చిగురించిన దీపంలా
నీ పెదాలపై చిరునవ్వు
సన్నజాజుల పరిమళంలా
సౌరభాలు వెదజల్లు
ఉషోదయ కిరణంలా
నీ కనులలో వెలుగులు
నిండు పున్నమిలా
వెన్నెల సుధలు కురిపించు
తొలకరి పలకరింపులా
చెక్కిలిపై నునుసిగ్గులు
ఎర్ర మందారాలు
విరగ బూసినట్లు
మధుర వీణా నాదంలా
మైమరపించే పలుకులు
వసంతం అల్లుకున్నట్లుగా
నీ గాఢ పరిష్వంగం
- రాజాబాబు కంచర్ల
22-03-2018
నీ పెదాలపై చిరునవ్వు
సన్నజాజుల పరిమళంలా
సౌరభాలు వెదజల్లు
ఉషోదయ కిరణంలా
నీ కనులలో వెలుగులు
నిండు పున్నమిలా
వెన్నెల సుధలు కురిపించు
తొలకరి పలకరింపులా
చెక్కిలిపై నునుసిగ్గులు
ఎర్ర మందారాలు
విరగ బూసినట్లు
మధుర వీణా నాదంలా
మైమరపించే పలుకులు
వసంతం అల్లుకున్నట్లుగా
నీ గాఢ పరిష్వంగం
- రాజాబాబు కంచర్ల
22-03-2018
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి