ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నను చుట్టేయ్యి

ప్రియతమా..
నీ కోమల చరణములను
నా కరములతో స్పృశించనీ..
నా అదరాల స్పర్శను
నీ చరణాల కద్దనీ...

నా స్వప్న సౌధాలను దాటుకొని
నా ఊహల శిఖరాలను అధిరోహించి
సౌందర్య తీరాలను నను చేరుకోనీ
అమరత్వాన్ని సిద్ధించుకోనీ...

చీకటి ప్రవాహాల వేడుకోళ్లను దాటి
నిశీధి తెరలను తొలగించుకొని
నీ ముందర నిల్చున్నా సరికొత్త వేకువనై
తుఫాను వేగంతో నను చుట్టేయ్యి

- రాజాబాబు కంచర్ల
21-01-2018

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్