రేయి కడుపున చీకటి ఛాయవోలె
విషాదమ్ములోను...
చీకటిని పారదోలె వెన్నెల కిరణంవోలె
ఆనందమ్ములోను...
జ్ఞాపకాల నీడల్లో ఆరని తడివోలె
జీవితమ్ములోను...
మనసు పొరల్లో జ్వలిస్తోన్న వెలుగురేఖవోలె
హృదయమ్ములోను
నాలోన దాగినది నీవె..
నాఎదుట నడయాడేదీ నీవె
కనులలోని స్వప్పికవు నీవె
అధరములపైని దరహాసివవీ నీవె
ప్రతి అడుగుల సవ్వడి నీవె
మది నిండుగ పరుచుకున్నదీ నీవె
అవని నీవు
అంబరం నీవు
అర్ణవం నీవు
అనంత విశ్వం నీవు
ఆ నువ్వే నేను...
నాలోని ఆత్మ నీవు...
శశిలా నిశిలా అలలా లయలా
- రాజాబాబు కంచర్ల
విషాదమ్ములోను...
చీకటిని పారదోలె వెన్నెల కిరణంవోలె
ఆనందమ్ములోను...
జ్ఞాపకాల నీడల్లో ఆరని తడివోలె
జీవితమ్ములోను...
మనసు పొరల్లో జ్వలిస్తోన్న వెలుగురేఖవోలె
హృదయమ్ములోను
నాలోన దాగినది నీవె..
నాఎదుట నడయాడేదీ నీవె
కనులలోని స్వప్పికవు నీవె
అధరములపైని దరహాసివవీ నీవె
ప్రతి అడుగుల సవ్వడి నీవె
మది నిండుగ పరుచుకున్నదీ నీవె
అవని నీవు
అంబరం నీవు
అర్ణవం నీవు
అనంత విశ్వం నీవు
ఆ నువ్వే నేను...
నాలోని ఆత్మ నీవు...
శశిలా నిశిలా అలలా లయలా
- రాజాబాబు కంచర్ల
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి