ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రేమవృక్షం

వేళ్లు లోతుగా పాతుకుపోయిన
వటవృక్షానికి నీళ్లతో పనిలేదు
భూమిలోని నీటిఊటను పీల్చుకొని
పుష్పిస్తూ, ఫలిస్తూంటుంది
నిజమైన ప్రేమ కూడా అంతే...
ఎంత దూరాన వున్నా
పదేపదే కలవకపోయినా
చివురులు వేస్తూంటుంది
పరిమళిస్తుంది
నవనాడుల్లో పారుతుంది
కాంతి నాదమౌతుంది
శాంతి ధామమౌతుంది
చిగురించి
పుష్పించి
పరిమళించి
ఫలించి
వటవృక్షమంత విశాలంగా
విస్తరిస్తుందీ ప్రేమవృక్షం...

- రాజాబాబు కంచర్ల
02-08-2018

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్