ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సాయం సంధ్యవేళ

సాయం సంధ్యవేళ
అలసిన సూర్యుడు నిస్సత్తువగా అస్తమించే వేళ
సంద్రం సంబరంగా వింత వింత కాంతులీనుతున్న వేళ
గంటలు నిమిషాలుగా గడిచిపోయే వేళ
పిల్లగాలి గలగలలు పరవశింపజేస్తున్న వేళ
ఎద కోవెలలో ప్రమిదలు వెలిగించే వేళ
నింగిమీద తొలి చుక్క తొంగి చూసే వేళ
దూరంగా నీలిమేఘాలు కమ్ముకొస్తున్న వేళ
ఈ నిశబ్ద నీరవంలో
నా తలపుల నిండుగా నిను నింపుకొస్తున్న
నా అడుగుల సవ్వడి వినిపిస్తుందేమో
జాగ్రత్తగా కనిపెట్టి చూడు...
మది తలపులను తెరచి వుంచు...
ఆ సంధ్యా కాంతిలో
నే నడచి వస్తున్నా..
నీ ఎద కోవెలలో ప్రమిదగ వెలగాలని...

- రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్