పాషాణ హృదయుల ప్రక్కలక్రింద రెక్కలు వీడి నలిగి నశించిపోయే పూలబాల జాలిపాట మెల్లమెల్లగా మ్రోగుతూవుంది.
ఆమె నిట్టూర్పులో గంగానది గట్టుమీద నిలిచి నిర్ఘాంతపోయి ఏటి కెరటాలలో పడి ఎక్కడెక్కడికో కొట్టుకుపొయ్యే కొడుకు వైపు నిశ్చల నిరీహ నేత్రాలతో చూచే కుంతీకుమారి గుండెలచప్పుడు వినిపిస్తూవుంది.
ఆమె ఆర్ద్రనేత్రాల్లో మృత్యుదేవత వెంట ఒంటరిగా పతికోసం పరువెత్తే సతీమణి సావిత్రి ప్రణయస్వరూపం ప్రతిబింబిస్తూ వుంది.
ఆమె చల్లనిచేతుల్లో కరుణామయి రాధిక హృదయవిపంచి అమృతరాగాలు ఆలపిస్తూవుంది.
ఆమె కన్నీటి కెరటాలలో భారతమాత బాష్పధారలు ప్రవహిస్తూవున్నాయి. ఆమె నిట్టూర్పులు నన్ను మానవుణ్ణిచేశాయి. ఆమె కన్నీళ్ళే నాలోని కవిత్వం. ఆమె నా కరుణామయి. నా జీవిత సహచరి. నా కళ్యాణమూర్తి. నా ఆరాధ్యదేవి.
భగవంతుడు కరుణామయుడు – సృష్టి కరుణామయం. జీవితం కరుణామయం. ప్రపంచం కరుణలో పుట్టి కరుణలో పెరిగి కరుణలోకే విలీన మౌతుంది.
కరుణకూ కవికి అవినాభావ సంబంధం వుంది. కరుణ లేకపోతే కవికి వ్యక్తిత్వం లేదు. కవి లేకపోతే కరుణకు అస్తిత్వం లేదు.
ఈనాడు నా శిథిల జీవితానికి ఒక మధుర ప్రభాతం. నాహృదయంలో ఒక ఉదయశ్రీ.
******************
అంజలి
పుట్టబోయెడి బుల్లిబుజ్జాయి కోసమైపొదుగుగిన్నెకు పాలు పొసి పోసి
కలికి వెన్నెల లూరి చలువ దోసిళ్ళతో
లతలకు మారాకు లతికి యతికి
పూల కంచాలలో రోలంబమునకు రే
పటి భోజనము సిద్ధపరచి పరచి
తెలవారకుండ మొగ్గలలోన జొరబడి
వింత వింతల రంగు వేసి వేసి
తీరికే లేని విశ్వ సంసారమందు
అలిసిపోయితివేమో దేవాదిదేవ!
ఒక నిమేషమ్ము కన్నుమూయుదువు గాని
రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు!!
కూర్చుండ మాయింట కురిచీలు లేవు! నా
ప్రణయాంకమే సిద్ధపరచనుంటి
పాద్యమ్ము నిడ మాకు పన్నీరులేదు! నా
కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి
పూజకై మావీట పుష్పాలు లేవు! నా
ప్రేమాంజలులె సమర్పించనుంటి
నైవేద్యమిడ మాకు నారికేళము లేదు! నా
హృదయమే చేతి కందీయనుంటి
లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము! దయసేయు మాత్మపీఠమ్ముపైకి
అమృతఝురి చిందు నీ పదాంకములయందు
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!
లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర
దీపాలు గగనాన త్రిప్పలేక
జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు
మామూలు మేరకు మడవలేక
పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె
గడియారముల కీలు కదపలేక
అందాలు చింద నీలాకాశ వేదిపై
చుక్కల మ్రుగ్గులు చెక్కలేక
ఎంత శ్రమనొందుచుంటివో ఏమో సామి!
అడుగిడితి వెట్లో నేడు మా గడపలోన!
గుండె కుదిలించి నీముందు కుప్పవోతు
అందుకోవయ్య! హృదయపుష్పాంజలులను
*******
ఉషస్సు
కర్కశ కరాళ కాలమేఘాల నీడలెగురుచున్నవి ప్రజల నెమ్మొగములందు!
క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి
క్రమ్ముకొన్నది దిగ్దిగంతమ్ము నెల్ల.
ఈ నిస్తబ్దత కంతరార్థ మెదియొ!! ఈ కారుమేఘాలలో
ఏ నిర్భాగ్య నిరర్థ నీరస గళం బెల్గెత్తి వాపోవునో!
ఈ నీరంధ్ర నిశీధ గర్భకుహర, మ్మే భావ గంభీరతా
పౌనఃపున్యము దాచెనో! వెలయవో ప్రాభాత శోభావళుల్!
ఈ చీక ట్లిక తెల్లవారవటె! లేనేలేవటయ్యా స్మిత
శ్రీ చైతన్య నవప్రభాతములు నిర్జీవ ప్రపంచాన! మా
ప్రాచీబాల కపోల పాళికలపై ప్రత్యూష సౌవర్ణ రే
ఖా చిత్రమ్ములు గీతు రెవ్వ రనురాగస్విన్న హస్తాలతో!
***********
ఉదయశ్రీ
సుప్రభాతము! రాగోజ్జ్వల ప్రబోధమంధలోకాని కిడు జగద్బాంధవుండు
ఉదయమగుచుండె నవయుగాభ్యుదయమునకు
అరుణ కిరణాలతో కరుణార్ద్రమూర్తి.
చీకటిలో లోక మ్మిది
చీకాకై పోయె; సంస్పృశింపగవలె నీ
శ్రీకరముల, కరుణా కమ
లాకర తరుణ ప్రభాకరా! రావోయీ!
శుద్ధోదన రాజేంద్రుని
శుద్ధాంతము చిందె శాంతసుధల, అహింసా
సిద్ధాంత మొలుకు గౌతమ
బుద్ధుని చిరునవ్వులోన పులకీకృతమై!
***********
ఉత్తిష్ఠ
చిన్నికుమారు చిర్నగవు చెక్కిలిలో పులకించు రాణి క్రీగన్నుల నీడలన్ సుఖముగా సుమడోలల తన్మయుండవై
ఉన్నత భర్మసౌధముల నూగెడి రాజుల చిన్నవాడ! నీ
కన్నులు విప్పి నల్ దెసలు సన్గొనరా! యిక నిద్రచాలురా!
నిదురన్ భంగము చేసినా ననుచుగానీ; కూర్మిదేవేరి ప
య్యెద బాంధవ్యము బాపుచుంటి నని కానీ, కిన్కగైకోకు! నీ
హృదయమ్మున్ హృదయేశ్వరీ హృదయమందే కాదు..సుప్త ప్రజా
హృదయాబ్జమ్ముల మేలుకొల్పు ’ఉదయశ్రీ’లో ప్రపంచింపరా!
ప్రేయసి ప్రేమలోన కనిపించెడి తీయని స్వర్గ మొక్కటే
ధ్యేయము కాదు, హీను లతిదీనులు మ్లానతనుల్ దరిద్ర నా
రాయణు లేడ్చుచుండిరి, తదశ్రువులన్ దుడువంగపొమ్ము నీ
ప్రేయసితోడ, నీ కట లభించును కోట్లకొలంది స్వర్గముల్!
బుద్ధుడవై సుషుప్తుల ప్రబుద్ధుల జేయుము, శాంతి సత్య ధ
ర్మోద్ధరణార్థమై బ్రతుకు నొగ్గుము, మానవ సంఘసేవయే
సిద్ధికి త్రోవ, వత్సలర చిందెడి ప్రేమ సుధా స్రవంతులన్
శుద్ధ మొనర్చు ముజ్జ్వలయశోధర! జర్జరిత ప్రపంచమున్!!
లెమ్మిక మేలుకొమ్ము! కదలింపుము క్రాంతిరథమ్ము శాంతి మా
ర్గమ్మున; కాంతి పుంజము లఖండములై నవ జీవన ప్రభా
తమ్ములు నింప, సర్వసమతాసుమకోమల మానవాంతరం
గమ్ముల ప్రేమసూత్రమున గట్టుము మంగళ తోరణమ్ములన్!
గుటగుటలాడ ప్రాణములు గొంతుకలో వసి కన్ను గొల్కులన్
బొటబొట రాల బాష్పకణపుంజము, బోరున నేడ్చు నల్లదే
కటికి కసాయి కెంపు చురకత్తి గనుంగొని గొర్రెపిల్ల; సం
దిట గదియింపవే! దిగులు దీర్పవె! ముద్దుల బుజ్జగింపవే!!
ఈ మహి స్వర్గఖండ మొనరింపుము! ఘోర హలాహలమ్ము ది
వ్యామృత మాచరింపుము, “జయోస్తు” కుమార! శిరస్సుపై అహిం
సా మకుట ద్యుతుల్ దశదిశల్ వెలిగింప ప్రపంచ మెల్ల నీ
ప్రేమ రసైక వృష్టి గురిపింపుమురా! కరుణాకళాధరా!
************
కరుణమూర్తి
ఈ ప్రగాఢ నిగూఢ మధ్యే నిశీధిగడియ కదలించుచున్న సవ్వడి యిదేమి?
ఇప్పు డంతఃపురమ్మునం దెవరు వీరు
మూసియున్నట్టి తలుపులు దీసినార?
తెర తొలగ ద్రోసికొని చనుదెంచుచున్న
ముగ్ధ మోహన కారుణ్యమూర్తి యెవరు?
అందములు చిందు పున్నమచందమామ
కళ దరుగుటేమి కాలమేఘాలలోన?
నిండు గుండెలపై వ్రాలి నిదురవోవు
ఏ హృదయదేవి పావన స్నేహమునకు
ద్రోహ మొనరించి ప్రక్కకు త్రోసిపుచ్చి
వచ్చెనో కాక – వదన వైవర్ణ్య మేమి?
నమ్మి జీవన సర్వస్వ మమ్ముకొన్న
ప్రణయమయి శాశ్వతప్రేమబంధనములు
త్రెంపుకొని బైటపడు ప్రయత్నింపులేమొ-
తడబడుచు కాళ్ళు గడపలు దాటవేమి!
ఒడలు తెలియక ప్రక్కపై బడి, యనంత
మోహనస్వప్నలోకాలలో హసించు
ముద్దుపాపాయి చిరునవ్వు ముత్తియములు
దొరలుచున్నవి వాలు కందోయి తుదల!
గేహమే వీడలేకనో! గృహిణితోడ
స్నేహమే వీడలేకనో; శిశువుమీది
మోహమే వీడలేకనో; సాహసించి
దేహళిని దాట నింత సందేహపడును?
ప్రణయ భాగ్యేశ్వరీ బాహు పాశ మట్లు
జారిపొలేక ముందుకు సాగనీక
వెంట జీరాడుచు భుజమ్ము నంటి వచ్చు
నుత్తరీయాంచలము చక్కనొత్తడేమి?
కేలుగవ సాచి ఆర్ద్రనేత్రాల తోడ
మెట్టు మెట్టుకు పాదాల జుట్టుకొనెడి
ప్రేయసీ కల్పనా ప్రతిబింబ శత స
హస్రముల గాంచి నిస్తబ్ధు డగుచు నిలుచు!
పడియు ముందుకు, వెనుకకే ప్రాకులాడు
ప్రభువు చరణాలు స్ఫటిక సోపాన పంక్తి;
గాలి కెదురుగ సెలయేటి జాలులోన
పయనమగు రాజహంస దంపతుల భంగి.
ఆ మహోన్నత భర్మ హర్మ్యాలు దిగుట
ఏ మహోన్నత సౌధాల కెక్కజనుటొ?
ఈ వన విహారములు త్యజియించి చనుట
ఏ నవ విహారములు సృజియించుకొనుటో;
లలిత లజ్జావతీ లాస్య లాలనములు
కనెడి కన్నులు సత్య నర్తనము కనెనొ;
శ్రీ చరణ మంజు మంజీర శింజితములు
వినెడి వీను లంతర్వాణి పులుపు వినెనొ;
మినుకు మినుకున గుడిసెలో కునుకుచున్న
దీప మంపిన దీన సందేశ మేమొ;
స్వర్ణశాలలపై భ్రాంతి సడలి, జీర్ణ
పర్ణశాలల మార్గమ్ము పట్టినాడు;
ఆపుకొలేని హృదయమ్ము నదిమిపట్టి
దూరమగుచుండె ప్రభువు సంసారమునకు’
శ్రీయు – శ్రీమతియును – చిరంజీవి లేని
ఈ “మహానిష్క్రమణ”కర్థ మేమికలదో?
కాంతిలోనుండి కటికి చీకటులలోన
కలిసిపోవుచునున్నాడు కరుణమూర్తి’
కటికి చీకట్లలోనుండి కాంతిలోన
పతితపావనుడై బయల్పడగనేమొ!!
***********
కరుణాకుమారి
ఆమె భువనైకమోహిని, అమృతమయి, అనంత విశ్వ విహారిణి, శాంతమూర్తి;
ఆమె లోకైకపావని, ఆమెవంటి
అందములరాణి లేదు బ్రహ్మాండమందు.
ఆమె మానస కమలాకరాంతరమున
జలజమై తేలు నీ చరాచరజగత్తు;
ఆమె నిట్టూర్పులో పరమాణులట్లు
కరగి నీరౌను మేరు మందరము లెన్నొ!!
ఆమె కడకంటి చూపులో అనవరతము
కాపురము సేయు దివిజగంగాభవాని;
ఆమె చిరునవ్వు తలుకులో అహరహమ్ము
నవ్వుకొన్నవి వంద నందనవనాలు!!
బాల భానుడు పసిడి హస్తాలతోడ
పసుపు పారాణి నిడు నామె పాదములకు;
ఆ దయామయి విశ్వ విహారమందు
ప్రతిపదమ్మును కోటి స్వర్గాలపెట్టు.
ఆర్ద్రత-అహింస-అనసూయ-ఆమె యింటి
ఆడబిడ్డలు, నిత్య కల్యాణి ఆమె;
ఆ మహారాజ్ఞి మృదల పాదాంతికమున
అనవతశిరస్కు డగును బ్రహ్మంతవాడు!
ఆమె గాఢ పరిష్వంగమే మదీయ
జీవితమునకు మోక్ష్మలక్ష్మీ ప్రసాద;
మామె యనుభూతియే శుష్కమైన నాదు
బ్రతుకు నోదార్చు మలయ మారుతపు వీచి.
కర్కశ కఠోర కాలచక్రాన నలిగి
చితికిపోయిన నా ముగ్ధ జీవితమ్ము
నింపుకొందును అంచులనిండ, ఆమె
అడుగుదమ్ముల కమ్మపుప్పొడులతోడ.
అస్మదీయ జీవిత పరమార్థ మెల్ల
ఆమె పాదాలమీదనే అంకితమ్ము;
ఆమె హృదయము హృదయాన సందుకొనక
సార్థకత లేదు నా నరజన్మమునకు.
భరతమాత ఆనంద బాష్పాలలోన
నిండు జాబిల్లి పండువెన్నెలలలోన
విశ్వ మానవ కల్యాణ వేదిపైన
జరిగినది మాకు గాంధర్వపరిణయమ్ము.
అస్మదారాధ్యదేవియౌ ఆమెకొరకె
ఆమెకొరకె మదీయ మహా తపస్య;
బుద్ధభగవాను గారాబు పుత్రి – ఆమె
నవ్య సుకుమారి “శ్రీకరుణాకుమారి.”
*************
కరుణామయి
నీ దరహాస చంద్రికలు నిండిన నా హృదయాంగణమ్ములోలేదుగదా తమస్సు లవలేశము, ప్రేమసుధానిధాన! నే
డీ దయనీయదాసి భరియింపగలే దిక నీదు ప్రేమలో
పేదరికమ్ము – మేను మరపింపుము మోహన వేణుగీతికన్!
నీ యసితద్యుతుల్ కనుల నింపితి కాటుకచేసి – అల్లదే
తీయని పాటతో తలుపుదీసెను గుండెకు గున్నమావిపై
కొయిలకన్నె – నా వలపు కొండలపై కడకళ్లనుండి నే
రే యమునా స్రవంతి ప్రవహించెనురా; అనురాగవార్నిధీ!
“శ్రీయుతమూర్తియై కరుణచిందెడి చూపులతోడ స్వామి వేం
చేయును; పాదపూజ దయసేయును మా” కను సంబరాన, ఆ
ప్యాయముగా త్వదీయ పథ మారయుచున్నవి నేడు, పూచియుం
బూయని పచ్చపట్టు పరపుల్ గొని శ్యామల శాద్వలీ స్థలుల్.
నిద్దపు ముద్దుమోవి పయనించు భవన్మురళీరవమ్ములో
నిద్దుర వోయినట్లు శయనించె సమస్తము; సద్దులేని ఈ
యద్దమరేయి ఒంటిగ – రహస్యముగా – తపియించు గుండెపై
నద్దుకొనంగ వచ్చితి దయామయ! నీ చరణారుణాబ్జముల్!!
ఏది మరొక్కమాటు హృదయేశ్వర! గుండెలు పుల్కరింపగా
ఊదగదోయి! ఊదగదవోయి! సుధామయ యుష్మదీయ వే
ణూదయ రాగ డోలికల నూగుచు, విస్మృతిలో విలీనమై
పోదును నాదు క్రొవ్వలపు పువ్వుల ముగ్ధ పరీమళమ్ముతో!!
నీ చిరునవ్వు పాటలు ధ్వనించెడి మామక మానసమ్ములో
లేచెనురా! ప్రఫుల్ల మురళీరవళీ రమణీయ భావనా
వీచి – దృగంచలమ్ముల ద్రవించి స్రవించు మనోనురాగముల్
దాచుకొనంగలేని పసిదాననురా! విసిగింపబోకురా!
“ఇది యది” యంచు తేల్చి వచియింపగరాని విషాద మేదియో
హృది గదలించుచున్నది; దహింపగసాగె నిరాశ శుష్కమౌ
బ్రదుకును; స్నిగ్ధ శీతల కృపారస ధారల, దుర్దినమ్మునే
సుదినము చేయరా! యదుకిశోర! కృశాంగి ననుగ్రహింపరా!
నీరసమైన నీ ప్రణయినీ హృదయ మ్మిది చల్లచల్లగా
నీ రసగీతిలో కరిగి నీరయిపోవుచునుండె, మోహనా
కార! రవంత వచ్చి కనికారము జూపవయేని, కాలువై
యేరయి పొంగి పొర్లి ప్రవహింపదొ గోకుల మాకులమ్ముగన్!
ఈ కరుణామయీ హృదయమే ఒక ప్రేమ మహాసముద్రమై
లోకము నిండెరా! కడుపులో బడబాగ్నిని దాచి; కాంక్ష మ
ర్రాకయి తేలె; చక్కనిదొరా! శయనింతువుగాని పొంగి వ
చ్చే కెరటాలమీద; దయసేయుము గోప కిశోర మూర్తియై.
రాధనురా ప్రభూ! నిరపరాధనురా! అనురాగ భావనా
రాధన మగ్నమానసనురా కనరా; కరుణింపరా; మనో
వీధి పదేపదే కలకవేయుచునున్నవిరా పురా రహో
గాథలు – ఈదలేనిక అగాధ తమోమయ కాలవాహినిన్!!
***********
పారవశ్యము
అది శరద్రాత్రి, గగన సౌధాంగణమునదేవతా స్త్రీలు దీపాలు తీర్చినారు;
సరస రాకాసుధాకర కరములందు
కలమటంచు నవ్వె శృంగారసరసి.
పూచె వనలక్ష్మి, పిండారబోసినట్లు
పండు వెన్నెల జగ మెల్ల నిండిపోయె;
యమున శీతల సురభి తోయమున దోగి
చల్లగా…మెల్లగా…వీచె పిల్లగాలి.
ఆ మహోజ్వల రజని, మోహన విహార
నవ నవానంద బృందావనమ్ము నందు,
అమల యమునానదీ శాద్వలముల మీద,
లలిత బాల రసాల పల్లవ పరీత
మధుర మంజుల మాలతీ మంటపమున-
పాల రా తిన్నెపయి కల్వపూలతోడ
మాల గట్టుచు కూర్చున్న బాల యెవరు?
ప్రణయ మకరంద మాధురీ భరిత ముగ్ధ
లోచనమ్ములలోని యాలోచనమ్ము
లేమో – ప్రేమ సుధారస శ్రీముఖ మగు
ఆ ముఖములోని యాకాంక్ష లేమొ – త్రిజగ
తీ సముజ్జ్వల సౌందర్యతిలక మామె
ముద్దు చేతులలో ప్రేమ పుష్పమాల
అంద మొగవోయి ఏ కళానందమూర్తి
కంఠము నలంకరించునో –
“చిచ్చువలె చందురుడు పైకి వచ్చినాడు!
పెచ్చరిలినాడు గాడుపు పిల్లగాడు!
రాడు మోహన మురళీస్వరాలవాడు!
తప్ప కేతెంతు నని మాట తప్పినాడు!”
అంత కంతకు నిట్టూర్పు లతిశయించె
కొమరు చెమటలు చిగురు చెక్కుల జనించె
వదన మరచేతిలో నట్టె వ్రాలిపోయె
పడె కపోలమ్ముపై నొక్క బాష్పకణము.
అంత లోపల సుశ్యామలాంగు డొకడు
అల్లనల్లన పుడమిపై నడుగు లిడుచు
వెనుకగా వచ్చి తన ముద్దు వ్రేళ్ళతోడ
గట్టిగా మూసె నామె వాల్గన్ను దోయి.
కమ్మ కస్తురి తావులు గమ్ముమనియె
లలిత తులసీ పరీమళమ్ములు చెలంగె
తరుణి తన్మృదులాంగుళుల్ తడవి చూచి
“కృష్ణుడో, కృష్ణుడో” యంచు కేకవేసె.
“సరస శారద చంద్రికా స్థగిత రజత
యామున తరంగ నౌకా విహారములకు
నన్ను రమ్మని చెప్పి బృందావనమున;
కింటిలో హాయిగా కూరుచుంటివేమి?
ఎంత తడవయ్యె నే వచ్చి – ఎంతనుండి
వేచియుంటిని – పొదరిండ్లు పూచి – వలపు
వీచికలు లేచి – హృదయాలు దోచికొనెడి
యీ శరజ్జోత్స్నలో – పుల్కరించి పొంగి
మ్రోతలెత్తెడి యమునానదీ తటాన!
ప్రేయసి నుపేక్ష సేతువే ప్రియవయస్య!
ఇంత నిర్దయ పూనెదవే దయాళు!
ఇంతగా చిన్నబుచ్చెదనే మహాత్మ!
ఇట్లు గికురింతువే నన్ను హృదయనాథ!”
కలికి యిటు వచ్చిరాని పేరలుక తోడ
సజల నయనాల జీవితేశ్వరుని గాంచె.
సరస సంగీత శృంగార చక్రవర్తి
సకల భువనైక మోహన చారుమూర్తి
రాధికా మానస విహార రాజహంస
మందహాసమ్ము కెమ్మోవి చింద పలికె.
“ఆలసించుట! కాగ్రహ మందితేని
వెలది! విరిదండ సంకెలల్ వేయరాదొ!
ముగుద! పూబంతితో నన్ను మోదరాదొ!
కలికి! మొలనూలుతో నన్ను కట్టరాదొ!
రాధికా క్రోధ మధురాధర మ్మొకింత
నవ్వెనో లేదొ? పకపక నవ్వె ప్రకృతి;
నవ్వుకొన్నది బృందావనమ్ము; యమున
నవ్వుకొన్నది, చంద్రుడు నవ్వినాడు;
విరగబడి తమ పొట్టలు విచ్చిపోవ
నవ్వినవి రాధ తలలోని పువ్వులెల్ల.
వాలుకన్నుల బాష్పాలు జాలువార
నంత రాధిక వివశయై అంఘ్రియుగళి
వ్రాలిపోయిన ప్రియుని కెంగేల నెత్తి
చిక్కుపడిన ముంగురులను చక్కనొత్తి
చెరిగిపోయిన తిలకమ్ము సరియొనర్చి –
“అవును లేవోయి! కపటమాయా ప్రవీణ!
ధీరుడవు మంచిశిక్షనే కోరినావు!
నిత్య సుకుమారమైన సున్నితపు మేను
నాదు చేబంతి తాకున నలిగిపోదె?
సొక్కి సొలిన నీ మోము చూడగలనె?
చేతు లెట్లాడు నిన్ను శిక్షింప నాథ!”
ఎంత నిర్దయురాలనో పంతగించి
కృష్ణ! నీచేత నిట్లు మ్రొక్కించుకొంటి –
నవ్య వనమాల కంఠాన నలిగిపొయె
చెక్కుటద్దాల తళుకొత్తె చిగురుచెమట
కొదుమ కస్తూరి నుదుటిపై చెదరిపోయె
బర్హిబర్హంబు చీకాకుపడియె మౌళి.
పొంద నేర్తునె నిన్ను నా పూర్వజన్మ
కృత సుకృత వైభవమున దక్కితివి నాకు;
విశ్వసుందర చరణారవింద యుగళి
ముద్దుగొని చెక్కుటద్దాల నద్దుకొను అ
దృష్ట మబ్బిన దొక్క రాధికకె నేడు,
తావకీన సౌందర్య సందర్శనాను
భూతిలో పొంగి ప్రవహించి పోదునోయి!
ఎంత కారుణ్య మున్నదో యెంచగలనె
కమలలోచన! నీ కటాక్షములలోన –
ఎంత లావణ్య మున్నదో యెంచగలనె!
ప్రేమమయమూర్తి! నీ ముద్దుమోములోన –
ఎంత మాధుర్య మున్నదో యెంచగలనె!
సులలితకపోల! నీ మృదు సూక్తిలోన –
ఎంత యమృతము గలదొ భావింపగలనె!
స్వామి! తావక మందహాసమ్ములోన –
ఎంత మైకము కలదొ యూహింప గలనె!
రాధికానాథ! నీ మధురాధరమున.”
అనుచు రాధిక పారవశ్యమున మునిగి
వ్రాలె మాధవు స్నేహార్ద్ర వక్షమునందు.
“రాధపై ప్రేమ యధికమో మాధవునకు
మాధవునిపైన రాధ ప్రేమయె ఘనమ్మొ”
ఈ రహస్యము నెరుగలే రెవరుగూడ
ప్రణయమయ నిత్యనూత్న దంపతులు వారు!
****************
విశ్వప్రేమ
ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీచక్రమిరుసు లేకుండనే దిరుగుచుండు
ఏ ప్రేమ మహిమచే నెల్ల నక్షత్రాలు
నేల రాలక మింట నిలిచియుండు
ఏ ప్రేమ మహిమచే పృథివిపై బడకుండ
కడలిరాయుడు కాళ్ళు ముడుచుకొనును
ఏ ప్రేమ మహిమచే నీరేడు భువనాల
గాలిదేవుడు సురటీలు విసరు
ఆ మహాప్రేమ – శాశ్వతమైన ప్రేమ –
అద్భుత మఖండ మవ్యక్తమైన ప్రేమ –
నిండియున్నది బ్రహ్మాండభాండమెల్ల
ప్రేయసీ! సృష్టి యంతయు ప్రేమమయము!!
************
అద్వైతమూర్తి
చూచెదవేల నో ప్రణయసుందరి! కాటుక కళ్లలోని ఆలోచన లేమిటో హరిణలోచనీ! నీ చిరునవ్వులోని సం
కోచము లెందుకో కుసుమకోమలి! నీ మధురాధరమ్ములో
దాచుకొనంగనేటికి సుధామయసూక్తి కళావిలాసినీ!
భావోద్యానమునందు క్రొత్తవలపుంబందిళ్లలో కోరికల్
తీవెల్ సాగెను పూలు పూచెను; రసార్ద్రీభూతచేతమ్ముతో
నీవే నేనుగ నేనె నీవుగ లతాంగీ! యేకమైపోద మీ
ప్రావృ ణ్ణీరద పంక్తి క్రింద పులకింపన్ పూర్వపుణ్యావళుల్!
మన దాంపత్యము సత్యమౌ ప్రణయ సామ్రాజ్యమ్ములో లోతులన్
గనియెన్; సాగెను భాగ్యనౌక కవితాకాళిందిలో; నవ్య జీ
వన బృందావన దివ్యసీమ విహరింపన్ రమ్ము; నే కొల్లగొం
దును నీ కోమల బాహుబంధనములందున్ కోటిస్వర్గమ్ములన్
*************
సాంధ్యశ్రీ
అంజన రేఖ వాల్గనుల యంచులు దాట, మనోజ్ఞ మల్లికాకుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ
కంజదళాక్షి! నీ ప్రణయ గానమ్ములో పులకింతునా – మనో
రంజని! పుష్పవృష్టి పయి రాల్చి నినున్ పులకింపజేతునా!
క్రొంజిగురాకు వ్రేళుల కురుల్ తడియార్చుచు కూరుచున్న అ
భ్యంజనమంగళాంగి! జడ యల్లుదునా – మకరంద మాధురీ
మంజుల మామక ప్రణయ మానస భావనలే ప్రఫుల్ల పు
ష్పాంజలి చేసి నీ యడుగులందు సమర్పణచేసికొందునా –
సంజవెలుంగులో పసిడిచాయల ఖద్దరు చీరగట్టి నా
రింజకు నీళ్ళువోయు శశిరేఖవె నీవు; సుభద్రసూతినై
రంజిత పాణిపల్లవము రాయుదునా – నిను మౌళి దాల్చి మృ
త్యుంజయమూర్తినై జమునితో తొడగొట్టి సవాలుచేతునా!
వైశాఖి
కుండలమీద పిచ్చికలు గుంపులుగూడె; నఖండ చండ మార్తాండుడు చేటలన్ జెరిగె నగ్నికణమ్ములు; వెండినీ రదే
కొండలు నెత్తిపై పులుముకొన్నవి, రమ్ము శయింతు మీ లతా
మండపమందు, ప్రేమమయ మానసముల్ మధురించిపోవగన్
బుడుత డుయేలలో నిదురబోవుచునుండెను; పొట్లపాదుపై
ఉడుత పదేపదే అరచుచున్నది; పిట్టలు చెట్టుకొమ్మలన్
వడబడి కూరుచుండె; తలవంచెను చిట్టిగులాబి; గాడుపుల్
సుడిగొనుచుండె నో కుసుమసుందరి! మో మటు త్రిప్పబోకుమా
ఉండుము – లేవబోకుము కృశోదరి! నీ నుదుటన్ శ్రమాంబువుల్
నిండెను; పైపయిం దుడువనీ – సుషమా సుకుమారమైన నీ
గండయుగమ్ము వాడె వడగాలికి; ఊయలలోన వచ్చి కూ
ర్చుండుము – స్వేచ్ఛమై కలసి యూగుద మాశలు మిన్నుముట్టగన్.
------------------------------------------------------
ప్రాభాతి
రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్ప్రోగులు వోయగా నిదురవోవు దయామయి! నా యెడందలో
ఆగక పొంగు స్వాప్నిక రహస్యము లెవ్వియొ నీదు గుండెలో
దాగుడుమూతలాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా!
ఈ గిజిగానిగూడు వలెనే మలయానిల రాగడోలలో
నూగుచునుండె నా తలపు లూరక; నీ కబరీభరమ్ములో
మాగిన కేతకీ సుమ సమంచిత సౌరభవీచి పైపయిన్
మూగి స్పృశించి నా హృదయమున్ కదలించుచునుండె ప్రేయసీ!
రాగము నందుకొన్నది తరంగిణి; బాలమరీచిమాలికిన్
స్వాగతమిచ్చె పద్మిని; హసన్ముఖమై మన దొడ్డిలోని పు
న్నాగము కుప్పవోసె సుమనస్సులు, కోవెలలో విపంచికల్
మ్రోగెను; లెమ్ము! పోదము! ప్రమోదముతో మనమాతృపూజకున్.
-------------------------------------------------------
రాట్న సుందరి
రాటము మేళవించి, అనురాగము రాగము మాతృభూమిపైపాటయి మ్రోగ, నూల్ వడకు పావన భారత భాగ్యలక్ష్మి! నీ
పాటల పాణిపద్మములు భవ్యము లయ్యెను – వేలులక్షలున్
కోటులు నూరుకోట్లు గయికొ మ్మివె ముద్దుల బావ దీవనల్.
పసుపుంబూతల లేత పాదములకున్ బారాణి గీలించి, నె
న్నొసటం గుంకుమ దిద్ది, కజ్జలము కన్నుందోయి గైసేసి, క్రొ
గుసుమంబుల్ తలదాల్చి, రాట్నముకడన్ గూర్చున్న నీమూర్తిలో
ప్రసరించెన్ జయభారతీ మధుర శోభా భాగ్య సౌభాగ్యముల్.
పండెను దేవి! నా వలపుపంటలు; పింజలు పింజలైన యీ
గుండెయె యేకుగా వడకుకొంటివి; నా బ్రతుకెల్ల దారమై
కండెలుగగట్టె నీదు చరఖాపయి; నేనిక చే రుమాలనై
యుండెద మెత్తగా పెదవు లొత్తుచు నీ వరహాల చేతిలో.
--------------------------------------------------
మధుర స్మృతి
ఆ మనోహర మధుర సాయంతనమునఉపవన నికుంజ వేదిపై నుంటి నేను;
చేత సుమరజ మూని వచ్చితిని నీవు
తిలకమును నా ముఖమ్ముపై దిద్ది తీర్ప.
ఒరిగి ఒయ్యరమొలుక కూర్చుండినావు
అందములరాణివై అస్మదభిముఖముగ;
చేరె మునుముందు నీ కుడిచేయి నాదు
ఆలిక ఫలకమ్ము తిలక విన్యాసమునకు.
పులక లెత్తించె తనువెల్ల చెలి! మదీయ
చిబుక మంటి పైకెత్తు నీ చేతివ్రేళ్ళు;
రాగరస రంజిత పరాగ రచ్యమాన
తిలక కళిక పరీమళమ్ములను చిందె.
“ఐనది సమర్చ, సొగ సింక అద్దమందు
చూచుకొను” డంటి వీవు నాజూకుగాను;
“అటులనా”యంచు నటునిటు సరసి, నీదు
చెక్కుటద్దమ్ము కడ మోము చేర్చినాను.
“ఎంత ముద్దుగ దిద్దితి వేది యేది”
యనుచు నొకరెండు ముద్దుల నునిచినాను;
పకపక మటంచు నవ్వి నీ పాణితలము
అడ్డమొనరించితివి తళ్కుటద్దమునకు.
నాటి ప్రేమార్ద్రతిలక మీ నాడు విజయ
దీక్ష నిప్పించు రక్తార్ద్ర తిలకమయ్యె;
ప్రియతమా! రమ్ము చేయెత్తి పులుచుచుండె
అమ్మ మనలను కరుణ కంఠమ్ము తోడ.
-----------------------------------------------
తపోభంగము
మానస సరోవరాంతర మధుకణాలుమోసికొనివచ్చి సేవలు చేసిపోవు
మంచుమలమీది యాదిమ మౌనిమణికి
మందమంద మందాకినీ మారుతములు
స్వామి యర్ధ నిమీలితేక్షణములందు
ఏమి యాకాంక్షితమో చెప్పలేము గాని
సర్వమంగళ పర్వత సార్వభౌము
పట్టి ముప్ప్రొద్దు భక్తిమై పరిచరించు.
అమ్మునిరాజు గెల్చి విజయధ్వజ మెత్తెడి పూన్కి చెంగటన్
ద్రిమ్మరుచుండె మారుడు సతీయుతుడై సమయప్రతీక్షమై;
తుమ్మెదనారితో – చివురుతూణముతో – విరజాజిపూల వి
ల్లమ్ములతో – శుకీపిక బలమ్ములతో – అతిలోకశూరుడై.
ఉచిత పూజోపహారము లూని గౌరి
మూడుకన్నుల మునిమౌళి ముందు నిలిచె;
వినయము భయమ్ము సిగ్గు ముప్పిరిగొనంగ
పలికె కలకంఠి చిగురుచేతులు మొగిడ్చి.
“వాచవులూరు పండ్లు గొనివచ్చితి స్వాములకోస మిచ్చటన్
దాచుదునా ప్రభూ! మిసిమి తామరపాకులలోన; క్రొత్తగా
మా చదలేటి ప్రక్క మధుమాస మనోజ్ఞ మహోదయమ్ములో
పూచెను మొన్ననే పొగడపూ లివి, మాలలు గ్రుచ్చి యిత్తునా!
వచ్చుచునున్న సూర్యభగవానుని చక్కిలిగింత కప్పుడే
విచ్చుచు విచ్చుచున్న అరవిందములందున పొంగి వెల్లువౌ
వెచ్చని తియ్యదేనియలు భృంగకుమారిక లంటకుండగా
తెచ్చితి దొన్నెలందు నిడి దేవరవారికి ఆరగింపుకై!”
అందము చిందిపోవు చెవియందలి చెందొవ జారుచుండ “పూ
లందుకొనుం”డటంచు సుమనోంజలి ముందుకు జాచి శైలరా
ణ్ణందన వంగె – చెంగున అనంగుని చాపము వంగె – వంగె
బాలేందుధరుండు కాన్కలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై.
ఇచట శాంతమ్ము నిండార ఈమెచేతి
పైడి క్రొందమ్ము లందుకొన్నాడు హరుడు;
అచట పంతమ్ము నిండార ఆమె చేతి
వాడి కెందమ్ము లందుకొన్నాడు మరుడు.
తియ్యవిల్కాడు వింట సంధించి విడిచె
అక్షయమ్మైన సమ్మోహనాశుగమ్ము;
గౌరి కడగంటి చూపుతో కలిసిపోయి
గ్రుచ్చుకొనె నది ముక్కంటి గుండెలోన.
స్వర్ణదీ స్వర్ణ కింజల్కములకు
పసిమి దిద్దెడి గిరికన్య పాణితలము
పట్టుకొని వీడగాలేడు భవుడు; మేను
పులకరింపగ వలపులు తొలకరింప.
ముద్దు లొలికెడి పగడాల మోవిమీద
తళుకు చిరునవ్వు ముత్యాలు తద్గుణింప
“స్వామి! యేమిది?” యనుచు లజ్జా వినమ్ర
ముఖి యయి యొకింత వారించె మగుద మునిని.
అంత మహేశ్అరుండు హృదయమ్మును మెల్లగ నిగ్రహించి, అ
త్యంత తపోవిభంగమున కాగ్రహముం గొని, విఘ్నకారణ
మ్మింతకు నెద్దియంచు కనియెన్ నలుదిక్కులు – కానుపించె ఆ
పొంతనె పువ్వుటీరమున పూవిలుకాడు సతీసమేతుడై.
తక్షణము శూలి రూక్ష ఫాలేక్షణమున
ఉదయమందెను ప్రళయ మహోగ్ర శిఖలు;
“పాహి పాహి ప్రభో! ప్రభో! పాహి” యనెడి
సురుల యార్తధ్వనుల్ మింట సుళ్ళు తిరిగె.
అగ్గిరిశు ఫాలనేత్రంపుటగ్గిలోన
భగ్గుమన్నాడు క్షణములో ప్రసవశరుడు
మంచుగుబ్బలి గుహలలో మారుమ్రోగె
తేటి జవరాలి జాలి కన్నీటిపాట.
ఆ కరుణగానమే – ఆ యనంత విరహ
విశ్వసంగీతమే – పంచమస్వరాన
గాన మొనరించినది మన “కాళిదాస
కోకిలమ్ము “వియోగినీ” కూజితముల.
---------------------------------------------
పుష్పవిలాపము
చేతులారంగ నిన్ను పూజించుకొరకుకోడి కూయంగనే మేలుకొంటి నేను;
గంగలో మున్గి ధొతవల్కలము గట్టి
పూలు గొనితేర నరిగితి పుష్పవనికి.
నే నొక పూల మొక్కకడ నిల్చి, చివాలున కొమ్మ వంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి “మా
ప్రాణము తీతువా” యనుచు బావురుమన్నవి – క్రుంగిపోతి – నా
మానసమం దెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై!
“తల్లి యొడిలోన తలిరాకు తల్పమందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె! మోక్షవిత్తమ్ము కొరకు?
హృదయమే లేని నీ పూజ లెందుకోయి?
జడమతుల మేము! జ్ఞానవంతుడవు నీవు!
బుద్ధి యున్నది! భావసమృద్ధి గలదు;
బండబారెనటోయి నీ గుండెకాయ?
శివునికై పూయదే నాల్గు చిన్నిపూలు?
ఆయువు గల్గు నాల్గుగడియల్ కనిపెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తుము – తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము – ఆయువు దీరినంతనే
హాయిగ కన్నుమూసెదము - ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.
గాలిని గౌరవింతుము సుగంధము పూసి, సమాశ్రయించు భృం
గాలకు విందు సేసెదము కమ్మని తేనెలు, మిమ్ముబోంట్ల నే
త్రాలకు హాయి గూర్తుము, స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో
తాళుము త్రుంపబోవకుము! తల్లికి బిడ్డను వేరుసేతువే?
ఆత్మసుఖమ్ము కోసమయి! అన్యుల గొంతులు కోసితెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురుచేతిపూజ వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచరవర్తి ప్రభుండు మా పవి
త్రాత్మల నందుకోడె? నడుమంత్రపు నీ తగులాట మేటికిన్?
ఊలుదారాలతో గొంతు కురి బిరించి
గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము
అకట! దయలేనివారు మీ యాడవారు.
గుండెతడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపుకొరకు
పులుముకొందురు హంత! మీ కొలమువారు.
అక్కట హాయిమేయు మహిషాసురు లందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కలమీద చల్లుకొని, మా పనిమేనులు పాడుకాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి – దొర్లి – మరురోజుదయాననే వాడి వత్తలై
రెక్కలు జారిపోన్ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బపై.
మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోమె! మా
యౌవన మెల్ల కొల్లగొని ఆపయి చీపురితోడ చిమ్మి మ
మ్మావల పారవోతురుగదా! నరజాతికి నీతి యున్నదా?
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్యచేసెడి హంతకుండ
మైల పడిపోయెనోయి! నీ మనుజజన్మ!
పూజ లేకున్న బాబు నీ పున్నెమాయె!
కోయబోకుము మా పేద కుత్తుకలను;
అకట! చేసేత మమ్ముల హత్యచేసి
బాపుకొనబోవు ఆ మహాభాగ్య మేమి?”
ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లుపెట్టి
నట్లుగాన్ – పూలు కోయ చేయాడలేదు!
ఏమితోచక దేవర కెరుకసేయ
వట్టిచేతులతో ఇటు వచ్చినాను.
---------------------------------------------
కుంతికుమారి
అది రమణీయ పుష్పవన – మావనమం దొకమేడ – మేడపైనది యొక మారుమూలగది – ఆ గది తల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్ల యీడుగల బాలిక – పోలిక రాచపిల్ల – జం
కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్!
కన్నియలాగె వాలకము కన్పడుచున్నది – కాదు కాదు – ఆ
చిన్ని గులాబి లేత అరచేతులలో – పసిబిడ్డ డున్నయ
ట్లున్నది – ఏమికావలయునోగద ఆమెకు – అచ్చుగ్రుద్దిన
ట్లున్నవి రూపురేక – లెవరో యనరా దత డామెబిడ్డయే!
దొరలు నానంద బాష్పాలో – పొరలు దుఃఖ
బాష్పములొగాని యవి గుర్తుపట్టలేము;
రాలుచున్నవి ఆమె నేత్రాలనుండి
బాలకుని ముద్దు చెక్కుటద్దాలమీద!
పొత్తులలోని బిడ్డనికి పుట్టియుపుట్టకముందె యెవ్వరో
క్రొత్తవి వజ్రపుం గవచకుండలముల్ గయిచేసినారు! మేల్
పుత్తడి తమ్మిమొగ్గ జిగిబుగ్గల ముద్దులు మూటగట్టు నీ
నెత్తురుకందు నెత్తుకొని నెచ్చెలి యెచ్చటి కేగుచున్నదో?
గాలితాకున జలతారు మేలిముసుగు
జారె నొక్కింత – అదిగొ! చిన్నారిమోము!
పోల్చుకున్నాములే! కుంతిభోజపుత్రి
స్నిగ్ధ సుకుమారి ఆమె కుంతీకుమారి!!
కడువేగమ్మున చెంగుచెంగున తరంగాల్ పొంగ ఆ తోట వెం
బడి గంగానది పారుచున్నయది బ్రహ్మాండమ్ముగా – అల్లదే
బుడుతన్ చేతులలోన బట్టుకొని యా పూబోడియుంఘూడ ని
య్యడకే వచ్చుచునుండె గద్గదికతో నేమేమొ వాపోవుచున్
“ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నే కోరగనేల? కోరితినిబో ఆతండు రానేల? వ
చ్చెనుబో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగానేల? ప
ట్టెనుబో పట్టినొసంగనేల? అడుగంటెన్ కుంతిసౌభాగ్యముల్.
ఏ యెడ దాచుకొందు నిపు డీ కసిగందును? కన్నతండ్రి “ఛీ
ఛీ” యనకుండునే? పరిహసింపరె బంధువు? లాత్మగౌరవ
శ్రీ యిక దక్కునే? జనులు చేతులు చూపరె? దైవయోగమున్
ద్రోయగరాదు – ఈ శిశివుతో నొడిగట్టితి లోకనిందకున్
“ఈ విషాదాశ్రువులతోడ నింక నెంత
కాల మీమేను మోతు? గంగాభవాని
కలుషహారిణి – ఈ తల్లి కడుపులోన
కలిసిపోయెద నా కన్నకడుపుతోడ.”
అనుచు పసివాని రొమ్ములో నదుముకొనుచు
కుంతి దిగినది నదిలోన – అంతలోన
పెట్టె కాబోలు పవన కంపిత తరంగ
మాలికా డోలికల తేలితేలి వచ్చు!
మందసము రాక గనెనేమొ – ముందు కిడిన
యడుగు వెనుకకు బెట్టి దుఃఖాశ్రుపూర్ణ
నయనములలోన ఆశాకణాలు మెరయ
ఆ దెసకె చూచు నామె కన్నార్పకుండ
దూరదూరాల ప్రాణబంధువు విధాన
అంతకంతకు తనకు దాపగుచునున్న
పెట్టె పొడవును; తన ముద్దుపట్టి పొడవు
చూచి తలయూచు మది నేమి తోచినదియొ!!
“ఆత్మహత్యయు శిశిహత్య యనక గంగ
పాలు గానున్న యీ దీనురాలిమీద
భుఅవనబంధునకే జాలిపుట్టెనేమొ
పెట్టె నంపించి తెరువు చూపెట్టినాడు.”
“ఇట్టులున్నది కాబోలు నీశ్వరేచ్ఛ”
యనుచు విభ్రాంతయై దిక్కు లరసికొనుచు
సగము తడిసిన కోకతో మగువ, పెట్టె
దరికి జని మెల్లమెల్లగా దరికి తెచ్చి –
ఒత్తుగా పూలగుత్తుల నెత్తుపెట్టి –
పైచెరగు చింపి మెత్తగా ప్రక్కపరచి –
క్రొత్త నెత్తలిరాకుల గూర్చి పేర్చి –
ఒత్తుకొనకుండ చేతితో నొత్తిచూచి –
ఎట్ట కేలకు దడదడ కొట్టుకొనెడి
గుండె బిగబట్టుకొని కళ్ళనిండ జుచి,
బాష్పముల సాము దడిసిన ప్రక్కమీద
చిట్టిబాబును బజ్జుండబెట్టె తల్లి.
చిన్ని పెదవుల ముత్యాలు చిందిపడగ
కలమటంచు నవ్వునేగాని, కన్న
యమ్మ కష్టము తన యదృష్టమ్ము కూడ
నెరుగ డింతయు నా యమాయికపుబిడ్డ.
చెదరు హృదయము రాయి చేసికొని పెట్టె
నలలలో త్రోయబొవును – వలపు నిలుప
లేక – చెయిరాక – సుతు కౌగిలించి వెక్కి
వెక్కి యేడ్చును – కన్నీరు గ్రుక్కుకొనును.
“భోగభాగ్యాలతో తులదూగుచున్న
కుంతిభోజుని గారాబు కూతురునయి
కన్న నలుసుకు ఒక పట్టె డన్నమైన
పెట్టుకో నోచనైతి పాపిష్టిదాన.
నన్నతి పేర్మిమై గనెడి నా తలిదండ్రుల ప్రేమ యర్థమౌ
చున్నది; నేడు బిడ్డ నిట నొంటరిగా విడిపొవ కాళ్ళు రా
కున్నవి; యేమి సేతు కనియున్ గనలేని యభాగ్యురాల నే
నన్నివిధాల – కన్నకడుపన్నది కాంతల కింత తీపియే!
పెట్టియలోన నొత్తిగిలబెట్టి నినున్ నడిగంగలోనికిన్
నెట్టుచునుంటి తండ్రి! యిక నీకు నాకు ఋణంబుతీరె; మీ
దెట్టుల నున్నదో మన యదృష్టము! ఘోరము చేసినాను నా
పుట్టుక మాసిపోను! నినుబోలిన రత్నము నాకు దక్కునే!
“పున్నమ చందమామ” సరిపోయెడి నీ వరహాలమోము నే
నెన్నటికైన చూతునె! మరే! దురదృష్టము గప్పికొన్న నా
కన్నుల కంత భాగ్యమును కల్గునె? ఏ యమయైన ఇంత నీ
కన్నముపెట్టి ఆయువిడి నప్పటి మాటగదోయి నాయనా?
పాలబుగ్గల చిక్కదనాల తండ్రి!
వాలుగన్నుల చక్కదనాల తండ్రి!
మేలి నీలి ముంగురుల వరాల తండ్రి!
కాలు చేయి రాని తండ్రి! నా కన్నతండ్రి!
కన్నతండ్రి నవ్వుల పూలు గంపెడేసి –
చిన్నినాన్నకు కన్నులు చేరెడేసి –
చక్కనయ్యకు నెరికురుల్ జానెడేసి –
చిట్టిబాబు మై నిగనిగల్ పెట్టెడేసి –
బాలభానునిబోలు నా బాలు నీదు
గర్భమున నుంచుచుంటి గంగాభవాని!
వీని నే తల్లిచేతిలోనైన బెట్టి
మాట మన్నింపుమమ్మ! నమస్సులమ్ము!”
దిక్కులను జూచి భూదేవి దిక్కుజూచి –
గంగదెస జూచి బిడ్డ మొగమ్ము చూచి –
సజలనయనాలతో ఒక్కసారి “కలువ
కంటి” తలయెత్తి బాలభాస్కరుని జూచె-
మరులు రేకెత్త బిడ్డను మరల మరల
నెత్తుకొనుచు పాలిండ్లపై నొత్తుకొనుచు
బుజ్జగింపుల మమకార ముజ్జగింప
పెట్టెలోపల నుంచి జోకొట్టె తల్లి.
ఆతపత్రమ్ము భంగి కంజాతపత్ర
మొండు బంగారుతండ్రిపై నెండ తగుల
కుండ సంధించి, ఆకులోనుండి ముద్దు
మూతిపై కట్టకడపటి ముద్దు నునిచి –
“నన్ను విడిపోవుచుండె మానాన్న” యనుచు
కరుణ గద్గద కంఠియై కంపమాన
హస్తములతోడ కాంక్షలల్లాడ కనులు
మూసికొని నీటిలోనికి ద్రోసె పెట్టె.
ఏటి కెరటాలలో పెట్టె యేగుచుండ
గట్టుపై నిల్చి అట్టే నిర్ఘాంతపోయి
నిశ్చల నిరీహ నీరస నిర్నిమేష
లోచనమ్ములతో కుంతి చూచుచుండె.
---------------------------------------------
ధనుర్భంగము
అది మహాసభ – సీతా స్వయంవరార్థమచట గూడెను; తళతళలాడు భూష
ణాలతో ఖండ ఖండాంతరాల దొరలు
శివ ధనుర్భంగమునకు విచ్చేసినారు.
బారులు తీర్చి భూపతులు బంగరు గద్దెలమీద గూరుచు
న్నారు – వెలుంగుచుండ నయనమ్ముల ముందొక పెద్దవిల్లు, శృం
గార మధూక మాలికను గైకొని జానకి చూచువారి నో
రూరగ తండ్రి ప్రక్క నిలుచున్నది ముద్దుల పెండ్లికూతురై!
ఆ కనుదోయిలో తొణుకులాడు సముజ్జ్వల దివ్యదీప్తి ము
ల్లోకము లేలు రాజసము లోగొనగా – రఘురామమూర్తి తా
నాకృతిగొన్న వీరరసమట్టుల నమ్మునిరాజు వెన్క, నా
జూకుగ నిల్చియుండె ప్రియ సోదరుతో అభిరామమూర్తియై.
స్వాగత! మో స్వయంవర సమాగత రాజకుమారులార! మీ
యాగమనమ్ముచే హృది ప్రహర్ష పరిప్లుతమయ్యె – ఈ ధను
ర్యాగమునందు శంకర శరాసన మెక్కినాడు నెవ్వ; డా మహా
భాగు వరించు నా యనుగుపట్టి సమస్త సభాముఖమ్మునన్”
అని జనకుండు మెల్లగ నిజాసనమం దుపవిష్టుడయ్యె – మ్రో
గెను కరతాళముల్; నతముఖీ ముఖపద్మము వైపు పర్వులె
త్తినవి నరేంద్రపుత్రుల సతృష్ణ విలోకన భృంగపంక్తి; ఆ
ల్లన పులకించె మేను మిథిలాపురనాథుని ముద్దుబిడ్డకున్.
బిగువునిండారు కొమ్మటేనుగులవంటి
రాచవస్తాదు లెందరో లేచినారు;
శివధనుర్భంగ మట్లుండ శృంగభంగ
మయ్యెను సమస్త సభ్య సమక్షమందు.
ముని చిరునవ్వుతోడ తన ముద్దుల శిష్యుని మోము జూచె – త
మ్మునకు ధనుస్సు విచ్చి రఘుముఖ్యుడు జానకి నోరకంటితో
గనుచు, వినమ్రుడై గురువుగారికి – సింహకిశోరమట్లు ముం
దున కరుదెంచె నచ్చెరువుతో నృపతుల్ తలలెత్తి చూడగన్!
“ఫెళ్ళు” మనె విల్లు – గంటలు “ఘల్లు” మనె – “గు
భిల్లు” మనె గుండె నృపులకు – “ఝల్లు” మనియె
జానకీదేహ – మొక నిమేషమ్మునందె
నయము జయమును భయము విస్మయము గదుర.
సిగ్గు బరువున శిరసు వంచినది ఒక్క
సీతయే కాదు – సభలోని క్షితిపతులును;
ముదముమెయి పూలు వర్షించినది సతీ శ్
రోమణులె గాదు – దేవతాగ్రామణులును.
చెల్లరే విల్లు విరుచునే నల్లవాడు
పదిపదారేండ్ల యెలరాచపడుచువాడు!
“సిగ్గు సి”గ్గంచు లేచి గర్జించినారు
కనులుగుట్టిన తెల్లమొగాలవారు.
లక్ష్మివంటి సీతామహాలక్ష్మి విజయ
లక్ష్మితో శ్యామునకు గృహలక్ష్మి యయ్యె!
భరత జనయిత్రి ప్రేమ బాష్పాలలోన
అయ్యె నతివైభవముగ సీతమ్మ పెండ్లి.
-----------------------------------------
ఊర్మిళాకుమారి
ధవుని వెనువెంట జనిన సీతామతల్లిగడపివచ్చు వత్సర మొక గడియమాడ్కి;
నాథు నెడబాసి శూన్యమౌ నగరిలోన
నెట్లు నిలచెదు? పదునాలుగేండ్లు తల్లి!
రమణుడు చెంతనుండిన నరణ్యములే యపరంజి మేడలౌ –
రమణుడు లేక మేడలె యరణ్యములొ – నికనేమి జానకీ
రమణికి రాణివాసమె అరణ్యనివాసము – నీవు నీ మనో
రమణుని బాసి ఘోరపుటరణ్యములో బడిపోతి విచ్చటన్!
“వదినెయు నన్నగారు వనవాసము సేయగ నన్నగారి శ్రీ
పదముల సేవచేసికొను భాగ్యము స్వేచ్ఛగ నాకు గల్గు నీ
యదనున నీవు రావల”దటంచు ప్రియుండు నిరాకరింప, నీ
హృదయము కృంగి; పొంగిపోకలెత్తిన దుఃఖము మ్రింగికొంటివే.
అత్తరి “పోయి వత్తును ప్రియా! యిక నే”నను భర్తకెట్టి ప్ర
త్యుత్తర మీయలేక యెటులో తలయెత్తి యెలుంగు రాని డ
గ్గుత్తికతోడ నీలి కనుగొల్కుల బాష్పకణమ్ము లాపుచున్
“చిత్త” మటన్న నిన్ను గన చిత్తము నీరగు నమ్మ ఊర్మిళా!
పైటచెరంగుతో పుడమిపై బడకుండగ నద్దుకొమ్ము నీ
కాటుక కన్నుదామరల కాలువలై ప్రవహించు వేడి క
న్నీటికణాలు – క్రింద పడనీయకు! ముత్తమ సాధ్వి వైన నీ
బోటి వధూటి బాష్పములు భూమి భరింపగలేదు సోదరీ!
అన్నపదమ్ములన్ గొలుచు నాస మనోహరు డేగినాడు – తా
జన్నది భర్తృపాద పరిచర్యకు ప్రేమపుటక్కగారు – ఏ
మున్నది దిక్కు నీ కిచట? నొంటరి వైతివి తల్లి! ఎంతయున్
జిన్నతనమ్ము – నీ వెటుల జేతువొ కోడరిక మ్మయోధ్యలో.
“నన్ను నా పుత్రు జంపి, అన్నను అయోధ్య
గద్దె నెక్కింప వీరకంకణము దాల్చు
లక్ష్మణకుమారు దేవేరులా!” యటంచు
ఆడిపోయదె కైక ని న్నహరహమ్ము.
క్రొవ్వలపు జవ్వనపు మూగకోరికలను
దాపురమ్మైన మీ లేత కాపురమ్ము
చేఇమీదుగ నడవిపాల్ చేసినాడు
కనులుగుట్టిన వేమొ రాకాసి విధికి?
చెల్లెం డ్రిర్వురు ప్రాణవల్లభుల సంసేవించుచున్నారు – తా
నుల్లాసమ్మున సీత వల్లభునితో నుండెన్ వనిన్ నీ వెటుల్
తల్లీ! భర్తృ వియోగ దుఃఖమును నుల్లం బల్లకల్లోలమై
యల్లాడన్ కడత్రోతువమ్మ పదునా ల్గబ్దమ్ము లేకాకృతిన్!
నలుగురు “నంగనాచి గహనాలకు కాంతుని గెంటి యింటిలో
కులుకుచు కూరుచున్న”దనుకొందు రటంచు రవంతయేని చిం
తిలకము తల్లి! త్యాగమయదేవివి నీవని నీ చరిత్రమే
తెలుపుచునుండె – లోకము హృదిన్ గదలించు సదా త్వదశ్రువుల్!
కమ్మని జవ్వన మ్మడవిగాచిన వెన్నెలజేసి, భర్తృవా
క్యమ్మున కడ్డుచెప్పక మహత్తరమౌ పతిభక్తిలోన సీ
తమ్మను మించిపోయితివి – తావక దివ్య యశోలతా వితా
నమ్ములు ప్రాకిపోయె భువనమ్ముల, పుణ్యవతీవతంసమా!
------------------------------------------------------
అనసూయాదేవి
అల కలహభోజనుని ఫలాహారమునకునినుప గుగ్గిళ్ళు వండి వడ్డించినావు;
అమ్మ! నీ చేతి తాలింపు కమ్మదనము
భరతదేశాన గుమగుమ పరిమళించె.
అత్యపూర్వ మమోఘ మనంత మైన
తావక పతివ్రతా మహత్త్వమ్ములోన
ఆది సాధ్వీమణుల హృదయాలతోడ
నుక్కు సెనగలు తుక తుక ఉడికిపోయె.
వేద వేదాంత సౌవర్ణ వీథులందు
తిరుగుచుండెడి దివ్యమూర్తిత్రయమ్ము
నేడు నీ వంటయింట దోగాడుచుండె
గోరుముద్దలు గుజ్జనగూళ్ళు తినుచు.
కాలు కదపక బిడ్డ లుయ్యేలలందు
నూగునాడె ముల్లోకము లూగుచుండె;
కాలు వచ్చి గంతులు వేయు కాలమునకు
ఇంత కెంతౌనొ? వింతబాలెంతరాల!
ఇయ్యఖిల ప్రపంచములనే తమ బొజ్జల మాటుకొన్న బా
బయ్యలు మువ్వురున్ శిశువులై శయనించిరి నీ గృహాన – నీ
తియ్యని జోలపాటల కిదే పులకించెను సృష్టి యెల్ల – నీ
యుయ్యల తూగులో నిదురనొందెనులే పదునాల్గు లోకముల్!
గర్భము లేదు – కష్టపడి కన్నదిలే – దిక బారసాల సం
దర్భములే – దహో! పురిటి స్నానములున్ నడికట్లు లేవు – ఏ
స్వర్భువనాలనుండి దిగివచ్చిరి నీ ప్రణయాంక పీఠి కీ
యర్భకు? లంతులేని జననాంతర పుణ్య తపఃఫలమ్ములై.
ఆదియు నంతమే యెరుగనట్టి మహామహిమాఢ్యులైన బ్ర
హ్మాదుల కుగ్గు వెట్టి ఒడియం దిడి జోలలువాడు పెద్ద ము
త్తైదువ! “ధన్యురాలవు” గదమ్మ! త్వదుజ్జ్వల కీర్తి గీతికా
నాదము మ్రోగె స్వర్గ భువనమ్మున దైవతమౌని వీణపై.
అగ్గిని గల్పి మట్టు మరియాదలు – పుణ్య పురాణ పూరుషుల్
ముగ్గురు చేయవచ్చిన యమోఘపు టగ్నిపరీక్ష లోపలన్
నెగ్గితి వీ – వపూర్వములు నీ చరితల్ చెవిసోకి మేనులన్
గగ్గురుపాటు పుట్టినదిగా! ముగురమ్మల కొక్కపెట్టునన్;
కొంగులు బట్టి “మా పసుపుకుంకుతో పతిభిక్ష పెట్టి మా
మంగళ సూత్రముల్ నిలుపు” మంచు సరస్వతి సర్వమంగళా
మంగళ దేవతల్ ప్రణతమస్తకలై పడియున్నవారు నీ
ముంగిటియందు నారదుని మోమున నవ్వులు నాట్యమాడగన్!
అమ్మవైనావు చతురాస్య హరి హరులకు –
అత్తవైతివి వాణీ రమాంబికలకు –
ఘనతమై అత్తగారి పెత్తనము చూపి
క్రొత్త కోడండ్ర నిక దిద్దుకోగదమ్మ!
మాతృప్రేమ పునీతమౌ సఫల దాంపత్యమ్ము నీ సొమ్ము, నీ
పాతివ్రత్యములోన అత్రితపముల్ పండెన్, వియద్గంగకే
యేతామెత్తెను నీ యశస్సులు, గుమాయించెన్ జగమ్మెల్ల నీ
యాతిథ్యమ్ము, నమస్సులమ్మ! అనసూయా! అత్రి సీమంతినీ!
------------------------------------------------------------
సతీ సావిత్రి
ఓ దీనత్వము రూపుగైకొనిన ప్రేమోన్మాదినీ! యేల నీవీ దారిం బడి దక్షిణాభిముఖివై యేతెంతు వీ కానలో?
నీ దిక్కై దరిజేర్చువా రెవరు లేనేలేరటే తల్లి! ఏ
దేదీ! మో మిటు ద్రిప్పు మెవ్వతెవు దేవీ! నీవు సావిత్రివా!
“నల్లనివాడు – రక్తనయనమ్ములవాడు – భయంకర స్వరూ
పోల్లసనమ్మువాడు – గద నూని మహామహిషమ్ముపై ప్రవ
ర్తిల్లెడివాడు – నా ప్రణయదేవుని జీవధనమ్ము తెచ్చె – నో
బిల్లపురంధ్రులార! కనిపింపడుగా? దయచేసి చెప్పరే!”
చెడ్డది గొడ్డుబోతువిధి, చెల్లి! నిమేషముక్రింద ఏటికా
యొడ్డున గట్టుమీద నిలుచుండి హుటాహుటి రెండుచేతులన్
గొడ్డలి బట్టి కట్టియలు గొట్టెడి నీ హృదయేశు నెత్తిపై
గొడ్డలిపెట్టుపెట్టి పడగొట్టిన దుష్టకిరాతు డెవ్వడో!
నారదుడు చెప్పె – బెదరించె నాన్నగారు –
తల్లి బ్రతిమాలె – నీ గుండె ధైర్యమేమో!
చా వెరింగియు కట్టుకొన్నావు నాడు!
కొదువయైపోయె పసుపు కుంకుమలు నేడు!
పెండ్లినా డమ్మ చెక్కిట బెట్టినట్టి
కాటుక యరాబు రవ్వంత కందలేదు;
పెద్దముత్తైదువలు కాళ్ళ దిద్దినట్టి
పసుపు పారాణి కనుమాపు పడనెలేదు.
అత్తయు మామగారు జనుషాంధులు! కానన భూములందు క్రొం
గ్రొత్తది కాపురమ్ము! జనకుం డిట లేడు! నిజేశు డి ట్లిక
స్మాత్తుగ కూలిపోయె! కొరమాలిన క్రూర విధాత నేడు నీ
కుత్తుక కత్తిపెట్టి తెగగోసెను చిట్టెపు రాతిగుండెతో!
వదనశ్రీ వసివాడిపోయినది, జవ్వట్లాడె లేగను, నీ
మృదు పాదమ్ములు బొబ్బలెత్తినవి, నెమ్మేనెల్ల కంపించె వ
ట్టిది నీ నాథుడు నీకు దక్కుట – వధూటీ! ఆగిపోవమ్మ! అ
ల్లదిగో! కాలుడు, చాలదూరమున; నీ వందించుకోలేవులే!
“నా”యను దిక్కులేని, పదునారవయేడును వచ్చిరాని, లే
బ్రాయపు చిట్టితల్లివి! అరణ్యములో! జమువెంట నొంటిగా
నాయువు దీరి పోవు పతికై పరువెత్తెదు! నీ ప్రపత్తికిన్
మ్రోయవె దేవదుందుభులు! మ్రొక్కవె ఈ పదునాల్గులోకముల్!
బత్తెపుగింజ లేని పతి ప్రాణము కోసము వెంటనంటి ప
ర్వెత్తెడు పిచ్చిపిల్ల వనియే తలపోసెనొ – కచ్చగట్టి దం
డెత్తు సతీమతల్లివని యెంచెనొ – చట్టున నిల్చిపోయినా
డుత్తదిగాదు చూడు మదిగో! బిగబట్టిన దున్న పగ్గముల్!
“వందన మో మహామహిషవాహన! నీ దయచేత నాన్నకున్
నందను లబ్బినారు, నయనమ్ములు గల్గెను మామగారికిన్
హైందవసాధ్వి కీ శుభము లన్ని లభించియు భర్తలేక ఆ
నందము గల్గునా? నుతగుణా! పతిభిక్ష ననుగ్రహింపుమా!”
“పతి నొసగు” మంచు దోసిలొగ్గితివో లేదొ
చేతి పగ్గాలు సడలించె ప్రేతరాజు;
పరుచుచున్నది మహిష మంబరమునందు
వెంటబడుమమ్మ గుండె ద్రవించునేమొ!
చేతి మీదుగ ఎన్నెన్నొ పూతపిందె
కాపురమ్ములు తీసిన ఘాతకుండు!
నిండు ప్రాణాలు నిలువును పిండుకొనెడి
గుండెతడి లేని కర్కోటకుండు వాడు!
కాలుని దున్నపోతు మెడ గంటలు పట్టెడలోని కింకిణీ
జాల ’ఘణం ఘణం’ ధ్వనులు చల్లగ చల్లగ సాగి, దూర దూ
రాలకు పోయె – నీ యెలుగు రాసిన గొంతుక పిల్పులేల? “ఓ
హో”లకు నంద డాత డడిగో! కనిపించెడి కొండమల్పులో!
వైతరణీ ప్రవాహములు వైదొలగెన్ – అసిపత్ర కానన
వ్రాతము స్వాగత మ్మిడె – సెబా! సదిగో యమరాజధానియున్!
ప్రేత పురీశు డేడి కనుపింపడు! దుర్గములోన దూరినా
డాతడు – కోటతల్పు లకటా! బిగియించిరి ద్వారపాలకుల్.
కడకంటన్ బ్రభవింప రక్తనది – సాక్షాత్ కాళికాదేవివై
నడికట్టుం బిగియించి నిల్చిన త్వదంతశ్శక్తికిన్ “ఫెళ్ళునన్”
గడియల్ గూలి “గభీలు”మంచు యమ దుర్గద్వారముల్ బ్రద్దలై
పడియెన్ ధాత్రి “చిరాయురస్తు” జగదంబా నీకు నీ భర్తకున్!
“భగవంతుం డొక డున్న నాకిడును నా ప్రాణేశు – లేకున్న ఈ
జగముల్ నిల్చునె” యంచు భారతసతీ సామర్థ్యముల్ మ్రోతమ్రో
యగ గర్జించితి వమ్మ! దండధర బాహాదండ చండ ప్రచం
డ గదాదండము బెండువోయినది బిడ్డా! నీదు క్రోధాగ్నికిన్!
నిఖిల లోకైక సాధ్వి నిన్ను కన్న
భరతజనయిత్రి భాగ్యాలు పండెనమ్మ!
మెచ్చుకొన్నాడు నీ భర్త నిచ్చినాడు
పుచ్చుకోవమ్మ నీ పూర్వపుణ్యఫలము!
విశ్వవిచిత్ర మైనది పవిత్రము నీ చరితమ్ము – దిక్కులన్
శాశ్వతమయ్యె తావక యశ శ్శశి కాంతులు – నీవు రాజ రా
జేశ్వరివే పతివ్రతల కెల్లను – పచ్చనితల్లి! యింత కా
యశ్వపతిక్షితీంద్రుడు కృతార్థుడులే నిను గన్న తండ్రియై!
-----------------------------------------------------
పోతన
గంటమొ చేతిలోది ములుగర్రయొ? నిల్కడ యింటిలోననోపంటపొలానో? చేయునది పద్యమొ సేద్యమొ? మంచమందు గూ
ర్చుంటివో మంచెయందో? కవివో గడిదేరిన కర్షకుండవో?
రెంటికి చాలియుంటివి సరే కలమా హలమా ప్రియంబగున్?
కాయలుగాచిపోయినవిగా యరచేతులు! వ్రాతగంటపున్
రాయిడి చేతనా? మొరటు నాగలిమేడి ధరించి సేద్యమున్
జేయుట చేతనా? కవికృషీవల! నీ వ్యవసాయదీక్ష “కా
హా” యని యింతలేసి కనులార్పక చూచిరిలే దివౌకసుల్!
మెత్తనిచేయి నీది; సుతిమెత్తని చిత్తమువాడ వంచు నీ
పొత్తమె సాక్ష్యమిచ్చు; పొలమున్ హలమున్ గొని దున్నుచో నెటుల్
గిత్తల ముల్లుగోల నదలించితివో; వరిచేలపైన ను
వ్వెత్తుగ వ్రాలుచో పరిగపిట్టల నెట్టుల తోలినాడవో!
“నమ్ముము తల్లి నాదు వచనమ్ము; ధనమ్మునకై బజారులో
అమ్మనుజేశ్వరాధముల కమ్మను ని”న్నని బుజ్జగించి నీ
గుమ్మములోన నేడ్చు పలుకుంజెలి కాటుకకంటి వేడి బా
ష్పమ్ములు చేతితో తిడిచివైచెడి భాగ్యము నీకె యబ్బెరా!!
గంటలు కట్టుకొంటివటగా? విటగాండ్రను బోలునట్టి ఈ
కుంటి కురూపి భూపతులకుం గవితాసుత నీయనంచు; ఆ
పంటవలంతియల్లునకె భాగవతమ్మును ధారవోసి, ని
ష్కంటక వృత్తికై నడుముగట్టితి వెంతటి పుణ్యమూర్తివో!
అచ్చపు జుంటితేనియల; నైందవ బింబ సుధారసాల, గో
ర్వెచ్చని పాలమీగడల, విచ్చెడి కన్నెగులాబి మొగ్గలన్
మచ్చరికించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ
వెచ్చట నేర్చినావు? సుకవీ! సుకుమారకళా కళానిధీ!
కమ్మని తేట తెల్గు నుడికారము లేరిచి కూర్చి చాకచ
క్యమ్ముగ కైత లల్లు మొనగాండ్రు కవీశ్వరు లెంతమంది లో
కమ్మున లేరు – నీవలె నొకండును భక్తి రసామృత ప్రవా
హమ్ముల కేతమెత్తిన మహాకవి యేడి తెలుంగుగడ్డపై?
ఎండిన మ్రోడులే కిసలయించెనొ; యేకశిలాపురమ్ములో
బండలు పుల్కరించెనో; అపారముదమ్మున తెల్గుతల్లికిన్
గుండెలు పొంగిపోయి కనుగొల్కులు నిండెనో! పచ్చిపైరులే
పండెనొ; జాలువారిన భవత్ కవితామృత భక్తిధారలన్!
భీష్మునిపైకి కుప్పించి లంఘించు గో
పాల కృష్ణుని కుండలాల కాంతి
కరిరాజు మొరవెట్ట పరువెత్తు కరివేల్పు
ముడివీడి మూపుపై బడిన జుట్టు
సమరమ్ము గావించు సత్య కన్నుల నుండి
వెడలు ప్రేమ క్రోధ వీక్షణములు
కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ
సందు మాగాయ పచ్చడి పసందు
ఎటుల కనుగొంటివయ్య! నీ కెవరు చెప్పి
రయ్య! ఏరాత్రికలగంటివయ్య! రంగు
కుంచెతో దిద్దితీర్చి చిత్రించినావు!
సహజ పాండితి కిది నిదర్శనమటయ్య!!
ముద్దులుగార – భాగవతమున్ రచియించుచు, పంచదారలో
నద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య – అ
ట్లద్దక – వట్టిగంటమున నట్టిటు గీచిన తాటియాకులో
పద్దెములందు – ఈ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా?
“భాగవతమ్ము భాగ్య పరిపాకమ ఆంధ్రులకెల్ల – దానిముం
దాగగజాల వే కవిత” లంచు నభంబున దేవదుందుభుల్
మ్రోగినవేమొ; నీవు కలముంగొని కావ్యము వ్రాయ చిందిపో
సాగినవేమొ! తీయని రసాల రసాల త్వదీయ లేఖినిన్!
వేసము మార్చి యిన్ని దిగవేసి యభా సొనరింపకుండ శ్రీ
వ్యాసుని గ్రంథ మాంధ్రమున వ్రాసితి వందము చింద; నీద అ
గ్రాసనమయ్య! ఆంధ్రకవులందు; వరాలకు నెత్తు కెత్తుగా
ఆ సొగసైన పద్దెము లయారె; తయారగు నీ కలాననే!
ఖ్యాతి గడించుకొన్న కవులందరు లేరె – అదేమి చిత్రమో
పోతన యన్నచో కరిగిపోవు నెడంద, జొహారుసేతకై
చేతులు లేచు, ఈ జనవశీకరణాద్భుతశక్తి చూడగా
ఆతని పేరులో గలద్ప్; ఆయన గంటములోన నున్నదో!
-----------------------------------------------
ఆంధ్ర విద్యార్థి
సర్వభూమీ పూజ్య గీర్వాణ భాషా మతల్లి గారాబంపు తల్లి నాకు
అత్యంత సుకుమారి ఆంధ్రభాషా యోష
అల్లారు ముద్దుల చెల్లి నాకు
నవ నవోన్మేష సుందరమూర్తి సాహితీ
లక్ష్మియే అర్ధాంగ లక్ష్మి నాకు
కమనీయ మృదుపదక్రమ కవితాబాల
కలికి పల్కుల పసికందు నాకు
పాణినీయులు దేశికప్రభువులు నాకు
సరసవాజ్ఞ్మయపురము కాపురము నాకు
వాణి వాయించు మాణిక్య వీణలోన
యర్థ మెరిగిన “ఆంధ్ర విద్యార్థి నేను”!
ఒకమాటు కనుమోడ్చుచుందు బమ్మెరవారి
మందార మకరంద మధుర వృష్టి
ఒకమాటు మూర్కొనుచుందు తిమ్మనగారి
పారిజాత వినూత్న పరిమళమ్ము
ఒకమాటు చవిచూచుచుందు పెద్దనగారి
ద్రాక్షాగుళుచ్ఛ సుధా సుధార
ఒకమాటు విహరించుచుందు పింగళివారి
వరకళాపూర్ణ సౌవర్ణ శిఖరి
ఒకట కవితా కుమారితో నూగుచుందు
గగన గంగా తరంగ శృంగారడోల
ఆంధ్ర సాహిత్య నందనోద్యాన సీమ
నర్థి విహరించు “ఆంధ్ర విద్యార్థి” నేను.
కాళిదాస కవీంద్ర కావ్యకళావీధి
పరుగులెత్తెడి రాచబాట నాకు
భట్టబాణుని ముద్దుపట్టి కాదంబరి
కథలు చెప్పెడి చెల్మికత్తె నాకు
భవభూతి స్నేహార్ద్ర భావవైభవగీతి
కరుణా రసాభిషేకమ్ము నాకు
వాల్మీకి కవిచక్రవర్తి భావస్ఫూర్తి
ఆటలాడెడి పూలతోట నాకు
భారతీదేవి మృదులాంక భద్రపీఠి
ముద్దులొలికెడి కతనాల గద్దె నాకు
తెలుగుతోటల సంస్కృత వనలతాళి
నంటుత్రొక్కెడి “ఆంధ్రవిద్యార్థి” నేను.
--------------------------------------
అస్వతంత్రుడు
నేనొక దగ్ధజీవనుడనే అయినాను – మదీయ మానసోద్యానమునిండ రక్కసిపొదల్ చిగిరింతలు గారకంపలే
గాని, పదేపదే పయిరుగాలికి నూగు గులాబి గుత్తులే
కానగరావు – స్వేచ్ఛయును గల్గునే యీ కరుణావిహారికిన్!
నేనొక వెర్రిమొర్రికవినే అయినాను – మదీయ జీవితా
ఖ్యానమునందు క్లిష్టగతి కష్టసమన్వయ దుష్టసంధులే
కాని సుగమ్య సుందర సుఖంకర సూక్తి సువర్ణ పంక్తియే
కానగరాదు – బోధమును గల్గునే యీ కవితావిలాసికిన్!
నేనొక జీర్ణశిల్పకుడనే అయిపోయితి – నా యులిన్ సదా
పీనుగ మొండెముల్ – పునుకపేరులు – కుంటిరూపి బొమ్మలే
కాని, వినూత్న యౌవన వికాస మనోహర రూపరేఖయే
కానగరాదు – తృప్తియును గల్గునె యీ తృషితాంతరాత్మకున్!
నేనొక క్లిష్టగాయకుడనే అయిపోయితి – నా విపంచి పై
దీన గళమ్ముతో తెగిన తీగలమీద విషాదగీతులే
కాని, రసంబు పొంగి పులకల్ మొలపించు ప్రమోదగీతయే
కానుగరాదు – స్థాయియును గల్గునె యీ రసలుబ్ధజీవికిన్!
నేనొక రంగలంపటుడనే అయినాను – మదీయ నాటకా
స్థానములో బుసల్ గుసగుసల్ సకలింతలు చప్పరింతలే
కాని, సెబాసటంచు రసికప్రవరుల్ తలలూపి మెచ్చుటే
కానగరాదు – సిద్ధియును గల్గునె యీ నటనావిలాసికిన్!
నేనొక కష్టకర్షకుదనే అయినాను – మదీయ బుద్ధి మా
గాణము నిండ ఒడ్డు మెరకల్ రవపెంకులు రాలురప్పలే
కాని, పసందుగా పసిడి కంకులువంగిన పంటపైరులే
కానగరావు – పుష్టియును గల్గునె నిష్ఠదరిద్రమూర్తికిన్!
నేనొక నష్టజాతకుడనే అయినాను – మదీయ జన్మ చ
క్రాన కుజాష్టమాది కుటిలగ్రహ కుండలి క్రూర దృష్టులే
కాని, త్రికోణ కేంద్ర శుభగ గ్రహ వీక్షణ సామరస్యమే
కానగరా – దదృష్టమును గల్గునె? యీ దురదృష్టమూర్తికిన్?
నేనొక భగ్ననావికుడనే అయినాను – మదీయ భవనాం
భోనిధిలో మహామకరముల్ సుడిగుండములున్ తుపానులే
కాని, సుధా సుధాకిరణ కల్పక దివ్యమణీ వితానమే
కానగరాదు – అద్దరియు గల్గునె యీ యెదురీతగానికిన్?
నేనొక దీనభిక్షుడనే అయినాను – మదీయ జీర్ణగే
హాన దరిద్రదేవత మహా వికట ప్రళయాట్టహాసమే
కాని, యదృష్టలక్ష్మి కడకంటి సుధా మధురార్ద్రదృష్టియే
కానగరాదు – భాగ్యమును గల్గునె ఇట్టి యభాగ్యమూర్తికిన్?
నేనొక వ్యర్థతాపసుడనే అయినాను – మదీయ సంతత
ధ్యాన సమాధిలో వెకిలిదయ్యపు మూకల వెక్కిరింతలే
గాని, ప్రసన్నభావ కళికా లవలేశ విలాసమేనియున్
గానగరాదు – ముక్తియును గల్గునె యీ పరితప్తమౌనికిన్?
------------------------------------------
తెనుగుతల్లి
కనిపింపదే నేడు! కాకతీయ ప్రాజ్యసామ్రాజ్య జాతీయ జయపతాక –
వినిపింపదే నేడు! విద్యానగర రాజ
సభలోని విజయ దుందుభుల మ్రోత –
చెలగదే నేడు! బొబ్బిలికోట బురుజుపై
తాండ్ర పాపయ తళత్తళల బాకు –
నిప్పచ్చరంబయ్యెనే నేడు! వీర ప
ల్నాటి యోధుల సింహనాదలక్ష్మి –
చెక్కు చెదరని – యేనాడు మొక్కవోని –
ఆంధ్ర పౌరుష మిప్పు డధ్వాన్న మయ్యె;
మరల నొకమాటు వెనుకకు మరలి చూచి
దిద్దుకోవమ్మ! బిడ్డల తెనుగుతల్లి!
రాజరాజుల చరిత్రల నాలపించెడి
గౌతమీ గద్గద కంఠరవము
కృష్ణరాయల కీర్తిగీతాలు కడుపులో
జీర్ణించుకొను హంపి శిథిలశిలలు
అలనాటి కాకతీయుల పౌరుషము త్రవ్వి
గంపకెత్తెడి ఓరుగంటి బయలు
బలితంపు రెడ్డి బిడ్డల సాము గరడీల
రాటుతేలిన కొండవీటి తటులు
విని – కని – తలంచుకొని గుండె వ్రీలిపోయి
వేడి వేడి నిట్టూర్పులే విడిచినాము!
గుడ్డ గట్టిన కడివెడు కొడుకులుండి
యిల్లు వాకిలి కరువైన తల్లివీవు!!
“రాయి గ్రుద్దును” నీ పురా శిల్పసంపత్తి
అమరావతీ స్తూప సముదయంబు;
“చదవించు” నీ మహాసామ్రాజ్య కథల నాం
ధ్ర క్ష్మాపతుల జయస్తంభ లిపులు;
“గళమెత్తిపాడు” నీ గాన సౌభాగ్యమ్ము
రమణీయముగ త్యాగరాయ కృతులు;
“వేనోళ్ళచాటు” నీ వీరమాతృత్వమ్ము
పలనాటివీరుల పంట కథలు;
“వల్లె వేయును” నీ వైభవ ప్రశస్తి
హోరుమంచును నేడు మా ఓడరేవు;
బ్రతికిచెడియున్న నీపూర్వ భాగ్యరేఖ
చెరగిపోలేదు తల్లి! మా స్మృతిపథాల!!
గంటాన కవితను కదనుత్రొక్కించిన
“నన్నయభట్టు” లీనాడు లేరు
కలహాన కంచుఢక్కల నుగ్గునుగ్గు గా
వించు “శ్రీనాథు” లీవేళ లేరు
అంకాన వాణి నోదార్చి జోలలు వాడు
“పోతనామాత్యు”లీ ప్రొద్దు లేరు
పంతాన ప్రభువుచే పల్లకీ నెత్తించు
కొను “పెద్దనార్యు” లీ దినము లేరు
“వాణి నా రాణి” యంచు సవాలు కొట్టి
మాట నెగ్గించు వీరు లీ పూట లేరు
తిరిగి యొకమాటు వెనుకకు తిరిగి చూచి
దిద్దికోవమ్మ! బిడ్డల తెనుగు తల్లి!!
కవులకు బంగారు కడియాలు తొడిగిన
రాయలు గన్న వరాల కడుపు
సీసాలతో కవితాసార మిచ్చు శ్రీ
నాథుని గన్న రత్నాల కడుపు
భద్రాద్రిలో రామభద్రు స్థాపించు గో
పన్నను గన్న పుణ్యంపు కడుపు
జగ మగంటిమి నల్దెసల్ వెలార్చిన పాప
రాయని గన్న వజ్రాల కడుపు
పిసినిగొట్టు రాజులకును – పిలకబట్టు
కుకవులకు – పిచ్చిపిచ్చి భక్తులకు – పిరికి
పందలకు – తావు గాకుండ ముందు ముందు
దిద్దుకోవమ్మ! బిడ్డల తెనుగుతల్లి!
----------------------------------------------
కల్యాణగీతి
శ్రీకరము లౌత మీకు నాట్యైకలోలశివ జటాజూట గాంగేయ శీకరములు;
రంజితము లౌత మీకు శర్వాణి చరణ
కంజ మంజుల మంజీర శింజితములు.
జయోస్తు
రాణ్మహేంద్ర కవీంద్రు రత్నాల మేడలోపసిడి గిన్నెల నుగ్గుబాలు త్రాగి
సోమయాజులవారి హోమవేదికలపై
అల్లారు ముద్దుగా నాటలాడి
శ్రీనాథుల సువర్ణ సీసమాలికలలో
హాయిగా తూగుటుయ్యాల లూగి
భాగవతులవారి పంచపాళీలలో
మెత్తని శయ్యల నొత్తిగిల్లి
విజయ విద్యానగర రాజవీథులందు
దిగ్గజమ్ముల మీదనే తిరిగి తిరిగి
కంచు జయభేరి దెనల మ్రోగించుకొన్న
ఆంధ్ర కవితాకుమారి! “జయోస్తు” నీకు.
-------------------------------------
కవితాకుమారి
జడయల్లి జడకుచ్చు లిడ “రాయప్రోలు” “తల్లావజ్ఝల” కిరీటలక్ష్మి నింప
“పింగళి” “కాటూరి” ముంగురుల్ సవరింప
“దేవులపల్లి” శ్రీతిలక ముంప
“విశ్వనాథ” వినూత్న వీధుల కిన్నెర మీట
“తుమ్మల” రాష్ట్రగాన మ్మొనర్ప
“వేదుల” “నాయని” వింజామరలు వేయ
“బసవరాజు” “కొడాలి” పదము లొత్త
“అడివి” “నండూరి” భరతనాట్యములు సలుప
“జాషువా” “ఏటుకూరి” హెచ్చరిక లిడగ
నవ్యసాహిత్య సింహాసనమున నీకు
ఆంధ్ర కవితా కుమారి! “దీర్ఘాయురస్తు”
----------------------------------------
బీదపూజ
“వాడిన గ్రుడ్డిపూలు గొనివచ్చెను వీ”డని జాలిమాలి నోనాడకు మో దయామయ! యథార్థము నీకడ విప్పిచెప్ప నో
రాడుటలేదు – పూలకొరకై పువుదోటకు నేను గూడ జ
న్నాడను – పుష్ప మొక్కటయినన్ లభియింపకపోయె నాకటన్
వారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు – మంచి మంచి బం
గారపు పూలబుట్టలను గైకొని పోయిరి ముందుగానె – మా
బూరుగుచెట్టిక్రింద పడిపోయిన గోడల పూరిపాకలో
దూరిన లేతవెల్గులకు దుప్పటి నెత్తితి అమ్మ లేపినన్.
లేచి – చిరుచాప నొకమూల దాచిపెట్టి
ప్రాత తాటాకుబుట్టను చేత బట్టి
పొంగ లోపలి జల మింత పుక్కిలించి
తల్లి కాళ్ళకు వంగి వందన మొనర్చి –
తెలతెలవారుచుండ జనితిన్ విరితోటకు – తోటమాలి త
ల్పులు బిగియించె నా చినిగిపోయిన గుడ్డలు నన్ను జూచి; కా
ళుల బడి, గడ్డమంటి, యెటులో బ్రతిమాలి యవస్థనంది లో
పల బడినాను – చెంత గనుపట్టిరి మిత్రులు పూలు గోయిచున్.
చకచక పూలు గోసికొని సాగిరి వారలు – శూన్యకుంజ మా
లిక లెటుచూచినన్; మిగులలే దొక పుష్పము కూడ నాకు; నే
నొకదెస విన్నబోయి నిలుచుంటిని; నన్ గని వార లందరున్
పకపక నవ్వినారు – తలవంచితి నేనొక కొమ్మచాటునన్
వట్టి పూమొక్కలన్ని నా వంక జూచి
ప్రసవ బంధాలు సడల బాష్పములు రాల్చె;
చేతిలో నున్న బుట్టను చింపివైచి
తిరిగివచ్చితి గుండెలు దిగబడంగ.
ఇంటికి వచ్చుచుండ గనుపించిరి దేవర దేవళమ్ములో
మంటపమందు పుష్పములు మాలలుగ్రుచ్చుచు వారు - పోయి కూ
ర్చుంటిని నేనుగూడ నొకచో నొక స్తంభమువెన్క – ఇంతలో
గంటలు మ్రోగి – అర్చనలకై గుడిలోనికి పోయి రందరున్.
పూజలై మిత్రు లిండ్లకు పోయినారు
రిక్తహస్తాల నిన్ను దర్శింపలేక
మండపము ప్రక్క ధూళిలో నిండియున్న
గ్రుడ్డిపువ్వులనే యేరుకొంటి నేను.
పరిమళములేక – ఎవరికి పనిరాక –
పారవేయ బాటల ప్రక్కబడి – కరాళ
కాల పురుషుని కారు చక్రాల క్రింద
బ్రతుకలేని దరిద్ర పుష్పమ్ములివ్వి.
ఈ యనాథ సుమాలనే – ఈ విశీర్ణ
జీర్ణ కుసుమాలనే – ఈ కృశించు మ్లాన
హీన దీన ప్రసూనాలనే – త్వదంఘ్రి
సేవకై దోయిలించి తెచ్చితిని నేను.
పూల దోసిలి కన్నీట పొరలిపోయె
విరుల మాలిన్య మంతయు వెడలిపోయె
ఆగియుంటి ప్రభూ! స్వామి యాజ్ఞకొరకు
ఆదరింతువొ లేదొ నా బీదపూజ!
----------------------------------
సార్థకత
అర్చకు లొనర్చు పూజల నందుకొనుచుగుళ్ళలోపల హాయిగా కూరుచున్న
దైవముల తలకెక్కి తైతక్కలాడి
కులుకరింపగ మామది కోర్కె లేదు.
గందపొడి గాలిపై చల్లి విందులిడి మ
రంద బిందువులు మిళిందబృందములకు
సిగ్గు విడనాడి ఉచ్ఛిష్ట జీవితమ్ము
గడపుటకు మా మదిని కౌతుకమ్ము లేదు.
హాయి మేయుచు శయ్యాగృహాంతరముల
పూలపాన్పులపైబడి పొరలుచున్న
మనుజ మహిషాల అడుగున మణగిపోయిన
కమలిపోవ మాకు నుత్కంఠ లేదు.
తొడిమ లెడలించి చించి తంతువులతోడ
గొంతులు బిగించి దండలు గ్రుచ్చి మమ్ము
ముడుచుకొను మోహనాంగుల ముడుల మీద
ఫేషనులు దిద్ద మా కభిలాషలేదు.
ప్రణయినీ మృదులాంగుళీ రచిత పుష్ప
దామమై ప్రేమికుని కంఠసీమ నలరి
వలపు కౌగిళ్ళ సందున నలిగి నలిగి
పరవశత నంద మాకు సంబరములేదు.
ఒక ప్రశాంత ప్రభాతాన ఒక్క మంద
మలయ మారుతవీచిలో పులరించి
మెల్లగా తల్లి చల్లని కాళ్ళపైన
రాలి కను మూసికొనుటె సార్థకత మాకు.
--------------------------------------
స్వేచ్ఛా పుష్పాలు
శాంతిపూర్ణ సత్యాగ్రహ సమరమంచుజీవితమ్ములు నర్పణసేయునట్టి
ధన్యమూర్తులు నడచెడి దారులందు
కాపురము సేయగా కోర్కె గలదు మాకు.
దేశదాస్య విముక్తికై దీక్షనూని
బందిఖానాల బ్రతుకులు బలియొనర్చు
త్యాగమూర్తుల పాదపరాగ మొడల
పులుముకొన నెంతయో కాంక్ష గలదు మాకు.
కట్టుకొన గుడ్డ, త్రాగంగ గంజి లేక
గుడిసెలందు పేరాకట కుములుచున్న
కష్టజీవుల నిట్టూర్పు కాకలందు
కమలిపోవగ కోరిక గలదు మాకు.
విజయఘంటా ధ్వనులు వినువీథి నీండ
ప్రజలు సాగింప జాతీయ పథము వెంట
కదలు స్వాతంత్ర్యరథము చక్రాలక్రింద
నలిగిపోయి సముత్కంఠ గలదు మాకు
దాస్యబంధ విముక్త స్వతంత్ర భరత
మాతృకంఠాన ఒక పుష్పమాల యగుచు
తల్లి యానందబాష్పాల తడిసి తడిసి
పులకరింపగ అభిలాష గలదు మాకు.
ఒక ప్రశాంత ప్రభాతాన ఒక్క మంద
మలయ మారుత వీచిలో పులకరించి
మెల్లగా తల్లి చల్లని కాళ్ళపైన
రాలి కనుమూసికొనుటె సార్థకత మాకు.
----------------------------------
మాతృశ్రీ
అభ్రంకషంబౌ హిమాలయం బే తల్లిమౌళి జుట్టిన మల్లెపూలచెండు
గోదావరీ కృష్ణ లే దేవి కటిసీమ
వ్రేలాడు ఆణిముత్యాల సరులు
ఆంధ్రసముద్ర మే యమ్మ పాదాలపై
జీరాడు పట్టుకుచ్చెల చెరంగు
నలుబదికోట్ల వీరులు భారతీయులే
కళ్యాణి చల్లని కడుపుపంట
ఆమె బ్రహ్మర్షిజాత కళ్యాణగీత
ధర్మసముపేత వేదమంత్రపూత
విశ్వవిఖ్యాత సుశ్రీల వెలయుగాత
పరమకరుణాసమేత మా భరతమాత!!
----------------------------------
ప్రార్థన
ఎలుకగుర్రము మీద నీరేడు భువనాలుపరువెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తన మ్మొనరించు పెద్దకొడుకు
"నల్లమామా" యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లుకుర్ర
వడకు గుబ్బలి రాచవారిబిడ్డ భవాని
నూరేండ్లు నోచిన నోముపంట
అమరులం దగ్రతాంబూల మందు మేటి
ఆరుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ!!
తిలకమ్ముగా దిద్ది తీర్చిన పూప జా
బిలి రేక లేత వెన్నెలలు గాయ
చిరుబొజ్జ జీరాడు చికిలి కుచ్చెల చెంగు
మురిపెంపు పాదాల ముద్దుగొనగ
జలతారు పూలకుచ్చుల వల్లెవాటుతో
త్రాచు జందెములు దోబూచులాడ
కొలుచు ముప్పదిమూడు కోట్ల దేవతలపై
చల్లని చూపులు వెల్లివిరియ
గౌరికొమరుడు కొలువు సింగారమయ్యె
జాగుచేసినచో లేచి సాగునేమో
తమ్ముడా! రమ్ము స్వామి పాదములు బట్ట
చెల్లెలా! తెమ్ము పువ్వుల పళ్ళెరమ్ము
కొలుచు వారలకు ముంగొంగు బంగారమ్ము
పిలుచువారల కెల్ల ప్రియసఖుండు
సేవించువారికి చేతి చింతామణి
భావించు వారికి పట్టుగొమ్మ
"దాసోహ" మనువారి దగ్గర చుట్టమ్ము
దోసి లొగ్గినవారి తోడునీడ
ఆశ్రయించిన వారి కానంద మందార
మర్థించు వారల కమృతలహరి
జాలిపేగులవాడు - లోకాల కాది
దేవుడే మన పార్వతీదేవి కొడుకు!!
చిట్టెలుకనెక్కి; నేడు విచ్చేసినాడు
అక్కరో! అర్ఘ్యపాత్ర మిట్లందుకొనవె.
లడ్డు జిలేబి హల్వాలె యక్కరలేదు
బియ్యపుండ్రాళ్ళకే చెయ్యి చాచు
వలిపంపు పట్టు దువ్వలువలె పనిలేదు
పసుపు గోచీకె సంబ్రాలుపడును
ముడుపు మూటల పెట్టుబడి పట్టుదల లేదు
పొట్టిగుంజిళ్ళకే పొంగిపోవు
కల్కి తురాయికై తగాదా లేదు
గరిక పూజకె తలకాయ నొగ్గు
పంచకళ్యాణికై యల్కపాన్పు లేదు
ఎలుకతత్తడికె బుజా లెగురవైచు
పంచభక్ష్య ఫలహార కించ లేదు
పచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి.
కుడుము లర్పించు పిల్లభక్తులకు నెల్ల
యిడుమలం దించి కలుము లందించు చేయి;
పార్వతీబాయి ముద్దులబ్బాయి చేయి
తెలుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక!
@@@@@@@@@
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.