ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హరితహారం

హరితహారం ప్రకృతినుదుట సిందూరం
వర్షం పచ్చదనానికి జీవాధారం
వర్షాలులేని ప్రకృతికి పెరుగును అసహనం
దెబ్బతినక తప్పదు జీవవైవిధ్యం

జనులకు తరువులే వరములు
జగతి ప్రగతికి ఆధారములు
పర్యావరణానికి ప్రధమములు
భవిష్యత్తరాలకు ప్రగతిపథములు



అడవులను చెరబట్టినాడు
వనాలను పడగొట్టినాడు
ఆకాశ హర్య్యాలను నిలబెట్టినాడు
పర్యావరణాన్ని ఫణంగాపెట్టినాడు

తరువుల స్పర్శ కనని పుడమి
పచ్చదనానికి నోచని ప్రకృతి
ప్లాస్టిక్ జీవాని కలవాటుపడిన మనిషి
ప్లాస్టిక్ మాయలో  మందగించెను బుద్ధి

నేటి సమాజానికి ప్రపపంచీకరణం
పర్యావరణ వినాశనం
జీవవైవిధ్యానికి విఘాతం
హరితహారానికి ప్రమాదం

మేలుకోరా మనుజుడా
రుతువులు గతి తప్పకుండా కాచుకో
కాలుష్యం నుంచి నిన్నునువ్వు కాపాడుకో
ప్రకృతితో మమేకమై జీవించు
హరితహారాన్ని మెడన ధరించు

- రాజాబాబు కంచర్ల
15-07-2017

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్