ఈ మట్టికి పూసిన గడ్డిపువ్వులం మేము
మీ అడుగుల కింద మొలిచిన చైతన్య కెరటాలం మేము
మీ పాదాల కింద నలిగిన పాన్పులము
మీ పాదాలను గుచ్చే ముళ్లవుతాం సహనం నశించిననాడు
మట్టికున్నంత సహనముంది
మింటికెగసే ఆశయమూ వుంది
పంచములని పాతాళానికి తొక్కాలనుకుంటే
పాంచజన్యం పూరించే పార్థులం మేము
అమృతం తాగినా విషంగక్కే మనువు నువ్వు
గంజిబువ్వ తిన్నా విశ్వాసం నింపుకున్న మనిషులం మేము
దోచుకోవడం దాచుకోవడం నీ నైజం
శ్రామిక జన జీవన సౌందర్యం మా తేజం
వాడబతుకును దీపశిఖలుగా జ్వలింపజేయగలం
ఆకలిబాధను ఆయుధాలుగా మలచగలం
కులహంకార ముసుగులను తొలగించగలం
నపుంసక రాజకీయ క్రీడలను ఎదిరించగలం
సమానత్వం కోసం
హక్కుల కోసం
మా పోరాటం
మేము నిలుచున్న చోటే యుద్ధరంగం
మేము శ్రామిక సైనికులం
పోరాట యోధులం...రేపటి సూర్యులం
- ఉదయ
29-12-2017
మీ అడుగుల కింద మొలిచిన చైతన్య కెరటాలం మేము
మీ పాదాల కింద నలిగిన పాన్పులము
మీ పాదాలను గుచ్చే ముళ్లవుతాం సహనం నశించిననాడు
మట్టికున్నంత సహనముంది
మింటికెగసే ఆశయమూ వుంది
పంచములని పాతాళానికి తొక్కాలనుకుంటే
పాంచజన్యం పూరించే పార్థులం మేము
అమృతం తాగినా విషంగక్కే మనువు నువ్వు
గంజిబువ్వ తిన్నా విశ్వాసం నింపుకున్న మనిషులం మేము
దోచుకోవడం దాచుకోవడం నీ నైజం
శ్రామిక జన జీవన సౌందర్యం మా తేజం
వాడబతుకును దీపశిఖలుగా జ్వలింపజేయగలం
ఆకలిబాధను ఆయుధాలుగా మలచగలం
కులహంకార ముసుగులను తొలగించగలం
నపుంసక రాజకీయ క్రీడలను ఎదిరించగలం
సమానత్వం కోసం
హక్కుల కోసం
మా పోరాటం
మేము నిలుచున్న చోటే యుద్ధరంగం
మేము శ్రామిక సైనికులం
పోరాట యోధులం...రేపటి సూర్యులం
- ఉదయ
29-12-2017
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి