ఆంధ్రదేశంలో ప్రస్తుతం ఎన్నికల రణరంగం జరుగుతోంది. అధికార పార్టీ, అధికారంలోకి రావాలనుకుంటోన్న ప్రతిపక్ష పార్టీ పోటీపడి వాగ్దానాలు చేస్తున్నారు. ఎవరికెవరూ తగ్గకుండా హామీల వర్షం కురిపిస్తున్నారు. ఒకరు చంద్రన్న రాజ్యం అంటే, మరొకరు రాజన్న రాజ్యం అంటూ ప్రచారం చేస్తున్నారు. అధికారం కోసం ఇరు పార్టీల అధినేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే రియల్ గవర్నెన్స్ అంటూ వీడియో కాన్ఫరెన్స్‌లతో హోరెత్తించే ఇంద్రన్నకు పెద్ద సమస్య వచ్చిపడింది. ఆయన ఏ మీటింగ్‌కి వెళ్లినా 'దాహం... దాహం...' అంటూ ఒకటే గుసగుసలు. ఈ ఎన్నికలు చావుబతుకు సమస్యగా భావించిన చంద్రన్న ఈ దాహం సంగతేంటో తేల్చేయాలనుకున్నాడు. ఓ రోజు
ప్రచారాన్ని కూడా మానుకొని, ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశాడు. అధికారులను వీడియో కాన్ఫరెన్స్‌లోకి తీసుకున్నాడు. ప్రాంతాల వారీగా రివ్యూ చేయడం మొదలుబెట్టాడు. ''మారుమూల ప్రాంతాల వరకూ అన్ని బెల్ట్‌షాపులకూ, స్థానిక నాయకులకూ పుష్కలంగా దాహాన్ని తీర్చడానికి 'సప్లరు' చేశాం, దీనికి అధికారులు కూడా శక్తివంచనలేకుండా సాయం చేశారు'' అని ముఖ్యనాయకులు చెప్పారు. 'మా వంతు సాయం మేం చేశాం' అని అధికారులూ వంత పాడారు. దీంతో అధినాయకుడికేం పాలుపోలేదు. ఈ దాహం ఎందుకొస్తోందో అర్థంకాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. 'అందరూ సీరియస్‌గా ఆలోచించండీ... నాకు సమాధానం కావాలి' అన్నాడు ఇంద్రన్న.
ఆ మీటింగ్‌లో చివరగా కూర్చున్న ఓ కార్యకర్తకి వీళ్లెందుకు ఇంతగా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారో తెల్వలేదు. ఇంత చిన్న విషయం ఇంత పెద్ద నాయకులకు ఎందుకు అర్థంకాలేదో అనుకుంటూ... 'అరు... నేన్ చెప్తానండే.. అంటూ లేచి నుంచున్నాడు ఈర్నాయుడు. హాల్లో వున్నోళ్లంతా ఒక్కసారిగా సైలెంటైపోయి, వెనక్కి తిరిగి చూడసాగారు. ఇంద్రన్న కూడా అతనివైపు చూస్తూ... 'చెప్పు తమ్ముడూ.... ఇది మన ఇజ్జత్ కా సవాల్' అంటూ ఎప్పుడూ అలవాటులేని చిరుమందహాసం చేశాడు.
'మరేనండి... మనోల్లు చెప్పిందంతా నిజ్జమేనండె. అన్నిచోట్ల ఫుల్లుగా సరుకు దిగిపోనాది. ఉపయోగం ఏటండే? దాన్లో కలుపుకుందుకు నీళ్లు కావొద్దేటండే' అన్నాడు. ఒక్కసారిగా హాలంతా నవ్వులతో మునిగిపోయింది. కొంతమంది చప్పట్లతో తమ ఆమోదం తెలిపితే, 'ఇంత చిన్న విషయం మనకెందుకు అర్థంకాలేదో'నంటూ గుసగుసలు పోయారు. పెద్ద భారం దిగిపోయినట్లు ఫీలయ్యాడు ఇంద్రన్న. వెంటనే సెక్రటరీని పిలిచి, వాటర్‌బాటిల్స్ సప్లరు చేసే పెద్ద కంపెనీ ఏముందో చూడండి. వెంటనే దాంతో టైఅప్ అవండి. ఆ కంపెనీని కూడా మన 'ఎంవోయు'ల జాబితాలో చేర్చేద్దాం' అంటూ సమావేశం ముగించాడు.
- ఉదయమిత్ర
28-03-2019

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి