ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నెట్టింట్లో న‌డ‌క‌

    విఠలాచార్య సినిమాల్లో బోల్డన్ని వింతలు, కనికట్లు కనిపిస్తుంటాయి. మంత్రదండం తిప్పగానే ఓ రాతి తలుపు తెరుచుకుంటుంది. ఓ రాతి విగ్రహం నడుచుకుంటూ వస్తుంది. ఇక సైన్స్‌ ఫిక్షన్‌ కథల్లో, సినిమాల్లో అయితే బోల్డన్ని వింతలూ విశేషాలూను. చేతిలో రిమోట్‌
వుంటే చాలు... కూర్చున్న చోటు నుంచే అన్ని పనులూ జరిగిపోతుంటాయి. ఒక మీట నొక్కగానే అప్పటివరకూ శిల్పంలా వున్న రోబోట్‌ ఒకటి... ఎంచక్కా కాఫీ తెస్తుంది. మరో మీట నొక్కగానే గోడలోనుంచే టీపారు వచ్చేస్తుంది. ఇంకో మీట నొక్కగానే డోర్‌ తెరచుకుంటుంది. ఒకటేమిటి ఇలా ఎన్నో వింతలూ విశేషాలు ఈ సైన్స్‌ ఫిక్షన్స్‌లో కనబడతాయి. వాటన్నింటినీ చూసి అబ్బురపడతాం... ఇవన్నీ నిజజీవితంలో జరిగితే ఎంత బాగుంటుందో అనుకుంటాం. అప్పటి విఠలాచార్య గానీ, అప్పుడూ ఇప్పుడూ వచ్చే సైన్స్‌ ఫిక్షన్‌ రచయితలు గానీ ఊహించి వుండరు... తమ ఊహలను నిజజీవితంలో వాస్తవ రూపంలో చూడగలిగే మహాద్భుతాలు జరుగుతాయని. అవును... అలాంటి మహాద్భుతాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. నాటి కల్పనాశక్తికి నేటి సాంకేతిక యుక్తిని జోడించి సృష్టించిన అద్భుతాలే 'ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌'. ఇది ఇంటర్నెట్‌ ఆవిష్కరించిన మాయాజాలం.
          ఇంటర్నెట్‌ ఆవిష్కరణ... సాంకేతిక విజ్ఞానాన్ని తోడు చేసుకొని ప్రపంచాన్ని మన నట్టింట్లోకి తీసుకొచ్చింది. ప్రతిరంగంలోనూ ఇంటర్నెట్‌ అనేక రంగాలకు అనుసంధానం అవుతూ, తన సేవలను విస్తృతం చేసుకొంటూ శరవేగంగా దూసుకెళుతోంది. అలాంటి వాటిలో ఇటీవల మనకు ఎక్కువగా వినిపిస్తున్న పదం 'ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌' (Internet Of Things- IOT). ఐఓటీ అనేది ఒకే ఒక పరిజ్ఞానం కాదు, అనేక పరిజ్ఞానాల సమ్మేళనం. ఈ ప్రక్రియలో ప్రతి ఎలక్ట్రానిక్‌ పరికరమూ ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉంటుంది. మనం ఉదయం లేవగానే దంతాలు తోముకోడానికి బ్రష్‌ మంచం దగ్గరికి వస్తుంది. అదే ఆటోమేటిక్‌గా దంతాలను శుభ్రం చేస్తుంది. బాత్‌రూమ్‌కు వెళ్లగానే అక్కడి సెన్సార్లు యాక్టివేట్‌ అవుతాయి. ఈ సెన్సార్లు మీ శరీరాన్ని స్కాన్‌ చేస్తాయి. మన శరీరంలో ఏవైనా సమస్యలు వుంటే డిజిటల్‌ డిస్‌ప్లేలో చూపిస్తాయి. డ్రెస్‌ చేసుకొని రెడీ అవగానే ఒక రోబోట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ తెచ్చిపెడుతుంది. అదే సమయంలో మన సెల్‌ఫోన్‌ సాయంతో సెల్లార్‌లో ఉన్న కారు ఆన్‌ అయ్యి రెడీగా ఉంటుంది. వెళ్ళి కూర్చోగానే రూట్‌మ్యాప్‌ సహాయంతో ఆఫీస్‌కి తీసుకువెళ్తుంది. అంటే ఈ యంత్రాలన్నింటికీ ఇంతకుముందే ప్రోగ్రాం చేసి ఉంచుతారు అవి అలాగే మీ ఆదేశాలను అనుసరించి పనిచేస్తాయి. ఇటువంటి అనేక అద్భుతాలను ఇంటర్నెట్‌ అనుసంధానం ద్వారా చేస్తూ... విస్మయం కలిగిస్తున్నారు. ఒక యంత్రం కూడా మనిషిలా ఆలోచించి మనిషి అవసరాలను తీర్చేలా చేయగలుగుతున్నారు. మన నిత్యజీవితంలో వాడే వస్తువులు ఒకదానితో ఒకటి అనుసంధానమైతే, మనం ఉపయోగించే వస్తువులు ఒకదానితో ఒకటి ముచ్చటించుకుంటే, సమన్వయంతో సులభంగా పనిచేస్తే... శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విశిష్టమైన స్థాయికి చేరుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... ఇనుములో ప్రోగ్రామింగ్‌ చేసి మెదడును పెట్టి కమ్యూనికేషన్‌ అంతా ఇంటర్నెట్‌తో నడిపిస్తే... అదే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌.
       ఓ డాక్టర్‌కు ఎమర్జెన్సీ కాల్‌ వస్తుంది... అత్యవసరంగా అతనికి సర్జరీ చేయకపోతే ప్రాణాపాయమని. హడావుడిగా బయల్దేరతాడు డాక్టర్‌. కొంత దూరం వెళ్లగానే ఆ రూట్‌లో ట్రాఫిక్‌ జామ్‌ అయిందని, మరో మార్గం నుంచి వెళితే త్వరగా వెళతావని తన స్మార్ట్‌ఫోన్‌లో రూట్‌మ్యాప్‌ చూపిస్తుంది.
ఉదయశ్రీ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉన్నత స్థాయిలో వున్న ఉద్యోగి. ఏదో ముఖ్యమైన కాన్ఫెరెన్స్‌ వుందని హడావుడిగా వెళుతుంది. తన కారులో ఏర్పాటు చేసిన డిజిటల్‌ స్క్రీన్‌ మీద ఎమర్జెన్సీ కాల్‌ రింగ్‌ అవుతుంది. దాన్ని ప్రెస్‌ చేయగానే తన తండ్రి హార్ట్‌ ఎటాక్‌తో విలవిల్లాడుతోన్న దృశ్యం కనిపిస్తుంది. వెంటనే హాస్పటల్‌కు ఫోన్‌ చేసి అంబులెన్స్‌ పంపమని కోరుతుంది. వారికి ఒక కోడ్‌ ఇస్తుంది. అంబులెన్స్‌ ఉదయ ఇంటికి రాగానే ఆ కోడ్‌ ద్వారా మెయిన్‌ గేట్‌ ఆటోమేటిక్‌గా తెరచుకుంటుంది. అదే విధంగా ఇంటి తలుపు కూడా తెరచుకుంటుంది. వెంటనే ఆ పెద్దాయనను హాస్పిటల్‌కి తీసుకెళతారు. అంబులెన్స్‌ బయటకు రాగానే డోర్స్‌ అన్నీ ఆటోమేటిక్‌గా లాక్‌ అయిపోతాయి. ఉదయశ్రీ తన కాన్ఫెరెన్స్‌ చూసుకుంటూనే హాస్పిటల్‌లో తన తండ్రి పరిస్థితిని తెలుసుకుంటూ వుంటుంది.
       అర్ధరాత్రి.... ఇంట్లోనివారంతా గాఢనిద్రలో వుంటారు. ఇద్దరు దొంగలు ప్రహరీగోడ మీద నుంచి దిగుతుంటారు. నిద్రలోవున్న శ్రీదేవికి తమ స్మార్ట్‌ఫోన్‌ నుంచి పెద్దగా వినిపిస్తోన్న అలెర్ట్‌ సౌండ్‌కు మెలకువ వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ ఆన్‌ చేసి చూస్తే... ఇద్దరు దొంగలు ప్రహరీగోడ దిగి లోపలికి వస్తున్న దృశ్యం కనిపిస్తుంది. కంగారుగా భర్తను లేపుతుంది. హాల్లోకి వచ్చి టీవీ ఆన్‌ చేస్తారు... దొంగలు లోపలికి వచ్చే దృశ్యాలు కనిపిస్తుంటాయి. పోలీసులకు వీడియో కాల్‌ వెళుతుంది. ఇంట్లోని లైట్స్‌ ఆన్‌ అవుతాయి. పోలీసులు రావడంతో ఇవేవీ తెలియని దొంగలు సులభంగా దొరికిపోతారు.
     ఇలా ప్రతి అంశంలోనూ... ప్రతి రంగంలోనూ సాంకేతికతను జోడించి ఆయా పరికరాలను తమ స్మార్ట్‌ఫోన్లకు అమర్చుకొని సెన్సార్ల ద్వారా తమ పనులను వేగవంతం చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఫలితమే. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ అనేది కేవలం మిషన్‌ నుంచి మిషన్‌కు అనుసంధానం మాత్రమే కాదు. దీన్ని ఐవోటీ పారిశ్రామిక విప్లవం 4.0గా అభివర్ణిస్తారు. ఇంతకుముందు పారిశ్రామిక విప్లవం 3.0 అంటే టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెంది కంప్యూటర్లు స్థూలస్థాయి నుంచి సూక్ష్మస్థాయికి చేరాయి. 1946లో మొదటి కంప్యూటర్‌ అయిన ENIAC ఒక పెద్ద గది అంతా ఉండేది. ఈ రోజు ఆ పరికరం మన చేతిలో ఇమిడిపోయేంత సూక్ష్మంగా తయారైంది. ఈ పారిశ్రామిక విప్లవం 4.0తో ముఖ్యమైంది. కృత్రిమ మేధస్సు ఇది అచ్చం మనిషి ఏవిధంగా ఆలోచిస్తాడో అదేవిధంగా పనిచేస్తుంది. మనిషి అవసరాలను ముందుగానే గుర్తించి వాటిని పూర్తిచేస్తుంది. ఇప్పుడు మనం వాడే కంప్యూటర్లు మనలాగే ఆలోచించి మన సహాయం లేకుండా సేకరించిన డేటాను ట్రాక్‌ చేయగలిగి కచ్చితంగా లెక్కించగలిగితే మనుషుల ద్వారా జరిగే వ్యర్థాలు, నష్టాలు, ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చు.
ఇల్లు చాలా స్మార్ట్‌
గూగుల్‌లో అత్యంత ఎక్కువగా సెర్చ్‌ చేసిన ఐవోటీ పదం... 'స్మార్ట్‌ హౌమ్‌' అంటే... ఇంటి మొత్తాన్ని ఎలక్ట్రానిక్‌ సెన్సార్లతో స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేస్తారు. దాని ద్వారా మనం బయట నుంచి ఇంటికి చేరగానే ఇంటి మెయిన్‌ గేట్‌ ఆటోమేటిక్‌గా తెరచుకుంటుంది. అలాగే ఇంటి ద్వారం కూడా తెరచుకుంటుంది. ఇంటికి రావడానికి ముందే ఇంట్లో వుండే ఏసీని ఆన్‌ చేసుకోవచ్చు. ఇంట్లో వెలిగే లైట్స్‌ దగ్గర నుంచి బాత్‌రూమ్‌లో వేడి నీళ్ల వరకు, ఆహార పదార్థాలను వేడి చేసుకోవడం దగ్గర నుంచి ఇంట్లోని వాతావరణాన్ని కంట్రోల్‌ చేసుకోవడం వరకూ ప్రతి అంశాన్ని కంట్రోల్‌ చేసుకోవచ్చు. ఎవరైనా అపరిచితులు ఇంటి ఆవరణలోకి ప్రవేశించగానే అలెర్ట్‌ చేసే సిగలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఐవోటీ ద్వారా సాధ్యపడుతుంది. ఇంటి ఆటోమేషన్‌, బిల్డింగ్‌ ఆటోమేషన్‌ వ్యవస్థలో వివిధ రకాలైన భవనాల్లో ఉపయోగించిన యాంత్రిక విద్యుత్‌, ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి ఐవోటీ పరికరాలు ఉపయోగించవచ్చు. అదే సందర్భంలో ఆటోమోటివ్‌ డిజిటల్‌ టెక్నాలజీ వాహనాలను అంతర్గత విధులుపై కూడా దృష్టి పెట్టింది.
పర్యావరణానికి కూడా...
గాలి, నీరు, నేల, వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో సహాయపడేందుకు ఐవోటీ సాఫ్ట్‌వేర్స్‌ ఈ సెన్సార్లనే ఉపయోగిస్తాయి. వన్యప్రాణుల కదలికలు, వాటి ఆవాసాల పర్యవేక్షణ, పరిరక్షణలను నిర్వహిస్తాయి. ఇంటర్నెట్‌కి అనుసంధానించిన వనరుల నిరోధక పరికరాలను అభివృద్ధి చేయడం కూడా భూకంపం లేదా సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థల వంటి ఇతర అనువర్తనాలను మరింత సమర్థవంతమైన సహాయాన్ని అందించడానికి అత్యవసర సేవలతో కలిపి ఉపయోగిస్తారు. ఈ అనువర్తనంలో ఐవోటీ పరికరాలు సాధారణంగా భారీ భౌగోళిక ప్రాంతాన్ని కలిగి ఉంటాయి. అవస్థాపన నిర్వహణ, వంతెనలు, రైల్వేట్రాక్‌లు, ఆన్‌ అండ్‌ ఆఫ్‌షోర్‌ - విండ్‌ - ఫెర్మ్స్‌ వంటి పట్టణ, గ్రామీణ అంతర్గత నిర్మాణాల పర్యవేక్షణ, నియంత్రణ కార్యకలాపాల్లో ఐవోటీ కీలకమైన ఉపయోగం.
కన్జ్యూమర్‌ అప్లికేషన్‌
ఐవోటీ పరికరాల పెరుగుతున్న భాగాలన్నీ వినియోగదారుల ఉపయోగం కోసం రూపొందిస్తారు. అనుసంధానించిన కారు, వినోద, నివాసాలు, స్మార్ట్‌ గృహాలు, ధరించగలిగిన సాంకేతికత క్వాంటిఫైడ్‌ స్వీయ, అనుసంధానమైన ఆరోగ్య, స్మార్ట్‌ రిటైల్‌ ఉన్నాయి. ఐవోటీ ముఖ్య డ్రైవర్లలో డేటా లేదు. వాటిని మరింత ప్రభావంతంగా పనిచేయడానికి అనుసంధానించే పరికరాల ఆలోచన విజయవంతం కావాలంటే... డేటా, యాక్సెస్‌ నిల్వ, ప్రాసెసింగ్‌ వంటివి ఆధారపడి ఉంటాయి. ఈ ప్రయోజనం కోసం ఐవోటీలో పనిచేసే వివిధ అంశాల నుంచి డేటాను సేకరించి, దాని క్లౌడ్‌ నెట్‌వర్క్‌లో తదుపరి ప్రాసెసింగ్‌ కోసం దాన్ని నిల్వచేస్తాయి. గోప్యత, భద్రత కోసం, పలు వ్యవస్థల ఒకే పాయింట్‌ దుర్బలత్వానికి ఇది తలుపు తెరిచి ఉంటుంది. ప్రస్తుతం పైన పేర్కొన్న డేటా, స్టోరేజ్‌, ప్రాసెసింగ్‌ వ్యవస్థలను రక్షించడంలో నియంత్రణ దారులు మరింత ఆసక్తి చూపించాల్సివుంది.
ఆల్ట్‌ మీట
ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ మనిషి జీవన గమనాన్ని వేగవంతం చేయడంతోపాటు స్మార్ట్‌గా మారుస్తుంది. సుఖవంతమైన జీవితాన్నిస్తుంది. ఎన్నో ఉద్యోగావకాశాలను సృష్టిస్తుంది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు సెక్యూరిటీ సంబంధింత విషయాలు అనేకం ప్రతికూలంగానూ వున్నాయి. ఈ ప్రతికూలతలను అధిగమించి ప్రపంచాన్ని మరింత స్మార్ట్‌గా మార్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. నిజానికి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఇప్పుడే వచ్చిందేమీకాదు. 1982లోనే ఈ కాన్సెప్ట్‌పై చర్చ జరిగింది. అప్పుడే ఇంటర్నెట్‌కు అనుసంధానమైన కోక్‌ మెషిన్‌ను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఇంటర్నెట్‌కు అనుసంధానమయ్యే టోస్టర్‌ను 1989లో ఆవిష్కరించారు.
బ్రిటన్‌ వంటి నగరాల్లో స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లను ఏర్పాటు చేశారు. అవి ఇంట్లో ఎవరూ లేనప్పుడు విద్యుత్‌ను ఆటోమేటిక్‌గా నిలిపివేస్తాయి. అలాగే ట్రాఫిక్‌ సిగల్స్‌ వద్ద సెన్సార్లు ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌కు అనుగుణంగా సిగల్‌ లైట్లను ఏర్పాటు చేయడం ఇలాంటి ఆవిష్కరణే. అదేవిధంగా... డస్ట్‌బిన్‌ చెత్తతో నిండిపోయింది. వెంటనే ఆ సందేశం మున్సిపల్‌ విభాగానికి వెళుతుంది. వారొచ్చి ఆ బిన్‌ ఖాళీ చేస్తారు. అలాగే... టోల్‌గేట్లు దగ్గర కారు ఆగక్కర్లేదు. అక్కడ ఏర్పాటు చేసే సెన్సార్లు కారు నంబర్‌ను ఆటోమేటిక్‌గా గుర్తిస్తాయి.
     ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల పరికరాలు ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు కూడా ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొంటామన్నదే పెద్ద సవాలు. ఒకవేళ ఏదైనా హ్యాకర్‌ తన అపార తెలివితేటలను ఉపయోగించి వేల కోట్ల పరికరాలను పనిచేయకుండా, తన స్వాధీనంలోకి తీసుకుంటే జరిగే పరిణామాలు ఏమిటి? కీలకమైన, సున్నితమైన సమాచారం వారి చేతిలో పడితే పరిస్థితి ఏమిటి? వీటిపైనే పరిశోధకులు, నిపుణులు కూడా దృష్టి సారించారు.
    ఇప్పటికిప్పుడు అయితే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరంగా అడ్డంకులు ఏమీ లేవు. అది దూసుకుపోతూనే ఉంది. కంప్యూటర్లు ఇంటర్నెట్‌ కు అనుసంధానమై దశాబ్దాలు దాటింది. మరి ఇన్నేళ్లల్లో ఎన్ని కంప్యూటర్లు హ్యాక్‌ అయ్యయి...? ఇది కొందరి ప్రశ్న. అందుకే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ విషయంలోనూ ఆందోళన అవసరం లేదంటున్నారు.

ఉత్పత్తి రంగంలోను...
ఉత్పత్తి పరకరాలు, ఆస్తి, పరిస్థితి నిర్వహణ, నెట్‌వర్క్‌ నిర్వహణ, పారిశ్రామిక సాఫ్ట్‌వేర్స్‌, స్మార్ట్‌ తయారీ రంగాల్లో ఐవోటీ ఉపయోగపడుతుంది. నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ 2001లో తెలివైన నిర్వహణ వ్యవస్థలు (×వీూ), కనెక్ట్‌ యంత్రాలు, మానిటర్‌ యంత్రం అధోకరణం అంచనా, సంభావ్య వైఫల్యాలు నివారించడానికి ఐవోటీ ఆధారిత ముందస్తు విశ్లేషణలు, సాంకేతికతలను ఉపయోగించడానికి పరిశోధనతో ఒక యూనివర్సిటీ కోఆపరేటివ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను స్థాపించింది. ఐవోటీ ఆధారిత అంచనా విశ్లేషణలను ఉపయోగించి సమీక్షిస్తున్నా విచ్ఛిన్నం సాధించడానికి దృష్టి ఈ-తయారీ, ఈ-నిర్వహణ కార్యకలాపాల భవిష్యత్‌ అభివృద్ధికి దారితీస్తుంది.
ఐవోటీ అంటే
ఇంటర్నెట్‌ ద్వారా పనిచేసేలా వివిధ పరికరాలను ఒకదానికొకటి అనుసంధానించ డాన్నే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ) అంటారు. దీనికి సంబంధించిన పరికరాలను తయారుచేసేవాటిని ఐవోటీ పరిశ్రమగా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐవోటీ పరిశ్రమ సేవలు దాదాపుగా అన్ని రంగాలకూ శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకూ విస్తరించాయి. స్మార్ట్‌ సిటీస్‌, స్మార్ట్‌ హౌమ్స్‌, వ్యవసాయం, ఆరోగ్య సేవలు, ఇంధన రంగం, భద్రత, విపత్తుల నిర్వహణ వంటి అనేక రంగాల్లో మానవ ప్రమేయం లేకుండా రిమోట్‌తో అనుసంధానమయ్యే పరికరాల ద్వారా ఆటోమేటిక్‌ పరిష్కారాలు పొందేందుకు ఐవోటీ ఇప్పుడొక సరికొత్త వేదికగా ఆవిష్కృతమైంది. ఐవోటీ పరికరాల ద్వారా.. వీధిలైట్లు సమయం ప్రకారం లేదా వెలుతురు లభ్యతను బట్టి ఆటోమేటిక్‌గా వెలిగేలా, ఆరిపోయేలా చేయొచ్చు. ట్రాఫిక్‌ సిగళ్లను ఆటోమేటిక్‌గ్గా నియంత్రించొచ్చు. రిజర్వాయర్ల నుంచి పబ్లిక్‌ కుళాయిల వరకూ నీటి ప్రవాహం, నాణ్యతను పర్యవేక్షించొచ్చు. స్మార్ట్‌ పర్యావరణ పరికరాలతో వాయుకాలుష్యాన్ని పర్యవేక్షించవచ్చు. ఇంటర్నెట్‌కు అనుసంధానమై పనిచేసే పరికరాలు, సెన్సార్లను ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌గా పేర్కొంటారు. ఇంటర్నెట్‌తో అనుసంధానించి పరికరాలను పనిచేయించడం. ఆన్‌, ఆఫ్‌ చేయడం. ఇంటికి మరో ఐదు నిమిషాల్లో చేరుకుంటామనగా స్మార్ట్‌ఫోన్‌ నుంచే ఇంట్లో ఉన్న ఏసీని ఆన్‌ చేయడం ఎలా సాధ్యమో ఆలోచించండి.
      స్మార్ట్‌ఫోన్‌, ఏసీ రెండూ ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉండడం వల్లే. సెల్‌ ఫోన్లు, లైట్లు, వాషింగ్‌ మెషిన్లు, ఫ్రిడ్జ్‌ ఇలా ఒక్కటేమిటి చివరికి మొబైల్‌లోని ప్రతీ యాప్‌ వాట్సాప్‌ సహా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కిందకే వస్తాయి. ఇంటర్నెట్‌ సాయంతో సాగరంలో ఉన్న చమురు వెలికితీత రిగ్స్‌ను ఆన్‌ చేయగలిగితే...? అసలు డ్రైవర్‌ లేకుండానే కారు నడిపించలేమా...? ఇలా ఎన్నో అంశాలపై నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. గూగుల్‌ డ్రైవర్‌ రహిత కారు కోసం కొన్నేళ్లుగా పరిశోధనలు నిర్వహించి చివరికి అనుకున్నది సాధించింది. ఇది కూడా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లో భాగమే.
సాగుకు సాయం
వ్యవసాయ పద్ధతులను సాంకేతికత దిశగా నడిపేందుకు ఐవోటీ గణనీయంగా దోహదపడుతుంది. వ్యవసాయ మొబైల్‌ అనువర్తనాలు, క్లౌడ్‌ ప్లాట్‌ఫార్మర్లతో వైర్‌లెస్‌ సెన్సార్ల ఏకీకరణ పర్యావరణ పరిస్థితులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడంలో సహాయపడుతుంది. ఉష్ణోగ్రత, వర్షపాతం, తేమ, గాలివేగం, నేల హ్యూమస్‌ కంటెంట్‌ లేదా పోషకాలు, ఒక వ్యవసాయ భూమితో అనుసంధానించి, వ్యవసాయ పద్ధతులను మెరుగుపర్చడం, స్వయంచాలకంగా ఉపయోగించడం, నాణ్యతను, పరిమాణాన్ని మెరుగుపర్చడానికి సమాచారాన్ని తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం, ప్రమాదాలు, వ్యర్థాలను తగ్గించడం.

మెడికల్‌, హెల్త్‌కేర్‌
వైద్య, ఆరోగ్య సంరక్షణ మార్చే రిమోట్‌ హెల్త్‌ పర్యవేక్షణ, అత్యవసర నోటిఫికేషన్‌ వ్యవస్థలను ప్రారంభించడానికి ఐవోటి పరికరాలను ఉపయోగించవచ్చు. ఈ ఆరోగ్య పర్యవేక్షణ పరికరాలు రక్తపు పీడనం, హృదయ స్పందన మానిటర్ల నుంచి పేస్‌ మేకర్లు, ఫిట్‌ ఎలక్ట్రానిక్‌ రిస్ట్రాండ్స్‌ లేదా ఆధునిక వినికిడి సాధనాల వంటి ప్రత్యేక ఇంప్లాంట్లు పర్యవేక్షించే ఆధునిక పరికరాల వరకు ఉంటాయి. ఆరోగ్యం, సీనియర్‌ పౌరుల సాధారణ శ్రేయస్సును పర్యవేక్షించడానికి ప్రత్యేక ప్రదేశాల్లో ప్రత్యేక సెన్సార్లను అమర్చవచ్చు. వీటి ద్వారా సరైన చికిత్స నిర్వహించవచ్చు. చికిత్స ద్వారా కోల్పోయిన కదలికలను తిరిగి పొందటానికి సహాయపడతారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహిస్తాయి.
ఎనర్జీ మేనేజ్‌మెంట్‌
ఇంటర్నెట్‌కు అనుసంధానించిన సెన్సింగ్‌, యాక్టివేషన్‌ సిస్టమ్స్‌ ఏకీకరణ, మొత్తం శక్తి వినియోగంపై ఆప్టిమైజ్‌ చేస్తుంది. ఐవోటీ పరికరాలు అన్ని రకాల శక్తి వినియోగ పరికరాల్లో పవర్‌ అవుట్‌లెట్లు, టెలివిజన్లు విలీనం అవుతాయి. గృహ ఆధారిత శక్తి నిర్వహణతోపాటు ఐవోటీ ముఖ్యంగా స్మార్ట్‌గ్రిడ్‌కు సంబంధించినది. ఎందుకంటే శక్తిని, విశ్వసనీయత, ఆర్థిక శాస్త్రం, స్థిరత్వాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఆటోమేటెడ్‌ పద్ధతిలో శక్తి, శక్తి సంబంధిత సమాచారాన్ని సేకరించి అమలు చేయడానికి వ్యవస్థలను అందిస్తుంది.
 
- రాజాబాబు కంచర్ల
9490099231

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్