ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హేమంతం

మూలం : నికొలాయ్ నెక్రొసొవ్
అనుకృతి : శ్రీశ్రీ

ఎవరావస్తున్నది చెట్లమీంచి గాలికాదు
మైదానంమీద దూకు సెలయేళ్లవి కావుకావు
తన మిహికా సామ్రాజ్యం తణిఖీ చేసేటందుకు
అదిగో హేమంతరాజు కోటవెడలి కదలినాడు
అడవిదార్లు మూసుకు పోయాయాలేదా? హిమాని
కడుశ్రద్ధగ తనపని చేస్తున్నదాలేదా, ఈ
ధరణీతలమంతా ఏయెగుడు దిగుడు లేకుండా
మంచుకప్పి ఉందా అని మరీమరీ చూస్తాడు
టేకుచెట్లు, తురాయీలు, ఓకు చెట్లు రంగవల్లి
సవరించాయా లేదా? సెలయేళ్లూ పెద్దనదులు
గడ్డకట్టి సమత్వాన్ని సాధించాయా లేదా?
వస్తున్నాడతడు వృక్షవాటిక లందూగులాడి!
మంచుమీద అతని పదధ్వనులు మీరు వినలేదా?
అతని తెల్లని గడ్డం అదిగో కనబడలేదా!

(‘సోవియట్ భూమి’ నుండి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్