పట్టువదలని విక్రమార్కుడు, తన సైడ్ కారు స్కూటరెక్కి యమస్పీడుగా పోతున్నాడు. రాళ్లు, రప్పలు, గుంటలు, మెరకలు దాటుకుంటూ ఓ చిన్నపాటి అడవి దగ్గరకొచ్చాడు. ఆ పక్కనే స్కూటర్ స్టాండ్ వేసి, కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లి ఓ చెట్టు దగ్గర ఆగాడు. నెమ్మదిగా చెట్టుమీదకెక్కి కొమ్మల్లో దాగున్న శవాన్ని భుజాన వేసుకొని జాగ్రత్తగా కిందికి దిగాడు. అతికష్టం మీద శవాన్ని మోసుకుంటూ స్కూటర్ వరకూ నడిచొచ్చాడు. భుజం మీదనున్న శవాన్ని స్కూటర్ సైడ్ కారు సీటులో కూర్చోబెట్టి, నెమ్మదిగా స్కూటర్ పోనిస్తున్నాడు. కొంచెం దూరం వెళ్లగానే.. పిలుస్తున్న శబ్దానికి తన ఊహల్లోనుంచి బయటపడిన విక్రమార్కుడు... సైడ్ కారు సీట్లో వున్న శవంవైపు చూశాడు. ‘రాజా... నువ్వెక్కడో ఆలోచిస్తున్నట్టున్నావు. జారగిలపడి కూర్చోడానికి ఈ సీటు చాలా కంఫర్టబుల్ గా వుంది. నేనెక్కడికీ పోనుగానీ.. బండి జాగ్రత్తగా నడుపు. అమరావతి రాజధాని అయినంక ట్రాఫిక్ విపరీతంగా
పెరిగింది. నువ్వెక్కడ యాక్సిడెంట్ చేసేస్తావోనని హడలిచస్తున్నా... నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి. అలసిపోకుండా వుండటానికి నీకో కథ చెబుతా అన్నాడు శవంలోని బేతాళుడు.
‘రాజా.. ఈ మధ్యన ఆంధ్రదేశంలో డేటాచోరీ పెద్ద సంచలనం సృష్టించింది. బ్యాంకు అకౌంట్లతో సహా ప్రజల సమాచారమంతా అధికార పార్టీ‘చేవాయాప్’ అనే సాఫ్ట్ వేర్ లో వుంచిందని పెద్ద దుమారమే రేగింది. చేవాయాప్ ద్వారా మా ఓట్లన్నీ డిలీట్ చేస్తున్నారని ప్రతిపక్షం గగ్గోలు పెడుతుంటే, మా ఓట్లనే ప్రతిపక్షం తీయించి వేస్తోందని, ఫారమ్-7 ఫిల్ చేస్తున్నారని అధికార పక్షం హడావుడి చేస్తోంది. ఈ యాప్ ను తయారుచేసిన వ్యక్తి అండర్ గ్రౌండ్ కి వెళ్లాడు. పక్కనున్న రాష్ట్టం డేటాచోరీపై ‘సిట్’ వేస్తే, మేమేం తక్కువ తినలేదని, ఫారమ్-7 మీద కూడా ఓ సిట్ ఏసేసింది ఆంధ్రప్రభుత్వం. ఇద్దరూ ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడుతూ అందులోంచి పైకిరాలేక కిందామీదా పడుతున్నారు. ఇంతలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అన్ని పార్టీలు అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేసే హడావుడిలో పడ్డారు. ఇప్పుడు డేటాచోరీ కేసు ఏమౌతుంది? చేవాయాప్ లోని దేవరహస్యం ఏమిటి? ఇంతకీ ఏ పార్టీ ఓట్లను ఏ పార్టీవారు తొలగించారు? తమ ఓట్లు ఉన్నాయో లేవో తెలియక ఆందోళన పడుతోన్న ప్రజల సంగతేంటి? అసలు ఫారమ్-7 మీద సిట్ వల్ల ఏం సాధిస్తారు? నా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో... నీ తల వేయివక్కలవుతుంది’అన్నాడు బేతాళుడు.
దానికి విక్రమార్కుడు చిరుదరహాసం చేస్తూ... ‘మొదటి నుంచి రాష్ట్రంలో అధికారపక్షం, ప్రతిపక్షం ఉప్పు నిప్పు మాదిరి వున్నారు. అధికారం కాపాడుకోటం కోసం ఒకరు, అధికారం దక్కించుకోడమే ముఖ్యమన్నట్టుగా మరొకరు ఎత్తుకు పైఎత్తులేస్తూ ప్రజల సంక్షేమం గాలికొదిలేశారు. అదేదో సినిమాలో ‘కన్ఫ్యూజ్ చేయకు...ఆ కన్ఫ్యూజన్ లో మరింత ఎక్కువ కొడతా’ అన్నట్టుగా... జనాన్ని కన్ఫ్యూజ్ చేసి ఆ కన్ఫ్యూజన్ లో గద్దెనెక్కేయాలని చూస్తున్నారు. ఫారం-7 మీద ఎలక్షన్ కమిషన్ వివరణ ఇచ్చినా, దానిమీద సిట్ ఏమిటా అని జనం నవ్వుకుంటున్నారు. చేవామిత్ర యాప్ సృష్టికర్త అధినాథుడి సంరక్షణలోనే వున్నాడని అమరావతి కోడై కూస్తోంది. ఇకపోతే... నువ్వు చోరీ అంటే నువ్వు చోరీ అంటూ ఎదుటివారి ఓట్లను తొలగించేందుకు ఇద్దరూ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకే... తమ ఓట్లు వున్నాయో లేవోనని ప్రజలు ఆందోళన పడితే లాభంలేదు. ఎవరి ఓట్లను వారు కాచుకోవాల్సిందే...’ అంటూ ఓ క్షణం ఊపిరి తీసుకునేందుకు ఆగాడు.
విక్రమార్కుడికి మౌనభంగం కాగానే... స్కూటరు సైడ్ కారులో జారగిలపడి రెస్టు తీసుకుంటోన్న బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.
- ఉదయమిత్ర
11-03-2019

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి