అక్కడ వెతికేను
కాసిన్ని పాదముద్రల కోసం
మరి కాసిన్ని చిరునవ్వుల కోసం
అది...
తన పాదముద్రలను
పారాణిగా పులుముకున్న నేల కదా
అది...
తన చిరునగవులను చెక్కిళ్లనద్దుకున్న గాలి కదా
అందుకే...
అక్కడ నాలుగడుగులు వేసి
ఆ నేలను, ఆ గాలిని స్పృశించాను
తడిమి తడిమి చూశాను
అప్పుడు కనిపించాయి...
సుపరిచితమైన పాదముద్రలు
అప్పుడు స్పృశించాయి...
నను మత్తెక్కించే చిరునవ్వుల కిలకిలలు
మైమరిచానో క్షణం
మమతలన్నీ మూటగట్టుకుని
జ్ఞాపకాలను పదిలపర్చుకుని
ముందుకు సాగిపోయా...
పెనవేసుకున్న మమతలను పండించుకోవాలనీ...
- రాజాబాబు కంచర్ల
26-01-2018
కాసిన్ని పాదముద్రల కోసం
మరి కాసిన్ని చిరునవ్వుల కోసం
అది...
తన పాదముద్రలను
పారాణిగా పులుముకున్న నేల కదా
అది...
తన చిరునగవులను చెక్కిళ్లనద్దుకున్న గాలి కదా
అందుకే...
అక్కడ నాలుగడుగులు వేసి
ఆ నేలను, ఆ గాలిని స్పృశించాను
తడిమి తడిమి చూశాను
అప్పుడు కనిపించాయి...
సుపరిచితమైన పాదముద్రలు
అప్పుడు స్పృశించాయి...
నను మత్తెక్కించే చిరునవ్వుల కిలకిలలు
మైమరిచానో క్షణం
మమతలన్నీ మూటగట్టుకుని
జ్ఞాపకాలను పదిలపర్చుకుని
ముందుకు సాగిపోయా...
పెనవేసుకున్న మమతలను పండించుకోవాలనీ...
- రాజాబాబు కంచర్ల
26-01-2018
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి