ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

స్వరం మారిన స్వతంత్రం

నాడు...
ఏ ఆశయంతో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నామో
ఏ ఆశయంతో దేశమంతా ఒక్కటిగా నిలిచిందో
నేడు...
ఆ ఆశయం ఆవిరైపోతున్నది
నల్లదొరల దోపిడీ కబంధ హస్తాల్లో దేశం తల్లడిల్లిపోతోంది
అవినీతి నిరుద్యోగం విచ్చలవిడిగా పెరిగిపోతోంది
ఒకవైపు మద్యం ఏరులై పారుతుంటే...
తాగునీరు సాగునీరు కోసం జనం గొంతులు పగులుతున్నాయి
అభివృద్ధి పేరుతో పచ్చని పంటభూములు బీళ్లుగా మారుతున్నాయి
పేదరికాన్ని రూపుమాపుతామంటూ

పేదలు బతకలేని స్థితిని కల్పిస్తున్నారు
వందలకొద్ది వాగ్దానాలు చేస్తూ
పబ్బం గడుపుకునే నైశ్చానికి పాల్పడుతున్నారు
ఆసుపత్రుల్లో మందులు లేక చిన్నపిల్లలు చచ్చిపోతుంటే
గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే
పట్టపగలే తిరగలేని దుస్థితిలో భారతనారి బిక్కుబిక్కుమంటుంటే
ఉద్యోగాలులేక యువతరం ఉగ్రవాదులుగా మారుతుంటే
పెరిగే ధరలు... కరువు కాటకాలతో ప్రజలు విలవిల్లాడుతుంటే
కూడులేక గూడులేక గుడిసెల్లో కాలం వెల్లదీస్తుంటే
రగులుతున్న కుల మతాల కుంపటిలో
ఊగుతున్న మతోన్మాద మత్తులో ప్రజలు చిత్తవుతుంటే
భారత్ వెలిగిపోతోందంటూ... కోట్లరూపాయలు ఖర్చుబెట్టి
సంబరాలు జరుపుకుంటున్న నాయకులను జూసి దేశం విస్తుబోతోంది
ఇది రగులుతున్న భారతదేశం...
స్వరం మారిన వందేమాతర గీతం...
వరస తప్పిన స్వతంత్ర భారతం...
కార్పొరేట్ల గానం చేస్తోన్న సామ్రాజవాద స్తోత్రగీతం...
70 ఏళ్ల స్వాతంత్ర్యమా వర్థిల్లు..!

- రాజాబాబు కంచర్ల
15-08-2017

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్