ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2017లో నా పుస్తక పఠనం

        ‘అక్షరం చినుకై తాకగానే... కాగిన మట్టిపై తొలకరి జల్లుల పరిమళం’ వెదజల్లినటుల ‘వంద పుస్తకాల పఠనం... వేయి ఆలోచనల సంఘర్షణకు కారణం’ అయింది.  ఫలితంగా కాస్తంతైనా అక్షర శుద్ధి అబ్బివుంటుందనే తృప్తి. 2016లో చదివిన పుస్తకాల సంఖ్య 116 అయింది. 2017లో కూడా అదే ఒరవడి కొనసాగింది. ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగి... 150 అయింది.  కథా సంపుటములు, కవితా సంకలనాలు, ప్రముఖుల కథలు, వ్యాసాలు వున్నాయి.  ఇవే కాకుండా వివిధ పత్రికల ఆదివారం అనుబంధాల్లో వచ్చేవి, ఆన్ లైన్ మ్యాగజైన్స్ లోనివి కథలు, సాహిత్య వ్యాసాలు అదనంగా వున్నాయి. ఆరు కథలు కూడా రాయడం గతేడాది మరింత సంతృప్తినిచ్చే విషయం. అంతేకాకుండా ‘పెట్టుబడి’ గ్రంథం మొదటి సంపుటి చదివే పనిలో వున్నా. ఇదేదో గొప్పగా చెప్పుకోడం కాదు. జంపాల చౌదరి గారి లాంటివారు చాలా ఎక్కువ చదువుతున్నారు. కానీ.. ఈ ఏడాది కాలంలో నా సాహిత్య పఠనం,
తద్వారా నేను పొందిన సంతృప్తిని మిత్రులతోనూ పంచుకోవాలనే తాపత్రయం మాత్రమే. నేనూ కొన్ని పుస్తకాలు చదివాను అనే ఫీలింగ్ సంతోషాన్నివ్వడంతో పాటు మిత్రుల ప్రోత్సాహం నా అధ్యయనాన్ని మరింత పెంచుకోడానికి, మెరుగుపర్చుకోడానికి ఉపయోగపడుతుందనే భావనకు ఈ సందర్భం తోడయింది. నా పుస్తక పఠనం వెనుక నా ఆత్మీయ నేస్తం ఇచ్చే స్ఫూర్తి, ప్రోత్సాహం, సూచనలు మరువలేనివి. అందుకే ఈ నూతన సంవత్సరాన ముందుగా తనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. చదివిన ప్రతి పుస్తకానికీ  సమీక్ష గానో, వ్యాసంగానో రాయాలనుకున్నప్పటికీ అన్నిటికీ రాయలేకపోయాను. ఈ నూతన సంవత్సరంలో నా పుస్తక పఠనాన్ని మరికాస్త మెరుగు పర్చుకోడంతో పాటు ఆయా పుస్తకాలపై సమీక్షలు, సాహిత్య వ్యాసాలు రాయాలనే సంకల్పంతో వున్నా. అది ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. నా పుస్తక పఠనానికి ఒక వాహికగా ఉపయోగపడిన 2017 సంవత్సరానికి సంతృప్తిగా వీడ్కోలు చెబుతూ... అంతే ఆశావాహ దృక్పథంతో 2018 కి స్వాగతం పలుకుతున్నా...

***
మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

***
01- ఇంతిహాసం (పురాణాల్లోని స్త్రీ పాత్రలు) - సి.మృణాళిని
02- అజ్ఞాని (కథానిక) - కె.పరమేశ్వరరావు
03- రెండోపెళ్లి (కథ) - కొడవటిగంటి
04- అతడు అడవిని జయించాడు (నవల) - డాక్టర్ కేవశరెడ్డి
05- మూగవాని పిల్లనగ్రోవి (నవల) - డాక్టర్ కేవశరెడ్డి
06- రూమ్మేట్ (కథ) - పాటిబండ్ల రజనీ
07- బ్లాక్ ఇంక్ (కథలు) - ఎం.ఎం.వినోదిని
08- ఎర్రసీత (నవల) - గొల్లపూడి మారుతీరావు
09- రాయికి నోరొస్తే (కథల సంపుటి) - వనజ తాతినేని
10- గోల (కథ) - పురాణం సుబ్రహ్మణ్య శర్మ
11- హృదయం ఇక్కడే వుంది (కథ) - ఆర్.దమయంతి
12- మనసే ఒక పూలతోట (కథ) - సునీత గంగవరపు
13- ప్రయాణం (కథ) అబ్బూరి ఛాయాదేవి
14- కాలుతున్న పూలతోట (నవల) - సలీం
15- గోవు పవిత్రత... ఒక కట్టుకథ (చారిత్రక పరిశీలన)- డి.ఎన్.ఝా
16- ఇట్లు మీ విధేయుడు (సమగ్ర కథా సంకలనం) - భమిడిపాటి రాధాగోపాలం (భరాగో)
    (మొత్తం 52 కథలు, 665 పేజీలు )
17- తడి మంటకి పొడినీళ్లు (కథ)- బుచ్చిబాబు
18- ఆఖరిదశ (కథ)- రావిశాస్త్రి
19- చివరి గుడిసె (నవల)- డాక్టర్ కేశవరెడ్డి
20- అల్పజీవి (నవల) - రావిశాస్త్రి
21- జో లాలి పాపా (కథ) - సలీం
22- నయనం ఆలపించిన రాగం (కథాసంపుటి)
23- ఒక సంచలిత రాగం (కవితాసంపుటి)
24- వరదగుడి (కథ) - శంఖువరం సరోజాసింధూరి
25- ముక్త (కథ) - కుప్పిలి పద్మ
26- అవనిమీద హరివిల్లు (కథ) - కుప్పిలి పద్మ
27- చివరకు మిగిలేది (నవల) - బుచ్చిబాబు
28- ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ (కథలు) - కుప్పిలి పద్మ
29- శ్రీవారు (పెద్ద కథ) - శరత్ బాబు (అనువాదం చక్రపాణి)
30- ఆధునికతకు చిరునామా - సైన్స్ (కథ) - నాగసూరి వేణుగోపాల్
31- కొత్తగాలి (కవిత) - మహిళాదినోత్సవం సందర్భంగా నేను రాసినది
32- అంబేద్కర్ సామాజిక న్యాయం (వ్యాసాలు)
33- అగ్నిప్రవేశం (నవల) - యండమూరి
34- నిమగ్న (సారస్వత వ్యాసాలు) - డాక్టర్ మైతిలి అబ్బరాజు
35- రేయివీడని నక్షత్రం (కథాసంపుటి) - కొండవలస శ్రీనివాసరావు
36- తిలక్ కవిత్వం భాషాశైలీరూపాలు
37- నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా (వ్యాసం) :  భైరవభట్ల కామేశ్వరరావు
38- నన్ను గురించి కథ రాయవూ – కథ నచ్చిన కారణం (వ్యాసం) : వేలూరి వేంకటేశ్వరరావు
39- మునిసుందరం రచనల అనుశీలన () -
40- తెల్లకాగితం-మల్లెపూలు (కథ) - గొల్లపూడి మారుతీరావు
41- వాడిపోని వసంతాలు (కవితలు) - జె.బాపురెడ్డి
42- పెళ్లి-వ్యవహారం (కథ) - కొడవటిగంటి కుటుంబరావు
43- నిలవనీరు (కథ) - కొడవటిగంటి కుటుంబరావు
44- ముసలం (కథ) - కొడవటిగంటి కుటుంబరావు
45- సాహిత్య దృక్పథం (సాహిత్య విమర్శ వ్యాసాలు) - వి.చెంచయ్య
46- మోడీప్రభుత్వం.. పేట్రేగిన మతోన్మాదం  (రాజకీయ వ్యాసాలు) - సీతారామ్ ఏచూరి
47- ఖాకీ నిక్కర్లు కాషాయ ధ్వజాలు (భారతదేశ వ్యతిరేకి ఆర్ఎస్ఎస్- లఘుగ్రంథం)
48- ప్రొద్దు చాలని మనిషి (కథ) - మధురాంతకం రాజారామ్
49- పరిత్యాగం (కథలు) - టాగూర్ (అనువాదం: బెల్లంకొండ రామదాసు)
50- ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక కపటత్వం (భారతదేశ వ్యతిరేకి ఆర్ఎస్ఎస్- లఘుగ్రంథం)
51- గొడ్డుమాంస రాజకీయం.. మతవిద్వేష వ్యూహం (భారతదేశ వ్యతిరేకి ఆర్ఎస్ఎస్- లఘుగ్రంథం)
52- చరిత్ర, విజ్ఞాన శాస్త్రాలపై బిజెపి దాడి (భారతదేశ వ్యతిరేకి ఆర్ఎస్ఎస్- లఘుగ్రంథం)
53- అంబేద్కర్ సామాజిక న్యాయం (వ్యాససంపుటి)
54- ఇన్ స్టెంట్ లైఫ్ (కథ) - కుప్పిలి పద్మ
55- దణి (హోసూరు కతలు) - అగరం వసంత్
56- సాగరసంగీతం (కవితాసంపుటి) - పేర్వారం జగన్నాథం
57- అగ్ని సరస్సున వికసించిన వజ్రం నార్ల చిరంజీవి - విశ్వేశ్వరరావు
58- కమ్యూనిస్టు ప్రణాళిక () - మార్క్స్, ఎంగెల్స్
59- బ్రాహ్మణీకం (నవల) - చలం
60- యుద్ధకాండ (కవిత్వం) - డాక్టర్ బండి సత్యనారాయణ
61- మన వేమన (ఉపన్యాసాలు, వ్యాసాలు) - ఆరుద్ర
62- సోమెపల్లి పురస్కార కథలు-2 (చిన్నకథల సంకలనం) - ఆరుద్ర
63- వేమన (భారతీయ సాహిత్య నిర్మాతలు) - వి.ఆర్.నార్ల (అనువాదం: జి.లలిత)
64- పెట్టుబడిదారీ విధానం ఒక ప్రేతాత్మ కథ () - అరుంధతీరాయ్
65- మనోవీధి (కథాసంపుటి) - దాసరి శిరీష
66- చాణక్య నీతి సూత్రాలు (ఆంధ్రతాత్పర్యం) డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు
67- గుజరాత్ ఫైల్స్ () - రానా అయ్యూబ్
68- మతం, మార్కెట్ ముట్టడిలో మహిళ () - ఐద్వా
69- చీకట్లో మెరుపులు (కథ) - పాలగుమ్మి పద్మరాజు
70- జాజిమల్లి (బ్లాగ్ కథలు) - కె.ఎన్.మల్లీశ్వరి
71- ఒక ప్రేమ కథ (నవల) - సింధుకుమారి
72- అంటరాని వసంతం (నవల) - జి.కళ్యాణరావు
73- జాజిపూల పరిమళం (కథలు) - షహీదా
74- శశికళ (నవల) - నండూరు సుబ్బారావు
75- ఏ దేవి వరము నీవో... (నవల) - గుమ్మడి రవీంద్రనాథ్
76- రాలనిపువ్వు (నవల) - ఎన్.ప్రభాకరరెడ్డి
77- ఒక పతివ్రత (కథ) - కొడవటిగంటి ()
78- శ్రీశ్రీ సాహిత్యం - ఆర్థిక రాజకీయ దృక్పథం (పరిశోధన) - కాత్యాయని విద్మహే
79- పుట్టుమచ్చ (కవిత్వం) - ఖాదర్ మొహియుద్దీన్
80- తడి ఆరిన సీమ గొంతుకలు (కవితాసంకలనం) - రాయలసీమ సాంస్కృతికవేదిక
81- రాయలమ్మ (కథ)- మునిసుందరం
82- సిటీ బ్యూటిఫుల్ (నవల)- డాక్టర్ కేశవరెడ్డి
83- జాషువా కవిత్వం – స్త్రీ వాదం (వ్యాసం)- బొడ్డు శేషకుమార్‌
84- వచన కవిత తీరుతెన్నులు (వ్యాసం)- డాక్టర్ సి.భవానీ దేవి
85- కోకిలమ్మ పెళ్లి(కవిత)- విశ్వనాథ సత్యనారాయణ
86- నవ దార్శనిక మహాకవి శేషేంద్ర (వ్యాసం)- గింజల నరసింహారెడ్డి
87- తెలుగు భాషలో నవలా ప్రక్రియ (వ్యాసం)- ప్రొపెసర్‌ ముదిగొండ శివప్రసాద్‌
88- స్త్రీవాద విమర్శలో నిరసన, ప్రతిఘటన- కాత్యాయనీ మేలుమలుపు (వ్యాసం)- డాక్టర్ కే.శ్రీదేవి
89- స్వప్నభంగం (కావ్యం)- సినారె
90- కాలాతీత వ్యక్తులు (నవల)- డాక్టర్ పి.శ్రీదేవి
91- మరీచిక (నవల)- వాసిరెడ్డి సీతాదేవి
92- ప్రేమపల్లకి (నవల) - శ్రీరమణ
93- ఏడుతరాలు (నవల) - ఎలెక్స్ హేలీ
94- వానకు తడిసిన పువ్వొకటి (కవిత్వం) - పాలపర్తి ఇంద్రాణి
95- రంగులరాట్నం (నవల) - వంశీ
96- పనిపిల్ల (కథ) - గోపీచంద్
97- పల్లవిలేని పాట (నవల) - రంగనాయకమ్మ
98- పొగలేని నిప్పు (పెద్దకథ)- బుచ్చిబాబు
99- కాంచన మృగం (నవల)- సలీం
100- విపంచి (వ్యాస సంపుటి)- టి.శ్రీరంగస్వామి
101- కవిత్వాన్ని తెలుగునేలపై జల్లిన కవి గుంటూరు శేషేంద్రశర్మ (వ్యాసం) - డా.ఎ.రవీంద్రబాబు
102- గోర్కీ రాసిన ''ప్రేమలేఖలు'' (వ్యాసం)- ఎన్‌.వి.ఎస్‌.నాగభూషణ్‌
103- తెలుగులో వచన కవిత కథా కావ్యాల అనుశీలన (సిద్ధాంత గ్రంథం)-
104- మచ్చుతునకలు (ప్రముఖుల ఏరిన కథల సంపుటి)-
105- నాగార్జున సాగరం (గేయకావ్యం)- సి.నారాయణరెడ్డి
106- తెలుగు నవల (సాహిత్యగ్రంధం)- అక్కిరాజు రమాపతిరావు
107- అజేయ (కథ)- కుప్పిలి పద్మ
108- ‘వైధవ్యం’–రసి కారుతున్న ఓ రాచపుండు (సంపాదకీయ వ్యాసం)- కొండవీటి సత్యవతి
109- దేవులపల్లి రామానుజరావు - ఒక రేఖాచిత్రం (వ్యాసం)- టి.శ్రీరంగస్వామి (
110- పదసాహిత్య పరిమళం (పదసాహిత్య వ్యాస సంపుటి)- ఆచార్య ఎస్.గంగప్ప
111- అగ్రవర్ణ స్త్రీలే … మా దళిత స్త్రీలకు మా మగోళ్ల కంటే, పెద్ద మగోళ్లు (ఇంటర్వ్యూ)- వినోదినితో వెంకటకృష్ణ
112- నిరసన గళాలు (కవితా సంకలనం)- సత్యరంజన్
113- గాలివాన (కథ)- పాలగుమ్మి పద్మరాజు
114- ఉద్వేగాలు (కథ)- పాలగుమ్మి పద్మరాజు
115- పడవ ప్రయాణం (కథ)- పాలగుమ్మి పద్మరాజు
116- ఆ ‘మాలపిల్ల’ మాదిరిగా మాటలు రాసేవారున్నారా ఇప్పుడు?(వ్యాసం)- బుద్ధి యజ్ఞమూర్తి
117- ప్రేమకావ్యం (ఖండకావ్యం)- కొణతం నాగేశ్వరరావు
118- ఆవిడ (కథ)- పి.సత్యవతి
119- మొగలిపూలు (నానీలు)- రేగులపాటి విజయలక్ష్మి
120- అతడు-ఆమె (నవల)- ఉప్పల లక్ష్మణరావు
121- సాహిత్యంలో విప్లవం (చరిత్ర, శిల్పం, స్వీయానుభవాలు)- శ్రీశ్రీ
122- సంజెవెలుగు (నవల)- డాక్టర్ ఆర్.అనంత పద్మనాభ రావు
123- పాటూరు రామయ్య ఉద్యమం- జీవితం (జ్ఞాపకాలు)- పాటూరు రామయ్య
124- నిరంతరం (కవితా సంపుటి)- టి.శ్రీరంగస్వామి
125- కసిగా కదలివస్తే (కవితలు)- రవీంద్ర
126- శేషేంద్ర శ్వాస, ధ్యాస  (వ్యాసం)- డా.జె.సీతాపతిరావు
127- తెలుగు సాహిత్యం–మహిళలు (వ్యాసం)- అబ్బూరి ఛాయాదేవి
128- నాలో నేను (కవితాసంపుటి) - ఆచాళ్ల శ్రీనివాసరావు
129- ఆరు సారాకథలు  (కథాసంపుటి) - రావిశాస్త్రి
130- శొంఠి కృష్ణమూర్తి రచనలు (కథల సంపుటి)- శొంఠి కృష్ణమూర్తి
131- ఎలిజీలు (కొందరు ప్రముఖుల పట్ల గొల్లపూడి హృదయస్పందన)- గొల్లపూడి మారుతీరావు
132- కథ 2015 (కథల సంకలనం)- వాసిరెడ్డి నవీన్
133- ఆధునిక మహాభారతం (సాహిత్యం)- గుంటూరు శేషేంద్రశర్మ
134- పానశాల (ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు)- దువ్వురు రామిరెడ్డి
135- గురజాడ అడుగుజాడ (సాహిత్యవ్యాసాలు)- ఓల్గా
136- గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం (సాహిత్య వ్యాసం)- జయప్రభ
137- జయప్రభ కవిత్వంలో జెండర్ స్పృహ (పరిశోధనా గ్రంధం)-
138- ముత్యాలసరాలు (కవిత్వం)- గురజాడ అప్పారావు
139- అడ్వర్టయిజింగ్ కథలు - విజయ సూత్రాలు ()-ఎ.జి.కృష్ణమూర్తి
140- జుజుమురా (కథ)- గొల్లపూడి మారుతీరావు
141- గిరీశం లెక్చర్లు (వ్యాసాలు)- ముళ్లపూడి వెంకటరమణ
142- కాదంబరి (నవల)- రావూరి భరద్వాజ
143- అతడు-ఆమె-మనం(అతడు-ఆమె నవలపై విశ్లేషణ)- ఓల్గా
144- మాధవ మందారాలు(తెలుగు గజళ్లు)- కోరుప్రోలు మాధవరావు
145- జాజిమల్లి(నవల)- అడవి బాపిరాజు
146- యోగాయోగాలు(కథానిక)- రవీంద్రనాథ్ ఠాగూర్
147- చీకట్లోంచి చీకట్లోకి (కథలు)- వడ్డెర చండీదాస్
148- ఆనాటి వాన చినుకులు (కథలు)- వంశీ
149- మెట్రోకథలు (కథలు)- మహమ్మద్ ఖదీర్ బాబు
150- పాలెగాడు (ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర) - ఎస్.డి.వి.అజీజ్

ఈ ఏడాది నేను రాసిన కథలు :
01- ఓల్గా (కథ)
02- గాన కోయిల (కథ)
03- అమ్మ (కథ)
04- చీకటిదారుల్లో వెలుగురేఖలు (కథ)
    (ఈ కథకు  ‘తెలుగుతల్లి -కెనడా’ మ్యాగజైన్ కథల పోటీలో బహుమతి లభించింది.)
05- వలస బతుకు (కథ)- రాజాబాబు కంచర్ల (ఇది నేను రాసిన కథ)
06- ఫోన్ కాల్ (కథ)- రాజాబాబు కంచర్ల

- నిత్యం మీ అభిమానాన్ని ఆకాంక్షించే మీ రాజాబాబు కంచర్ల.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్