ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నానీలు

జీవితం
సత్యం సుందరం
గమ్యం
విజయం తథ్యం
---
భావాల వెల్లువ
పొంగి పొర్లనీ
తేలికవును
మనసు శాంతించి

---
మనసు సంక్షిప్తమే
కాదు అనంతం
భరిస్తుంది
మంచినీచెడుని
---
శరీర స్పర్శ
తాత్కాలికం
మన:స్పర్శ
శాశ్వితం
---
స్వార్థం బానిస
త్యాగానికి
ప్రేమ బానిస
ఆత్మీయతకి
---
మనసు
మౌనగీతం
జత కుదిరితే
యుగళగీతం
---
దొరికిన
వాసంతం
చిగిర్చిన
మధుమాసం
---
భావం
మధురం
సరసం
శృంగారం
---
ప్రేమలేని
జీవితం
తప్పని
ఒంటరితనం
---
కలవని
మనసులు
దంపతులూ
శత్రువులు
---
అర్థం చేసుకునే
మనసు లేకుంటే
చెలమ కూడా
ఉప్పుకయ్యే
---
మనసును
రమించేందుకు
కావాలి
మరో మనసు
---
తనువు సెగ
చల్లారకపోదు
మనసు వగ
చల్లారిపోదు
---
ఆరని జ్వాలలు
రేపును
వెన్నెల రాత్రులు
మరింత
---
రాత్రిపగలు
తేడాలేదు
సుఖదు:ఖాలు
అంతంకావు
---
సుఖాల తీరం
ప్రశాంత జలపాతం
వగల సెగలు
కడలితరంగం
---
యాంత్రిక పిలుపు
తాత్కాలిక మలుపు
చిక్కటి మనసు
మిక్కిలి వలపు
---
జీవితం
వాస్తవం
కాదు సంక్లిష్టం
గమ్యం
---
గతం
గతుకులు
భవిష్యత్ కు
పునాదులు
---
ఆశలు
కన్నీటి ప్రవాహాలు
ఆశయాలు
వెన్నెల దివిటీలు
---
మునిగిపోయే నావ
చేరకపోదు
ఏదోక తీరం
గుర్తించు చాలు
---
ఆశయానికి
లేదు ఓటమి
ఆలస్యమైనా
వేచిచూడాలి
---
ముక్కలైన మనసు
సప్తవర్ణ చాపం
వెలిగించు
వెన్నెల దీపం
---
ఏదోక దశలో
జీవితం
అనుభవిస్తుంది
ఒంటరితనం
---
కలలు
చేరువచేస్తాయి
కోరుకున్న
తలపులను
---
నిట్టూర్పులే
జీవితమని
కూర్చోకు
మౌనివై
---
కలలు కను
రేయింబవలు
సాకారం చేసుకో
పిడికిలి బిగించు
---
రాధతో
ప్రణయం
బృందావన
విహారం
---
బృందావనిలో
కృష్ణపక్షం
చెలివడిలో
వాత్సాయనం
---
సవతిపోరు
అష్టభామలకే
రాధ దెపుడూ
ప్రథమస్థానమే
---
కదిలే కురులు
జవరాలి ఎదపై
నర్తించే నా
కరములు
---
మాయమాటలకు
ఆడ మగ
తేడాలేదు
హృదయముండాలి తప్ప
---
అవరోధాలు
తాత్కాలికం
లక్ష్యమే
శాశ్వతం
---
హృదయం
మాయ కావొచ్చు
ప్రేమ
మాయ కాదు
---
చూసినప్పుడు
దూకాలనిపించక మానదు
దూకితేనే కదా
ఏముందో తెలుసేది
---
ప్రేమ
మధురం
దక్కినా
దక్కకపోయినా
---
ఆత్మ
భ్రమ
ఆమె
వాస్తవం
---
విశ్వం
రమణీయం
జీవితం
రంగులమయం
---
స్వర్గం నరకం
అభూతకల్పన
త్రిశంకుస్వర్గానికి
తావెక్కడ
---
కష్టం
సుఖం
ప్రతిబింబం
వాస్తవం
---
ఆశయం
ఆచరణం
స్వప్నం
కార్యాచరణం
---
బోషణంలో అయినా
కడలిగర్భంలో అయినా
దొరికేవి
ఆణిముత్యాలే
---
జుంటితేనెల
తియ్యందనం
తాగేకొద్దీ
కమ్మందనం
---
ఎదురుచూశా
చకోరములా
ఎదురైంది
వసంతకోకిల
---

నానీలు రాయడానికి ప్రయత్నించా...
లోపాలను తెలియజేస్తే మరింత సంతోషం
- రాజాబాబు కంచర్ల
20-04-2017

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్