ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నవచేతనం

నా ప్రతి అణువు
ఒక స్వరం
ఒక నయాగరా జలపాతం
నా ప్రతి శ్వాస
ఒక కెరటం
అంబరాన్ని తాకాలనే
ఆశల జలతరంగం
నా ప్రతి కదలిక
ఒక మలయమారుతం
ఎదను శృతిచేసే వీణానాదం
నా ప్రతి అరుపు
ఒక స్ఫూర్తిగీతం
ఒక ఉత్తుంగ తరంగం
నా ప్రతి మలుపు
ఒక గిరిశిఖరం
నువు నా సర్వాంగీణ నవచేతనం

- రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్