ప్రతి ఉషోదయం చిగురించనీ
ప్రతి ఊహనూ బ్రతికించుకోనీ
ప్రతి రేయినీ వెలిగించుకోనీ
ప్రతి స్వప్నికను సృష్టించుకోనీ
నీ చిరునవ్వుతో...
ప్రతి క్షణం గులాబీల పరిమళం ప్రభవించనీ
ప్రతి నిముషం మల్లెల మకరంధం మదిగ్రోలనీ
ప్రతి గడియా పారిజాతాలు పరిమళించనీ
ప్రతి దినం విరజాజులు విరబూయనీ
నీ చిరునవ్వుతో...
ప్రతి ఉదయం నందివర్థనంలా విచ్చుకోనీ
ప్రతి మధ్యాహ్నం మొగలిపొదలా చురుక్కున గుచ్చుకోనీ
ప్రతి సాయంత్రం గుల్మొహర్ పూవులా పుష్పించనీ
ప్రతి నిశీధిలో నల్లకలువలా విరబూయనీ
నీ చిరునవ్వుతో...
ప్రతి వేకువా ప్రభాతకిరణమై ఉదయించనీ
ప్రతి రుతువూ వసంతమై అలరించనీ
ప్రతి అడుగూ మువ్వల సవ్వడై రవళించనీ
ప్రతి క్షణం నాలో నిన్ను శ్వాసించనీ
నీ చిరునవ్వుతో...
- రాజాబాబు కంచర్ల
ప్రతి ఊహనూ బ్రతికించుకోనీ
ప్రతి రేయినీ వెలిగించుకోనీ
ప్రతి స్వప్నికను సృష్టించుకోనీ
నీ చిరునవ్వుతో...
ప్రతి క్షణం గులాబీల పరిమళం ప్రభవించనీ
ప్రతి నిముషం మల్లెల మకరంధం మదిగ్రోలనీ
ప్రతి గడియా పారిజాతాలు పరిమళించనీ
ప్రతి దినం విరజాజులు విరబూయనీ
నీ చిరునవ్వుతో...
ప్రతి ఉదయం నందివర్థనంలా విచ్చుకోనీ
ప్రతి మధ్యాహ్నం మొగలిపొదలా చురుక్కున గుచ్చుకోనీ
ప్రతి సాయంత్రం గుల్మొహర్ పూవులా పుష్పించనీ
ప్రతి నిశీధిలో నల్లకలువలా విరబూయనీ
నీ చిరునవ్వుతో...
ప్రతి వేకువా ప్రభాతకిరణమై ఉదయించనీ
ప్రతి రుతువూ వసంతమై అలరించనీ
ప్రతి అడుగూ మువ్వల సవ్వడై రవళించనీ
ప్రతి క్షణం నాలో నిన్ను శ్వాసించనీ
నీ చిరునవ్వుతో...
- రాజాబాబు కంచర్ల
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి