ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చతురత

కనులు మూసినా నీవే,
కనులు తెరిచినా నీవే,
ఈ క్షణంలోనూ నీవే,
మరుక్షణంలోనూ నీవే,
శ్వాసల్లోనూ నీవే,
ఆశల్లోనూ నీవే,
ఆనందంలోనూ నీవే,
ఆవేదనలోనూ నీవే,
ఊహల్లోనూ నీవే,
ఊరడింపుల్లోనూ నీవే,
నా మనసు పొరల్లో పారాడే
ప్రతి జ్ఞాపకంలోనూ నీవే,
నా పరువపు సీమను ఏలే ప్రణయమూ నీవే
నా మనసును కోవెలగా మార్చే ప్రణవమూ నీవే
మాయే చేసావో, మంత్రమే వేసావో,
కూరిమిని కళ్ళలో కురిపిస్తూ కనికట్టే చేసావో,
ఎక్కడ నేర్చుకున్నావో ఏమో
నా జీవాన్ని నీ మనసు కొనలకు ముడేసుకునే ఈ చతురత ...

- రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్