మల్లెలోని తెల్లదనం
తన మనసులోనే చూశానని
ఆ మనుసులోని మంచితనం
తన కనులలోనే చూశానని
అనురాగానికి అవధులు
తనలోనే చూశానని
చెప్పవే చిరుగాలి...
నాజూకు నాసికపై
జాబిలి చంద్రిక నేనై మెరవాలని
ఎదపై హొయలొలికించే
కంఠహారం నేనై పరవశించాలని
పసిడి వర్ణ చరణాలపై
పుట్టుమచ్చ నేనై మురవాలని
చెప్పవే చిరుగాలి...
నా చెలియతో..
- రాజాబాబు కంచర్ల
24-04-2018
తన మనసులోనే చూశానని
ఆ మనుసులోని మంచితనం
తన కనులలోనే చూశానని
అనురాగానికి అవధులు
తనలోనే చూశానని
చెప్పవే చిరుగాలి...
నాజూకు నాసికపై
జాబిలి చంద్రిక నేనై మెరవాలని
ఎదపై హొయలొలికించే
కంఠహారం నేనై పరవశించాలని
పసిడి వర్ణ చరణాలపై
పుట్టుమచ్చ నేనై మురవాలని
చెప్పవే చిరుగాలి...
నా చెలియతో..
- రాజాబాబు కంచర్ల
24-04-2018
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి