ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంతోష సింధువు

సాయంసంధ్య వేళ
వెండివెలుగుల కాంతుల్లో
జాలువారుతోంది
నీ నవ్వుల జలపాతం

మనోనేత్రాన్ని తాకిన
ఘల్లుఘల్లుమనే అందెల సవ్వడిలో
పరవశిస్తుంది
నీ అడుగుల చప్పుడుతో రమిస్తుంది

పరుచుకుంటున్న నిశీధి నీడ
ఉనికిని మాయం చేస్తున్న వేళలో
నాలో నిన్ను చూపిన దివిటీ
సంతోష సింధువులా నీ పరిచయం

- రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్