నీతో చెప్పాలనుకున్నాను
విరజాజుల పరిమళాల గురించి...
ఆ పొదరింటి వద్ద నిలుచుండిపోయాను
ఆ పరిమళం ఎంత మధురంగా వుందనీ...
అప్పుడప్పుడే కురుస్తోన్న వెన్నెలతో
జత కలిసిన వన్నెల పరిమళం
మరింత మత్తెక్కిస్తుంటే...
అప్పుడు దూసుకొచ్చింది రివ్వున
కిలకిలమంటూ నా ఎన్నెలపిట్ట...
ఏ గోదారి అలలు తాకిందో ఏమో
వెన్నెల పరిమళాన్ని తనువంతా అద్దుతూ...
- రాజాబాబు కంచర్ల
29-09-2017
విరజాజుల పరిమళాల గురించి...
ఆ పొదరింటి వద్ద నిలుచుండిపోయాను
ఆ పరిమళం ఎంత మధురంగా వుందనీ...
అప్పుడప్పుడే కురుస్తోన్న వెన్నెలతో
జత కలిసిన వన్నెల పరిమళం
మరింత మత్తెక్కిస్తుంటే...
అప్పుడు దూసుకొచ్చింది రివ్వున
కిలకిలమంటూ నా ఎన్నెలపిట్ట...
ఏ గోదారి అలలు తాకిందో ఏమో
వెన్నెల పరిమళాన్ని తనువంతా అద్దుతూ...
- రాజాబాబు కంచర్ల
29-09-2017
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి