ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సూక్తులు 01

సంతోషాలు వికసించిన సుమాలు... వాటి జ్ఞాపకాలు ఎన్నటికీ వాడిపోని సుమగంధాలు : డి బఫర్

మనం ఓటమికి సిద్ధంగా లేనంత వరకు మనల్ని ఓడించడం ఎవరి తరం కాదు - కిరణ్ బేడీ

ఇతరులను అర్థం చేసుకున్న వాడు జ్ఞాని, తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి : జైనులబ్దీన్

సహనం లేని వాడే పరమ దరిద్రుడు : షేక్స్ స్పియర్

ఏ మనిషినైనా అతని బుద్ధి నాశనం చేస్తుంది కానీ అతని శత్రువులు కాదు : బుద్ధుడు

విద్యార్థి విజ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్లాలి కాని, విజ్ఞానం విద్యార్థిని వెతుక్కుంటూ రాదు : చుక్కా రామయ్య

శ్రమ ఎదగడానికి ఉపయోగపడే మెట్లలాంటిదైతే, అదృష్టం లిఫ్ట్ లాంటిది. అయితే లిఫ్ట్ ఒక్కోసారి పనిచేయకపోవచ్చు.. కానీ మెట్లు శాశ్వతమైనవి : విక్టర్ బోర్గే

నువ్వు చేసిన పని గురించి కానీ, చేయబోయే పనుల గురించి కానీ ఎక్కడా మాట్లాడకు : థామస్ జెఫెర్సన్

మరచిన వెత చూపుతుంది
అరచేతిలోన స్వర్గం
మరపుల మతి తెరుస్తుంది
ఊహానూతన దుర్గం - బైరాగి

పరిపూర్ణంగా నేర్చుకున్న విజ్ఞానమెప్పుడూ మరపురాదు- పైథాగరస్

మరుపు అనేది ఎప్పుడొస్తుంది? ఎదుటివారి మీద లక్ష్యం లేనప్పుడు, ఎదుటివాడి మాట మీద గురిలేనప్పుడు - బీనాదేవి

‘ఒక ఆలోచనను నాటు- ఒక చర్యను కోసుకో, ఒక చర్యను నాటు- ఒక అలవాటును కోసుకో, ఒక అలవాటును నాటు- శీలాన్ని కోసుకో, శీలాన్ని నాటు- భవితవ్యాన్ని అందుకో’ అనేది సూక్తి.

మనిషి గెలిచినా, ఓడినా తన వల్లే. ఆలోచన అనే విల్లంబుతో, తనే తయారు చేసుకున్న ఆయుధాలతో తనని నాశనం చేసుకుంటాడు. తను తయారుచేసుకున్న పరికరాలతో ఆనందపు భవనాలు కడతాడు. శక్తిని, ప్రశాంతతని పెంచుకుంటాడు. సరియైన నిర్ణయం తీసుకుని, ఆలోచనని సవ్యంగా ఉపయోగిస్తే, మనిషి దైవత్వాన్ని పొందుతాడు. దాన్ని దుర్వినియోగం చేసి, తప్పుగా ఉపయోగిస్తే, పశువుకన్నా హీనంగా మారతాడు.’ 
                                                      - జేమ్స్ ఆలెన్, యాజ్ ఎమాన్ థింకెత్

సరియైన మానసిక దృక్పథం ఉన్న వ్యక్తికి తన లక్ష్యం సాధించకుండా ఏదీ ఆపలేదు. తప్పుడు మానసిక దృక్పథం ఉన్న మనిషికి భూమ్మీద ఏ శక్తీ సాయపడలేదు’ - డబ్ల్యు.డబ్ల్యు.జైజ్

కలుపు మొక్కలు తోటని, ఫలప్రదమైన ఫొలాలని తినేస్తాయని అందరికీ తెలుసు. అందుకని అటు తోటమాలి, ఇటు రైతు కలుపు మొక్కల్ని ఏరుతూనే వుండాలి. మన వ్యక్తిత్వం పెంచుకోవడానికి కూడా ఇదే మార్గం. మనకున్న లోపాలు, మన లక్షణాలు మనకి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలీదు. అందుకని వాటిని సరిదిద్ది ఆ కలుపు మొక్కలను మనమే ఏరిపారేయాలి. అప్పుడు మన ఎదుగుదల శక్తివంతంగా ఫలప్రదంగా సాగుతుంది.’ 
                 - జార్జి మాథ్యూ ఆడమ్స్

మనిషి మేలుకొంటే చీకటి రాజ్యంలో సూర్యుడవుతాడు
మనిషి తలచుకొంటే తన రాతను తిరిగి రాసుకొనే బ్రహ్మవుతాడు  - కరణం లుగేంద్ర పిళ్ళై 

సత్యసంధతకు మించిన ఔన్నత్యం ఈ ప్రపంచం మొత్తం మీద లేదు - డేవిడ్ స్టార్ జోర్డన్

మనం సృష్టించుకున్న సమస్యల్ని, 
అవి సృష్టించుకున్నప్పుడున్న స్థాయిలోనే ఇప్పుడు పరిష్కరించలేము’- ఆల్ బర్ట్ ఐన్ స్టీన్

మనం మళ్లీ మళ్లీ చేసేపనే మనం, ఔన్నత్యం అంటే ఒక చర్య కాదు, ఒక అలవాటు - అరిస్టాటిల్

‘చైతన్యవంతమైన కృషితో ఔన్యత్యానికి పాటుపడడం కన్న ప్రోత్సహించదగ్గ విషయం మరొకటి లేదు’ - హెన్రీ డేవిడ్ థొరో

పురుషులు రాసిన శాస్త్రాలు స్త్రీల పాలిట సంకెళ్లు - శరత్

వాళ్లను అణచివుంచి, వాళ్లచేత వెట్టి చాకిరీ చేయించుకోవటానికి పురుషులు ఆ పన్నాగం పన్నారు.
పాతివ్రత్యం పాటింపు ఒక్క స్త్రీలకేనా? పురుషులకు అవసరంలేదా? - శరత్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్