నా విరులతోటను నీవెప్పుడైనా చూశావా
ఆ తోటంతా రకరకాల పూల పరిమళంతో
రకరకాల పక్షుల రెక్కల శబ్దాలతో
రమణీయంగా ఆహ్వానిస్తోంది...
మలయమారుతాలను చీల్చుకొని
గోదారి అలలను దాటుకొని
అడ్డొచ్చే మేఘాలను తప్పుకొని
ఎప్పుడొస్తావో కదా...
వేకువనే పక్షుల కిలకిలరావాలతో మేల్కొని చూస్తే...
వేపచెట్టు మీది గూటిలో కాకి కావుకా అంది
మామిడి కొమ్మ మీది కోయిల కుహుకుహు అంది
అయినా నీ జాడే కనబడలేదు...
ప్రభాత కిరణాలకు ఆకులు తళతళ లాడుతున్నాయి
పిల్ల గాలులకు పువ్వులు తలలాడిస్తున్నాయి
గాలితెర వీచినప్పుడల్లా పూలు రాలిపడుతున్నాయి
నీకు స్వాగతం చెప్పడానికా అన్నట్టు...
అప్పుడొచ్చింది ఎన్నెలపిట్ట
మంచుతెరలను చీల్చుకొని ఉదయించే సూర్యునిలా
కిలకిలమని వయ్యారాలు ఒలికిస్తూ...
గరికపువ్వుని చేరింది..గుసగుసలు చెప్పింది
- రాజాబాబు కంచర్ల
07-10-2017
ఆ తోటంతా రకరకాల పూల పరిమళంతో
రకరకాల పక్షుల రెక్కల శబ్దాలతో
రమణీయంగా ఆహ్వానిస్తోంది...
మలయమారుతాలను చీల్చుకొని
గోదారి అలలను దాటుకొని
అడ్డొచ్చే మేఘాలను తప్పుకొని
ఎప్పుడొస్తావో కదా...
వేకువనే పక్షుల కిలకిలరావాలతో మేల్కొని చూస్తే...
వేపచెట్టు మీది గూటిలో కాకి కావుకా అంది
మామిడి కొమ్మ మీది కోయిల కుహుకుహు అంది
అయినా నీ జాడే కనబడలేదు...
ప్రభాత కిరణాలకు ఆకులు తళతళ లాడుతున్నాయి
పిల్ల గాలులకు పువ్వులు తలలాడిస్తున్నాయి
గాలితెర వీచినప్పుడల్లా పూలు రాలిపడుతున్నాయి
నీకు స్వాగతం చెప్పడానికా అన్నట్టు...
అప్పుడొచ్చింది ఎన్నెలపిట్ట
మంచుతెరలను చీల్చుకొని ఉదయించే సూర్యునిలా
కిలకిలమని వయ్యారాలు ఒలికిస్తూ...
గరికపువ్వుని చేరింది..గుసగుసలు చెప్పింది
- రాజాబాబు కంచర్ల
07-10-2017
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి