ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తాను..!

తాను...
ప్రవహించే సెలయేరు
ఎగసిపడే జలపాతం
వర్షించే శ్రావణమేఘం
నవీన జాగృతిలోంచి
పుట్టుకొచ్చిన రసవిస్ఫోటనం

తాను...
ఎప్పుడు ఆవహించిందో తెలియదు
నాకు తెలియకుండానే
నాలోకి తనను వంపేసుకుంది
ఒక సెలయేరులా
ఒక జలపాతంలా
ఒక శ్రావణమేఘంలా
నిలువెల్లా నింపేసింది
గోదావరి వేదంలా
కృష్ణవేణి తరంగంలా
ప్రేమ రుతువు
ఆలపించే అమరనాదంలా
హృదయ తంత్రుల్ని మీటుతోంది

తాను...
తన పాదముద్రలను
తన కనుల నక్షత్ర కాంతులను
వసంతకాలపు యామినిలో
హేమంతపు కౌముదిలో
మళ్లీ మళ్లీ
అద్దుతూనే వుంది
నిలువెల్లా ఆవహిస్తూనే వుంది

- రాజాబాబు కంచర్ల
29-03-2018

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్