ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నేనే నువ్వని

నువ్వెవరో తెలియనప్పుడు
నేనో మామూలు వ్యక్తిని
ఎగిరే పక్షుల
రెక్కల రెపరెపలలోని సంగీతం
గోదారి గలగలల విన్యాసం
చిరుగాలికి కదలాడే
విరుల పరిమళ వికాసం
ఇంత అందంగా వుంటాయని
తెలియదు నాకప్పుడు



కానీ...
నువ్వు పరిచయమయ్యాకే తెలిసింది
ఎగిరే పక్షుల రెక్కల చప్పుడులోనూ
ఓ సంగీతం వుందని
గోదారి అలల గలగలలోనూ
ఓ లయ వుందని
చిరుగాలికి కదలాడే
విరులకూ ఓ  భాష వుందని

అవును...
నీ పరిచయమే నేర్పింది
ప్రకృతిని ఆస్వాదించడం

అవును..
ఆ ఆస్వాదనలోని
సంతోషం నువ్వని

అసలు...
నా సంతోషమే నువ్వని
చిరవకు నేనే నువ్వని

- రాజాబాబు కంచర్ల
18-06-2018

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్