వ్వాట్.. బయింగ్ ఓట్స్! మైగాడ్! వర్స్ డాన్ సెల్లింగ్ సీట్స్... సీట్లనమ్ముకోడంకన్నా నికృష్టం. దిస్. మైడియర్ షేక్స్ పియర్, ఈజ్ బార్చేరియస్... ఓట్లు కొండమా? డబ్బుపెట్టా? నువ్వు స్టోన్ ఏజ్ మానవుడిలా వున్నావోయ్! ఇది నవ్యాంధ్రమనిన్నీ, నువ్వు టెలుగూస్ జాతివాడివనిన్నీ ఇది ఫలానా యుగమనిన్నీ మర్చిపోయావా? ఓట్లు, నోట్లు, ప్రజాస్వామ్యం టాపిక్ మీద నా లెక్చర్లు, పఝ్ఝెనిమిది డాక్టరేట్లకు సరిపడే నా థీసిస్ లు ఇంతలోనే పరగడుపైపోయాయటోయ్? మిస్టర్ వెంకటేశం... ఈ విషయమై ఇప్పటికే ట్విట్టర్ లో పోస్టులు పెట్టానోయ్. నా లాంటి సెలబ్రిటీలంతా ఇవ్వాళ రేపు ట్విట్టర్లనేగ గొప్ప గొప్ప ఐడియాల్ని షేర్ చేస్తున్నారు. గిప్పుడు లేటెస్ట్ గా ఎలక్షన్స్
వచ్చినయ్ కదా.. మన లెక్చర్లకిప్పుడు పెద్ద డిమాండొచ్చి పడిందోయ్. అన్ని పార్టీలూ నన్నే అప్రోచ్ అవుతున్నారనుకో...ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ మీద లెక్చరిచ్చినప్పుడు నిన్న ఎలెక్షన్ ప్రచారం స్టార్ట్ చేసి ఒక్క బిగిన నాలుగు ఘంటల్లెక్చరిచ్చేసరి ప్రెస్సు ప్రెస్సంతా డంగైపోయారు. మళ్లీ వాళ్లని మేల్కొల్పడానికి స్మెల్లింగ్ సాలూ గట్రా పెట్టి నానాతంటాలు పడవల్సొచ్చింది. మనవాళ్లొట్టి వెదవాయిలోయ్..! ఏం మాటాడినా చిలవలుపలవలు జేసి ఊదరగొట్టేస్తారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఒక్కసారిగా జనాన్ని చూసిన కంగారులో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో నా లెక్చర్ ఇచ్చాననుకో... అంతదానికే గగ్గోలు పెట్టేస్తే ఎలాగష. జయంతికీ వర్థంతికీ తేడాతెలీని వాజెమ్మలోయ్ మనోళ్లు. నీ దగ్గిర దాపరిక వేవుంది. ఆత్మస్తుతి చేసుకుంటున్నారు మాస్టారు గారని నువ్వనుకున్నా సరే, చెప్పేస్తాను విను. చెప్పనిపాపం నాకేల. యూ ఇడియట్ వెంకటేశం... నవ్వుతున్నావా? నువ్వూ లోకంతో పాటవుతావనుకోలేదు. జరిగింది పెద్ద తప్పు అయితే వాళ్లు మళ్లీ నామాట వింటారా చెప్పు. మరి విన్నారు తెలుసా? ఇంగ్లీష్ లో షేక్స్ పియర్ అంతటోడ్నని, తెలుగులో విశ్వనాథకు గురువునని ఆళ్లూ యీళ్లు అనుకోడమే తప్ప నామటుకు నాదగ్గర ఎవరూ ప్రస్తావించలేదనుకో. పిటీ... నీకు తెలుసుగా వెంకటేశం... సిటీలో బోల్డన్ని సన్మానాల్ని వదులుకున్నోడ్ని, నాకివో లెక్కా... బొత్తగి పొగడ్తలంటే గిట్టదష. అది నా వీక్నెష్ మరి. హౌరా... మన ఆంధ్రులు వింత గొప్పోళ్లు. ఈ గిరీశం గారు అరిటిపండొలిచినట్టు చెప్పేదాకా యీవైనం కనుక్కోలేకపోతిమే అని తెగ నొచ్చుకున్నారు. ఇడియట్... అస్తమాను అలా నవ్వకు.. నన్ను ఇన్సల్ట్ చేస్తన్నట్టు ఫీలవుతా.
ఇంతకీ అసలు విషయమేందో చెప్పమంటావా? నీకంతా తొందరేనోయ్. వెదవది నాతో కల్సి చుట్టకాల్చటమే చాలే. అలా చుట్ట కాల్చి జీనియస్సులై పోయినోళ్లెందరో వున్నారు తెలుసా? నువ్వు మాత్రం.. పొట్టగోస్తే అక్షరం ముక్కలేనోడ్వి. నాతో ఇంగ్లీష్ మాట్లాడుతోంటే... మీ ఇంట్లోవాళ్లంతా నోరెళ్లబెట్టుకు చూళ్లేదూ... అయినా మన గొప్పతనం కూడా మనం చెప్పుకోవద్దుటోయ్. పబ్లిసిటీ ఈజ్ ది లైఫాపిట్ అన్నాడో సీమదొర. మైడియర్ బ్రదరిన్లా....అక్కడికే వస్తున్నా. అసలు విషయమేంటంటే... మన ఆంధ్రాలో ఎలక్షన్లనే విషయం నీకు తెలుసు కదా. ఓ స్పీచ్ ఇవ్వడానికి రమ్మన్నారోయ్. మనదంతా ఇంటర్నేషనల్ లెక్చర్లు. అప్పుడే థింక్ చేశా. మనోళ్లకి నా స్టాండర్ట్ అర్థమౌతుందా అని. ట్రంప్ తో కలిసి లెక్చర్ ఇవ్వాల్సింది కూడా పక్కనబెట్టి... ఈ స్పీచ్ కి ఒప్పుకున్నానష. చిన్నచిన్న మీటింగ్ లు ఎడ్రెస్ చేయడం మనకి కొత్తగదా. అలవాట్లో పొరబాటుగా చిన్న మిస్టేక్ దొర్లిందోయ్. ఏమిటీ... అంత తొందర. చెప్తున్నాకదా..! ‘మన పార్టీ నైన్టీన్ ఎయిటీస్ నుంచే ఇక్కడ గెలవలేదని, ఇప్పుడు మనం గెలవాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారని’ ఫ్లోలో అనేశా. దీనికే ఇంతిదైపోతారేమిటోయ్. అందుకే... మనవాళ్లు ఉత్త వెదవాయిలోయ్. నాకేమిలే మధ్యన... లోకాని క్కాసిన్ని లెక్చర్లు లేకుండాపోతాయ్. మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెరగలేదంటే, ప్రాజెక్టులు రాలేదంటే అందుక్కారణమేమిటి? ఇవే. వెదవది ఎంతచెడ్డా అంత తెలీదుటోయ్... ఆవలించకపోయినా పేగుల్లెక్కెట్టేయగలను. పిటీ... మిస్టర్ గిరీశం... పరాయి దేశం వచ్చి ‘పప్పు’లో కాలేశావోయ్. వాటెఫాల్ మై కంట్రీమన్ అనుకున్నా... సారీ... చూశావా చూశావా... ఆ దెబ్బకు మళ్లీ రాంగ్ కొటేషన్ పడింది. ‘గిరీశం..? బీ కేర్ ఫుల్. మెమొరీ స్లిప్పవువుతోంది. ఛేంజి ది టాపిక్.
- రాజాబాబు కంచర్ల
15-03-2019

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి