ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మనమిద్దరం అయినా...

మనం సంచరించిన
చోటులన్నీ కలిపితే
ఓ బృందావనమవుతుంది

మనం చెప్పుకున్న ఊసులన్నీ
ఒకచోట చేర్చితే
ఓ కావ్యమవుతుంది

మనం మోస్తున్న
కలలన్నీ కలిపితే
ఓ పంచవర్ణ చిత్రమవుతుంది

మనం వేసిన
అడుగులన్నీ కలిపితే
ఓ ప్రగతిపథం అవుతుంది

మనమిద్దరం అయినా
మనలోకి తొంగిచూసుకుంటే
కనిపించేది ఒక్కరే
నాకు నువ్వు- నీకు నేను

- రాజాబాబు కంచర్ల
17-01-2018

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్