అది వెలుతురు పిట్ట
పండు వెన్నెల్లో పరవశించి ఆడే ఎన్నెలపిట్ట
ఆనందం కట్టలు తెంచుకున్నప్పుడు
మమకారం వెల్లువల పొంగినప్పుడు
వసంతంలో కోయిలల కిలకిల రావాలు రువ్వుతూ
రాగాల సన్నాయి అవుతుంది
ప్రేమ వరదలా పొంగినప్పుడు
భావాలు కట్టలు తెంచుకొని ఎగసినప్పుడు
హేమంతంలో పక్షిల ముడుచుకుపోతూ
తుపానుకు ముందు సంద్రంలా గంభీరం అవుతుంది
ఆ కళ్లు అయస్కాంత క్షేత్రాలు
ఆ నవ్వులు మొగలిపువ్వులు
అంబరమంత ప్రేమను
అర్ణవమంత మమతను
మదిలోనే అణచిపెడుతూ
ప్రశాంత గోదారిలా ప్రవహిస్తుంది..
చౌరాసియా వేణుగానంలా తనలో లీనం చేసుకుంటుంది
విరజిమ్మే వెన్నెల వెలుగుల్లో
ఎన్నెలపిట్ట ప్రేమగీతమౌతుంది
మత్తెక్కించే మల్లెచెండు అవుతుంది
మెడఒంపు మొగలిపువ్వవుతుంది
మల్లెతీగలా అల్లుకుంటుంది
మన్మథ శరసంధానం గావిస్తుంది
విప్పార్చుకున్న రెక్కల మధ్యన
విత్తును చీల్చుకొనివచ్చే మొలకలా
తనువంతా చుట్టుకొని ఒదిగిపోతూ
బరువంతా తానై కరిగిపోతూ
బతుకంతా తానై నిలిచిపోతూ
జీవితాన్ని పండిస్తుంది వెలుగుల పంటై...
- రాజాబాబు కంచర్ల
14-08-18
పండు వెన్నెల్లో పరవశించి ఆడే ఎన్నెలపిట్ట
ఆనందం కట్టలు తెంచుకున్నప్పుడు
మమకారం వెల్లువల పొంగినప్పుడు
వసంతంలో కోయిలల కిలకిల రావాలు రువ్వుతూ
రాగాల సన్నాయి అవుతుంది
ప్రేమ వరదలా పొంగినప్పుడు
భావాలు కట్టలు తెంచుకొని ఎగసినప్పుడు
హేమంతంలో పక్షిల ముడుచుకుపోతూ
తుపానుకు ముందు సంద్రంలా గంభీరం అవుతుంది
ఆ కళ్లు అయస్కాంత క్షేత్రాలు
ఆ నవ్వులు మొగలిపువ్వులు
అంబరమంత ప్రేమను
అర్ణవమంత మమతను
మదిలోనే అణచిపెడుతూ
ప్రశాంత గోదారిలా ప్రవహిస్తుంది..
చౌరాసియా వేణుగానంలా తనలో లీనం చేసుకుంటుంది
విరజిమ్మే వెన్నెల వెలుగుల్లో
ఎన్నెలపిట్ట ప్రేమగీతమౌతుంది
మత్తెక్కించే మల్లెచెండు అవుతుంది
మెడఒంపు మొగలిపువ్వవుతుంది
మల్లెతీగలా అల్లుకుంటుంది
మన్మథ శరసంధానం గావిస్తుంది
విప్పార్చుకున్న రెక్కల మధ్యన
విత్తును చీల్చుకొనివచ్చే మొలకలా
తనువంతా చుట్టుకొని ఒదిగిపోతూ
బరువంతా తానై కరిగిపోతూ
బతుకంతా తానై నిలిచిపోతూ
జీవితాన్ని పండిస్తుంది వెలుగుల పంటై...
- రాజాబాబు కంచర్ల
14-08-18
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి