ఇక్కడ వసంతం లేదు
భరించరాని గ్రీష్మ పవనాలు తప్ప
ఇక్కడ ప్రభాతోదయాలు లేవు
భరించరాని నిశీధి నిస్పృహలు తప్ప
ఇక్కడ పున్నమి వెలుగులు లేవు వెన్నెల కాంతులూ లేవు
భరించరాని అంధకారము తప్ప
ఇక్కడ ఉగాదులులేవు మత్తకోయిలలు లేవు
భరించరాని ఒంటరితనం తప్ప
వసంతాలు పుష్పించాలంటే
సరికొత్త ఉదయాలు వెలగాలంటే
పున్నములు పరిమళించాలంటే
నా కనులెదుట నీవుండాలి
నా గుండెల నిండిపోవాలి
నాలో నిలువెల్లా ఒలికిపోవాలి
తప్పదు...
- రాజాబాబు కంచర్ల
21-06-2018
భరించరాని గ్రీష్మ పవనాలు తప్ప
ఇక్కడ ప్రభాతోదయాలు లేవు
భరించరాని నిశీధి నిస్పృహలు తప్ప
ఇక్కడ పున్నమి వెలుగులు లేవు వెన్నెల కాంతులూ లేవు
భరించరాని అంధకారము తప్ప
ఇక్కడ ఉగాదులులేవు మత్తకోయిలలు లేవు
భరించరాని ఒంటరితనం తప్ప
వసంతాలు పుష్పించాలంటే
సరికొత్త ఉదయాలు వెలగాలంటే
పున్నములు పరిమళించాలంటే
నా కనులెదుట నీవుండాలి
నా గుండెల నిండిపోవాలి
నాలో నిలువెల్లా ఒలికిపోవాలి
తప్పదు...
- రాజాబాబు కంచర్ల
21-06-2018
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి