ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నిరీక్షణ

ఎందుకలా కొంటెగా నవ్వుతావు నన్నుచూసి
చిన్నపిల్లాడిలా మారం చేస్తున్నాననా...
అవును.. నువ్వే నన్నలా తయారుచేశావు
ఇంతకుముందు నేనో యంత్రాన్ని
ఇప్పుడు స్పందించే గుణమున్న మనిషిని
నువ్వేగా నన్నిలా చేసావు
నువ్వేగా నన్నిలా మలిచావు
నా హృదయమంతా ఆక్రమించేశావు
నువ్వు తప్ప ఏమీ మిగల్చలేదు
ఎంత కోపాన్నయినా
ఎంత బాధనయినా
ఎంత ఉక్రోషాన్నయినా
క్షణాల్లో కరిగించేస్తావు
గలిగింతలు పెట్టే నీ నవ్వులతో
ప్రేమపూర్వకమైన నీ చూపులతో...
ఓయ్.. నా ప్రియమైన ఎంకి..
నీ స్పర్శ కోసం ఎంత తహతహలాడిపోతున్నానో
నీ కెట్లా తెలుస్తుంది...
నీ కౌగిలి కోసం ఎంత పరితపిస్తున్నానో
ఎలా చెప్పేది...
పుస్తకంలోని ఒక్కో పేజీని తిప్పినట్లుగా
నిన్ను ఒక్కో అణువూ స్పృశించి ముద్దాడాలంటే
సమయం కుదరడంలేదు కదా...
ఈ నిరీక్షణ ఇంత కఠినంగా వుంటుందని
ఈ విరహం ఇంత పరీక్షిస్తుందని
ఇపుడిపుడే అనుభవపూర్వకంగా తెలుస్తోంది
ఈ నిరీక్షణ
ఈ విరహము
నువు ఎదురుపడేంతవరకేలే...

- నీ చిన్నా...
09-12-2019

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్