‘అక్షరం చినుకై తాకగానే... కాగిన మట్టిపై తొలకరి జల్లుల పరిమళం’ వెదజల్లినటుల ‘వంద పుస్తకాల పఠనం... వేయి ఆలోచనల సంఘర్షణకు కారణం’ అయింది. ఫలితంగా కాస్తంతైనా అక్షర శుద్ధి అబ్బివుంటుందనే తృప్తి. 2016లో చదివిన పుస్తకాల సంఖ్య 116 అయింది. 2017లో ఆ ఒరవడి కాస్త పెరిగి 150 పుస్తకాలు చదివే వరకూ వచ్చింది. 2018లో మాత్రం గత రెండేళ్లకంటే తక్కువగా 105 పుస్తకాల వరకు చదవగలిగాను. కథా సంపుటములు, కవితా సంకలనాలు, ప్రముఖుల కథలు, సాహిత్య విమర్శలు, వ్యాసాలు వున్నాయి. ఇవే కాకుండా వివిధ పత్రికల ఆదివారం అనుబంధాల్లో వచ్చేవి, ఆన్ లైన్ మ్యాగజైన్స్ లోనివి కథలు, సాహిత్య వ్యాసాలు అదనంగా మరికొన్ని. నాలుగు కథలు, సుమారుగా 20 కవితలు రాయడం కొంత సంతృప్తినిచ్చే విషయం. 2017లో మాదిరిగానే 2018లోనూ వరుసగా రెండోసారి ‘కెనడా తెలుగుతల్లి’ మ్యాగజైన్ వారినుండి ‘మాతృద్రోహం’ అనే కథకు బహుమతి పొందడం ఆనందించే విషయమే. జంపాల చౌదరి గారిని చూసిన తర్వాతనే ఇలా రాయాలన్న కోర్కె కలిగింది. ఇలా మిత్రులతో పంచుకోవడం ద్వారా మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని పొందేందుకే తప్ప గొప్ప కోసం కాదు. ఆ మాటకొస్తే ఇదేం పెద్ద గొప్ప కూడా కాదు. ఈ ఏడాది కాలంలో నా సాహిత్య పఠనం, తద్వారా నేను పొందిన సంతృప్తిని మిత్రులతోనూ పంచుకోవాలనే తాపత్రయంతో మాత్రమే ఈ పోస్టు రాస్తున్నా. ఈ సంతోషం నా అధ్యయనాన్ని మరింత పెంచుకోడానికి, మెరుగుపర్చుకోడానికి ఉపయోగపడుతుందనే భావన మాత్రమే. నా పుస్తక పఠనానికి నా ఆత్మీయ నేస్తం ఇచ్చే స్ఫూర్తి, ప్రోత్సాహం ఎనలేనిది. అందుకే ఈ నూతన సంవత్సరాన ముందుగా తనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చదివిన ప్రతి పుస్తకానికీ సమీక్ష గానీ, వ్యాసంగానీ రాయాలనుకున్నప్పటికీ రాయలేకపోయాను. ఈ నూతన సంవత్సరంలో నా పుస్తక పఠనాన్ని మరికాస్త మెరుగు పర్చుకోడంతో పాటు ఆయా పుస్తకాలపై సమీక్షలు, సాహిత్య వ్యాసాలు రాయాలనే సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి. అందుకే... ఆశావహ దృక్పథంతో 2019 కి స్వాగతం పలుకుతున్నా...

***
మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...
***
2018లో చదివిన పుస్తకాలు
------------------------
01- ద్రౌపది (ఇతిహాసం నవల)- యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
02- చైతన్య దేహళి (20వ శతాబ్దపు తెలుగు కవితా సంపుటి)- సంకలనం: డాక్టర్ కల్లూరి శ్యామల
(వేంకట పార్వతీశకవులు, గురజాడ, రాయప్రోలు, విశ్వనాథ నుండి కల్లూరి శ్యామల వరకూ
63 ప్రముఖ కవులు రాసిన వంద కవితలు)
03- టాగూర్ గీతాంజలి ()- అనువాదం: బెందాళం కృష్ణారావు
04- రంగు రంగుల చీకట్లు (కవితా సంపుటి)- డాక్టర్ జె.బాపురెడ్డి
05- నీల (నవల)- కె.ఎన్.మల్లీశ్వరి
06- అక్షర యజ్ఞం (నవల)- సూర్యదేవర రామ్మోహనరావు
07- సారాంశం (మో కవిత్వం)- మోహన్ ప్రసాద్
08- భిన్నసందర్భాలు (కథలు)- ఓల్గా
09- ఈ నగరం జాబిల్లి (గజల్ గీతి కావ్యం)- గుంటూరు శేషేంద్రశర్మ
10- రేలపూలు (కథల సంపుటి)- సమ్మెట ఉమాదేవి
11- మబ్బు విడిచిన వెన్నెల (నవల) - డాక్టర్ పరుచూరి రాజారామ్
12- పురూరవ (నాటకం)- చలం
13- ఎన్నెల్లో ఎన్నెల (రావిశాస్త్రి కవిత్వం)- రావిశాస్త్రి
14- కూనలమ్మ పదాలు (మినీ కవిత్వం)- ఆరుద్ర
15- స్తబ్దత చలనం (కవిత్వం)- పాపినేని శివశంకర్
16- అవాస్తవికుడు (నవల)- అంపశయ్య నవీన్
17- మట్టిమనిషి (నవల)- వాసిరెడ్డి సీతాదేవి
18- మట్టిపూల గాలి (కవిత్వం)- స్వేచ్ఛ
19- ప్రళయం (కథా సంకలనం)- చలపాక ప్రకాష్
20- యశోబుద్ధ (నవల)- ఓల్గా
21- ఎదారిబతుకులు (పల్లెకతలు)- ఎండపల్లి భారతి
22- మునివాహనుడు ఒక పరిశీలన (పరిశోధనా గ్రంథం)- డి.ఎస్.బషీర్
23- హంసమంజీరాలు (నవల)- సిఎస్ రావు, శివదత్తా
24- నీదాకా వచ్చినా తాకుతానోలేదో సాయంకాలం వానని (కవిత్వం)- రివేరా
25- మెలూహా మృత్యుంజయులు (శివత్రయం-1)- అమిష్
26- నాగా రహస్యం (శివత్రయం-2)- అమిష్
27- వాయుపుత్ర శపథం (శివత్రయం-3)- అమిష్
28- స్ఫూర్తిశిఖరం (దీర్ఘకావ్యం)- కె.ఆనందాచారి
29- మంచీ చెడు (నవల)- శారద(నటరాజన్)
30- నగరం (The City of the yellow Devil)- మాక్సిమ్ గోర్కీ
31- పరిణీత (నవల)- శరచ్ఛంద్ర ఛటోపాధ్యాయ
32- కాశీనాథ్ (నవల)- శరచ్ఛంద్ర ఛటోపాధ్యాయ
33- కలలు నిజమయితే (నవల)- పోట్లూరు సుబ్రహ్మణ్యం
34- విశాల నేత్రాలు (నవల)- పిలకా గణపతి శాస్త్రి
35- చరిత్రహీనులు (నవల)- శరచ్ఛంద్ర ఛటోపాధ్యాయ
36- మంజీరనాదాలు (కావ్యం)- డాక్టర్ వాసా ప్రభావతి
37- శుభద (నవల)- శరచ్ఛంద్ర ఛటోపాధ్యాయ
38- చిలకలు వాలిన చెట్టు (కవిత్వం)- ఇస్మాయిల్
39- ఆరు సారా కథలు (కథాసంపుటి)- రావిశాస్త్రి
40- చెరబండరాజు కవితలు-పాటలు (కవిత్వం)- చెరబండరాజు
41- జీవనస్రవంతి (నవల)- లత
42- కర్మభూమి (నవల)- ప్రేమ్ చంద్
43- ఎర్రడబ్బా రైలు(కవితాసంపుటి)- శీలా వీర్రాజు
44- ఒకసారాంశం కోసం(కవిత్వం)- పాపినేని శివశంకర్
45- సామాజిక హైకూలు (హైకూలు)- డాక్టర్ రావి రంగారావు
46- కళికలు (చిన్నకవితలు)- బెజవాడ గోపాలరెడ్డి
47- రక్తాశ్రువులు (నవల)- సిడ్నీ గోర్డన్, టెడ్ అలె
48- వ్యాసనవమి(సాహిత్య వ్యాసాలు)- డాక్టర్ ఎన్.గోపి
49- జ్యూలియస్ ఫ్యూజిక్ (కవితాసంపుటి)- ఉషా ఎస్ డానీ
50- ఏడవకు బిడ్డా...(నవల) - గుగివా థియాంగో
51- రక్తాక్షరాలు - జ్యూలియస్ ఫ్యూజిక్
52- ఆమెత్యాగం (కథ) - చలం
53- మేడమెట్లు (కథానిక) - బుచ్చిబాబు
54- పొగలేని నిప్పు (కథానిక) - బుచ్చిబాబు
55- ఆశాప్రియ (కథానిక) - బుచ్చిబాబు
56- స్నేహసుమాలు (రష్యా జ్ఞాపికలు) - డాక్టర్ వాసా ప్రభావతి
57- దోషగుణం (కధానిక)- చలం
58- మైదానం (నవల)- చలం
59- మన తెలుగు తెలుసుకుందాం (భాషా శాస్త్రం)- డాక్టర్ ద్వానా శాస్త్రి
60- ఇంద్రధనుస్సు నవల- వాందా వాస్సిలేవస్కా
61- గృహభంగం నవల- ఎస్.ఎల్.భైరప్ప (అను:సంపత్)
62- దాటు (సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కన్నడ నవల)- ఎస్.ఎల్.భైరప్ప, అను:పరిమి రామనరసింహం
63- జాషువా ప్రగతిశీలత- కళాత్మకత - అద్దేపల్లి రామ్మోహనరావు
64- తుఫానులకెదురు నడవరా (అనువాద కవిత్వం)- అను: గోదావరి
65- మతోన్మాదం పుట్టుక- పరిణామం- నివారణ - బిపిన్ చంద్ర
66- జీవన గతులు (కథాసంపుటి)- చెన్నూరి సుదర్శన్
67- పాలగుమ్మి పద్మరాజు రచనలు-4(వ్యాసాలు, కవితలు)- పాలగుమ్మి
68- హరిజన శతకం (కవితలు)- కుసుమ ధర్మన్న
69- నాకొద్దీ నల్లదొరతనము (కవితలు)- కుసుమ ధర్మన్న
70- నేను హిందువు నెట్లయితా? ()- కంచ ఐలయ్య
71- హిందూ సామ్రాజ్యవాద చరిత్ర ()- స్వామి ధర్మతీర్థ
72- చీకటి దీపాలు (కవిత)- ఎస్.మునిసుందరం
73- అలిశెట్టి ప్రభాకర్ కవిత (కవిత్వం)- అలిశెట్టి ప్రభాకర్
74- గడియ పడని తలుపులు (నవల)- గోపీచంద్
76- గతించని గతం (నవల)- గోపీచంద్
76- సంపంగె పువ్వు (పెద్ద కథ)- గోపీచంద్
77- వెండిసీసా (పెద్దకథ)- పాలగుమ్మి పద్మరాజు
78- అందాల తెలుగు కథ (కథా సాహిత్య వ్యాసాలు) - కోడూరి శ్రీరామమూర్తి
79- మినీ, హైకూ కవిత్వాల తులనాత్మక అధ్యయనం -
80- భూమత్స్యగుండ్ర (పెద్దకథ)- ప్రసన్నకుమార్ సర్రాజు
81- సాహిత్యంలో సజీవ స్త్రీ మూర్తులు (వ్యాసాలు) - జలంధర
82- ఒక భార్గవి (వ్యాసాలు) - డాక్టర్ భార్గవి రొంపిచర్ల
83- గడ్డిపూలు (కవిత్వం)- మాధవి పిన్నమనేని
84- హిందూత్వ రాజకీయాలు- సామాజిక మూలాలు (బి.చంద్రశేఖర్ స్మారకోపన్యాసం)- రాణి శివశంకర శర్మ
85- నిమిత్తమాత్రులు(నాటకము)- ముద్దంశెట్టి హనుమంతరావు
86- పద్యనాటక నటరత్నాలు ()- డాక్టర్ దేవరపల్లి ప్రభుదాస్
87- ధర్మజ రాజసూయము ()- మల్లంగి రామసుబ్బారెడ్డి
88- కావ్యేషు నాటకం రమ్యమ్ (వ్యాసాలు, సమీక్షలు)- సుంకర కోటేశ్వరరావు
89- శ్రీ బుఱ్ఱా సుబ్రహ్మణ్యశాస్త్రి గారి నటజీవితం (పరిశోధనా గ్రంథం)- మేకా రామకృష్ణ
90- మరో అమ్మ(మేరీజోన్స్ ఆత్మకథ)- అనువాదం :కె.ఉష,పి.మణి
91- మార్క్సిజం అంటే ఏమిటి ()- ఎమిలి బరన్స్
92- మురళీయం () - డాక్టర్ కెవిఎస్ జి మురళీకృష్ణ
93- భాగ్యనగరం (నాటకం)- నార్ల చిరంజీవి
94- స్త్రీత్వం ఓ వూహ (వ్యాసాలు)- తమిళ శెల్వన్
95- కొన్ని తీరాలు కొన్ని రాగాలు (కవిత్వం)- ఎన్.అరుణ
96- అడవి పాడింది (కథలు) - దీవి సుబ్బారావు
97- మార్క్సిజము కవిత్వమూ (వ్యాసాలు)- ప్రొఫెసర్ జార్జిథామ్సన్,అను: సోమసుందర్)
98- తీవ్రమధ్యమం (వ్యాసాలు)- వసంత కన్నబిరాన్
99- నెలవంక (కవిత్వం)- శివసాగర్
100- మునివాహనుడు (నాటకం)- కొలకలూరి ఇనాక్
101- నండూరి సుబ్బారావు (భారతీయ సాహిత్య నిర్మాతలు)- వాడ్రేవు వీరలక్ష్మీదేవి
102- మహాకథకుడు చాగంటి సోమయాజులు (శతజయంతి సదస్సు ప్రసంగవ్యాసాలు)- చాగంటి తులసి
103- ఆలూరు బైరాగి (భారతీయ సాహిత్య నిర్మాతలు)
104- అపరిచిత (సోవియట్ నవల)- గలీనా నికొలయెవా (అను: పిచ్చేశ్వరరావు)
105- బ్లాక్ బ్యూటీ (ఓ గుర్రం ఆత్మకథ)- అన్నా సెవెల్


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి