ఇప్పుడు సమయం...
తెల్లవారుఝామున 4.13నిముషాలు
ఎందుకో రోజుకంటే ఆలస్యంగా పడుకున్నా
ముందే మెలకువ వచ్చేసింది.
ఉదయం 5 గంటలకు గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడం చాలా కాలంగా ఎంతో ఇష్టంగా చేస్తున్న ఒక తపస్సు.
చాలాసార్లు అడిగావు...
'రోజూ అదే సమయానికి ఎలా మెసేజ్ చేస్తున్నారు...
ముందుగానే టైం సెట్ చేసుకుంటున్నారా' అని,
కాదు, అప్పటికప్పుడే టైప్ చేసి పెడుతున్నానని చెప్పేవాడిని.
అలాగే ఇప్పుడు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ కూడా మొబైల్ తీసుకున్నా....
కానీ, ఉదయాన్నే నా పలకరింపు
ఏవేవో జ్ఞాపకాలను గుర్తు చేసి, బాధ పడుతుందేమోనని...
మొబైల్ లోనే రాసుకుంటున్నా...
ఇకపై ప్రతి రోజూ ఇంతేనేమో...
అలా రాయొద్దు, ఇలా పెట్టొద్దు అని చెప్పడానికి ,
నువ్వు ఇబ్బంది పడటానికి
బహుశా ఇంకేమీ లేవనుకుంటాను...
గతంలో అయితే డైరీ రాసుకునేవాళ్ళు...
ఇప్పుడు మొబైల్స్, బ్లాగ్ లు ఉన్నాయి కదా...
నీతో మాట్లాడాలని ప్రతిసారీ
నా మాటలను, నా ప్రేమను, నా బాధను, నా సంతోషాన్ని...
అన్నీ https://udayamithra .blogspot.com లో రాసుకుంటా.
నా ఫీలింగ్స్ అన్నీ గూగుల్ భరిస్తుంది...
నిన్ను విష్ చేయలేని, నా ఫీలింగ్స్ నీతో పంచుకోలేని ఒకరోజు వస్తుందని ఇన్నేళ్లలో ఎప్పుడూ అనుకోలేదు.
ఇది నాకు అత్యంత బాధాకరమైన విషయమే...
ఇప్పుడు 5.03 నిమిషాలు అయింది.
రోజూ ఈపాటికి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టేవాడిని.
"గుడ్ మార్నింగ్" కన్నలూ....
ప్చ్...
‘‘నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే
మళ్ళీ నా కలం ఈ ప్రేమ రసైక జీవిని మేలుకొలిపింది.
ప్రతి ఆలోచనలోనూ కొత్తగా దర్శనమిచ్చి
ప్రతి దర్శనలోనూ కొత్త ఆలోచనని రేకెత్తిస్తున్నావు నీవు’’
.jpeg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి