ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దీన్నేమంటారు..?

బీడువారిన నేల
గుల్ల బారింది
చినుకమ్మ రాకతో
అవని పులకించింది
మోడువారిన తరువులు
చిగుళ్లు విడిచింది
గరికమ్మ సైతం
మొగ్గలు తొడిగింది
దీన్నేమంటారు..?

రసభాషిణి కోయిలమ్మ
గళము విప్పింది  రాగాలుపాడింది
వసంతమొచ్చిందని
వయ్యారాలు వలికించింది

చీకటిని పారద్రోలుతూ
వెన్నెలమ్మ పురివిప్పింది
ఎన్నెలపిట్ట మధువును తాగుతోంది
దీన్నేమంటారు...?

- రాజాబాబు కంచర్ల
09-01-2018

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్