కన్నుల్లో వెలిగావు కంటిపాపవై
గుండెల్లో నిలిచావు గుండె సవ్వడై
నాలో చేరుకున్నది నీ ఊహే ఊపిరై
నడుపుతున్నవి నీ ఊసులే జీవనాడులై
ఎదలోతులు తాకే నవ్వులు
మధురాలు దాచే అధరాలు
ఒడిలోన వాలే నగుమోము
మదిలోన దాగే వలపుపొంగులు
నీ చూపులతో ప్రేమపొంగె నాలో
పరవశం పెంచే పరిమళం నీలో
వలపు వీణాలు మ్రోగించావు నాలో
ఏ జన్మకైనా బతికేవుంటాను నీలో
ఈ చల్లని శరద్రాత్రిలో
నింగిలోని తారలా నువ్వు
కొలనులోని కలువల నేను...
ఊసులతో రాతిరి కరిగే
దూరము తరిగే
వలపులు రగిలే
విరహము పగిలే
తనువులు కలిసే
ప్రకృతి మురిసే
- రాజాబాబు కంచర్ల
గుండెల్లో నిలిచావు గుండె సవ్వడై
నాలో చేరుకున్నది నీ ఊహే ఊపిరై
నడుపుతున్నవి నీ ఊసులే జీవనాడులై
ఎదలోతులు తాకే నవ్వులు
మధురాలు దాచే అధరాలు
ఒడిలోన వాలే నగుమోము
మదిలోన దాగే వలపుపొంగులు
నీ చూపులతో ప్రేమపొంగె నాలో
పరవశం పెంచే పరిమళం నీలో
వలపు వీణాలు మ్రోగించావు నాలో
ఏ జన్మకైనా బతికేవుంటాను నీలో
ఈ చల్లని శరద్రాత్రిలో
నింగిలోని తారలా నువ్వు
కొలనులోని కలువల నేను...
ఊసులతో రాతిరి కరిగే
దూరము తరిగే
వలపులు రగిలే
విరహము పగిలే
తనువులు కలిసే
ప్రకృతి మురిసే
- రాజాబాబు కంచర్ల
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి