ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఏమిటీ అన్యాయం..?

ఏమిటీ అన్యాయం..?
ఎందుకీ కర్కశత్వం..?
మధ్యాహ్న భోజన పథకాన్ని
ప్రైవేటు సంస్థలకివ్వొద్దంటే...
వేలాది కార్మికులు రోడ్డున పడితే...
మహిళలన్న ఇంగితం లేకుండా
జుట్టుపట్టి లాగడం..
కాళ్లు పట్టి ఈడ్చడం...
మానవత్వం మరిచారా?
పశువుల్లా వ్యవహరిస్తారా?
ఏ విలువలకీ ప్రస్థానం..
ఎవరి అభివృద్ధిని కాంక్షించి ఈ జులుం..
మీ విదేశీ టూర్ల కయినంత ఖర్చు కూడా వుండదేమో
మీ దీక్షల పబ్లిసిటీ కయినంత ఖర్చు కూడా వుండదేమో
మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ...
వినాశకాలే విపరీత బుద్ధి అని...
వినాశకాలం దాపురించినప్పుడు
ఇలాంటి బుద్ధులే పుడతాయి...
గతాన్ని తల్చుకోండొకసారి
ఈసారి శాశ్వత బహిష్కరణ తప్పదు
ఇది కడుపు మండిన కార్మిక, కర్షకుల ప్రతిన.

- రాజాబాబు కంచర్ల
31-07-2018

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్