ఎవరిదా నవ్వు?
కిలకిలమని గిలిగింతలు పెడుతూ
ఇంత మత్తుగా
ఇంత నిర్మలంగా
ఇప్పుడే వసంతమొచ్చినట్టుగా
నవ్వుల వెలుగులు పంచుతున్న దీపికలా
నందన వన విహారి గోపికలా
ఎంత మధురంగా నవ్వుతోంది..!
ఎవరిదా నవ్వు?
వెన్నెలంత స్వచ్చంగా
మల్లెలంత మధురంగా
మత్తుగా
కొత్తగా
గమ్మత్తుగా
అమృతధారలు కురిపించే కిన్నెరలా
మయమరపించే మోహినిలా
హాయిని పంచే ఉదయనిలా
ఎంతో సమ్మోహనంగా నవ్వుతోంది..!
ఎవరిదా నవ్వు?
ఇంత రమ్యంగా
ఇంత రసాత్మకంగా
ఇంత సౌకుమార్యంగా
ఇంత ప్రభోదాత్మకంగా
నిశీధిని ఛేదించే తేజంలా
ఎంత సుమమనోహరంగా నవ్వుతోంది..!
అదీ...
వెన్నెలను తాగి
నవ్వుల అమృతధారలను ఒలికించే
ఎన్నెలపిట్ట కాదుకదా..!
- రాజాబాబు కంచర్ల
26-07-2018
కిలకిలమని గిలిగింతలు పెడుతూ
ఇంత మత్తుగా
ఇంత నిర్మలంగా
ఇప్పుడే వసంతమొచ్చినట్టుగా
నవ్వుల వెలుగులు పంచుతున్న దీపికలా
నందన వన విహారి గోపికలా
ఎంత మధురంగా నవ్వుతోంది..!
ఎవరిదా నవ్వు?
వెన్నెలంత స్వచ్చంగా
మల్లెలంత మధురంగా
మత్తుగా
కొత్తగా
గమ్మత్తుగా
అమృతధారలు కురిపించే కిన్నెరలా
మయమరపించే మోహినిలా
హాయిని పంచే ఉదయనిలా
ఎంతో సమ్మోహనంగా నవ్వుతోంది..!
ఎవరిదా నవ్వు?
ఇంత రమ్యంగా
ఇంత రసాత్మకంగా
ఇంత సౌకుమార్యంగా
ఇంత ప్రభోదాత్మకంగా
నిశీధిని ఛేదించే తేజంలా
ఎంత సుమమనోహరంగా నవ్వుతోంది..!
అదీ...
వెన్నెలను తాగి
నవ్వుల అమృతధారలను ఒలికించే
ఎన్నెలపిట్ట కాదుకదా..!
- రాజాబాబు కంచర్ల
26-07-2018
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి