ప్రేమ పూదోటలో
మనం పంచుకున్న అనుభూతులు
పరిమళాలు వెదజల్లే సంపంగెల్లా
ఇంకా ఆ తోటలో
కదలాడుతునే వున్నాయి
ఆ చెట్టు కొమ్మల్లోంచి
కురిసిన వెన్నెల
ఇంకా బొట్లుబొట్లుగా
రాలుతూనే వుంది
ఆ పూల పరిమళాలతో కలగలిపి
రాలిన వెన్నెల బిందువులన్నీ
నా గుండెల్లో పట్టితెచ్చాను
సూర్యుడికి భూమిపై ఉన్నంత ప్రేముంది
నీపై నాకు
రాత్రి అస్తమించిన సూరీడు
పొద్దునే ప్రభాత కాంతులతో
మళ్లీ ఉదయిస్తాడు
ధరణిని పరవశింపజేస్తాడు
అచ్చంగా నేనూ అంతే...
రాత్రి అస్తమించినా...
పొద్దున్నే ఉదయిస్తాను
మళ్లీ మళ్లీ ఉదయిస్తూనే వుంటాను
- రాజాబాబు కంచర్ల
10-11-2017
మనం పంచుకున్న అనుభూతులు
పరిమళాలు వెదజల్లే సంపంగెల్లా
ఇంకా ఆ తోటలో
కదలాడుతునే వున్నాయి
ఆ చెట్టు కొమ్మల్లోంచి
కురిసిన వెన్నెల
ఇంకా బొట్లుబొట్లుగా
రాలుతూనే వుంది
ఆ పూల పరిమళాలతో కలగలిపి
రాలిన వెన్నెల బిందువులన్నీ
నా గుండెల్లో పట్టితెచ్చాను
సూర్యుడికి భూమిపై ఉన్నంత ప్రేముంది
నీపై నాకు
రాత్రి అస్తమించిన సూరీడు
పొద్దునే ప్రభాత కాంతులతో
మళ్లీ ఉదయిస్తాడు
ధరణిని పరవశింపజేస్తాడు
అచ్చంగా నేనూ అంతే...
రాత్రి అస్తమించినా...
పొద్దున్నే ఉదయిస్తాను
మళ్లీ మళ్లీ ఉదయిస్తూనే వుంటాను
- రాజాబాబు కంచర్ల
10-11-2017
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి