ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఏ జన్మవరమో

రోజులలో లెక్కించలేని మనబంధం
ఇది జన్మజన్మల అనుబంధం
ఎన్నటికీ వీడని మమతానురాగాల పరిమళం
ఏ జన్మవరమో ఈ నేస్తం

అనుకోని అతిథిలా అడుగుపెట్టావు
గ్రీష్మంలో వసంతంలా ఎద తట్టావు
మూగబోయిన మౌనమృదంగాన్ని పలికించావు
గానం తెలియని గొంతులో రాగమై పల్లవించావు

ఏడాదికొకటే వసంతం
నీరాకతో నామది నిత్యవసంతం
నీ పద సవ్వడి తరలివచ్చిన మలయమారుతం
చీకటిలో మెరిసే నక్షత్రం నీ రూపం

వేయివెన్నెల కుంచెతో
నీలాల నింగి క్యాన్వస్ పై
ఇంద్రధనుస్సు రంగులతో
చిత్రించా నీ పంచవన్నెల చిత్రాన్ని

ఈ క్షణాల కోసమే ఎదురుచూశానేమో
మరుగుతున్న హృదయంతో ఇన్నాళ్లు
ఎద లోగిలి దాటిపోకు నేస్తమా...
ఈ చిన్నిగుండె పగిలిపోతుందేమో

- రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్