ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాలుతున్న కుసుమాలు

రాలుతున్న
కుసుమాలు
దిగజారుతున్న
విద్యాప్రమాణాలు
---

పిల్లలకు
విద్య విజ్ఞానం
వ్యాపారులకు
విద్య ధనం
---

18 గంటల చదువు
18 గంటల సిఎం పని
ఒకరికి ఉరి
ఒకరికి సరి
---

అధికారులపై
హుకుం
కార్పొరేట్ కాలేజీలపై
మౌనం
---

విద్యా
వ్యాపారులు
ప్రభుత్వానికి
ఆర్థిక వనరులు
---

చర్యలంటూ
ఆగ్రహాలు
తెరచాటున
మంతనాలు
---

భుజానికి
పుస్తకాల బ్యాగు
మెడకు
ఉరితాడు
---

ఈ చదువులు
మాకొద్దు
క్లాసురూములో
ఖైదీలం కాదు
---

విజ్ఞాన దీపం
వెలిగిద్దాం
పసి ప్రాణాలను
కాపాడుదాం
---

తల్లిదండ్రులారా
ఆలోచించండి
‘కార్పొరేట్’వలలో
పడకండి
---

- రాజాబాబు కంచర్ల
17-10-2017










కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్