ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మే, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మెమొరీ స్లిప్

వ్వాట్.. బయింగ్ ఓట్స్! మైగాడ్! వర్స్ డాన్ సెల్లింగ్ సీట్స్... సీట్లనమ్ముకోడంకన్నా నికృష్టం. దిస్. మైడియర్ షేక్స్ పియర్, ఈజ్ బార్చేరియస్... ఓట్లు కొండమా?  డబ్బుపెట్టా? నువ్వు స్టోన్ ఏజ్ మానవుడిలా వున్నావోయ్! ఇది నవ్యాంధ్రమనిన్నీ, నువ్వు టెలుగూస్ జాతివాడివనిన్నీ ఇది ఫలానా యుగమనిన్నీ మర్చిపోయావా? ఓట్లు, నోట్లు, ప్రజాస్వామ్యం టాపిక్ మీద నా లెక్చర్లు, పఝ్ఝెనిమిది డాక్టరేట్లకు సరిపడే నా థీసిస్ లు ఇంతలోనే పరగడుపైపోయాయటోయ్? మిస్టర్ వెంకటేశం... ఈ విషయమై ఇప్పటికే ట్విట్టర్ లో పోస్టులు పెట్టానోయ్. నా లాంటి సెలబ్రిటీలంతా ఇవ్వాళ రేపు ట్విట్టర్లనేగ గొప్ప గొప్ప ఐడియాల్ని షేర్ చేస్తున్నారు. గిప్పుడు లేటెస్ట్ గా ఎలక్షన్స్

దాహం.. దాహం..!

ఆంధ్రదేశంలో ప్రస్తుతం ఎన్నికల రణరంగం జరుగుతోంది. అధికార పార్టీ, అధికారంలోకి రావాలనుకుంటోన్న ప్రతిపక్ష పార్టీ పోటీపడి వాగ్దానాలు చేస్తున్నారు. ఎవరికెవరూ తగ్గకుండా హామీల వర్షం కురిపిస్తున్నారు. ఒకరు చంద్రన్న రాజ్యం అంటే, మరొకరు రాజన్న రాజ్యం అంటూ ప్రచారం చేస్తున్నారు. అధికారం కోసం ఇరు పార్టీల అధినేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే రియల్‌ గవర్నెన్స్‌ అంటూ వీడియో కాన్ఫరెన్స్‌లతో హోరెత్తించే ఇంద్రన్నకు పెద్ద సమస్య వచ్చిపడింది. ఆయన ఏ మీటింగ్‌కి వెళ్లినా 'దాహం... దాహం...' అంటూ ఒకటే గుసగుసలు. ఈ ఎన్నికలు చావుబతుకు సమస్యగా భావించిన చంద్రన్న ఈ దాహం సంగతేంటో తేల్చేయాలనుకున్నాడు. ఓ రోజు

బెదిరింపు

పట్టువదలని విక్రమార్కుడు, తిరిగి తన సైడ్ కారు స్కూటరెక్కి యమస్పీడుగా పోతున్నాడు. రాళ్లు, రప్పలు, గుంటలు, మెరకలు దాటుకుంటూ ఇంతకుముందు వచ్చినట్లుగానే అడవి కొచ్చాడు. ఆ పక్కనే స్కూటర్ స్టాండ్ వేసి, చకచకా నడుచుకుంటూ వెళ్లి ఓ చెట్టు దగ్గర ఆగాడు.  నెమ్మదిగా చెట్టుమీదకెక్కి కొమ్మల్లో దాగున్న శవాన్ని భుజాన వేసుకొని ఈసారి మరింత జాగ్రత్తగా కిందికి దిగాడు. అతికష్టం మీద శవాన్ని మోసుకుంటూ స్కూటర్ వరకూ నడిచొచ్చాడు. భుజం మీదనున్న శవాన్ని స్కూటర్ సైడ్ కారు సీటులో కూర్చోబెట్టి, నెమ్మదిగా స్కూటర్

చోరీ..చోరీ..!

పట్టువదలని విక్రమార్కుడు, తన సైడ్ కారు స్కూటరెక్కి యమస్పీడుగా పోతున్నాడు. రాళ్లు, రప్పలు, గుంటలు, మెరకలు దాటుకుంటూ ఓ చిన్నపాటి అడవి దగ్గరకొచ్చాడు. ఆ పక్కనే స్కూటర్ స్టాండ్ వేసి, కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లి ఓ చెట్టు దగ్గర ఆగాడు.  నెమ్మదిగా చెట్టుమీదకెక్కి కొమ్మల్లో దాగున్న శవాన్ని భుజాన వేసుకొని జాగ్రత్తగా కిందికి దిగాడు. అతికష్టం మీద శవాన్ని మోసుకుంటూ స్కూటర్ వరకూ నడిచొచ్చాడు. భుజం మీదనున్న శవాన్ని స్కూటర్ సైడ్ కారు సీటులో కూర్చోబెట్టి, నెమ్మదిగా స్కూటర్ పోనిస్తున్నాడు. కొంచెం దూరం వెళ్లగానే.. పిలుస్తున్న శబ్దానికి తన ఊహల్లోనుంచి బయటపడిన విక్రమార్కుడు... సైడ్ కారు సీట్లో వున్న శవంవైపు చూశాడు. ‘రాజా... నువ్వెక్కడో ఆలోచిస్తున్నట్టున్నావు. జారగిలపడి కూర్చోడానికి ఈ సీటు చాలా కంఫర్టబుల్ గా వుంది. నేనెక్కడికీ పోనుగానీ.. బండి జాగ్రత్తగా నడుపు. అమరావతి రాజధాని అయినంక ట్రాఫిక్ విపరీతంగా

జాడ

తొలిసంధ్య వేళ తెలిమబ్బుల జాడ కానరానివేళ మసక మసక తెరల్లో నీడలా అగుపిస్తావు నీ ఊహలలో జోగి సోలి పోయిన మనసుకు గుసగుసలేవో చెబుతావు కిలకిలమంటూ చిలిపి నవ్వొకటి నా పెదవులపై జారవిడుస్తావు గోదారి అలల సవ్వడులను మధుర సంగీతంలా పలికించి మేల్కొలుపుతావు మత్తులోని గమ్మత్తేమిటో తెలుసుకునేలోపు తరలిపోయిన వసంతంలా మాయమవుతావు - రాజాబాబు కంచర్ల (9490099231) 08-05-2019

మా ఊరి చెట్టు

 ఓ రోజు.... వేసవికాలం సాయంత్రం చల్లగాలికి మా ఇంటిపైన పచార్లు చేస్తున్నా.. అప్పటివరకూ ప్రచండంగా మండిపోయిన సూర్యుడు, తన ప్రతాపాన్ని విరమించుకుని మెల్లగా తన దిశను మార్చుకుని మౌనమునిలా మారిపోయాడు. విరహతాపమో, ఉక్కపోతో తెలియని వేసవితాపం నుండి కూసింత ఉపశమనం కలిగించే ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణం... సుదూర తీరాల నుంచి ప్రియురాలు పంపిన మేఘసందేశంలా చిరుగాలి గిలిగింతలు పెడుతుంటే... ప్రియురాలి బాహువుల్లా ఓ అందమైన అనుభూతి మనసును అల్లుకుంది. పసుపువర్ణధారియైన సూరీడు మెల్లగా జారుకుంటుంటే.. అప్పుడప్పుడే పక్షులు గూళ్లకు చేరుకుంటున్నాయి. గత ముప్పై ఏళ్లుగా కోల్పోయిన ఇలాంటి అందమైన సాయంత్రాలను కోల్పోయానా అని ఓ క్షణకాలం మనసు నిట్టూర్పు విడిచినా..

మల్లెతీగ కథల పోటీ ఫలితాలు

మల్లెతీగ మ్యాగజైన్ నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన కథల పోటీలో  నేను రాసిన ‘ఓల్గా’ కథకు బహుమతి

ఉగాది కవితా పఠనం

మార్చి 18, 2018న  జాషువా సాంస్కృతిక వేదిక  ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ‘ఉగాది ఉత్సవం’లో కవితా పఠనం ఉగాదీ... రావొద్దు నువ్వు! -------------------------------------- రావొద్దు ఉగాదీ రావొద్దు నువ్వు ఎత్తుకు పైఎత్తులతో రాజకీయ కుతంత్రాలతో బలిపీఠమెక్కిన తెలుగోడి గుండెలో కత్తి దించడానికి రావొద్దు ఉగాదీ రావొద్దు నువ్వు రాజ్యం లాక్కున్న పంట పొలాల మీదుగా రగులుతున్న రైతుల క్రోధాగ్నుల్ని పీల్చుకుంటూ నెర్రలిచ్చిన గుండె గాయాల్ని ఎర్రకలువల్లాంటి పాదముద్రల్ని నిలువునా చీల్చుకుంటూ మధువు కంటే మత్తేక్కించే ద్వేషంతో కూజితాలు పాడే మత్త కోకిల వేషంతో రావొద్దు ఉగాదీ రావొద్దు నువ్వు అంతర్జాలంలో అమరావతీ నగరం రాజధాని ప్రాంతంలో తాత్కాలిక భవనం గారడీవాని గమ్మత్తుల పెట్టెలో ఉన్న రంగుల చిత్రం సింగపూరు సిన్నోడి మాయాజాలం ఊహకందని ఊహల కీకారణ్యంలో యువత భవితను సమాధిచేసుకుంటూ రావొద్దు ఉగాదీ రావొద్దు నువ్వు నోట్ల రద్దు, జిఎస్టీ పేరుతో దేశం బజారున పడింది నిరుడు వాడు కొట్టిన దెబ్బకు ఈ మార్పుల కూర్పు మనకు చేతగాని నేర్పు గ్రామాల్లో నగరాల్లో రోడ్ల మీద రాలిన శవాల ఆక్రందనలను ఆస్వాద...

2018లో నా పుస్తక పఠనం

‘అక్షరం చినుకై తాకగానే... కాగిన మట్టిపై తొలకరి జల్లుల పరిమళం’ వెదజల్లినటుల ‘వంద పుస్తకాల పఠనం... వేయి ఆలోచనల సంఘర్షణకు కారణం’ అయింది.  ఫలితంగా కాస్తంతైనా అక్షర శుద్ధి అబ్బివుంటుందనే తృప్తి. 2016లో చదివిన పుస్తకాల సంఖ్య 116 అయింది. 2017లో ఆ ఒరవడి కాస్త పెరిగి 150 పుస్తకాలు చదివే వరకూ వచ్చింది. 2018లో  మాత్రం గత రెండేళ్లకంటే  తక్కువగా 105 పుస్తకాల వరకు చదవగలిగాను. కథా సంపుటములు, కవితా సంకలనాలు, ప్రముఖుల కథలు, సాహిత్య విమర్శలు, వ్యాసాలు వున్నాయి.  ఇవే కాకుండా వివిధ పత్రికల ఆదివారం అనుబంధాల్లో వచ్చేవి, ఆన్ లైన్ మ్యాగజైన్స్ లోనివి కథలు, సాహిత్య వ్యాసాలు అదనంగా మరికొన్ని. నాలుగు కథలు, సుమారుగా 20 కవితలు రాయడం కొంత సంతృప్తినిచ్చే విషయం. 2017లో మాదిరిగానే 2018లోనూ వరుసగా రెండోసారి ‘కెనడా తెలుగుతల్లి’ మ్యాగజైన్ వారినుండి ‘మాతృద్రోహం’ అనే కథకు బహుమతి పొందడం ఆనందించే విషయమే. జంపాల చౌదరి గారిని చూసిన తర్వాతనే ఇలా రాయాలన్న కోర్కె కలిగింది. ఇలా మిత్రులతో పంచుకోవడం ద్వారా మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని పొందేందుకే తప్ప గొప్ప కోసం కాదు. ఆ మాటకొస్తే ఇదేం పెద్ద గొప్ప కూడా కాదు...

మధుర జ్ఞాపకంగా మిగిలిన ఓ స్పర్శ

మేడే దినోత్సవ శుభాకాంక్షలతో... పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి సందర్భంగా నివాళులతో ఒక అరుదైన జ్ఞాపకం... ---------------- అజ్జంపూడి... కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో అదో పల్లెటూరు. ఎయిర్ పోర్ట్ కు వెనుకవైపున వుంటుంది. అది...మా ఊరు నేను పుట్టి పెరిగిన ఊరు.

శ్రీశ్రీ వారసత్వం

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి ఈ శతాబ్దం నాదీ అని ప్రకటించిన సామ్యవాది సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాలను ధిక్కరించిన విప్లవకవి సంఘచైతన్యాన్ని, వర్గచైతన్యాన్ని ప్రవచించిన ప్రజాకవి తిరుగుబాటు అతని వేదాంతం ముళ్లూ , రాళ్లూ , అవాంతరాలెన్ని ఉన్నా మునుముందుకే నడవడం అతని సిద్ధాంతం ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం అని ప్రకటించిన ఆయన బాట మహాప్రస్థానం జీవన రసాగ్నిని రగిలించిన సొగసరి కష్టజీవి కిరువైపుల నిలిచిన మహాకవి మనిషిలోని వేదన, కల్లోలాలను కొలిచిన కాలజ్ఞాని ఆయన కవిత్వానికి కేంద్రబింధువు మనిషి అంధుకే ఆధునిక కవిత్వానికి ఆయన ప్రతినిధి నేను సైతమంటూ మోగించాడు జయభేరి ఆయనే మహాకవి శ్రీశ్రీ ఖడ్గసృష్టి చేసిన భిన్నదృక్పథాల ప్రయోగశీలి శ్రీశ్రీ నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నేనున్నాని నిండుగ పలికిన మహామనీషి శ్రీశ్రీ హృదయంలో నిదురించే చెలీ అంటూ విప్లవాన్ని ప్రియురాలిగా ఆరాధించి సరిహద్దులు దాటిన ప్రేమికుడు శ్రీశ్రీ నదీనదాలు, అడవులు, కొండలు, ఎడారులా  మన కడ్డంకి అని ఎర్రబావుటా నిగనిగల కలమెత్తిన విప్లవ వైతాళికుడు శ్రీశ్రీ అందుకే... జగన్నాథ రధచక...