ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అరుణారుణం

ఓ అరుణారుణమా
నువు బయల్దేరుతునే
వసంతాన్ని కొనితెచ్చావు
గ్రీష్మంలో అల్లాడుతున్న జనానికి
చిరు ఆశను కల్పించావు

నవ్యాంధ్ర కరుణిమను పులమడానికి
పిల్లతెమ్మెరలను తోడ్కొని
సప్తవర్ణాలను రంగరించుకొని
నలు దిక్కులను కలుపుకొని
శరవేగంగా కదిలొస్తున్నావు

ఏవైనా మబ్బు తెరలు అడ్డొస్తే
ఏవైనా గండు తుమ్మెదలు నిలువరిస్తే
ఏమాత్రం అదరకు బెదరకు
ఏమైనా నీ అడుగులాపకు

నీవెంట నడుస్తున్నాయెన్నో
అరుణకిశోరములు
నీకోసం ఎదురు చూస్తున్నాయి మరెన్నో
అరుణకిరణములు
నవ్యాంధ్ర సీమల్లో
ఎర్రమందారాలు పూయించడానికి

ఓ అరుణారుణమా...
నిండా కమ్మిన
గ్రీష్మపు వాడగాడ్పులకు
ప్రాణాల నెదురొడ్డి
నువు కొనివచ్చే వసంతం కోసం
నిరీక్షిస్తోంది నవ్యాంధ్రము

- రాజాబాబు కంచర్ల
02-09-2018

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్