నీ దగ్గర వదిలిపెట్టిన నాకోసం
పచ్చటి పంటచేలను
జలజల పారే వాగువంకలను
దాటుకొని
బిరబిర పరుగులెత్తే మేఘాలను
తప్పుకొని
బయలుదేరాను
నీలోవున్న నాకోసం...
ఓ పిల్లగాలి ఎదురొచ్చి అడిగింది
ఓ వెన్నెలపిట్ట జతకలిసి అడిగింది
ఓ నీటితుంపర దప్పికతీర్చి అడిగింది
ఓ తుంటరితుమ్మెద వెంటబడి అడిగింది
నీ వెక్కడికనీ... ఎందుకీ ఆతృత నీ
నే చెప్పిన మాటవిని
పొట్ట చెక్కలయ్యేలా నవ్వాయి
హాస్యమాడాయి
అల్లరి చేశాయి
చిన్నబుచ్చుకున్న నన్నుజూసి
ఓదార్చాయి
ఊరించాయి
అక్కునజేర్చుకున్నాయి
నాతో కలిసి అడుగేశాయి
అప్పుడు చూపించాను నిన్ను
నీలో దాగివున్న నన్ను
ప్రేమామృతాన్ని సేవిస్తూ
ప్రేమమత్తులో కూజితాలు సలుపుతూ
నీ ప్రేమ రస జగత్తులో
అమరత్వాన్ని సిద్ధించుకున్న
నన్నుజూసి
మురిసిపోయాన్నేను
ఆల్ ది బెస్ట్ అన్నాయి
నా నేస్తాలు...
- రాజాబాబు కంచర్ల
15-04-2018
పచ్చటి పంటచేలను
జలజల పారే వాగువంకలను
దాటుకొని
బిరబిర పరుగులెత్తే మేఘాలను
తప్పుకొని
బయలుదేరాను
నీలోవున్న నాకోసం...
ఓ పిల్లగాలి ఎదురొచ్చి అడిగింది
ఓ వెన్నెలపిట్ట జతకలిసి అడిగింది
ఓ నీటితుంపర దప్పికతీర్చి అడిగింది
ఓ తుంటరితుమ్మెద వెంటబడి అడిగింది
నీ వెక్కడికనీ... ఎందుకీ ఆతృత నీ
నే చెప్పిన మాటవిని
పొట్ట చెక్కలయ్యేలా నవ్వాయి
హాస్యమాడాయి
అల్లరి చేశాయి
చిన్నబుచ్చుకున్న నన్నుజూసి
ఓదార్చాయి
ఊరించాయి
అక్కునజేర్చుకున్నాయి
నాతో కలిసి అడుగేశాయి
అప్పుడు చూపించాను నిన్ను
నీలో దాగివున్న నన్ను
ప్రేమామృతాన్ని సేవిస్తూ
ప్రేమమత్తులో కూజితాలు సలుపుతూ
నీ ప్రేమ రస జగత్తులో
అమరత్వాన్ని సిద్ధించుకున్న
నన్నుజూసి
మురిసిపోయాన్నేను
ఆల్ ది బెస్ట్ అన్నాయి
నా నేస్తాలు...
- రాజాబాబు కంచర్ల
15-04-2018
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి