ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెప్టెంబర్, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

శ్ర‌మ‌, సంస్కృతుల‌ సారం సామెతలు

Prajasakti Posted On:   Sunday,July 15,2018                     తెలుగునాట జానపద సాహిత్యానికి పుట్టినిళ్లు గ్రామాలు. శ్రమైక జీవన సౌందర్యానికి సజీవ సాక్ష్యం మౌఖిక వాజ్మయం. మౌఖిక వాజ్మయంలో అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు ఉంది. జానపద సాహిత్య ప్రక్రియల్ని పాట, కథ,

అరుణారుణం

ఓ అరుణారుణమా నువు బయల్దేరుతునే వసంతాన్ని కొనితెచ్చావు గ్రీష్మంలో అల్లాడుతున్న జనానికి చిరు ఆశను కల్పించావు నవ్యాంధ్ర కరుణిమను పులమడానికి పిల్లతెమ్మెరలను తోడ్కొని సప్తవర్ణాలను రంగరించుకొని నలు దిక్కులను కలుపుకొని శరవేగంగా కదిలొస్తున్నావు ఏవైనా మబ్బు తెరలు అడ్డొస్తే ఏవైనా గండు తుమ్మెదలు నిలువరిస్తే ఏమాత్రం అదరకు బెదరకు ఏమైనా నీ అడుగులాపకు నీవెంట నడుస్తున్నాయెన్నో అరుణకిశోరములు నీకోసం ఎదురు చూస్తున్నాయి మరెన్నో అరుణకిరణములు నవ్యాంధ్ర సీమల్లో ఎర్రమందారాలు పూయించడానికి ఓ అరుణారుణమా... నిండా కమ్మిన గ్రీష్మపు వాడగాడ్పులకు ప్రాణాల నెదురొడ్డి నువు కొనివచ్చే వసంతం కోసం నిరీక్షిస్తోంది నవ్యాంధ్రము - రాజాబాబు కంచర్ల 02-09-2018

ముద్దు...

ముద్దు... నాలుగు పెదవుల కలయికే కాదు రెండు శ్వాసల సరాగం రెండు మనసుల సంగమం రెండు తనువుల తన్మయత్వం

నా పతాకం అరుణారుణం

నా పతాకం అరుణారుణం నా కవిత్వం రసరమ్యం నా దీక్ష దృఢ సంకల్పం నా లక్ష్యం నిత్య చైతన్యం

అంటరాని వసంతంలో పూసిన ‘కటికపూలు’

         ఇవి ‘కటికపూలే’ కాదు... పైకి కనిపించని గులాబీల సౌరభాలు. పెత్తందారీ పదఘట్టనల కింద నలిగిపోయిన మల్లెల మార్దవం. తడియారని గుండె సడి. తినే తిండి మీద, కట్టే బట్ట మీద, మాట మీద, నడక మీద, నడత మీద బోల్డన్ని ఆంక్షలు. సొంతమంచం మీద స్వేచ్చగా కూచోలేని అస్వతంత్ర బతుకుల జీవన పోరాటం ఇది. అంటరాని వసంతంలో పూసిన ‘కటికపూలు’ అరుణిమను పులుముకున్న వెలివాడల ఎర్ర మందారాలు. ఇవి కథలు కావు.. మట్టిపాదాల ముద్రలు. పెత్తందారుల పొలాల్లో లోగిళ్లలో చిందిన నెత్తురు చుక్కలు. అనుభవంలోంచి మొలిచిన అక్షరాలు గనుకే ఈ కథలకు ఇంత పదును. రచయిత తన అనుభవంలోంచి తీసుకున్న సంఘటనలు గనుకే ఈకథల కన్నీటిలో ఇన్ని ఎరుపుజీరలు. దళిత జీవితం గురించి, దళిత జనం గురించి ఇప్పుడిప్పుడే ఈ సమాజానికి తెలియజెప్పే సొంత గొంతుకలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో ఒక పదునైన గొంతుక  ఇండస్ మార్టిన్. ‘కటికపూలు’ పుస్తకం ద్వారా దళిత జీవిత చిత్రాన్ని తనదైన శైలిలో సజీవమైన, స్వచ్ఛమైన భాష, యాసతో పఠితులకందించారు.  

కిటికీ

కటికపూలు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్

శశి మనసు

మేఘాల్లో పద్మాలు వికసిస్తున్నాయి నదీనదాలు సంగీతాన్ని ఆలపిస్తున్నాయి పవనుడు పక్షులతో కలిసి తాళం వేస్తున్నాడు కోయిలలు మైమరచి పాడుతుంటే.. మయూరాలు పరవశించి నాట్యమాడుతున్నాయి కాళిదాసు బందనలోనున్న అప్సరాంగనలు ఈర్ష్యగా చూస్తున్నారు శశికాంతుడు ఎన్నెలపిట్ట కిలకిలల కోసం ఆత్రంగా ఎదురుచూస్తూనే వున్నాడు శశి మనసును రంజింప జేయాలని ప్రకృతి సర్వశక్తులూ ఒడ్డుతునే వుంది - రాజాబాబు కంచర్ల 25-07-2018

రాగాల సన్నాయి

అది వెలుతురు పిట్ట పండు వెన్నెల్లో పరవశించి ఆడే ఎన్నెలపిట్ట ఆనందం కట్టలు తెంచుకున్నప్పుడు మమకారం వెల్లువల పొంగినప్పుడు వసంతంలో కోయిలల కిలకిల రావాలు రువ్వుతూ రాగాల సన్నాయి అవుతుంది ప్రేమ వరదలా పొంగినప్పుడు భావాలు కట్టలు తెంచుకొని ఎగసినప్పుడు హేమంతంలో పక్షిల ముడుచుకుపోతూ తుపానుకు ముందు సంద్రంలా గంభీరం అవుతుంది ఆ కళ్లు అయస్కాంత క్షేత్రాలు ఆ నవ్వులు  మొగలిపువ్వులు అంబరమంత ప్రేమను అర్ణవమంత మమతను మదిలోనే అణచిపెడుతూ ప్రశాంత గోదారిలా ప్రవహిస్తుంది.. చౌరాసియా వేణుగానంలా తనలో లీనం చేసుకుంటుంది విరజిమ్మే వెన్నెల వెలుగుల్లో ఎన్నెలపిట్ట ప్రేమగీతమౌతుంది మత్తెక్కించే మల్లెచెండు అవుతుంది మెడఒంపు మొగలిపువ్వవుతుంది మల్లెతీగలా అల్లుకుంటుంది మన్మథ శరసంధానం గావిస్తుంది విప్పార్చుకున్న రెక్కల మధ్యన విత్తును చీల్చుకొనివచ్చే మొలకలా తనువంతా చుట్టుకొని ఒదిగిపోతూ బరువంతా తానై కరిగిపోతూ బతుకంతా తానై నిలిచిపోతూ జీవితాన్ని పండిస్తుంది వెలుగుల పంటై... - రాజాబాబు కంచర్ల 14-08-18

ప్రేమవృక్షం

వేళ్లు లోతుగా పాతుకుపోయిన వటవృక్షానికి నీళ్లతో పనిలేదు భూమిలోని నీటిఊటను పీల్చుకొని పుష్పిస్తూ, ఫలిస్తూంటుంది నిజమైన ప్రేమ కూడా అంతే... ఎంత దూరాన వున్నా పదేపదే కలవకపోయినా చివురులు వేస్తూంటుంది పరిమళిస్తుంది నవనాడుల్లో పారుతుంది కాంతి నాదమౌతుంది శాంతి ధామమౌతుంది చిగురించి పుష్పించి పరిమళించి ఫలించి వటవృక్షమంత విశాలంగా విస్తరిస్తుందీ ప్రేమవృక్షం... - రాజాబాబు కంచర్ల 02-08-2018

నీ తలపులు

నీ తలపులు మదిలో చెలమలుగా ప్రవహిస్తుంటే క్షణాలు నిమిషాలుగా నిమిషాలు దినాలుగా గడిచిపోతుంటే... మదిలోని నీ రూపం హృదయమంతా అల్లుకుంటుంటే నీవెంత దూరంలో వున్నా నీతో కలిసి నడుస్తూనే వుంటా... నీ స్థానం ఎప్పటికీ పదిలం నీవిచ్చే స్ఫూర్తి నా నడకకు ఆలంబనం చివరి శ్వాస వరకూ... నీ ఆరాధనలో మునగనీ నీ కనుదోయి కనుపాపల్లే ప్రేమసుమాలు విరియనీ... విరహమైనా..ప్రణయమైనా చెదరని నీ ప్రేమ సాక్షిగా నిలువనీ తుదివరకూ.... - రాజాబాబు కంచర్ల 18-07-2018

ఏమిటీ అన్యాయం..?

ఏమిటీ అన్యాయం..? ఎందుకీ కర్కశత్వం..? మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకివ్వొద్దంటే... వేలాది కార్మికులు రోడ్డున పడితే... మహిళలన్న ఇంగితం లేకుండా జుట్టుపట్టి లాగడం.. కాళ్లు పట్టి ఈడ్చడం... మానవత్వం మరిచారా? పశువుల్లా వ్యవహరిస్తారా? ఏ విలువలకీ ప్రస్థానం.. ఎవరి అభివృద్ధిని కాంక్షించి ఈ జులుం.. మీ విదేశీ టూర్ల కయినంత ఖర్చు కూడా వుండదేమో మీ దీక్షల పబ్లిసిటీ కయినంత ఖర్చు కూడా వుండదేమో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ... వినాశకాలే విపరీత బుద్ధి అని... వినాశకాలం దాపురించినప్పుడు ఇలాంటి బుద్ధులే పుడతాయి... గతాన్ని తల్చుకోండొకసారి ఈసారి శాశ్వత బహిష్కరణ తప్పదు ఇది కడుపు మండిన కార్మిక, కర్షకుల ప్రతిన. - రాజాబాబు కంచర్ల 31-07-2018

ఎవరిదా నవ్వు?

ఎవరిదా నవ్వు? కిలకిలమని గిలిగింతలు పెడుతూ ఇంత మత్తుగా ఇంత నిర్మలంగా ఇప్పుడే వసంతమొచ్చినట్టుగా నవ్వుల వెలుగులు పంచుతున్న దీపికలా నందన వన విహారి గోపికలా ఎంత మధురంగా నవ్వుతోంది..! ఎవరిదా నవ్వు? వెన్నెలంత స్వచ్చంగా మల్లెలంత మధురంగా మత్తుగా కొత్తగా గమ్మత్తుగా అమృతధారలు కురిపించే కిన్నెరలా మయమరపించే మోహినిలా హాయిని పంచే ఉదయనిలా ఎంతో సమ్మోహనంగా నవ్వుతోంది..! ఎవరిదా నవ్వు? ఇంత రమ్యంగా ఇంత రసాత్మకంగా ఇంత సౌకుమార్యంగా ఇంత ప్రభోదాత్మకంగా నిశీధిని ఛేదించే తేజంలా ఎంత సుమమనోహరంగా నవ్వుతోంది..! అదీ... వెన్నెలను తాగి నవ్వుల అమృతధారలను ఒలికించే ఎన్నెలపిట్ట కాదుకదా..! - రాజాబాబు కంచర్ల 26-07-2018

ఈరోజు

ఈరోజు మంచిరోజు మధురమైనది.. మరపురానిదీ ఇరువురినీ కలిపిన రోజు ఇరుతనువుల దరిచేర్చిన రోజు ఈ రోజు మంచిరోజు ఇరు మనసులు పెనవేసిన రోజు తొలిసారి ఎన్నెలమ్మ కలిసిన రోజు తొలిచూపులు ముడివేసిన రోజు చెక్కిలిపై సిగ్గులు మొలిచిన రోజు పెదవులపై ముద్దులు మురిసిన రోజు ఈ రోజు మంచిరోజు ఇరు మనసులు పెనవేసిన రోజు రెండు మనసుల సంగమం తొలిప్రేమ పులకించిన పుణ్యక్షేత్రం ఈ ప్రేమ పరమ పవిత్రము ఈ రోజు నిత్య స్మరణము ఈ రోజు మంచిరోజు ఇరు మనసులు పెనవేసిన రోజు - రాజాబాబు కంచర్ల 23-06-2018