ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శ్రీశ్రీ వారసత్వం


ఇరవయ్యవ శతాబ్దపు
తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి
ఈ శతాబ్దం నాదీ అని ప్రకటించిన సామ్యవాది
సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాలను
ధిక్కరించిన విప్లవకవి
సంఘచైతన్యాన్ని, వర్గచైతన్యాన్ని
ప్రవచించిన ప్రజాకవి

తిరుగుబాటు అతని వేదాంతం
ముళ్లూ , రాళ్లూ , అవాంతరాలెన్ని ఉన్నా
మునుముందుకే నడవడం అతని సిద్ధాంతం
ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరని దాహం
అని ప్రకటించిన ఆయన బాట మహాప్రస్థానం

జీవన రసాగ్నిని రగిలించిన సొగసరి
కష్టజీవి కిరువైపుల నిలిచిన మహాకవి
మనిషిలోని వేదన, కల్లోలాలను కొలిచిన కాలజ్ఞాని
ఆయన కవిత్వానికి కేంద్రబింధువు మనిషి
అంధుకే ఆధునిక కవిత్వానికి ఆయన ప్రతినిధి
నేను సైతమంటూ మోగించాడు జయభేరి

ఆయనే మహాకవి శ్రీశ్రీ
ఖడ్గసృష్టి చేసిన భిన్నదృక్పథాల ప్రయోగశీలి శ్రీశ్రీ
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నేనున్నాని నిండుగ పలికిన మహామనీషి శ్రీశ్రీ
హృదయంలో నిదురించే చెలీ అంటూ
విప్లవాన్ని ప్రియురాలిగా ఆరాధించి
సరిహద్దులు దాటిన ప్రేమికుడు శ్రీశ్రీ
నదీనదాలు, అడవులు, కొండలు, ఎడారులా  మన కడ్డంకి అని
ఎర్రబావుటా నిగనిగల కలమెత్తిన విప్లవ వైతాళికుడు శ్రీశ్రీ

అందుకే...
జగన్నాథ రధచక్రాలై కదులుదాం..
శ్రీశ్రీ వారసత్వాన్ని కొనసాగిద్దాం...

(ఏప్రిల్ 30- మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా అక్షరనివాళితో...)

- రాజాబాబు కంచర్ల
9490099231

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్