ఆకాశం మేఘావృతం
గుంపులు గుంపులుగా మేఘాల పయనం
గాలి తెరలతో ఆటలాడుకుంటున్నట్టుగా...
జరజర రాలుతున్న నీటి తుంపరలు
గాలి తెరలను దాటుకొని
అక్కున చేరుతున్నాయి పరవశంగా...
మెలమెల్లగా కమ్ముతున్న చీకట్లు
మబ్బుల చాటునుంచి తొంగిచూశాడు తారాపతి
నెమ్మదిగా విచ్చకునె వెన్నెల జిలుగులు
రివ్వున దూసుకొచ్చిందో పవన వీచిక
వెన్నెల మధువును వెంటతెచ్చింది
వచ్చింది ఎన్నెలపిట్ట..
అధరాలకందించె కిలకిలమంటూ...
- రాజాబాబు కంచర్ల
27-09-2017
గుంపులు గుంపులుగా మేఘాల పయనం
గాలి తెరలతో ఆటలాడుకుంటున్నట్టుగా...
జరజర రాలుతున్న నీటి తుంపరలు
గాలి తెరలను దాటుకొని
అక్కున చేరుతున్నాయి పరవశంగా...
మెలమెల్లగా కమ్ముతున్న చీకట్లు
మబ్బుల చాటునుంచి తొంగిచూశాడు తారాపతి
నెమ్మదిగా విచ్చకునె వెన్నెల జిలుగులు
రివ్వున దూసుకొచ్చిందో పవన వీచిక
వెన్నెల మధువును వెంటతెచ్చింది
వచ్చింది ఎన్నెలపిట్ట..
అధరాలకందించె కిలకిలమంటూ...
- రాజాబాబు కంచర్ల
27-09-2017
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి