నా మధుర హృదయమా... ఒంటరిగా వున్నా నేను. ప్రత్యక్షంగా నీతో మాట్లాడలేకపోవడం, నిన్ను చూడలేకపోవడం బాధగా వుంది. మనసు నీతో మాట్లాడుతూనే వుంది. కానీ, ఎంతో ఇబ్బంది, ఏదో వెలితి నన్నావరిస్తోంది. నాలో నేనే సాగించే నా కలల ప్రయాణం నీకు తెలియదు కదా నాలో నేనే సాగించే నా స్వాప్నిక సంభాషణ నీకు వినిపించదు కదా ముద్దులిచ్చే నీ అధరాల స్పర్శ ప్రేమసోనలు కురిపించే నీ నయనాల జాబు నను చేరడంలేదు ఏదోక రోజున నా ముందు ప్రత్యక్షమవుతావు నీవు అప్పుడు సున్నితంగా స్పృశిస్తాను నీ నుదుట ముద్దులు కురిపిస్తాను గాఢంగా హత్తుకుంటాను నీముందు మోకరిల్లి నిను ప్రేమిస్తున్నానని రోదిస్తాను.. - నీ చిన్నా... 29-12-2019
‘‘నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే
మళ్ళీ నా కలం ఈ ప్రేమ రసైక జీవిని మేలుకొలిపింది.
ప్రతి ఆలోచనలోనూ కొత్తగా దర్శనమిచ్చి
ప్రతి దర్శనలోనూ కొత్త ఆలోచనని రేకెత్తిస్తున్నావు నీవు’’