ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నీ తలపులు

నీ తలపులు మదిలో
చెలమలుగా ప్రవహిస్తుంటే
క్షణాలు నిమిషాలుగా
నిమిషాలు దినాలుగా
గడిచిపోతుంటే...
మదిలోని నీ రూపం
హృదయమంతా అల్లుకుంటుంటే
నీవెంత దూరంలో వున్నా
నీతో కలిసి నడుస్తూనే వుంటా...
నీ స్థానం ఎప్పటికీ పదిలం
నీవిచ్చే స్ఫూర్తి నా నడకకు ఆలంబనం
చివరి శ్వాస వరకూ...
నీ ఆరాధనలో మునగనీ
నీ కనుదోయి కనుపాపల్లే
ప్రేమసుమాలు విరియనీ...
విరహమైనా..ప్రణయమైనా
చెదరని నీ ప్రేమ సాక్షిగా
నిలువనీ తుదివరకూ....

- రాజాబాబు కంచర్ల
18-07-2018

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్